NTV Telugu Site icon

Top Headlines @9PM: టాప్ న్యూస్

Ntv Top Hl 9pm

Ntv Top Hl 9pm

ఏపీ సచివాలయం, అసెంబ్లీకి రిపబ్లిక్ డే వెలుగులు

గణతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం అయింది. విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాయి ఏపీ అసెంబ్లీ, సెక్రటేరియట్.గణతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్బంగా విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న ఏపీ సచివాలయం.ఉదయం ఎంతో ఘనంగా జరుగనున్న 74 వ గణతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఆంద్రప్రదేశ్ సచివాలయం, శాసన సభ, శాసన మండలి భవనాలు ముస్తాబయ్యాయి. ఆంద్రప్రదేశ్ శాసన సభా భవనంతో పాటు రాష్ట్ర సచివాలయంలోని ఐదు బ్లాక్ లను రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరణ చేశారు. ఇవి చూడడానికి రెండు కళ్ళుచాలడం లేదు. ఇదిలా ఉంటే రేపు సాయంత్రం రాజ్ భవన్‌లో ఎట్ హోం జరగనుంది. రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా ఆతిధ్యం ఇవ్వనున్నారు గవర్నర్. రేపు సాయంత్రం 4.30 నిమిషాలకు రాజ్ భవన్‌లో హై టీ. హాజరు కానున్న హైకోర్టు సీజే, ముఖ్యమంత్రి జగన్ దంపతులు, మంత్రులు, అధికారులు, పలువురు ప్రముఖులు. ఎట్ హోం కు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను ఆహ్వానించింది రాజ్ భవన్. గత ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ సమయంలో ఎట్ హోం కు హాజరయ్యారు చంద్రబాబు. రేపటి ఎట్ హోం కు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరు అవుతారా లేదా అన్న ఉత్కంఠ ఏర్పడింది.

రిపబ్లిక్‌ డే భారత పౌరులందరికీ పండుగ రోజు

సమానత్వంతో కూడిన సమర్థవంతమైన ప్రజాస్వామిక పాలన ద్వారానే దేశ రాజ్యాంగం ఆశించిన లక్ష్యం పరిపూర్ణంగా సిద్ధిస్తుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 74వ గణతంత్ర దినోత్సవాన్ని (జనవరి 26) పురస్కరించుకొని సీఎం కేసీఆర్ రాష్ట్ర, దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామిక దేశంగా భారతదేశంలో రాజ్యాంగబద్ధ పాలనకు అంకురార్పణ జరిగిన 26 జనవరి రోజు భారత పౌరులందరికీ పండుగ రోజని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన మహోన్నత రాజ్యాంగాన్ని రూపొందించిన భారత రాజ్యాంగ నిర్మాతల కృషిని ఈ దేశ ప్రజలు సదా స్మరించుకుంటారని సీఎం తెలిపారు. గుల్ దస్తా మాదిరి విభిన్న సామాజిక సంస్కృతులు సాంప్రదాయాలు భాషలు ఆచారాలతో భిన్నత్వంలో ఏకత్వాన్ని పొదిగివుండడమే భారత దేశ ప్రధాన లక్షణమన్నారు.

మూగజీవాలకు మెరుగైన సేవలు…165 అంబులెన్స్ లు ప్రారంభం

ఏపీలో అన్నివర్గాల సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. వైద్యారోగ్య, పశుసంవర్థక శాఖలోనూ మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా మరో ముందడుగు పడింది. మూగ జీవాలకు మెరుగైన వైద్య సేవలందించే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకొచ్చిన వైయ‌స్ఆర్‌ సంచార పశు ఆరోగ్య (మొబైల్‌ అంబులేటరీ క్లినిక్స్‌) సేవలను మరింత విస్తరించే దిశగా ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది. ఇప్ప­టికే నియోజకవర్గానికి ఒకటి చొప్పున రూ.­129.07 కోట్లతో 175 వాహనాలను అందుబాటులోకి తీసు­కువచ్చిన విషయం తెలిసిందే. వీటికి అదనంగా రూ.111.62 కోట్లతో రూపొందిన మరో 165 వాహనాలు నేటి నుంచి రోడ్డెక్కాయి. బుధ­వారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం వద్ద సీఎం జగన్ జెండా ఊపి వీటిని ప్రారంభించారు. ఈ అంబులెన్స్‌ల విషయంలో జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాలు ఏపీని స్ఫూర్తిగా తీసుకొని అడుగులు వేస్తున్నాయి. ఈ అంబులెన్స్‌ల కోసం జాతీయ స్థాయిలో 1962 కాల్‌ సెంటర్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమీకృత కాల్‌ సెంటర్‌ 155251ను అనుసంధానించారు. ఈ నంబర్ల ద్వారా అంబులెన్స్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ అంబులెన్స్‌లో పశు వైద్యుడు, వెటర్నరీ డిప్లొమా సహాయకుడు, డ్రైవర్‌ కమ్‌ అటెండర్లను అందుబాటులో ఉంచారు. ప్రతి అంబులెన్స్‌లో రూ.35 వేల విలువైన 81 రకాల మందులు అందుబాటులో ఉంచారు. పశువుల యజమానులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వీటిని వాడుకోవచ్చు. 54 రకాల అత్యాధునిక పరికరాలతో పాటు వెయ్యి కిలోల బరువు ఎత్తగలిగే హైడ్రాలిక్‌ లిఫ్ట్‌ ఏర్పాటు చేశారు. నిర్వహణ బాధ్యతలను జీవీకే–ఈఎంఆర్‌ఐకు అప్పగించారు.

జనసేన ఎప్పుడూ జనం పక్షానే నిలబడింది

జనసేన పార్టీ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ – వైసీపీ సర్కార్ నిర్లక్ష్యంపై రాష్ట్ర సదస్సు జరిగింది. జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వానికి ప్రజలకు మేలు‌ చేసే ఆలోచన లేదు.అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పాట్లు పడుతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోదు.ప్రతి ఒక్కరూ న్యాయబద్ధంగా రావాల్సిన హక్కుల కోసం పోరాడండి.జనసేన ఎప్పుడూ జనం పక్షానే నిలబడింది.. నిలబడుతుందన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పూర్తిగా అమలు చేస్తే అందరికీ ఉపయోగ పడుతుంది.జగన్ ప్రభుత్వానికి నిజంగా‌ చిత్తశుద్ధి ఉందా..?ఆర్డినెన్స్ తేవడం ద్వారా పూర్తిగా అమలైపోతుందా..?ఈ నాలుగేళ్ల కాలంలో ‌జగన్ ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది..?ఎంతమంది ఆర్ధిక‌ ప్రగతి సాధించారు..?ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ను పొడిగించడం కాదు.. పూర్తి స్థాయిలో అమలు‌ చేసేలా చూడాలి.సమాజంలో కుల వివక్ష, అసమానతలు ఎన్నో దశాబ్దాలుగా ఉంటూనే ఉన్నాయి.రాజకీయ వ్యవస్థలో ఎవరైనా అభిప్రాయాలు వెలిబుచ్చే అవకాశం ఇవ్వకపోతే ఎలా..? అని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ను పూర్తిగా అమలు చేసి, నిధులిస్తే వాటి ఫలితాలు అద్భుతంగా ఉంటాయి.అందరికీ వీటిపై అవగాహన కల్పించి, అభిప్రాయాలు పంచుకుకోవాలనే ఈ సదస్సు ఏర్పాటు చేశాం.అన్ని పట్టణాలు, పల్లెల్లో తిరిగి వారి హక్కుల గురించి వివరించాలి.చట్టం అమలు చేయకుండా మోసం చేస్తున్న వైనాన్ని‌ చెప్పాలి.

ఎవరి డ్యూటీ ఏంటో ప్రధాని మోడీ చెప్పాలి

రిపబ్లిక్ డే వేడుకలకు సంబంధించి తెలంగాణలో బీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీగా మారిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ వ్యవహారం చివరికి హైకోర్టుకెళ్లడం.. న్యాయస్థానం సైతం రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించాలని ఆదేశించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. గవర్నర్‌కు.. బీజేపీకి, బీజేపీ ఎమ్మెల్యేలకు ఏం సంబంధమని ఆయన ప్రశ్నించారు. గవర్నర్ కంటివెలుగు కార్యక్రమానికి వస్తానంటే ఎవరైనా ఆపారా?అని ఆయన ప్రశ్నించారు. ఏ వేడుకలైనా చట్ట ప్రకారం జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. నోరు ఉందిగా అని ప్రతిపక్ష నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. బర్త్ డే వేడుకల కోసం సెక్రటేరియట్ కట్టలేదు… ఏ కట్టడం అలా కట్టరని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధాని తన బర్త్ డే రోజే సికింద్రాబాద్ వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానంటే ఎవరైనా అడ్డుకుంటారా? అని ఆయన అన్నారు. ఎవరి డ్యూటీ ఏంటో ప్రధాని నరేంద్ర మోడీ చెప్పాలని, రాజ్యాంగంలో ప్రధాని, సీఎం, గవర్నర్ రోల్ ఏంటో మోడీ వివరించాలన్నారు మంత్రి తలసాని.

ఏడుగురిని బలి తీసుకున్న ప్రతీకారం

మహారాష్ట్రలోని పుణేలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి ప్రతీకారం.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురిని బలి తీసుకుంది. వారిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఏడుగురి మృతదేహాలు భీమా నది ఒడ్డున కనిపించాయి. తన కొడుకు మృతికి ప్రతీకారంగా.. ఓ వ్యక్తి ఈ కిరాతక పనికి పాల్పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జనవరి 18వ తేదీ నుంచి 24వ తేదీ మధ్య పూణేలో దువాండ్‌ తహసిల్‌లోని భీమా నది ఒడ్డున ఏడు మృతదేహాలు లభ్యమయ్యాయి. పోలీసులు వెంటనే ఆ మృతదేహాలు ఎవరివని విచారించగా.. మోహన్‌ పవార్‌(45), అతని భార్య సంగీతా మోహన్‌(40), అతని కుమార్తె రాణి ఫుల్‌వేర్‌(24), అల్లుడు శ్యామ్‌ ఫుల్‌వేర్‌(28), వారి ముగ్గురు పిల్లలు (3 నుంచి ఏడేళ్ల మధ్య)గా గుర్తించారు. వీరిది హత్యేనని నిర్ధారించుకున్న పోలీసులు.. ఎవరు చంపారని దర్యాప్తు చేశారు. అప్పుడు ‘ప్రతీకారం’ కోణం వెలుగుచూసింది.

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలులో నిర్లక్ష్యం సిగ్గుచేటు

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు నిర్లక్ష్యంపై జనసేన పార్టీ కార్యాలయంలో సదస్సు జరిగింది. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు.. సంక్షేమానికి కృషి చేస్తామంటూ జనసేన డిక్లరేషన్ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలును మరో పదేళ్లు కొనసాగిస్తామని ప్రభుత్వం చెప్పడం కంటి తుడుపు చర్యేనంటూ డిక్లరేషన్ లో దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ శాశ్వతంగా అమలయ్యేలా చట్టం రూపకల్పనకు జనసేన డిమాండ్ చేసింది.సదస్సులో పాల్గొన్న పవన్ కళ్యాణ్ పలు అంశాలు ప్రస్తావించారు. సబ్ ప్లాన్ అమలు చేయని జగనుపై ఎన్ని కేసులు పెట్టాలన్నారు సదస్సులో పాల్గొన్న వక్తలు.. జగన్ పోవాలి.. పవన్ రావాలి. పవన్ దెబ్బకు భయపడి జగన్ కొత్త జీవోలు తెస్తున్నారు. ఏపీలో మైదాన ప్రాంత గిరిజనులకు అన్యాయం జరుగుతోంది. ఏజెన్సీ ఏరియాలోని గిరిజనులకు మాత్రమే. మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని జనసేన డిమాండ్ చేసింది. నవరత్నాల పేరుతో దళితుల భవిష్యత్తుకు ఉరేస్తున్నారు.ఎస్సీ, ఎస్టీలకు రావాల్సిన నిధులు కూడా రావడం లేదు.. దీన్ని పవన్ ప్రశ్నించాలి.27 ఎస్సీ, ఎస్టీ పథకాలు రద్దు చేశారు.దళితులకు విదేశీ విద్య పథకాన్ని నిర్వీర్యం చేశారని వక్తలు మండిపడ్డారు.

మహానటి పెళ్లి.. సోషల్ మీడియాను షేక్ చేస్తుందే..?

మహానటి కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి చేసుకోనుందా అంటే నిజమే అని అంటున్నారు తమిళ్ తంబీలు. గత కొన్నిరోజులుగా కీర్తి పెళ్లి వార్త నెట్టింట సంచలనాన్ని సృష్టిస్తోంది. మొన్నటి నుంచి కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో కీర్తి ఎఫైర్ నడుపుతోందని, త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకొంటున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కీర్తి, విజయ్ ఫోటోలను పక్కపక్కన పెట్టి ట్రోల్స్ చేస్తున్నారు. విజయ్ భార్య సంగీతకు న్యాయం కావాలంటూ జస్టిస్ ఫర్ సంగీత అనే గ్యాస్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. ఇక మరోపక్క కీర్తి సురేష్.. ఒక వ్యాపారవేత్తను వివాహమాడుతోందని మరికొందరు చెప్పుకురావడం విశేషం.ఆమె ఒక వ్యాపారవేత్తతో ప్రేమలో ఉందని, అతనికి కేరళలో రిసార్ట్స్ కూడా ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా.. ఈ జంట ప్రేమాయణం 13 ఏళ్ళ కిందటి నుంచి నడుస్తోందని టాక్. చిన్ననాటి స్నేహితులు అయిన వీరు ఈ మధ్యనే ఇరు కుటుంబాలకు తమ ప్రేమను వెల్లడించారని, వారు కూడా అంగీకరించడంతో త్వరలోనే కీర్తి వివాహం జరగనుందని అంటున్నారు. ఇకపోతే ప్రస్తుతం కీర్తి వరుస సినిమాలతో బిజీగా మారింది.