NTV Telugu Site icon

Top Headlines @9AM: టాప్ న్యూస్

9am

9am

కూకట్‌పల్లిలో అగ్నిప్రమాదం.. మూడు బస్సుల్లో మంటలు..

హైదరాబాద్ నగరంలో వరుస అగ్నిప్రమాదాలు ప్రజలను కలవరపెడుతున్నాయి. సికింద్రాబాద్ దక్కన్ మాల్, చిక్కడపల్లి గోడాం, నూతన సచివాలయం, రామాంతపూర్‌లో వరుస ఘటనలు మరువకముందే తాజాగా కూకట్ పల్లిలోని పార్క్ షేడ్స్‌లో అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం భాగ్యనగర ప్రజలను భయాందోళనకు గురి చేసింది. వరుస ప్రమాదాలతో నగర వాసులు భయబ్రాంతులకు గురవుతున్నారు. పార్కట్‌ షెడ్స్‌లో పార్కింగ్ చేసిన ఉన్న మూడు బస్సులో ఈప్రమాదం జరిగింది. ఒకబస్సులు మొదట మంటలు చెలరేగడంతో పక్కనే వున్న మరో బస్సుకు మంటలు అంటుకున్నా అలా మూడు బస్సలు అగ్నికి ఆహుతయ్యాయి.

వేతనాలు ఇవ్వండి.. విధులు బహిష్కరించి మున్సిపల్ కార్మకులు నిరసన

కొమరంభీం జిల్లా కాగజ్‌ నగర్‌ లో మున్సిపల్ కార్మకులు నిరసన బాట పట్టారు. విధులు బహిష్కరించి వేతన బకాయిల కోసం ఆందోళన చేపట్టారు. అధికారుల వద్ద నుంచి ఎలాంటి స్పందన లేకపోవంతో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. వేతన బకాయిలు చెల్లించాలని నాలుగు రోజులుగా నల్లబ్యాడ్జీల విధులకు హాజరయ్యారు. వేతనాలు బకాయిలు చెల్లించాలని ఎన్ని సార్లు విన్నవించినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని సార్లు అధికారులకు తమ గోడు తెలిపిన అస్సలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబాన్ని పోషించుకోవడం ఇబ్బందిగా ఉందని వాపోతున్నారు. పూట గడవాలంటే జీతాలు రాక ఇబ్బంది ఎదుర్కొంటున్నామని తెలిపారు. నాలుగు రోజులుగా నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరై నిరసనలు తెలిపిన అధికారులు స్పందించలేదని చేసేది ఏమీలేక మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టామని తెలిపారు. వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరి దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.

చికెన్ ఆల్‌టైం రికార్డ్.. ధర కేజీ రూ.720

అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం. చికెన్ ధర ఆకాశాన్నంటింది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా.. కిలో రూ.720కి చికెన్ ధర పెరిగింది. అయితే.. ఇది మన దేశంలో కాదులెండి, పొరుగు దేశం పాకిస్తాన్‌లో. కరాచీలో కేజీ చికెన్ ధర రూ.720 ఉండగా.. ఇస్లామాబాద్, రావల్పిండి సహా ఇతర నగరాల్లో రూ.700-705 మధ్యలో ఉంది. అయితే.. లాహోర్‌లో మాత్రం రూ.550-600 మధ్య రేటు పలుకుతోంది. ఇంతలా అక్కడ చికెన్ రేట్లు పెరగడానికి కారణం.. ఆర్థిక సంక్షోభంతో పాటు పౌల్ట్రీ వ్యాపారాలు మూతపడటమేని పాకిస్తాన్ మీడియా తెలుపుతోంది. కోళ్ల ఫీడ్‌కు తీవ్ర కొరత ఏర్పడిందని, అందుకే పౌల్ట్రీ వ్యాపారులు బిజినెస్ నిలిపివేశారని పేర్కొంటోంది. చరిత్రలో కనీవినీ ఎరుగుని స్థాయిలో పెరిగిన ఈ ధరలు చూసి.. చికెన్ ప్రియులు ఆందోళన చెందుతున్నారు. ధరలు పెరగడంతో.. చికెన్‌ను తినలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రేమన్నాడు.. కోరిక తీరాక పొమ్మన్నాడు.. కట్ చేస్తే..

ప్రేమ పేరుతో ఓ యువకుడు ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో, ఆ యువతి తన భర్తకు విడాకులిచ్చి, దేశాలు దాటి మరీ వచ్చింది. తీరా కోరిక తీరాక.. ఆ యువతిని వదిలి మరొకరితో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ యువతి.. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. బోరబండ రాజ్‌నగర్‌ ప్రాంతానికి చెందిన ఓ యువతి (27) టెలీకాలర్‌గా పనిచేస్తుంది. ఈ యువతికి ఐదేళ్ల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో మహారాష్ట్ర జల్‌గావ్‌కు చెందిన సైఫ్‌(28)తో పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల తర్వాత అది ప్రేమగా మారింది. పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు హైదరాబాద్‌లో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని, సహజీవనం చేశారు. అయితే.. యువతి తరఫు కుటుంబసభ్యులు వారి పెళ్లికి నిరాకరించారు. అనంతరం 2020లో ఆమెకు మరొకరితో పెళ్లి చేసి, దుబాయ్‌కి పంపించారు.

భార్యకు ట్రిపుల్‌ తలాక్‌ చెప్పి యూకేకు పయనం.. ఎయిర్‌పోర్టులో భర్త అరెస్ట్

ఢిల్లీలోని కళ్యాణ్ పురికి చెందిన 40 ఏళ్ల వైద్యుడు 36 ఏళ్ల భార్యను ట్రిపుల్ తలాఖ్ ఇచ్చాడని పోలీసులు చెప్పారు.ఈ సంఘటన అక్టోబర్ 13, 2022 న జరిగింది, అయితే ఈ నెల ప్రారంభంలో ఆ వ్యక్తి 36 ఏళ్ల భార్య తూర్పు ఢిల్లీలోని కళ్యాణ్‌పురిలో పోలీసు అధికారులను సంప్రదించినప్పుడు వెలుగులోకి వచ్చింది. ట్రిపుల్ తలాక్‌ ఇచ్చాక ఢిల్లీకి చెందిన డాక్టర్ బెంగళూరు నుంచి యూకేకు వెళ్లేందుకు యత్నిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి గుర్తింపును రహస్యంగా ఉంచేందుకు నిందితుడి పేరును పోలీసులు వెల్లడించలేదు. విచారణలు, సాంకేతిక నిఘా తరువాత, నిందితుడిని బెంగళూరు విమానాశ్రయంలో గుర్తించారు. అక్కడ నుంచి ఢిల్లీ పోలీసు బృందం ఫిబ్రవరి 9న అతన్ని పట్టుకుని అతన్ని అరెస్టు చేసింది. బాధితురాలి గుర్తింపును కాపాడేందుకు నిందితుడి పేరును పోలీసులు వెల్లడించలేదు. ఫిబ్రవరి 1న నమోదైన ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. అక్టోబర్ 13, 2022 న తనపై “ట్రిపుల్ తలాక్” ఉచ్ఛరించినందుకు తన భర్తపై ఫిర్యాదు చేసినట్లు ఆ మహిళ తెలిపింది.

టర్కీలో మరోసారి భూకంపం.. 34 వేలు దాటిన మృతుల సంఖ్య

టర్కీ, ,సిరియాల్లో విషాదం తాండవిస్తోంది. ఆ దేశాల్లో వచ్చిన భారీ భూకంపం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. భూకంప శిథిలాలను తొలగించే కొద్ది వెలుగుచూస్తున్న విగతజీవులు.. సాయం కోసం ఎదురుచూస్తూ శిథిలాల కింద వేచి చూస్తూ ప్రాణాలుగ్గబట్టుకున్న దయనీయ పరిస్థితులు కంటతడి పెట్టిస్తున్నాయి. భవనాల శిథిలాల నుంచి రోజూ బయటపడుతున్న వందల శవాలు కళ్లు చెమర్చేలా చేస్తున్నాయి. ఇదిలా ఉండగా.. టర్కీలో మరోసారి భూకంపం సంభవించింది. టర్కీలోని కహ్రామన్‌మరాస్‌కు ఆగ్నేయం నుంచి 24 కి.మీ దూరంలో సంభవించిన 4.7 తీవ్రతతో మరో భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ఆదివారం పేర్కొంది. ఈ భూకంపం 15.7 కి.మీ లోతులో సంభవించినట్లు తెలిపింది.

సైప్రస్ తదుపరి అధ్యక్షుడిగా నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఎన్నిక

సైప్రస్ తదుపరి అధ్యక్షుడిగా మాజీ విదేశాంగ మంత్రి నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఆదివారం ఎన్నికయ్యారు. ఆయన తన దౌత్య, విదేశాంగ విధాన దృష్టితో సైప్రస్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రాధాన్యతలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. విభజించబడిన మధ్యధరా ద్వీపంలో 49 ఏళ్ల క్రిస్టోడౌలిడెస్ 51.9 శాతం ఓట్లతో తోటి దౌత్యవేత్త ఆండ్రియాస్ మావ్రోయినిస్‌ను ఓడించారని అల్ జజీరా నివేదించింది. ఆండ్రియాస్ మావ్రోయినిస్‌ విలేకరులతో మాట్లాడుతూ.. ఈ రాత్రి ఒక ప్రయాణం ముగిసిందని, తాను వేలాది మంది వ్యక్తులతో పంచుకున్న గొప్ప ప్రయాణం ముగిసిందన్నారు. సైప్రస్‌లో అవసరమైన మార్పును సాధించలేకపోయామని చింతిస్తున్నానన్నారు. క్రిస్టోడౌలిడెస్‌ ప్రచారం సమయంలో ద్వీపంలోని దశాబ్దాల నాటి విభజనను అంతం చేయడంపై ఐక్యరాజ్యసమితి మద్దతుతో చర్చలపై కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందని అల్ జజీరా నివేదించింది.

సిక్కింలో భూకంపం.. పరుగులు తీసిన జనం

సిక్కింలోని యుక్సోమ్‌కి వాయవ్యంగా 70 కిలోమీటర్ల దూరంలో ఈ రోజు తెల్లవారుజామున 4.15కి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 4.3గా నమోదైంది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ స్పష్టం చేసింది. అయితే ఇది చాలా చిన్న భూకంపం కిందే లెక్క. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4 దాకా ఉన్న భూకంపాలను చిన్నవిగా లెక్కిస్తారు. వీటి వల్ల గోడలు బీటలు వారడం వంటివి జరుగుతాయే తప్ప పెద్దగా నష్టం ఏదీ ఉండదు. కాకపోతే.. గత వారం టర్కీలో 3 భారీ భూకంపాలు రావడం వల్ల.. ఇలాంటి సమయంలో ఈ భూకంపం రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ భూ ప్రకంపనలతో ఇళ్లలో నిద్రపోతున్న జనం లేచి రోడ్లపైకి పరుగులు తీశారు. ఆదివారం అసోంలోనూ భూమి కంపించింది.

టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా న్యూ కపుల్ రిసెప్షన్

యంగ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రాల మ్యారేజ్ రీసెంట్ గా జైసల్మేర్ లో లిమిటెడ్ గెస్టుల మధ్య చాలా గ్రాండ్ గా జరిగింది. ముంబై తిరిగి వచ్చిన ఈ కొత్త జంట, బాలీవుడ్ కి గ్రాండ్ రిసెప్షన్ ని అరేంజ్ చేసింది. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన ఈ రిసెప్షన్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రిసెప్షన్ ఫోటోస్ లో కియారా, సిద్ ఎఫోర్ట్ లెస్ గా బ్యూటిఫుల్ గా ఉన్నారు. ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఫోటోస్ లో కనిపిస్తుంది. కియారా అద్వానీ బ్లాక్ డ్రెస్ లో ప్రిన్సెస్ లా ఉంది.