రాజధానిపై సజ్జల కీలక వ్యాఖ్యలు.. అందుకే బుగ్గన అలా..!
మూడు రాజధానుల వ్యవహారంపై చర్చ కొనసాగుతూనే ఉంది.. మరోసారి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.. సుప్రీం కోర్టు తీర్పునకు లోబడే సీఎం వైఎస్ జగన్ వైజాగ్ వెళ్తారని తెలిపారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. బుగ్గన వ్యాఖ్యలు వికేంద్రీకరణకు మద్దతుగానే ఉన్నాయన్నారు.. ఏదేమైనా మూడు ప్రాంతాల అభివృద్ధి మా లక్ష్యం.. ప్రధాన వ్యవస్థలు మూడు ప్రాంతాల్లో పెడతాం. మరింత మెరుగైన విధంగా చట్టం తెస్తామని వెల్లడించారు.. విశాఖపట్నంలో సెక్రటేరియట్ ఉంటుంది.. అసెంబ్లీ అమరావతిలో.. హైకోర్టు కర్నూల్‌లో ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు సజ్జల.. రాజధాని అనేది మేం పెట్టుకున్న పేరు.. అమరావతిలో మాత్రమే మొత్తం రాజధాని ఉండాలనుకునేవారు మాత్రమే గందరగోళం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి.. ఎవరూ అస్పష్టత, అపోహలకు గురి కావద్దు.. వికేంద్రీకరణ అజెండాగానే రానున్న ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు.
కొండగట్టు ఆలయాన్ని కనివినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేయాలి
కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని ఆగమశాస్త్ర పద్ధతులను అనుసరించి అభివృద్ధి చేయాలని, భక్తుల సౌకర్యార్థం పునర్నిర్మాణాలను చేపట్టాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు నిర్ణయించారు. భారతదేశంలోనే గొప్పదైన ఆంజనేయ స్వామి దేవాలయం ఎక్కడున్నదంటే కొండగట్టు అంజన్న ఆలయం పేరు వినపడేలా అత్యంత గొప్పగా, అన్ని హంగులతో, సకల సౌకర్యాలతో తీర్చిదిద్దాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. అత్యంత సుందరమైన ప్రకృతి రమణీయత, అభయారణ్యంతో కూడిన కొండగటట్టు ఆలయాన్ని సుందరంగా తీర్చి దిద్ది, దేశవ్యాప్తంగా ఉన్న హనుమాన్ భక్తులు దర్శించుకునేందుకు అనువుగా కార్యాచరణ రూపొందిచేలా బుధవారం నాడు కొండగట్టు అంజన్న సన్నిదిలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని సీఎం కేసీఆర్ నిర్వహించారు.ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమాలకర్, ఎంపి దివకొండ దామోదర్ రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తో పాటు, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, బాల్క సుమన్, జీవన్ రెడ్డి, సంజయ్, కె. విద్యాసాగర్ రావు, కోరుకంటి చందర్, మండలి చీఫ్ విప్ భాను ప్రసాద రావు తదితరులు పాల్గొన్నారు.
,
ప్రత్తిపాడు టీడీపీలో విభేదాలు… ఏలేశ్వరంలో ఆందోళన
ప్రత్తిపాడు టీడీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. ప్రత్తిపాడులో టీడీపీ నేతలు నియోజకవర్గ ఇంఛార్జి ని మార్చాలంటు ఏలేశ్వరం ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగడం చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గ కోఆర్డినేటర్ వరుపుల రాజా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని పార్టీ కోసం పని చేసిన వారిని పక్కన పెట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపాడు టీడీపీ నేతల్లో ఐక్యత కొరవడిందా? అధిష్టానం పట్టించుకోవడం లేదా? తెలుగు తమ్ముళ్లు రోడ్డెక్కి ఆందోళన చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం నియోజకవర్గ కోఆర్డినేటర్ గా ఉన్న వరుపుల రాజా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. పార్టీ కోసం పని చేసిన వారిని పక్కన పెట్టి సొంత వర్గాన్ని ఎంకరేజ్ చేస్తున్నారని రాజా వ్యతిరేకవర్గం నిరసన వ్యక్తం చేశారు.. ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ కష్ట కాలంలో పార్టీని వదిలి వెళ్లి ఇప్పుడు పెత్తనం చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు.. టీడీపీ అసమ్మతి వర్గం ఆందోళనతో ఏలేశ్వరంలో కొద్దిసేపు ట్రాపిక్ జామ్ అయింది. అధినేత జిల్లా పర్యటనకు మరి కొద్ది సేపట్లో రానుండగా సైకిల్ పార్టీ పత్తిపాడు లీడర్ల విభేదాలు బయటపడ్డాయి.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం.. టీడీపీ ఫిర్యాదు
ఏపీలో తాజాగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం జరుగుతోందని, చర్యలు తీసుకోవాలని టీడీపీ ఫిర్యాదుచేసింది. అమరావతిలోని సచివాలయంలో ఎన్నికల సంఘాన్ని కలిసింది టీడీపీ బృందం. ఏపీలో జరగనున్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీ అవకతవకలకు పాల్పడుతోందని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది టీడీపీ. అధికార పార్టీ ఓటర్లను ప్రలోభ పెట్టడంతో పాటు ఓట్లనే తారుమారు చేస్తుందని ఫిర్యాదు చేసింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిశారు మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజా, ఎమ్మెల్సీ అశోక్ బాబు. నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అవకతవకలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. అధికార పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాలకు గురిచేసేందుకే ఎమ్మెల్సీ కల్పన రెడ్డి భర్త ప్రతాప్ రెడ్డిని విద్యాశాఖ కడప ఆర్జేడీగా ప్రభుత్వం నియామకం చేసింది. కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా అధికార దుర్వినియోగానికి పాల్పడి తన భార్య కల్పనా రెడ్డిని.. ప్రతాప్ రెడ్డి గెలిపించుకున్నాడు. ఇదే విధానాన్ని పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రతాప్ రెడ్డిని వాడుకుంటోంది.
చెప్పులు లేకుండా నడిచారా.. ఒకసారి ట్రైచేసి చూడండి
పొద్దున్న నిద్రలేచిన దగ్గర్నించి మళ్లీ రాత్రి పడుకునే వరకూ కాళ్ళకి చెప్పులు వేసుకునే అన్ని పనులు చేస్తాం. అసలు చెప్పులు లేకుండా అనేది ఊహించలేం. కేవలం దేవాలయానికి వెళ్లినప్పుడు, ఇంట్లో మందిరానికి వెళితే తప్ప చెప్పులు తీయం. కొందరైతే ఇళ్లలోనూ చెప్పులు వేసుకుంటుంటారు. ఇలా చేయడం మంచిదేనా అని ఆలోచించండి. చెప్పులు విప్పి నడవడం అనేది కష్టమయినదే. కానీ అసాధ్యం మాత్రం కాదు. మన ఆరోగ్య కారణాల వల్ల మనం ఖచ్చితంగా పాదాలకు పాదరక్షలు లేకుండా నడవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి.. ఇంటి పని.. ఆఫీసు పనితో నిత్యం బిజీ ఉండే గృహిణి తన ఆరోగ్యం పట్ల చూపించే శ్రద్ధ కాస్త తక్కువేనని చెప్పాలి. పిల్లల చదువు బాధ్యత కూడా ఆమె పైనే పడుతుంది. దీంతో క్షణం కూడా తీరిక లేకుండా పోతోంది. ఇంత బిజీ షెడ్యూల్లో వ్యాయామానికి వారికి సమయం దొరకడం కాస్త కష్టమే. అందుకే నడిచేటప్పుడు చెప్పుల్లేకుండా నడిస్తే ఒత్తిడి మాయమై ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ఖరీదైన చెప్పులు వేసుకుని నడవడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. కొంతమంది ధరించే చెప్పుల వల్ల అనేక అనర్థాలు కలుగుతున్నాయి. పాదాలకు సరైన వ్యాయామం లభించడం లేదు.
కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు.. నోరుమూయించలేరు.. కొనలేరు
భారతీయ మీడియా సంస్థల్లాగా అంతర్జాతీయ మీడియాను నోరు మూయించ లేరని, వాటిని కొనుగో చేయలేరని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్ అల్లర్లపై బీబీసీ డాక్యుమెంటరీ తీసినందుకే ఐటీ దాడులు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే గడిచిన 9 ఏళ్లుగా బీజేపీ పాలనలో దేశ ప్రతిష్ఠ దిగజారిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీబీసీ ని నోరు మూయించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందా..? అని ప్రశ్నించారు. పత్రికా స్వేచ్ఛ ను కేంద్రం నియంత్రించలేదని అన్నారు. డాక్యుమెంటరీ నచ్చకపోతే కోర్టుకి వెళ్ళాలి అని సూచించారు. అంతర్జాతీయ మీడియా నోరు మూయించగలరా? అంటూ ప్రశ్నించారు. అంతర్జాతీయ మీడియాతో మోడీ యుద్ధం చేయవద్దని సూచించారు. మోడీ,అమిత్ షా,విదేశాంగ శాఖ అంతర్జాతీయ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలని, రాజకీయాలు చేయోద్దు.. ఇది దేశానికి ప్రమాదకరం అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం లో అతిత్వరలో కవితను అరెస్ట్ చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
బావగారిని వాడు వీడు అంటావేంట్రా.. చెప్పుతో కొడతా
బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నటిగా మంచి అవకాశాలను అందుకుంటున్న అనసూయ.. ఈ మధ్యనే ఆంటీ వివాదంతో ఫేమస్ అయ్యింది.. తనను ఆంటీ అని పిలిచినవారిపై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసి షాక్ ఇచ్చింది. ఈ వివాదం అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. అనసూయ.. తన గురించి కానీ, ఆడపిల్లల గురించి కానీ ఎక్కువ తక్కువ మాట్లాడితే వారి అంతు చూసే వరకు వదలదు. ఇక తాజాగా మరోసారి అనసూయ కొత్త వివాదానికి తెరలేపింది. ఓకే నెటిజెన్ తో కామెంట్స్ బాక్స్ లోనే వాగ్వాదానికి దిగింది. అసలు విషయమేంటంటే.. నిన్న ప్రేమికుల రోజు సందర్భంగా అనసూయ.. భర్త భరద్వాజ్ తో ఉన్న ఒక ఫోటోను షేర్ చేస్తూ.. “నీతో జీవితం నాకు రోలర్ కాస్ట్ ఎక్కినట్లు ఉంటుంది.. హ్యాపీ వాలెంటెన్స్ డే .. సుశాంక్ భరద్వాజ్” అని క్యాప్షన్ ఇచ్చింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఈ ఫోటోపై నెటిజెన్ల పలు విధాలుగా స్పందించారు. అందులో ఒక నెటిజెన్ మాత్రం.. “అదేం లేదు అక్కా.. వాడి దగ్గర చాలా డబ్బు ఉంది అందుకే” అని కామెంట్ చేశాడు. ఇక ఈ కామెంట్ కు అనసూయకు చిర్రెత్తుకొచ్చింది. అక్కా అనడంతో.. ఎంతో పద్దతిగా తమ్ముడు అని సంబోధిస్తూనే కౌంటర్ ఎటాక్ ఇచ్చింది.
టెస్టుల్లో నెంబర్ వన్.. కెప్టెన్‌గా రోహిత్ సరికొత్త చరిత్ర
రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా అదరగొడుతోంది. ఇప్పటికే టీ20, వన్డేల్లో నెంబర్ వన్‌గా ఉన్న్ భారత జట్టు తాజాగా టెస్టుల్లోనూ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఘనవిజయం సాధించడం ద్వారా నాలుగు పాయింట్లు పొంది టాప్ ప్లేస్‌కు చేరుకుంది. ప్రస్తుతం టీమిండియా ఖాతాలో 115 పాయింట్లు ఉన్నాయి. తద్వారా మూడు ఫార్మాట్లలోనూ నెంబర్‌వన్‌గా నిలిచిన ఘనతను టీమిండియా సొంతం చేసుకుంది. మరోవైపు భారత్‌తో తొలి టెస్టులో ఇన్నింగ్స్ పరాజయం చవిచూసిన ఆస్ట్రేలియా 111 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయింది. ఇక ఇంగ్లాండ్ 106 పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ 100 పాయింట్లతో నాలుగు, సౌతాఫ్రికా 85 పాయింట్లతో ఐదో ప్లేస్‌లో కొనసాగుతున్నాయి.
ఇండియన్ ఐడల్ సీజన్ 2 ప్రారంభం
తెలుగు సంగీత ప్రేక్షకులను అలరించిన సింగింగ్ షో ఇండియన్ ఐడల్ తెలుగు సెకండ్ సీజన్ రాబోతోంది. తాజాగా సీజన్ 2 కర్టెన్ రైజర్ ప్రోగ్రామ్ గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆహా సీఈవో అజిత్ ఠాకూర్, సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్, గాయనీ గాయకులు కార్తీక్, గీతామాధురి, హేమచంద్ర పాల్గొన్నారు. ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో హిట్ అయిన షోస్ లో తెలుగు ఇండియన్ ఐడల్ ఒకటి. యువగాయనీ గాయకులకు తమ ప్రతిభ నిరూపించుకోవడానికి ఈ సింగింగ్ షో మంచి వేదికగా నిలిచింది. సింగర్ శ్రీరామచంద్ర హోస్ట్ గాను మ్యూజిక్ డైరెక్టర్ థమన్, హీరోయిన్ నిత్యామీనన్, సింగర్ కార్తీక్ జడ్జీలుగా వ్యవహరించి సందడి చేసిన తొలి సీజన్ లో జయంత్, వాగ్దేవి, శ్రీనివాస్, వైష్ణవి, ప్రణతి లాంటి తెలుగు గాయనీగాయకులు తమ పాటలతో ఆకట్టుకున్నారు. తొలి సీజన్ లో వాగ్దేవి విజేతగా నిలిచింది. ఈ షో ఫైనల్స్ కు మెగాస్టార్ చిరంజీవి విచ్చేసి సందడి చేశారు.