ప్రారంభమయిన తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. గవర్నర్ తమిళిసై ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వం సాధిస్తున్న సమ్మిళిత సమగ్రాభివృద్ధి యావత్ దేశానికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ప్రతి రంగంలోనూ దేశం ఆశ్చర్యపోయే విధంగా అద్భుతమైన ప్రగతిని ఆవిష్కరిస్తూ పురోగమిస్తున్నదని చెప్పారు.తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది. దేశానికే ధాన్యాగారం తెలంగాణ. ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తున్నాం. తలసరి ఆదాయం 3 లక్షలకు పైగా పెరిగింది. తెలంగాణ ఏర్పాటయ్యాక అభివృద్ధి రేటు రెట్టింపు అయింది. తెలంగాణ గ్రామాల్లో జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. మా ప్రభుత్వం ఎన్నో సవాళ్లను అధిగమించింది.మిషన్ కాకతీయతో చెరువులను పునరుద్ధరించాం. రైతు బంధు పథకాన్ని ఐక్యరాజ్యసమితి ప్రశంసించింది. 65 లక్షలమంది రైతులకు సాయం అందిస్తున్నాం. రైతు బీమా ద్వారా 5 లక్షలు అందిస్తున్నాం. రైతులకు అన్నివిధాల సాయం అందిస్తున్నాం. వ్యవసాయ రంగం పండుగలా మారింది. రికార్డు టైంలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిచేశాం. కోటి ఎకరాలు సాగులోకి వచ్చాయి. తెలంగాణలో ఫ్లోరైడ్ లేదని కేంద్ర జలశక్తి మిషన్ ప్రకటించింది. దళిత బంధు దేశంలో రికార్డు సృష్టించింది. రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి జరుగుతోంది. 10 లక్షల రూపాయలు దళిత బంధుగా వాడుకోవచ్చు. మళ్ళీ దీనిని చెల్లించాల్సిన అవసరం లేదు. ఆసరా పథకం ద్వారా వృద్ధులకు పెన్షన్లు అందిస్తున్నాం.
నాందేడ్ లో సీయం కేసీఆర్ సభ.. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి
మహారాష్ట్ర నాందేడ్‌లో అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పర్యటిన కొనసాగుతుంది. ఈ నెల 5న మహారాష్ట్రలోని నాందేడ్ సీయం కేసీఆర్ పాల్గొననున్ననేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. ఎమ్మెల్యేలు జోగు రామన్న, విఠల్ రెడ్డి టీఎస్‌ఐఐసీ చైర్మన్ బాలమల్లు, తదితరులతో కలిసి శుక్రవారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. సభాస్థలికి చేరుకుని నిర్వాహకులతో మాట్లాడారు. సభ వేదిక, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లపై మంత్రి ఆరా తీశారు. నాందేడ్ జిల్లాతో పాటు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలు, తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, శ్రేయోభిలాషులు సభకు హాజరుకానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని.. అందరూ సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేయాలని సూచనలిచ్చారు.
విదేశీ విద్యార్ధులకు తోడుగా ఉంటా
విదేశీ వర్సిటీల్లో 213 మంది విద్యార్థులకు అడ్మిషన్లు.. జగనన్న విదేశీ విద్యా దీవెన నిధులు విడుదల.. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువే.. ప్రపంచ వేదికపై మన విద్యార్థులు ఆంధ్రా జెండా ఎగరవేయాలి.. మన పిల్లలు ప్రపంచస్థాయిలో రాణించాలన్నారు సీఎం జగన్. ఈ ఏడాది టాప్ 200 విదేశీ యూనివర్శిటీల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు మొదటి విడత విద్యా దీవెన సహాయం అందచేస్తోంది ప్రభుత్వం. ఈ పథకం ద్వారా 213 మంది విద్యార్ధులకు లబ్ది చేకూరనుంది. మొదటి విడత సాయంగా రూ. 19.95 కోట్లు విడుదల చేశారు సీఎం. లబ్ధిదారుల ఖాతాల్లో వర్చువల్ గా జమ చేయనున్న సీఎం వైఎస్ జగన్. ఏటా 2 సీజన్లలో విదేశీ విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు. టాప్ 100 విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్ధులకు గరిష్టంగా రూ. 1.25 కోట్ల వరకు 100 శాతం ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్. మిగిలిన వారికి గరిష్టంగా రూ. 1 కోటి వరకు ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్ అందుతుందన్నారు సీఎం జగన్. 100 నుండి 200 క్యూఎస్ ర్యాంకులు పొందిన యూనివర్శిటీలలో ఎంపికైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్ధులకు గరిష్టంగా రూ. 75 లక్షల వరకు ట్యూషన్ ఫీజు రీఎంబర్స్‌మెంట్. మిగిలిన విద్యార్ధులకు గరిష్టంగా రూ. 50 లక్షలు లేదా ట్యూషన్ ఫీజులో 50 శాతం ఏది తక్కువైతే అది చెల్లింపు. విదేశీ విశ్వవిద్యాలయానికి వెళ్ళే విద్యార్ధులకు విమాన, వీసా ఛార్జీలు సైతం రీఇంబర్స్‌మెంట్ చేస్తామన్నారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే తమను సంప్రదించవచ్చన్నారు.
ఈయన ఒక ఎంపీ, అది కూడా కరీంనగర్ నుండి.. ఖర్మరా బాబు
ఢిల్లీలో విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మొదటి నుంచి బండి సంజయ్ ని టార్గెట్ చేస్తూ కౌంటర్ రిమార్క్స్ తో దూసుకుపోతున్న కేటీఆర్ ఇటీవల ఉమ్మడి జిల్లా పర్యటనలో ప్రధానంగా బండి సంజయ్ ని టార్గెట్ చేస్తూ ప్రసంగాలు కొనసాగించారు. కరీంనగర్ లాంటి ఉద్యమాల మూలంగా దొరికిపోయిన ఎంపీ పూర్తిగా సబ్జెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈసారి చేసిన ట్వీట్ చర్చకు దారి తీస్తోంది. నిజానికి ఈ ట్వీట్‌ని సోషల్ మీడియాలో పుట్టా విష్ణువర్ధన్ రెడ్డి అనే బీఆర్‌ఎస్ నేత ప్రారంభించారు. మోడీ ప్రధానిగా వచ్చిన తర్వాత బండి సంజయ్ తో స్క్రీన్ షాట్ షేర్ చేస్తూ.. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం ప్రజలకు దండాలు అంటూ పైగా జోకర్ ఎంపీ… యాక్సిడెంటల్ ఎంపీ అంటూ ట్వీట్ చేశారు. అయితే దీన్ని మళ్లీ షేర్ చేస్తూ మంత్రి కేటీఆర్ ఢిల్లీలో పరమానందయ్య గారి ఫేకుడు.. ఆయన గారి శిష్యులు ఇక్కడ జోకుడు అంటూ ట్వీట్ చేయడమే కాదండోయ్.. ఈయన ఒక ఎంపీ, అది కూడా కరీంనగర్ నుంచి అని తల కొట్టుకుంటున్నట్టుగా ఉండే ఎమోజీని యాడ్ చేసి షేర్ చేశారు. అయితే.. ఇప్పుడు దీన్ని బీఆర్ఎస్ సోషల్ మీడియా టీం అన్ని గ్రూపుల్లో షేర్ చేస్తోంది.
జరిగింది ఫోన్ ట్యాపింగ్ కాదు.. మ్యాన్ ట్యాపింగ్
పార్టీ మారాలనే నిర్ణయం కోటంరెడ్డి వ్యక్తిగతం.. వైసీపీపై బురద జల్లడం కోటంరెడ్డి మానుకోవాలన్నారు మంత్రి కాకాణి. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ఇన్ని రోజులు కోర్టుకు ఎందుకు వెళ్లలేదు.. ఆడియో రికార్డు అని కోటంరెడ్డికి తెలుసన్నారు కాకాణి గోవర్ధన్‌రెడ్డి. ఫోన్ రికార్డింగ్ అని తెలుసు కాబట్టే ఫోన్ ట్యాపింగ్ అని డ్రామాలు చేస్తున్నారు.. ఫోన్ ట్యాపింగ్ జరగలేదు మ్యాన్ ట్యాపింగ్ జరిగింది.. కోటంరెడ్డి ఈ స్థాయికి రావడానికి కారణం జగన్ కారణం కాదా?. కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని చెప్పావు ఏమైందన్నారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం…ముఖ్యమంత్రి .జగన్ మీద రూరల్ ఎం.ఎల్.ఏ.శ్రీధర్ రెడ్డి ఆరోపణలు చేశారు. పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారు. అది ఆయన వ్యక్తిగతం. ఏదో ఒక కారణం చెప్పి బయటకు వెళ్లాలనుకున్నారు. 2014 లో నెల్లూరు రూరల్ టికెట్ పై చాలా ఒత్తిళ్లు వచ్చాయి. అక్కడ జగన్ ఉన్నారు కాబట్టే టికెట్ వచ్చింది. నమ్మకం లేని చోట ఉండలేనని అంటున్నారు. ట్యాపింగ్ కాదు..రికార్డింగ్ అది శ్రీధర్ రెడ్డికి తెలుసు. ఫోన్ ట్యాపింగ్ కాదు..మ్యాన్ ట్యాపింగ్ జరిగింది..చంద్రబాబు మ్యాన్ ట్యాపింగ్ చేశారు. అందుకే టిడిపి వాళ్ళు ట్యాపింగ్..ట్యాపింగ్ అంటున్నారు.
అన్ని వర్గాల వారికి ఈ బడ్జెట్ ఆమోదయోగ్యం
పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2023 బడ్జెట్ అన్ని వర్గాల వారికి ఈ బడ్జెట్ ఆమోద యోగ్యమయినదన్నారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి. నాగోతు రమేష్ నాయుడు. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలమ్మ బడ్జెట్ అందరికీ మేలు చేసెలా ఉంది.ఇందిరా గాంధీ తరువాత నిర్మలా సీతారామన్ మహిళగా వరుసగా బడ్జెట్ ప్రవేశ పెట్టారు.అన్ని వర్గాల వారికి ఈ బడ్జెట్ ఆమోద యోగ్యమైంది.జనరంజక పాలన చేస్తానని, అవినీతి నిర్మూలనకు టోల్ ఫ్రీ నెంబర్ పెడతానని జగన్ హామీ ఇచ్చారు. ఆ పార్టీ నాయకుల అవినీతి తెలపడానికి ఆ టోల్ ఫ్రీ నెంబర్ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. కనీసం ఈ హామీనైనా జగన్ నిలబెట్టుకోవాలి. మద్య నిషేధం అన్న జగన్.. నేడు రాష్ట్రం మొత్తం ఏరులై పారిస్తున్నాడు.పేదల మహిళల పుస్తెలు తెంపే విధంగా జగన్ చర్యలు ఉన్నాయి.యువతకు ఉద్యోగాలన్న జగన్.. వారిని మోసం చేశాడు.జాబ్ క్యాలెండర్ లేదు.. జాబ్ లెస్ క్యాలెండర్ తో మభ్యపెట్టారు.జగన్ కావాలని ఏరి కోరి గెలిపించిన ఉద్యోగుల హక్కులను హరించేశాడు. నేడు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియక ఎదురు చూస్తున్నారు. రైతులకు మేలు చేస్తామన్న జగన్.. ఉన్న పధకాలు కూడా పీకేశాడు. రైతులకు నష్ట పరిహారం ఇవ్వకుండా అన్యాయం చేశారు. ప్రతి అంశంలోనూ నేడు అందరూ కోర్టును ఆశ్రయిస్తున్నారు. మార్కెటింగ్ వ్యవస్థలో మెళకువలు నేర్చుకోవాలంటే జగన్ దగ్గరకి వెళ్లండి.
రామమందిరాన్ని బాంబులతో కూల్చేస్తామని ఫోన్ కాల్
అయోధ్య రామమందిరాన్ని బాంబులతో కూల్చేస్తామని ఓ ఆగంతకుడు చేసిన బెదిరింపు ఫోన్ కాల్ కలకలం సృష్టించింది. ఫోన్ చేసిన ఆ వ్యక్తి ఆలయాన్ని పేల్చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ బెదిరింపు కాల్ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. గురువారం ప్రయాగ్‌రాజ్‌కు చెందిన మనోజ్ కుమార్ అనే వ్యక్తికి అయోధ్య రామమందిరాన్ని కూల్చేస్తామని బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. మనోజ్ కుమార్ అయోధ్యలోని రాంలాలా సదన్ నివాసి కాగా.. ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌లోని కల్పవస్‌లో ఉన్నాడు. అయితే, మనోజ్‌కు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. కాల్‌లో మరికొన్ని గంటల్లో శ్రీరామ జన్మభూమి ఆలయాన్ని బాంబులతో పేల్చేస్తామని బెదిరించారు. దీంతో, భయాందోళనకు గురైన మనోజ్.. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.
నమ్మకద్రోహం మాట బాధేసింది
నెల్లూరు రాజకీయం వేడెక్కింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్వంత పార్టీ పై తిరుగుబాటు బావుటా ఎగరేశారు. తనపై నిఘా పెట్టారని, తన ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపించారు కోటంరెడ్డి. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై మాజీ మంత్రి అనిల్ కుమార్ విరుచుపడ్డారు. దమ్ముంటే రాజీనామా చేయాలని సవాల్ చేశారు. ఇద్దరం స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా చేసి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తేల్చుకుందామన్నారు. అనిల్ ఆరోపణలపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. 2009లో అనిల్ కుమార్ 90 ఓట్లతో ఒడిపోయిపుడు నా కుటుంబ సభ్యులు ఏడ్చారు. ఇప్పుడు నా బిడ్డల గురించి మాట్లాడటం బాధేసిందన్నారు. అధికారాన్ని వదులుకుని ప్రతిపక్షం లోకి వచ్చానన్నారు. నెల ముందు నుంచి నా పై అధిష్టానానికి అనుమానం పెరిగింది.నా మనసుకు కష్టం కలిగిందని కాబట్టే బయటకు వచ్చా..సజ్జల లాంటి వ్యక్తులు అడ్డ దిడ్డముగా ఆడియో వెనుక ఉన్నారు. థియేటర్ ల పరిస్థితి బాగలేక మూసుకుంటుంటే.. వారివద్ద నెల వారీ మామూళ్లు తీసుకుంటున్నానని ఆరోపించారు. ఇసుక ..మద్యం పేర్లతో ఎవరు వ్యాపారం చేస్తున్నారో ..వారి మీద ఆడియోలు పెట్టించండి. వీరి మీద ఆడియోలు పెడితే. మీ పదవి పోతుంది.ఇసుక మాఫియా ఎవరినీ ఖాతరు చేయడం లేదు. నన్ను అరెస్ట్ చేస్తామని సజ్జల ఆధ్వర్యంలో మీడియాకు లీకులు ఇస్తున్నారు. రండి..ఎప్పుడు వస్తారో రండి అని కోటంరెడ్డి సవాల్ విసిరారు.
పార్కింగ్లోని బైకును ఢీకొట్టి.. 3కి.మీ మంటలొస్తున్నా లాక్కెళ్లాడు
గురుగ్రామ్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ హోండా సిటీ కారు రోడ్డు పక్క పార్కింగులోని బైకును ఢీకొట్టింది. అనంతరం ఏకంగా మూడు కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ఇతర ప్రయాణికులు వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించినా పట్టించుకోకుండా మోటార్‌సైకిల్‌ను ఈడ్చుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. సదరు వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు.. గురుగ్రామ్‌లోని సెక్టార్ 65లో బుధవారం రాత్రి మోనూ అనే వ్యక్తి డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్నాడు. మార్గం మధ్యలో ఏదో పని నిమిత్తం రోడ్డు పక్కన తన మోటర్ సైకిల్ ఆపాడు. ఆ సమయంలో అటుగా వేగంగా వచ్చిన హోండా సిటీ కారు.. బైక్‌ను ఢీ కొట్టింది. తృటిలో ఆ వ్యక్తి ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ క్రమంలో కారు కింద బైక్ ఇరుక్కుపోవడంతో దాన్ని మూడు కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. అక్కడే ఉన్న జనం కారును ఆపేందుకు ప్రయత్నించారు. కానీ కారులో ఉన్న వ్యక్తి పట్టించుకోకుండా వెళ్లిపోయాడని పోలీసులు తెలిపారు.