NTV Telugu Site icon

Top Headlines @9AM: టాప్ న్యూస్

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడే తెలంగాణ బడ్జెట్.. 10.30కు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న హరీష్ రావు

తెలంగాణ పద్దుల సీజన్ వచ్చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ను సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు ఆర్థికమంత్రి తన్నీరు హరీష్ రావు. ఉదయం 10.30 గంటలకు శాసనసభలో ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు, శాసనమండలిలో ఆర్‌ అండ్‌ బీ, శాసనసభ వ్యవహారాలశాఖల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రవేశపెడతారు. నిరుడు మార్చి 7న రూ.2.71 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 3ఈసారి బడ్జెట్‌లో అంతకంటే ఎక్కువే ఉండే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు పేర్కొంటున్నారు. బడ్జెట్‌పై ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, ఆర్థిక శాఖ ముఖ్యకాఅఈర్యదర్శి రామకృష్ణారావు సహా ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ 20 రోజులుగా సుదీర్ఘ కసరత్తు చేశారు. వివిధ శాఖలకు సంబంధించి గత కేటాయింపులు, చేసిన వ్యయం తదితర అంశాలపై సమీక్షించారు. గత అనుభవాలను పరిగణనలోకి తీసుకొని వచ్చే ఆర్థిక సంవత్సరానికి చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తదితర అంశాలపై సీఎం కేసీఆర్‌ పలు సూచనలు చేశారు. ఆదివారం సమావేశమయిన రాష్ట్ర మంత్రిమండలి బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్‌పై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించి, ఆమోదం తెలిపింది. సంక్షేమ రంగానికి పెద్ద పీట వేసే అవకాశం ఉంది.

అది మోసం కాదా? విపక్షాలపై మంత్రి ధర్మాన ఫైర్

ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రతిపక్షాలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్షాలు అభివృద్దే జరగలేదని తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని.. కానీ ఎప్పుడూ జరగనంత అభివృద్ధి ఈ మూడున్నరేళ్ళలో ఈ పట్టణంలో జరిగిందని అన్నారు. దశాబ్దాలుగా వేధిస్తున్న అవినీతి సమస్య నుండి ఇప్పుడు ఒక దశ వరకు బయటపడ్డామన్నారు. ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలన్నీ ప్రతిపక్షం వారు దుబారా అంటున్నారని, అదే తాము అధికారంలోకి వస్తే మాత్రం ఆ పథకాలే ఇస్తామని చెప్తున్నారని, మరి అది మాయ – మోసం కాదా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారన్నారు. తప్పు చేసి ఎవరినో నిందించడం సరికాదని హితవు పలికారు. లాస్ట్ టైం వైసీపీ ప్రభుత్వానికి ఓటు వేసి, ప్రజలు మంచి నిర్ణయం తీసుకున్నారన్నారు. తప్పు చేయండని ఎవరూ చెప్పమని, కానీ ఈసారి తప్పు చేస్తే మాత్రం అది మీ ఇష్టమంటూ.. ప్రభుత్వాల్ని ఎంపిక చేసే విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సిందిగా ప్రజల్ని సూచించారు. పెద గనగలవాని పేట బీచ్‌లో విశాఖ బీచ్ రోడ్‌లాగా పెద్ద రోడ్ వేయాలని తన కోరిక అని, అది తప్పకుండా చేస్తానని మాటిచ్చారు. పట్టణంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు తమ సాయశక్తులా కృషి చేస్తున్నామన్నారు. 80 ఫీట్ రోడ్ రావటం వల్ల మీ ఆస్తుల విలువ పెరిగాయని, ఇప్పుడు నాకన్నా మీరే ఆస్తి పరులు అయ్యారని ధర్మాన ఛలోక్తులు పేల్చారు.

అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్.. హరీష్ లెక్క ఎంతంటే?

ఇవాళ అసెంబ్లీలో 2023-24 వార్షిక సంవత్సరానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. ఇవాళ ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీలో ఆర్ధికశాఖ మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇక శాసనమండలిలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెడతారు. బడ్జెట్ ప్రవేశపెడుతున్న క్రమంలో ఇవాళ ఉదయం జూబ్లీహిల్స్ టీటీడీ ఆలయాన్ని హరీష్ రావు సందర్శించి ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం అసెంబ్లీకి చేరుకుని బడ్జెట్ ప్రసంగం చేయనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం కేటాయింపులపై చర్చ జరగనుంది. ఈ ఏడాది 12వ తేదీ వరకు సమావేశాలు జరిగే అవకాశముంది. అయితే.. ఈ ఏడాది డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటం, ముందస్తు ఎన్నికలు రావొచ్చనే సంకేతాల నేపథ్యంలో ఎన్నికల ఏడాదిలో తెలంగాణ బడ్జెట్ ఎలా ఉంటుందనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న దళితబంధు పథకానికి భారీగా కేటాయింపులు ఉండే అవకాశముందని తెలుస్తోంది. అలాగే మిగతా సంక్షేమ పథకాలను కూడా భారీగా నిధుల కేటాయింపు ఉండనుందని తెలుస్తోంది. అయితే.. నిరుద్యోగులకు రూ.3016 భృతి ఇస్తామని గత ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ పొందుపర్చింది.

కాంగ్రెస్ ఆందోళనలు.. అట్టుడుకుతున్న పార్లమెంట్ సమావేశాలు

పార్లమెంట్ నుంచి వీధుల వరకు ఆందోళనలకు పిలుపు నిచ్చింది కాంగ్రెస్ పార్టీ. హిండెన్ బర్గ్-అదానీ వివాదం నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంట్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా వీధుల్లో ఆందోళనలు జరగనున్నాయి. పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద ఈ రోజు ఆందోళనలు చేయనున్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్.పిలు.ఈ ఆందోళనలో పాల్గొననున్న ప్రతిపక్షాలకు చెందిన ఎమ్.పిలు. బహుజన్ సమాజ్ పార్టీ ( బి.ఎస్.పి), జనతా దళ్-ఎస్ ( సెక్యులర్) పార్టీ లు ఈ ఆందోళనకు దూరం ఉండాలని నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ ఆందోళనకు ఇతర ప్రతిపక్షాల నుంచి మద్దతు ఉన్నప్పటికీ, బిఆర్ఎస్, ఆప్, త్రిణమూల్ కాంగ్రెస్ పార్టీ లు నేరుగా ఆందోళనలో పాల్గొంటారా…!? లేదా సంఘీభావం వ్యక్తం చేసే వరకే పరిమితం అవుతారా చూడాలి.అదానీ గ్రూప్ కు వ్యతిరేకంగా హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై పార్లమెంట్ ఉభయసభలకు చెందిన సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసి” విచారణ జరపాలని గత శుక్రవారం డిమాండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ తో పాటు, 16 ప్రతిపక్షాలు. ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ వ్యవహారం పై విచారణ జరపాలని, ప్రతిరోజు విచారణ వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే. అదానీ గ్రూప్ చాలా బలహీనమైన వ్యాపార ప్రాధమిక సూత్రాలకు విరుధ్దంగా వ్యవహరిస్తోందని, పద్దుల మోసాలకు పాల్పడుతోందని, స్టాక్ మార్కెట్ లను ప్రభావితం చేస్తొందని, జనవరి 24 న అమెరికా కు చెందిన “హిండెన్ బర్గ్ రీసెర్చ్” సంస్థ విడుదల చేసిన నివేదికలో వెల్లడైంది. ఈ నివేదికతో అదానీ గ్రూప్ కు చెందిన కంపెనీ ల షేర్లు ఒక్కసారిగా అమ్మకాలకు వచ్చాయి. అయితే, అదానీ గ్రూప్ మాత్రం ఇవన్నీ అబద్ధాలని, అన్ని చట్టాలకు, నియమ నిబంధనలకు అనుగుణంగానే పని చేస్తున్నామని వెల్లడిచేసింది.

నాందేడ్ వేదిక పెద్ద డ్రామా.. ఇక్కడే గతిలేదు అక్కడ పట్టించుకుంటారా?

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రకటన విడుదల చేసారు. బీఆర్‌ఎస్‌ నాందేడ్‌ సభపై ఆయన విమర్శలు గుప్పించారు. నిన్న మహారాష్ట్రలోని నాందేడ్ లో బీఆర్ఎస్ నిర్వహించిన జాతీయ సభ తుస్సు మందని ఎద్దేవ చేశారు. మహారాష్ట్ర జనం అసలు పట్టించుకోనేలేదని, 30 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులు, ఇద్దరు ఎంపీలు 25 రోజులుగా నాందేడ్ లోనే మకాం వేసి ఏర్పాట్లు చేసినా అట్టర్ ఫ్లాప్ అయ్యిందని ఆరోపించారు. చివరకు తెలంగాణ సరిహద్దు జిల్లాల నుండి ఒక్కొక్కరికి రూ.500లు ఇచ్చి జనాన్ని పట్టుకొచ్చి నాందేడ్ వేదికగా కేసీఆర్ పెద్ద డ్రామా చేశారు. తెలంగాణలోనే అతీగతి లేదు.. నాందేడ్ లో బీఆర్ఎస్ ను ఎవరు పట్టించుకుంటారు? అంటూ ఎద్దేవ చేశారు. పెద్ద పెద్ద నాయకులు ఎవరెవరో చేరతారని ప్రచారం చేసుకున్నా.. చివరకు చేరిన అరొకర నాయకులంతా అవుట్ డేటేడ్ వాళ్లే. సొంత ఊరిలోనే 10 ఓట్లు కూడా వేసుకోలేని నాయకులే ఉన్నారు. వేల సంఖ్యలో బీఆర్ఎస్ కండువాలు తీసుకుపోతే ఆ కండువాలు పట్టుకుని కేసీఆర్ నిలబడ్డా… ఎవరూ రాక విసుక్కున్నారంటే బీఆర్ఎస్ పరిస్థితి ఏమిటో అర్ధమవుతోందని హాస్యాస్పదం చేశారు. ఆ సభలో, ఆ తరువాత జరిగిన ప్రెస్ మీట్ లో కేసీఆర్ ప్రధానంగా నాలుగైదు అంశాలు ప్రస్తావించారని, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఏడాదిలోపే మహిళలకు చట్ట సభల్లో 33 శాతం ప్రాతినిధ్యం పెంచుతారట అన్నారు. ప్రతి అసెంబ్లీ, కౌన్సిల్, పార్లమెంట్ లో 1/3 శాతం సీట్లు కేటాయిస్తారట. నోరు తెరిస్తే అబద్దాలే అంటూ మండిపడ్డారు. మీ తొలి కేబినెట్ లో ఐదేండ్లపాటు ఒక్క మహిళను కూడా మంత్రిగా చేయలే! మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ ను ఎందుకు నియమించలే.. నామినేటెడ్ పోస్టుల్లో ఒక్క మహిళకు కూడా ఎందుకు అవకాశమియ్యలే.. అంతెందుకు ఇప్పడున్న లోక్ సభ, రాజ్యసభ ఎంపీల్లో ఒక్కరైనా మహిళ ఉన్నారా? అంటూ ప్రశ్నించారు. ఇవన్నీ నాందెడ్ సభలో ప్రస్తావిస్తే బాగుండేదని ఆశాభావం వ్యక్తం చేశారు. నీలాంటి పచ్చి అబద్దాల కోరు, మోసగాడు మహిళలకు 1/3 శాతం రిజర్వేషన్లు ఇస్తానని చెబుతుంటే జనం అసహ్యించుకుంటున్నరని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చేసింది.. ఆ గాయాలకు కారణమిదే!

ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరాం నుదుటి భాగంపై గాయాలు ఉండటంతో.. ఆమె మృతిపై అనుమానాలు రేకెత్తిన విషయం తెలిసిందే! దీంతో ఫోరెన్సిక్ బృందం రంగంలోకి దిగింది. ఇప్పుడు ఆ రిపోర్ట్ బయటకు రావడంతో.. ఆమె తలపై గాయాలవ్వడానికి గల కారణాలేంటో బహిర్గతమైంది. బెడ్రూంలో ఆమె కిందపడటంతో తలకు బలమైన దెబ్బ తగిలిందని, దాంతో ఆమె మృతి చెందిందని ఫోరెన్సిక్ నివేదికలో తేలినట్టు పోలీసులు తెలిపారు. ఆమె నివసిస్తున్న అపార్ట్‌మెంట్ ప్రాంగణంలోని సీసీ కెమెరాలను తాము క్షుణ్ణంగా పరిశీలించామని, ఎక్కడా అనుమానాస్పద కదలికలు కనిపించలేదని స్పష్టం చేశారు. దీంతో.. వాణీ మృతిపై నెలకొన్న అనుమానాలు పటాపంచలయ్యాయి. కాగా.. వాణీజయరాం అసలు పేరు కలైవాణి. ఆరుగురు అక్కాచెల్లెళ్లలో ఆమె ఐదో సంతానం. కర్ణాటక సంగీతాన్ని అవపోసన పట్టిన ఆమె.. 1971లో గాయనిగా సినీరంగ ప్రవేశం చేశారు. తెలుగు, తమిళం, హిందీ, మళయాళం, గుజరాతీ, ఒరియా సహా 19 భాషల్లో 20 వేలకు పైగా పాటలు పాడారు. మూడు సార్లు ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం అందుకున్న వాణీ.. తొలి పాటకే ఐదు అవార్డులు అందుకోవడం విశేషం. మొన్నటికిమొన్న కేంద్ర ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ అవార్డును కూడా ప్రకటించింది. అయితే.. ఆ పురస్కారాన్ని అందుకోకుండానే కన్నుమూశారు. వాణీ జయరాం 1968 ఫిబ్రవరి 4వ తేదీన జయరాంను వివాహం చేసుకున్నారు. సరిగ్గా అదే రోజు ఆమె మృతి చెందారు. వాణీ భర్త జయరాం 2018లోనే కన్నుమూశారు. వీరికి పిల్లలు లేకపోవడంతో వాణీ జయరాం ఇంట్లో ఒంటరిగానే ఉంటున్నారు.

జింబాబ్వే క్రికెటర్ హిస్టరీ.. రెండు దేశాల తరఫున..

జింబాబ్వే క్రికెటర్‌ గ్యారీ బ్యాలెన్స్‌ చరిత్ర సృష్టించాడు. రెండు దేశాల (ఇంగ్లండ్‌, జింబాబ్వే) తరఫున టెస్ట్‌ క్రికెట్‌ ఆడిన 16వ క్రికెటర్‌గా చరిత్రపుటలకెక్కాడు. విడ్డూరమైన విషయం ఏంటంటే.. బ్యాలెన్స్‌ తొలుత పరాయి దేశం ఇంగ్లండ్‌ తరఫున ఆడి, ఆ తర్వాత సొంత దేశానికి ఆడాడు. క్రికెట్ చరిత్రలో ఒక క్రికెటర్ ఇలా రివర్స్‌లో ఆడటం ఇదే మొదటిసారి. ఆల్రెడీ రెండు దేశాల తరఫున ఆడిన 15 మంది క్రికెటర్లు తొలుత తమ సొంత దేశం తరఫున ఆడారు. ఆ తర్వాత కొన్ని అనుకోని కారణాల వల్ల ఇతర దేశాల తరఫున ప్రాతినిథ్యం వహించారు. కానీ.. బ్యాలెన్స్ మాత్రం రివర్స్‌లో మొదట ఇంగ్లండ్ తరఫున ప్రాతినిథ్యం వహించి, ఇప్పుడు సొంత దేశానికి ఆడుతున్నాడు. నిజానికి.. గ్యారీ బ్యాలెన్స్ జింబాబ్వేలోనే పుట్టి, పెరిగి, విద్యను అభ్యసించాడు. అయితే.. 2006లో బ్రిటన్‌కు వెళ్లి, అక్కడే స్థిరపడ్డాడు. క్రికెట్ మీద ఉన్న ప్రేమతో, ఇంగ్లండ్ తరఫున క్రికెట్ ఆడాలని కలలు కన్నాడు. ఆ కలల్ని సాకారం చేసుకున్నాడు కూడా. కౌంటీల్లో సత్తా చాటి.. 2013లో ఇంగ్లండ్ జాతీయ జట్టుకి ఎంపికయ్యాడు. 2017 వరకు, అంటే నాలుగేళ్ల పాటు ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. కానీ.. ఆ తర్వాత ఫామ్‌లేమీ కారణంగా అతడు జట్టులో స్థానం కోల్పోయాడు. ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించిన బ్యాలెన్స్‌.. ఆతర్వాత ఫామ్‌ కోల్పోవడంతో జట్టులో స్థానం కోల్పోయాడు. తిరిగి జట్టులో స్థానం పొందడానికి చాలా ప్రయత్నాలు చేశాడు కానీ, అతనికి అవకాశాలు రాలేదు. దీంతో.. అతడు తిరిగి తన సొంత గూటి అయిన జింబాబ్వేకి చేరుకున్నాడు.

ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. NTR30 సీక్రెట్స్ చెప్పేసిన తారక్

జూ. ఎన్టీఆర్ అభిమానులు NTR30 ప్రాజెక్ట్ అప్డేట్స్ కోసం ఎంతకాలం నుంచి వేచి చూస్తున్నారో అందరికీ తెలుసు. ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన తర్వాత కొంతకాలం వరకూ మౌనం పాటించిన చిత్రబృందం.. తారక్ పుట్టినరోజు సందర్భంగా ప్రీ-టీజర్‌తో మంచి ట్రీట్ అయితే ఇచ్చారు. కానీ, ఆ తర్వాత మళ్లీ సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాతి నుంచి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు. అప్పుడప్పుడు ఈ సినిమా అప్పుడు సెట్స్ మీదకి వెళ్లొచ్చు, ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ అవ్వొచ్చు అంటూ పుకార్లు షికారు చేశాయే తప్ప.. యూనిట్ వర్గాల నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. ఎట్టకేలకు చాలాకాలం తర్వాత చిత్రబృందం ఒక అప్డేట్ ఇచ్చారు. ఫిబ్రవరిలో ప్రారంభోత్సవం జరిపి, మార్చిలో సెట్స్ మీదకి తీసుకెళ్తామని ఓ ప్రకటన చేశారు. కానీ.. అలాంటి సందడి మాత్రం కనిపించలేదు. అప్డేట్ ఇచ్చి మళ్లీ మౌనం పాటించేసరికి.. ఈసారి కూడా షూటింగ్ వాయిదా పడుతుందేమోనని ఫ్యాన్స్ కంగారుపడ్డారు. దీంతో అప్డేట్ కావాలంటూ డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఫైనల్‌గా ఓ అద్దిరిపోయే అప్డేట్‌ని స్వయంగా తారకే ఇచ్చేశాడు. ‘అమిగోస్’ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా విచ్చేసిన తారక్.. తమ ఎన్టీఆర్30 సినిమా ఎప్పుడు లాంచ్ అవుతుంది? షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అనే వివరాల్ని రివీల్ చేయడంతో పాటు ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా క్లారిటీ ఇచ్చేశాడు.

సాయం కోరిన పాపానికి.. ప్రయాణికురాలిపై ఎయిర్ లైన్స్ సిబ్బంది పైశాచికం 

అమెరికన్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది ఓ భారత మహిళ పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించింది. కేవలం తన బ్యాగును క్యాబిన్‌లో పెట్టమని సాయం కోరిన పాపానికి.. ఆమెను ఏకంగా విమానంలో నుంచే దించేశారు. జనవరి 30వ తేదీన ఢిల్లీలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాల్లోకి వెళ్తే.. మీనాక్షి సేన్‌గుప్తా అనే మహిళ జనవరి 30న ఢిల్లీ నుంచి న్యూయార్క్‌కు వెళ్లేందుకు.. అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం 293లో టికెట్‌ బుక్‌ చేసుకుంది. అయితే.. కొన్ని రోజుల క్రితమే క్యాన్సర్ సంబంధిత శస్త్రచికిత్స జరగడంతో, ఆమె వీల్‌ఛైర్‌ అసిస్టెంట్‌ ద్వారా విమానం ఎక్కింది. తాను అనారోగ్యంగా ఉండటంతో.. తన వెంట తెచ్చుకున్న బ్యాగ్‌ను క్యాబిన్‌లో పెట్టాలని ఓ ఎయిర్‌హోస్టెస్‌ సాయం కోరింది. అయితే.. ఆమె సాయం చేయడానికి తిరస్కరించింది. అంతటితో ఆగకుండా.. విమానం నుంచి దిగిపోవాలని కోరింది. ఆమెతో పాటు మొత్తం సిబ్బంది దిగిపోవాలని కోరడంతో.. ఆమె అవమానంగా భావించి విమానం దిగిపోయింది.

అల్లు అర్జున్ కు లారీ బొమ్మ ఇచ్చిన అల్లు అయాన్ .. పుష్ప ఖుషీ

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో బ్లాక్ బస్టర్ పుష్ప చిత్రానికి సీక్వెల్ గా రూపొందుతున్న పుష్ప ది రూల్‌ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. అయితే.. తాజా సమాచారం ఏమిటంటే, అల్లు అయాన్ లారీ బొమ్మను తన తండ్రి అల్లు అర్జున్‌కు బహుమతిగా ఇచ్చి దానిపై ‘పుష్ప’ అని రాశాడు. ఈ బొమ్మ ఫోటోను అల్లు అర్జున్ సోషల్‌ మీడియాలో షేర్ చేశారు. “నా స్వీటెస్ట్ సోల్ అయాన్ చిన్ని బాబు నుండి అందమైన బహుమతి” అని క్యాప్షన్ రాస్తూ అల్లు అర్జున్‌ పోస్ట్‌ చేశారు. భారీ సక్సెస్ ను అందించిన ఈ చిత్ర విజయాన్ని గుర్తు చేస్తూ ఆయాన్ ఇలాంటి గిఫ్ట్ అందించడంతో అల్లు అర్జున్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. హైదరాబాద్‌లోని ఆర్‌ఎఫ్‌సిలో జరగబోయే షెడ్యూల్‌లో అల్లు అర్జున్ పుష్ప 2 సెట్స్‌లో జాయిన్ అవుతాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది.ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ బాణీలు సమకూర్చనున్నారు. ప్రస్తుతం టీమ్ 10 రోజుల షూటింగ్ కోసం వైజాగ్‌కు వెళ్లింది. షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండటం విశేషం. ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ నటిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది చిత్రం. మరోవైపు అల్లు అర్జున్ కోసం స్టార్ డైరెక్టర్లు ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది.