NTV Telugu Site icon

Top Headlines @5PM: టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం

నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై నారాయణ హృదయాల ఆసుపత్రి వైద్యులు హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేశారు. ఆ బులిటెన్‌లో ఇలా..’నందమూరి తారక రత్న జనవరి 27న కుప్పంలో గుండెపోటుకు గురయ్యారు. 45 నిమిషాల పాటు పునరుజ్జీవనం మరియు ప్రాథమిక చికిత్సతో కుప్పంలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో తృతీయ కేంద్రానికి తరలించాలని అక్కడి వైద్యులు సూచించారు. అతని పరిస్థితిని అంచనా వేయడానికి NH నుండి వైద్యుల బృందం కుప్పం వెళ్లినప్పుడు, బెంగళూరులోని నారాయణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాక్ సైన్సెస్ (నారాయణ హృదయాలయ)కి అతనిని బదిలీ చేయమని మేము అభ్యర్థించాము. అతను ఇంట్రా-అయోర్టిక్ బెలూన్ పంప్ (IABP) మరియు వాసోయాక్టివ్ సపోర్ట్‌పై బెలూన్ యాంజియోప్లాస్టీతో యాంటీరియర్ వాల్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ ఉన్నట్లు కనుగొనబడింది. జనవరి 28న తెల్లవారుజామున 1 గంటలకు రోడ్డు మీదుగా NHకి బదిలీ చేయబడ్డాడు. మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ తర్వాత కార్డియోజెనిక్ షాక్ కారణంగా అతని పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉందని NH ఉన్నత స్థాయి డయాగ్నస్టిక్స్‌కు చేరుకున్నప్పుడు మరియు అతని పరిస్థితిని అంచనా వేయడం ప్రామాణిక మార్గదర్శకాలు మరియు ప్రోటోకాల్‌ల ప్రకారం చికిత్సతో కొనసాగుతుంది.

అవినాష్ కు పార్టీ అండగా ఉంటుంది

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఆ కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది. సీబీఐ కార్యాలయంలో ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ ప్రారంభం అయింది. ఢిల్లీ సీబీఐ ఎస్ పీ రామ్ సింగ్ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. వివేకా హత్య జరిగిన రోజు…సాక్ష్యాలు తారుమారు చేశారు అన్న అంశాలపై అవినాష్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు సీబీఐ.. ఏపీ నుంచి ఈ కేసు విచారణను హైదరాబాద్ కి తరలించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో సీబీఐ దర్యాప్తు ప్రారంభించాక…సీన్ రీకనస్ట్రక్షన్ లో లభించిన అధారాలపై అవినాష్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు సీబీఐ అధికారులు. ప్రత్యేకమైన గదిలో అవినాష్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు అధికారులు. ఇదిలా ఉంటే.. సీబీఐ కార్యాలయం వద్దకు చేరుకున్నారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే లు శ్రీకాంత్ రెడ్డి , శ్రీనివాస్. అవినాష్ రెడ్డిని అనవసరంగా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. అవినాష్ రెడ్డి విచారణ పారదర్శకంగా జరగాలని కోరారు. వైసీపీ అవినాష్ కు పూర్తి అండగా వుంటుందన్నారు. విచారణకు అంతా కూడా వీడియో రికార్డింగ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే లు శ్రీకాంత్ రెడ్డి , శ్రీనివాస్ సీబీఐ కార్యాలయం వద్దే వేచి ఉన్నారు. విచారణలో ఏం జరుగుతుందో వారు ఆరా తీస్తున్నట్టు సమాచారం.

లోకేష్ ఐరెన్ లెగ్ శాస్త్రి.. చంద్రబాబు సైకో.. రోజా విమర్శలు

నారా లోకేష్‌ పాదయాత్రపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి ఆర్కే రోజా.. టీడీపీ అధినేత చంద్రబాబు సైకో అయితే.. నారా లోకేష్ ఐరన్ లెగ్ సైకో అంటూ విరుచుకుపడ్డారు.. విశాఖ శారదాపీఠం వార్షికోత్సవంలో పాల్గొన్న ఆమె.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.. మొదటిసారి గోదావరి పుష్కరాలకి వెళ్తే 29 మందిని పొట్టన పెట్టుకున్నాడు.. ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేస్తే.. వాళ్ల నాన్న చంద్రబాబుకి ఓటుకు నోటు కేసులో నోటీసులు వచ్చాయి.. మొన్న పాదయాత్ర పోస్టర్ లాంచింగ్ చేస్తే 8 మంది చనిపోయారు.. నిన్న పాదయాత్ర చేస్తే నందమూరి తారకరత్నకు గుండెపోటు వచ్చిదంటూ వ్యాఖ్యానించారు.. ఇక, లోకేష్ లాంటి ఐరన్ లెగ్ రాష్ట్రం అంతా నడిస్తే తమ పరిస్థితి ఏంటి అని ప్రజలు భయపడిపోతున్నారని చెప్పుకొచ్చారు మంత్రి రోజా. మరోవైపు లోకేష్‌ వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు మంత్రి రోజా.. లోకేష్ పాండిత్యాన్ని చూసి ఆయన పులకేసి అనాలని ఎద్దేవా చేశారు. నిరుద్యోగులంతా సంతోషంగా ఉన్నారని… రోడ్డు మీదకు వచ్చింది చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఆ పార్టీలో కొంతమంది అని మండిపడ్డారు..

ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు
ఆంధ్ర ప్రదేశ్ మరియు యానాం లలో దిగువ ట్రోపో ఆవరణము లో ఈశాన్యం / ఆగ్నేయ దిశలో గాలులు వీస్తున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతం మరియు దానిని ఆనుకుని ఉన్న తూర్పు భూమధ్య రేఖ ప్రాంత హిందూ మహాసముద్రం పై ఉన్న అల్పపీడనం మరియు దాని అనుబంధ ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపోస్పిరిక్ స్థాయిల వరకు విస్తరించి కొనసాగుతుంది.ఇది చాలా క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తదుపరి 24 గంటలలో బాగా గుర్తించబడిన అల్పపీడన ప్రాంతంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత, ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ, మరింత తీవ్రమై జనవరి 31న నైరుతి బంగాళాఖాతం మీద వాయుగుండంగా మారి ఫిబ్రవరి 01 న శ్రీలంక తీరానికి చేరుకుంటుంది.రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు చేసింది వాతావరణ శాఖ. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం లలో ఈరోజు మరియు రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం చాలా ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు, సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుండి 3 డిగ్రీల వరకు తక్కువగా, ఒకటి లేదా రెండు చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది.

పవన్ కళ్యాణ్ అలాంటి సినిమా తీస్తే అభిమానులకు నచ్చుతుందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఒకటి కాదు రెండు కాదు దాదాపు నాలుగు సినిమాలు పవన్ చేతిలో ఉన్నాయి. ప్రస్తుతం హరిహర వీరమల్లు షూటింగ్ ను పూర్తిచేస్తున్న పవన్ ఈ సినిమా తరువాత హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ ను మొదలుపెట్టనున్నాడు.. దీంతో పాటు వినోదాయ సీతాం ను కూడా మొదలు పెట్టనున్నాడు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. వీటితో పాటే సుజిత్ సినిమాను కూడా పవన్ పట్టాలెక్కించనున్నాడట. సాహో సినిమా తరువాత సుజిత్ పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయాడు. సినిమా ఎలాంటి టాక్ తెచ్చుకున్నది అనేది పక్కనపెడితే.. ఆ క్రేజ్ తోనే పవన్ తో సినిమా చేసే అవకాశాన్ని అందుకున్నాడు. గతేడాది ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేసి భారీ అంచనాలను పెట్టుకొనేలా చేసాడు. గ్యాంగ్ స్టర్ కథతో ఈ సినిమా తెరకెక్కనుందని టాక్. ఇక ఈ చిత్రాన్ని జనవరి 30న పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నట్టుగా తెలుస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే.. ఈ చిత్రానికి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ అభిమానులను భయాందోళనలకు గురిచేస్తోంది. అదేంటంటే.. ఈ సినిమాలో పాటలు కానీ, ఫైట్స్ కానీ ఉండవట. అసలు సినిమాకు వెళ్ళేదే పవన్ ఫైట్స్ కోసం.. సాంగ్స్ కోసం.. అలాంటింది పాటలు, ఫైట్స్ లేకపోవడం ఏంటి.. సుజీత్.. పవన్ తో ఎలాంటి సినిమా తీస్తున్నావ్ భయ్యా అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఛలో డీజీపీ’ ముట్టడిలో పోలీసుల లాఠీ ఛార్జ్.. బండి సంజయ్‌ సీరియస్‌

ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతూ బీజేవైఎం నాయకులు చేపట్టిన ‘ఛలో డీజీపీ’ ముట్టడి కార్యక్రమం పోలీసులు రాక్షసంగా వ్యవహరించారు. డీజీపీ ఆఫీస్ లోకి వెళ్లేందుకు యత్నించిన బీజేవైఎం నాయకులను ఈడ్చి వేశారు. లాఠీ ఛార్జ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, బీజేవైఎం కార్యకర్తలకు మధ్య తీవ్ర తోపులాటలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాశ్ స్ప్రుహ తప్పి పడిపోయారు. అయినా పోలీసులు విచక్షణారాహితంగా భాను ప్రకాశ్ లాఠీలు ఝుళిపించారు. ఈడ్చుకెళ్లి వ్యాన్ లో పడేశారు. ఈ సంఘటనలో భాను ప్రకాశ్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బీజేవైఎం నాయకులు గ్లోబెల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వెంటనే వైద్యులు ఎమర్జెన్సీ వార్డుకు భాను ప్రకాశ్ తరలించిన వైద్య చికిత్స చేయిస్తున్నారు. ఈ ఘటనలో భాను ప్రకాశ్ తోపాటు అరుణ్ కుమార్, పుల్లెల శివ సహా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కరీంనగర్ పర్యటనలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈ విషయం తెలుసుకున్న వెంటనే బీజేవైఎం నాయకులకు ఫోన్ చేసి భాను ప్రకాశ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

వ్యవసాయంతో పాటు మత్య, సహకార రంగాలకు రుణాలు

వ్యవసాయంతో పాటు మత్య, సహకార రంగాలకు రుణాలు ఇవ్వాలన్నారు నాబార్డ్ ఛైర్మన్ కె.వి.షాజీ. ఆప్కాబ్ ఆధ్వర్యంలో బ్యాంకర్స్ కాంక్లేవ్ విజయవాడలో జరిగింది. మచిలీపట్నం డీసీసీబీ పదివేల కోట్ల వ్యాపారం చేస్తోంది. నాబార్డ్ ఒక జాతీయ స్ధాయి బ్యాంక్. క్రెడిట్, డిపాజిట్ నిష్పత్తిలో 144శాతం అంటే చాలా అద్భుతం. పల్నాడులో 240శాతం క్రెడిట్ డిపాజిట్ నిష్పత్తి ఉండటం గుర్తించాం. తిరుపతిలో క్రెడిట్ డిపాజిట్ నిష్పత్తి 75శాతం. రుణాలను మరింతగా పెంచగలిగితే క్రెడిట్, జీడీపీ నిష్పత్తి 80శాతం అయ్యే అవకాశం ఉంది. ఏపీ జీడీపీలో వ్యవసాయం మూడవ వంతు ఉంది. భారత ప్రభుత్వం వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖలలో పలు పథకాలు ఇస్తోందన్నారు. వ్యవసాయంతో పాటు మత్య, సహకార రంగాలలో రుణాలు ఇవ్వాలి. నాబార్డ్ చట్టం మార్పు చేసిన తర్వాత ఎం.ఎస్.ఎం.ఈ లో కూడా పెట్టుబడి పెట్టాం అన్నారు. వ్యవసాయంలో కూడా వినూత్న క్రెడిట్ విధానాలు రావాలి. ఆర్.ఆర్.బి ల స్ధూల ఆదాయం 22 వేల‌ బ్రాంచిల నుంచీ వస్తోంది. రైతులకు సైతం త్వరితగతిన రుణాలు అందించాలి. గ్రామీణ బ్యాంకులు చాలా ఉపయోగకరమైనవిగా బ్యాంకింగ్ పరిశ్రమ గుర్తించాలి. కె.సి.సి, ప్యాక్స్ లాంటి టెక్నాలజీలు ప్రస్తుతం రివ్యూ లో ఉన్నాయన్నారు నాబార్డ్ ఛైర్మన్ కేవీ షాజీ.