Site icon NTV Telugu

Top Headlines @1PM: టాప్ న్యూస్

Top Headlines

Top Headlines

అందుకే వచ్చేశా.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హాట్ కామెంట్స్

వైసీపీ నుంచి బయటకు వచ్చిన నెల్లూరు రూరల్ ఎం.ఎల్.ఏ.కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీపై, సీఎం జగన్ పైన హాట్ కామెంట్స్ చేశారు. నెల్లూరు రూరల్ లో ప్రజా సమస్యలు పరిష్కరించాలి. పొట్టేపాలెం కలుజు నిర్మాణం చేయాలి. ఈ మార్గం మీదుగా నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తున్నారు.వరదల సమయంలో ముఖ్యమంత్రి జగన్ కూడా ఈ ప్రాంతానికి వచ్చి పరిస్థితిని పరిశీలించారు. వంతెన నిర్మాణంతో పాటు రహదారుల కోసం రూ.27 కోట్లు ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఏడాదిన్నర గడిచినా ఇంకా కార్యరూపం దాల్చలేదు. నాలుగేళ్ల నుంచి పోరాడుతున్నా ..ఏ సమస్య కూడా పరిష్కారం కాలేదు. రూరల్ పరిధిలో పలు రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయన్నారు కోటంరెడ్డి. శివారు కాలనీల్లో మౌలిక వసతులు. లేక ఇబ్బంది పడుతున్నారు. నిధులు ఇవ్వాలని కోరినా పట్టించుకోవడంలేదు. కొండ్లపూడి లిఫ్ట్ ఇర్రిగేషన్ పనులకు నిధులు ఇవ్వకపోవడంతో కాంట్రాక్ట్రర్ పనులు ఆపేశారు. ఇళ్ల నిర్మాణం కోసం ప్రజల నుంచి స్థలం తీసుకుని పరిహారం ఇవ్వలేదు. బి.సి.భవన్..అంబేద్కర్ భవన్..కాపు భవన్ ల నిర్మాణాలు ఆగిపోయాయి. జిల్లాలో మొదటి నుంచి జగన్ కు అండగా ఉన్నా. ప్రజా సమస్యలు ప్రశ్నిస్తే నా ఫోన్ ను ట్యాపింగ్ లో పెట్టారు. అనుమానం ఉన్న చోట ఉండకూడదని నిర్ణయం తీసుకున్నా. చివరి టికెట్ ఇవ్వకపోతే నా పరిస్థితి ఏంటి? అన్నారు.

సోలో బతుకే సో బెటర్ అంటున్న చైనీయులు

ప్రపంచ జనాభా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుంది. తాజాగా భారతదేశ జనాభా చైనాను దాటేసింది. ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించింది. ఇదే సమయంలో చైనా జనాభా పెరుగుదల రోజు రోజుకు క్షీణిస్తోంది. అందుకు అక్కడి యువత పెళ్లిపై పెద్దగా ఆసక్తి చూపకపోవడమే. 30 ఏండ్లు దాటినా పెండ్లి కానివారి ప్రసాదుల సంఖ్య పెరిగిపోతున్నదని ఆ దేశంలో ఓ సంస్థ జరిపిన తాజా సర్వేలో వెల్లడించింది. నగరాల్లోని యువత సోలో బతుకును కోరుకుంటున్నారు. అదే సమయంలో గ్రామీణ ప్రాంత యువత పెండ్లి మార్కెట్‌ నుంచి తొలగింపునకు గురయ్యాయరని చైనీస్‌ వెబ్‌సైట్‌ వీబో వెల్లడించింది. సర్వే ప్రకారం ఒంటరిగా బతకడం మంచిదేనన్న భావన పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రధాన నినాదమైంది. గ్రామీణ ప్రాంతాల్లోని యువత 30ఏళ్లు దాటిన పెళ్లి ప్రయత్నాలే చేయడంలేదు. ఇదే సమయంలో మహిళలు పెండ్లి చేసుకోవాలనుకొంటున్నా వారికి సరైన జోడీ దొరకడం లేదు.

టీచర్ ని ఎముకలు విరిగేలా కొట్టిన స్టూడెంట్

చదువును ప్రసాదించే గురువులను దేవతలుగా పూజించాలి. కానీ, ఫ్లోరిడాలో ఓ విద్యార్థి మాత్రం తన వీడియో గేమ్ తీసేసుకోవడంతో పట్టరాని ఆగ్రహంతో అసిస్టెంట్ టీచర్(టీచర్స్ ఎయిడ్)పై రెచ్చిపోయి దాడి చేశాడు. ఫ్లోరిడాలోని మటాంజస్ హైస్కూల్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫ్లాగ్లర్ కౌటీ షెరిఫ్ కార్యాలయం ఈ దాడికి సంబంధించి వీడియో ఫుటేజీని విడుదల చేసింది. స్కూల్లో వీడియో గేమ్ ఆడుతుండడంతో అసిస్టెంట్ టీచర్ దాన్ని తీసుకుని తరగతి నుంచి వెళ్తున్నారు. దీంతో వెనుక నుంచి వేగంగా వచ్చిన 17 ఏళ్ల విద్యార్థి, టీచర్ ను గట్టిగా తోసేశాడు. ఆమె ఎగిరి దూరంలో కిందపడిపోయింది. తల నేలను గట్టిగా తాకడంతో స్పృహ కోల్పోయింది. అయినా కానీ విద్యార్థి ఆగలేదు. ఆమె వీపు భాగంలో పిడిగుద్దులు కురిపించాడు. దీంతో అక్కడ ఉన్న వారు అతడ్ని ఏదో విధంగా కొంత సమయానికి నిలువరించారు.

బ్యాంక్ ఉద్యోగికే సైబర్ కేటుగాళ్ళ టోకరా

మోసానికి ఎవరైతే నేం అన్నట్టుగా ఉంది. హనుమకొండ జిల్లాలో ఓ బ్యాంకు ఉద్యోగి సైబర్‌ నేరగాళ్ల బారినపడ్డారు. తన ఖాతాలోంచి రూ.2,24,967 పోగొట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బిహార్‌కు చెందిన సకల్‌దేవ్‌ సింగ్‌ పరకాల ఎస్‌బీఐ మెయిన్‌ బ్రాంచిలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పని చేస్తున్నారు. హనుమకొండలోని సుబేదారిలో నివాసం ఉంటూ రాకపోకలు సాగిస్తుంటారు. గురువారం రాత్రి ఆయనకు ఓ మొబైల్‌ నంబరు నుంచి ‘మీ ఖాతా డీ యాక్టివేట్‌ అవుతుంది.. పాన్‌ కార్డు అప్‌డేట్‌ చేయండి’ అని మెసేజ్‌ వచ్చింది.ఆయన శుక్రవారం ఉదయం ఆ మెసేజ్‌ను క్లిక్‌ చేసి.. అప్‌డేట్‌ చేయడానికి ప్రయత్నించగా సబ్‌మిట్‌ కాలేదు. అనంతరం మరో నంబరు నుంచి ఆయనకు ఫోన్‌ వచ్చింది. తాను చెప్పినట్టు చేయాలని అవతలి వ్యక్తి సూచించగా..’నేను బస్సులో ఉన్నాను.. తర్వాత చేస్తాను’ అని సకల్‌దేవ్‌ సింగ్‌ చెప్పారు. బ్యాంకుకు వెళ్లిన తర్వాత ఆయనే తనకు వచ్చిన నంబర్‌కు ఫోన్‌ చేశారు. అవతలి వ్యక్తి పాన్‌ కార్డు అప్‌డేట్‌ చేయాలని సూచించగా కావడం లేదని చెప్పారు.ఆ వెంటనే వాట్సాప్‌నకు ఒక లింక్‌ పంపానని, దాన్ని ఓపెన్‌ చేయాలని అవతలి వ్యక్తి చెప్పాడు.

మోడీజీ.. ఏపీలో నో డిజిటల్.. ఓన్లీ క్యాష్

దేశమంతా డిజిటల్ విప్లవం నడుస్తోంది జేబులో పర్సు లేకపోయినా.. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా.. డెబిట్, క్రెడిట్‌ కార్డులు, సెల్‌ఫోన్‌ అందుబాటులో ఉంటే పని సులువవుతోంది. పాల ప్యాకెట్‌ తీసుకోవచ్చు.. హోటల్‌లో తినొచ్చు.. వేడివేడి టీ తాగొచ్చు.. బార్బర్‌ షాపులోనూ నచ్చినట్లు కటింగ్‌ చేయించుకోవచ్చు.. వైన్ షాపులో మనకు నచ్చిన మందు కొనుగోలు చేయవచ్చు. మార్కెట్‌లో కూరగాయలు మొదలుకొని దుకాణంలో సరుకుల కొనుగోలు వరకు కార్డు ఉంటే చాలు ఎలాగైనా పనులు చేసుకోవచ్చు. పాతకాలం పోయింది.. కొత్త కాలం వచ్చింది.. ప్రపంచం డిజిటల్‌ మయంగా మారింది. ఎక్కడ చూసినా ఆన్‌లైన్‌ చెల్లింపులకు తెర తీస్తున్నారు. ఆన్ లైన్ చెల్లింపులు అన్నిచోట్ల అమలవుతుంటే మాత్రం…ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ముందున్న ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అమలు కావడం లేదు. ప్రపంచమంతా డిజిటల్, యూపీఐ పేమెంట్స్ అంటుంటే… ఏపీలో మాత్రం అలాంటిదేం కనిపించడం లేదు. తాజాగా టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. మోడీ గారు.. భారత్ లోని డిజిటల్ విప్లవం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచినా మా ఏపీలో మాత్రం చెల్లదు.మా జగనన్న బ్రాందీ షాపుల్లో డిజిటల్ చెల్లింపులు అస్సలు కుదరవ్. అంతా క్యాష్ కట్టాల్సిందే.. సాయంత్రానికి కంటైనర్లలో నోట్ల కట్టలు తోలాల్సిందే. అది మందైనా… ఇసకైనా.. లేక సిలికా అయినా, ఇంకేదైనా సరే నోట్లు చూడందే మాకు నిద్ర పట్టదన్నారు సోమిరెడ్డి. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

ప్రేమదేశం మూవీ సీన్ రిపీట్.. విషాదంగా క్లైమాక్స్‌

నగరంలోని శివారు అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు మంచి స్నేహితులు. కానీ ఇద్దరూ ఒకే అమ్మాయి ప్రేమించడంతో తాను ప్రేమించిన అమ్మాయి తన స్నేహితుడికి దక్కుతుందేమో అని అనుమానంతో సొంత స్నేహితుడినే కొట్టి చంపేశాడు ఓ కిరాతకుడు. అచ్చం ప్రేమదేశం సినిమాను తలపించేలా ఈఘటన జరిగింది. కానీ క్లైమాక్స్‌ మాత్రం చాలా దారుణంగా ముగిసింది. ఈఘటన నల్గొండ జిల్లాలో సంచలనంగా మారింది. నాగర్ కర్నూలు జిల్లా చారుకొండ మండలం సిరిసనగండ్లకు నెనావత్ నవీన్ అనే యువకుడు చెందినవాడు. నెనావత్‌ నల్గొండలోని ఎంజి యూనివర్సిటీ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ త్రిబుల్ ఈ ఫోర్త్ ఇయర్స్ చదువుతున్నాడు. అయితే.. అదే కాలేజీలో చదువుతున్న హరికృష్ణతో ఇతనికి మంచి స్నేహం ఉంది. వీరిద్దరూ మంచి స్నేహితులే కానీ.. వీరిద్దరి మధ్యలో ఒక అమ్మాయి. ఆ అమ్మాయినే ఇద్దరూ ప్రేమించారు. అమ్మాయి ప్రేమ కారణంగా వీరిద్దరి స్నేహం దెబ్బతినడమే కాకుండా.. ఇద్దరి మధ్య తీవ్ర భేదాభిప్రాయాలు వచ్చాయి. అయితే ప్రేమించిన అమ్మాయి ఎక్కడ దక్కదనే భయం హరికృష్ణలో మొదలైంది. దీంతో ప్రాణానికి ప్రాణంగా ఉన్న నవీన్‌ను చంపేదుకు ప్లాన్‌ వేశాడు. అతని స్నేహితులతో హరికృష్ణ టచ్‌ లో వున్నాడు. ఈనేపథ్యంలోనే ఈ నెల 17వ తేదీన ఉదయం పార్టీ గెట్‌ టుగెదర్‌ చేసుకుందామని హరికృష్ణ.. తన స్నేహితుడి రూమ్ కి నెనావత్ నవీన్ ను రావాలని ఆహ్వానించాడు.

నెల్లూరు కబాడీపాలెంలో వింత.. శిలువ నుంచి రక్తం

వేప చెట్టునుంచి పాలు కారడం, కళ్ళు తెరచిన జీసస్, పాలు తాగుతున్న సాయిబాబా విగ్రహం.. ఇలా వింత వింత సంఘటనలు మనకు కొకొల్లలు. తాజాగా నెల్లూరు జిల్లాలో వింత చోటుచేసుకుంది. నగరంలోని కబాడీపాలెం చర్చిలో ఈ వింత బయటపడింది. పరిశుద్ధ కానుక మాతచర్చి లో వింతపై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శిలువకు వేలాడుతున్న యేసు క్రీస్తు బొమ్మ చేతులు.. కాళ్లు చేతుల నుంచి ఎర్రటి ద్రవాలు కారుతున్నాయి. ఈ వింతను చూసేందుకు ఎగబడుతున్నారు జనం. శిలువకు వేలాడ దీసి ఉన్న క్రీస్తు బొమ్మ చేతులు,కాళ్లకు దిగగొట్టిన మేకుల నుంచి ఎర్రటి ద్రవాలు కారుతున్నాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో చర్చిలోకి ఇతరులను అనుమతించడం లేదు నిర్వాహకులు. ఈ వింత ద్రవాలు ఏంటని పరిశీలించాలని స్థానికులు అధికారులను. చర్చి నిర్వాహకులను కోరుతున్నారు. గతంలో వరంగల్ జిల్లాలో వింత చోటుచేసుకుంది. భద్రకాళి అమ్మవారు అభిషేకం సమయంలో కళ్ళు మూసుకుని… తెరచుకుంటున్నట్లు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అమ్మవారి అభిషేక సమయంలో కళ్లు తెరవడం, మూయడం కనిపించింది.

పేటీఎం బ్యాంక్ లో ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్ విలీనం

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌లో ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ విలీనమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఎయిర్‌టెల్‌ అధినేత సునీల్‌ మిత్తల్‌ ప్రణాళిక రూపొందించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పేటీఎంలో విలీనం కావటం ద్వారా వాటా సొంతం చేసుకోవాలని ఆశిస్తున్నారు. ఇతర షేర్‌ హోల్డర్ల నుంచి కూడా పేటీఎంలోని వాటాలను కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని చెబుతున్నారు. అయితే.. ఈ వార్తలపై స్పందించేందుకు భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రతినిధి నిరాకరించారు. ఇవన్నీ మార్కెట్‌ ఊహాగానాలేనని తెలిపారు. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌కి నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌.. NCLATలో ఊరట లభించింది. ఆ సంస్థపై గత వారం మొదలైన దివాలా చర్యలను NCLAT నిలిపివేసింది. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ డైరెక్టర్‌ అండ్‌ సీఈఓ పునీత్‌ గోయెల్‌ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించింది. అనంతరం.. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌కు మరియు ఇంటెరిమ్‌ రిజల్యూషన్‌ ప్రొఫెషనల్‌కు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని గడువు విధించింది. తదుపరి విచారణను వచ్చే నెల 29వ తేదీకి వాయిదా వేసింది.

Exit mobile version