అక్కడ ఆప్యాయత లేదు.. మరోసారి మాట తూలిన బాలయ్య
సాధారణంగా ఒక వివాదం వచ్చినప్పుడు సెలబ్రిటీలు కానీ, రాజకీయ నేతలు కానీ ఏం చేస్తారు.. ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలనే చూస్తారు. అందుకు తగ్గట్టు మాట్లాడి సెట్ చేస్తారు. కానీ, ఇక్కడ కూడా బాలయ్య స్టైల్ వేరు. ఒక వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టడంతో పాటు మరో వివాదానికి తెరలేపుతాడు. ఒక వివాదం ముగిసిందో లేదో మరో వివాదం మొదలయ్యింది. వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో బాలయ్య.. అక్కినేని తొక్కినేని అంటూ మాట తూలడం.. అది కాస్తా వైరల్ గా మారి అక్కినేని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసేవరకు వెళ్ళింది. అక్కినేని వారసులు అఖిల్, నాగ చైతన్య సైతం ఈ విషయమై స్పందించారు. బాలయ్య బహిరంగంగా క్షమాపణ చెప్పాలని అక్కినేని అభిమానులు డిమాండ్ చేయడం కూడా జరిగింది. ఇక తాజాగా ఈ వివాదంపై మొట్ట మొదటిసారి బాలయ్య స్పందించాడు. “ఇండస్ట్రీకి ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్ రెండు కళ్లలాంటివారు.. నాన్న నేర్పిన క్రమశిక్షణ, బాబాయ్ నుంచి పొగడ్తలకు దూరంగా ఉండడం అన్న విషయాన్ని నేర్చుకున్నాను.. ఫ్లోలో వచ్చే మాటలను వ్యతిరేకంగా ప్రచారం చేస్తే నాకు సంబంధం లేదు. నాగేశ్వరరావు తన పిల్లలకంటే ఎక్కువగా నన్ను ప్రేమించే వారు.. నాన్న పరమపదించిన అనంతరం ఆయన పేరుతో ఏర్పాటు చేసిన జాతీయ అవార్డును మొట్టమొదటిసారిగా అక్కినేని నాగేశ్వరరావు గారికి అందించడం జరిగింది.. బాబాయ్‌పై ప్రేమ గుండెల్లో ఉంటుంది.. బయట ఏం జరిగినా నేను పట్టించుకోను” చెప్పుకొచ్చాడు.
నిరుద్యోగ యువతకు శుభవార్త…భృతిని ప్రకటించిన సీఎం
గణతంత్ర దినోత్సవ వేడుకల వేళ.. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ నిరుద్యోగ యువతకు శుభవార్త తెలిపారు. ఈ ఏడాది ఆఖరులో జరగనున్న ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ గురువారం ఓ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు నెలవారీ భత్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన కీలక వాగ్దానాలలో ఇది ఒకటి. 15 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్‌లో అధికారంలోకి వచ్చింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జగదల్‌పూర్‌లోని లాల్‌బాగ్ పరేడ్ మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రజలను ఉద్దేశించి బఘేల్ మాట్లాడారు. రాయ్‌పూర్ విమానాశ్రయం సమీపంలో ఏరోసిటీ ఏర్పాటు, గృహనిర్మాణ సహాయం సహా పలు ఇతర ప్రకటనలు చేశారు. కార్మికుల కోసం పథకం, మహిళా వ్యవస్థాపకతను ప్రోత్సహించే పథకాల గురించి ఆయన ప్రసంగించారు. నిరుద్యోగ యువతకు వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24) నుంచి ప్రతి నెలా నిరుద్యోగ భృతి ఇవ్వబడుతుందని వెల్లడించారు. కానీ ఎంత మొత్తం ఇస్తారో మాత్రం చెప్పలేదు.
ఎట్ హోం కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేస్తున్నాం
ఇవాల్టి రాజ్‌భవన్‌లో గవర్నర్ ఇచ్చిన ఎట్ హోం కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు సీపీఐ ప్రకటించింది. హైదరాబాద్ హిమాయత్ నగర్ మక్దూం భవన్ సీపీఐ కార్యాలయంలో 74వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కూనన్నె మాట్లాడుతూ సీపీఐ జాతీయ కమిటీ పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా రాజ్యాంగ పరిరక్షణకు ప్రతిజ్ఞ చేపడుతున్నామన్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన పాలకులు రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగ పీఠిక నుంచి లౌకికవాదం, సోషలిజం అనే పదాలను తొలగించే కుట్ర జరుగుతోందన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం సీపీఐ పోరాటం చేస్తుందని కూనంనేని చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తమపై పోలీసులు అక్రమ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. భూసమస్యపై అబ్దుల్లాపూర్ మెట్‌లో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొని తమకు మద్దతిస్తే తనపై ఐపీసీ 123బీ సెక్షన్ విధించారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎవరిపైనా ఆయుధాలతో దాడి చేసేందుకు వెళ్లలేదని, పేద ప్రజల భూ పోరాటానికి మాత్రమే మద్దతిచ్చామని స్పష్టం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రజాసమస్యల కోసం సీపీఐ పోరాటం కొనసాగిస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు బీఆర్‌ఎస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నామన్నారు.
పవన్ పిచ్చెక్కి మాట్లాడుతున్నాడు
ఏపీలో రాజకీయం ఎన్నికలకు ముందే వేడెక్కింది. వైసీపీ వర్సెస్ జనసేన విమర్శల జోరు పెరుగుతూనే వుంది. జనసేనాని పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ. పవన్ ఉగ్రవాది అయితే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. పవన్ పిచ్చెక్కి మాట్లాడుతున్నాడు. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది… ఎవరిని కొడతాడు? ఎవరిని బెదిరిస్తాడు.?రిపబ్లిక్ డే రోజున ఎవరైనా హుందాగా మాట్లాడుతారు. సన్నాసి మాటలు మాట్లాడి మాచేత కూడా మాట్లాడిస్తున్నాడన్నారు మంత్రి బొత్స. రిపబ్లిక్ డే రోజున ఎవరైనా హుందాగా మాట్లాడతారు. సెలబ్రిటీ పార్టీ నాయకుడు సన్నాసి మాటలు మాట్లాడి మాచేత కూడా మాట్లాడిస్తున్నాడు. పిచ్చెక్కి పోయి మాట్లాడుతున్నాడన్నారు. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది. ఉగ్రవాది అయిపోతే… చట్టం తన పని తాను చేసుకుని పోతుందన్నారు. ఎవరిని కొడతాడు? ఎవరిని బెదిరిస్తాడు? డీబీటీ ద్వారా 60 వేల కోట్లు ఇచ్చాం అన్నారు. అణగారిన వర్గాలకు ప్రభుత్వం అండగా నిలబడితే పవన్ కళ్యాణ్ కు ఏంటట బాధ?వాక్ స్వాతంత్రం ఉందని ఇలా మాట్లాడటం కరెక్టేనా? ఈ భాష ద్వారా వచ్చే తరాలకు ఏం సందేశం ఇవ్వాలి అనుకుంటున్నాడు?
ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది
వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ. యువత దేశ భవిత.. వారి అభివృద్ధి కోసం పాటుపడాలన్నారు. శ్రీ సత్య సాయి జిల్లాలో బాలయ్య మీడియాతో మాట్లాడారు. లోకేష్ పాదయాత్ర పై బాలకృష్ణ స్పందించారు. లోకేష్ పాదయాత్రలో రేపు పాల్గొంటున్నాను. ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేవు పరిశ్రమలు తరలిపోతున్నాయి. లోకేష్ పాదయాత్ర కు అన్ని అడ్డంకులు,ఆంక్షలు ఉంటాయి. జనం తిరగబడితే ఏం జరుగుతుందో గతంలో చూశాం… యువ గళం పేరుతో లోకేష్ చేపట్టిన పాదయాత్రను ప్రజలందరూ ఆశీర్వదించాలన్నారు. యువత దేశ భవిత.. వారి అభివృద్ధి కోసం పాటుపడాలి. అక్కినేని తొక్కనేని మాటలపై స్పందించారు ఎమ్మెల్యే బాలకృష్ణ. ఇండస్ట్రీకి రెండు కళ్లలాంటివారు నాన్నగారు, అక్కినేని నాగేశ్వరరావు. నాన్నగారు నేర్పిన క్రమశిక్షణ, బాబాయ్ నుంచి పొగడ్తలకు దూరంగా ఉండడం అన్న విషయాన్ని నేర్చుకున్నాను. ఫ్లోలో వచ్చే మాటలను వ్యతిరేకంగా ప్రచారం చేస్తే నాకు సంబంధం లేదు. నాగేశ్వరరావు గారు తన పిల్లలకంటే ఎక్కువగా నన్ను ప్రేమించే వారు. నాన్న పరమపదించిన అనంతరం ఆయన పేరుతో ఏర్పాటు చేసిన జాతీయ అవార్డును మొట్టమొదటిసారిగా అక్కినేని నాగేశ్వరరావు గారికి అందించడం జరిగింది. బాబాయిపై ప్రేమ గుండెల్లో ఉంటుంది. బయట ఏం జరిగినా నేను పట్టించుకోను అన్నారు బాలకృష్ణ.
రష్యా మద్దతుదారులతో జకోవిచ్.. నెట్టింట విమర్శలు
గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్‌లో రష్యా వర్ధిల్లాలు అంటూ చేసిన నినాదాలు ఇప్పుడు నెట్టింట హాట్‌టాపిక్‌గా మారాయి. అలా చేసింది ఎవరో ప్రేక్షకులు కాదు.. వారితో పాటు టెన్నిస్ లెజెండరీ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ తండ్రి ఈ నినాదాలు చేయడం కొందరికి రుచించడం లేదు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఎలాంటి వివాదాలకు తావివ్వకూడదని రష్యా జెండాలను కూడా నిషేధించారు నిర్వాహకులు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ ప్రపంచ దేశాలు రష్యాను ఒంటరిని చేశాయి. కానీ టెన్నిస్ స్టార్ ప్లేయర్ నొవాక్ జోకొవిచ్ తండ్రి మాత్రం అదే రష్యన్ మద్దతుదారులతో కలిసి ఫోటోలకు పోజులివ్వడం తీవ్ర దుమారం రేపుతోంది. మెల్‌బోర్న్‌లోని రాడ్ లేవర్ అరెనాలో జకోవిచ్ ఆడిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ చూడటానికి అతని తండ్రి సర్డాన్ జకోవిచ్ వచ్చాడు. ఈ సందర్భంగా స్టేడియం బయట ఉన్న రష్యా మద్దతుదారులతో కలిసి అతడు ఫోటోలు దిగాడు. రష్యా వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశాడు. అంతేకాదు ఈ మ్యాచ్‌కు జెడ్ అనే అక్షరం ఉన్న టీషర్ట్ వేసుకొని వచ్చిన వ్యక్తితో కనిపించాడు. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి మద్దతిస్తున్న వాళ్ల చిహ్నం ఈ జెడ్ అనే అక్షరం. అలాంటి టీషర్ట్ వేసుకున్న వ్యక్తితో ఉండటం, రష్యాకు మద్దతుగా నినాదాలు చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
సింగర్ సునీత కొడుకు కోసం రాఘవేంద్రరావు సర్కారు నౌకరీ
ప్రముఖ సింగర్ సునీత కుమారుడు ఆకాశ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. విశేషం ఏమంటే… సునీత కొడుకును హీరో చేయడం కోసం దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ఆర్.కె. టెలీ షో పతాకంపై ఓ సినిమా నిర్మిస్తున్నారు. దీని ద్వారా గంగనమోని శేఖర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ‘సర్కారు నౌకరి’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలను సంస్థ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. గాయని సునీత తనయుడు ఆకాశ్ సరసన నూతన నటి భావనా వళపండల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ప్రారంభోత్సవంలో జీ స్టూడియోస్ నిర్మాత ప్రసాద్ నిమ్మకాయల కెమెరా స్విచ్చాన్ చేయగా, మ్యాంగో మీడియా అధినేత, గాయని సునీత భర్త రామ్ వీరపనేని గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దేవుడి పటాలపై క్లాప్ నిచ్చారు. అనంతరం హీరోహీరోయిన్లపై తీసిన తొలిషాట్ కు కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా గాయని సునీత కెమెరా స్విచ్చాన్ చేశారు. ఫిబ్రవరి 6 నుంచి నిరవధికంగా షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, సూర్య, సాయి శ్రీనివాస్ వడ్లమాని, మణిచందన, రాజేశ్వరి ముళ్లపూడి, రమ్య పొందూరి, త్రినాథ్ ప్రధాన పాత్రలు పోషించబోతున్నారు.
అశ్విన్ అలా అనేసరికి షాకయ్యా..మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్
మిండియా మాజీ స్పిన్నర్ ఆర్ శ్రీధరన్ ఏడేళ్ల పాటు బారత జట్టుకు పీల్డింగ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. 2021లో ఆ బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు. ఈ సమయంలో తన ఎక్స్‌పీరియన్స్, ఎదుర్కొన్న సవాళ్లను ఓ పుస్తకం రూపంలో రాశాడు, ‘కోచింగ్ బియాండ్: మై డేస్ విత్ ద ఇండియన్ క్రికెట్ టీమ్’ అనే బుక్‌లో ఇప్పటి వరకూ క్రికెట్ ఫ్యాన్స్‌కు తెలియని ఎన్నో ఆశ్చర్యకర విషయాలు కూడా ఉన్నాయి. తాజాగా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో తాను తొలిసారి మాట్లాడిన సందర్భంలో జరిగిన ఓ విషయం గురించి చెప్పాడు. ఫీల్డింగ్ కోచ్ మారినప్పుడల్లా ఏదో ఒక కొత్తది చెబుతుంటారని, మీ మాట నేను ఎందుకు వినాలని అశ్విన్ అడిగినప్పుడు తాను ఆశ్చర్యానికి గురైనట్లు ఈ పుస్తకంలో శ్రీధర్ వివరించాడు. “నేషనల్ టీమ్‌తో కలిసిన తొలి వారంలోనే అశ్విన్‌తో మాట్లాడినప్పుడు నేను కాస్త షాక్‌కు గురయ్యా. అతడు మామూలుగానే నన్నో విషయం అడిగాడు. మీరు ఏమీ అనుకోకపోతే శ్రీధర్ సర్.. నేను మీరు చెప్పింది ఎందుకు వినాలి. మీరు చెప్పిన ఫీల్డింగ్ డ్రిల్స్ ఎందుకు ఫాలో కావాలి? 2011 నుంచి 2014 వరకు ట్రెవర్ పెన్నీ ఫీల్డింగ్ కోచ్‌గా ఉన్నాడు. ఇప్పుడు మీరు వచ్చారు. మీరు మరో రెండు, మూడేళ్లు ఉంటారేమో. మీరు ఏదో చెబుతారు. వెళ్లిపోతారు. అప్పుడు మరో కొత్త ఫీల్డింగ్ కోచ్ వస్తాడు. నిజాయతీగా చెప్పాలంటే తర్వాత మూడేళ్లు నాకు చాలా ముఖ్యం. మీరు చెప్పింది నాకు ఉపయోగపడుతుందని నేను నమ్మాలి. అది నా ఆటకు సాయం చేయాలి. లేదంటే నేను ఎందుకు వినాలి అని అశ్విన్ నన్ను అడిగాడు” అని శ్రీధర్ తన పుస్తకంలో వెల్లడించాడు.