పార్లమెంటులో నిర్మలమ్మ బడ్జెట్… వేతన జీవులకు ఊరట
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. వేతన జీవులకు ఊరట కల్గించారు. ప్రస్తుతమున్న 6 శ్లాబులను 5 శ్లాబులకు తగ్గించారు. ఆదాయం రూ.7లక్షలు దాటితే 5 శ్లాబుల్లో పన్ను. 0-3 లక్షల వరకు నిల్. 3 – 6 లక్షల వరకు 5% పన్ను..6 – 9 లక్షల వరకు 10% పన్ను.. 9 -12 లక్షల వరకు 15% పన్ను విధిస్తారు. 12- 15 లక్షల వరకు 20% పన్ను విధిస్తారు. రూ.15 లక్షలు ఆదాయం దాటితే 30% పన్ను విధిస్తారు. ఇళ్లు లేని వారికి కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. పేదల సొంతింటి కలను నెరవేర్చేలా బడ్జెట్‌లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులను కేంద్రం భారీగా పెంచింది. పీఎం ఆవాస్ యోజనకు రూ.79 వేల కోట్ల కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రకటించారు. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేస్తున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజనకు గతంలో కంటే 66 శాతం నిధులను పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించారు. అదే సమయంలో దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు కూడా కేంద్ర ప్రభుత్వం పెద్ద పీట వేసింది. వరుసగా మూడో ఏడాది భారీగా నిధులను కేటాయించింది. మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.10 లక్షల కోట్లను వెచ్చించనున్నట్లు కేంద్ర మంత్రి సీతారామన్ ప్రకటించారు. ఇది జీడీపీలో 3.3 శాతమని చెప్పారు. 2020లో చేసిన కేటాయింపులతో పోలిస్తే ఇది మూడు రెట్లు అధికమని వివరించారు.
విషాదం.. పెళ్లికని వచ్చారు.. కళ్లెదుటే కాలిపోయారు
జార్ఖండ్ లో విషాదం నెలకొంది. ధన్ బాద్ లోని ఆశ్వీరాద్ అపార్ట్ మెంట్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 14మంది సజీవ దహనం అయ్యారు. మరికొందరికి తీవ్రగాయాలు కాగా స్థానికులు ఆస్పత్రికి తరలించారు. మంగళవారం సాయంత్రం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 13 అంతస్తుల అపార్ట్ మెంట్ లో మంటలు చెలరేగాయి. రెండో అంతస్తులో తొలుత మొదలైన మంటలు ఆ తర్వాత మిగత అంతస్తులకు వ్యాపించాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.
కేంద్ర న్యాయ శాఖ మాజీ మంత్రి శాంతి భూషణ్ కన్నుమూత
ప్రముఖ న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి శాంతి భూషణ్ కన్నుమూశారు. మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో ఢిల్లీలో శాంతి భూషణ్ తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 97సంవత్సరాలు. అవినీతికి వ్యతిరేకంగా గళం వినిపించిన న్యాయవాదిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఉత్తర ప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో 1925, నవంబర్ 11న ఆయన జన్మించారు. శాంతి భూషణ్ సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పని చేశారు. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు.
జవాన్ గా మారిన పఠాన్
కింగ్ ఖాన్ అని తనని అందరూ ఎందుకు పిలుస్తారో మరోసారి నిరూపించాడు షారుఖ్ ఖాన్. పదేళ్లుగా హిట్ లేని ఒక హీరో నటించిన సినిమా రిలీజ్ అయితే హిట్, సూపర్ హిట్ అవుతుందేమో కానీ ఇండస్ట్రీ హిట్ అయ్యింది. ఎన్నో స్టార్ హీరోలు నటించిన భారి బడ్జట్, సూపర్ హిట్ సినిమాలకి కూడా అందుకోవడానికి కష్టమైన బాహుబలి 3 రికార్డులకే ఎసరు పెట్టేలా ఉంది అంటే షారుఖ్ ఖాన్ బాక్సాఫీస్ స్టామినాకి నిదర్శనం. దాదాపు అయిదేళ్ల తర్వాత ‘పఠాన్’ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చిన షారుఖ్ ఖాన్, కేవలం ఏడు రోజుల్లో 640 కోట్లు రాబట్టాడు అంటే అతని రికార్డుల ఊచకోత ఏ రేంజులో జరుగుతుందో అర్ధం చేసుకోవచ్చు. షారుఖ్ ఖాన్ అంటే హీరో కాదు ఇండియన్స్ కి అతనో ఎమోషన్ అనే విషయాన్ని ప్రూవ్ చేస్తూ పఠాన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తూనే ఉంది.
జోషిమఠ్ తరహాలోనే మరో రెండు నగరాల్లో పగుళ్లు
ఉత్తరాఖండ్‌లోని పవిత్ర పట్టణం జోషిమఠ్‌లో ఇప్పటికే దాదాపు 678 ఇళ్లు దెబ్బతిన్నాయి. రుద్రప్రయాగ్, కర్ణప్రయాగ్‌లోని ఇళ్లలో కూడా ఇలాంటి పగుళ్లు కనిపించాయి. రిషికేశ్-కర్ణప్రయాగ్ రైలు మార్గంలో టన్నెల్ నిర్మాణమే ఈ పగుళ్లకు కారణమని అనుమానిస్తున్నారు. ఉత్తరాఖండ్ లోని జోషిమఠ్ తరహాలోనే మరో రెండు నగరాల్లోనూ ఇండ్లలో పగుళ్లు ఏర్పడుతుతున్నాయి. పుణ్యస్థలమైన జోషిమఠ్‌లో ఇప్పటికే 678 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇక రుద్రప్రయాగ్, కర్ణప్రయాగ్‌లోనూ ఇలాంటి పరిస్థితులే కన్పిస్తున్నాయి. రెండు నగరాల్లోని ఇండ్ల గోడలకు పగుళ్లు ఏర్పడి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో కొన్ని నిర్మాణాలు నేలమట్టమయ్యాయి. రిషికేశ్-కర్ణప్రయాగ్ రైలు మార్గంలో టన్నెల్ నిర్మాణమే ఇళ్ల పగుళ్లకు కారణమని అనుమానిస్తున్నారు.
మా దేవుడు నువ్వేనయ్యా… మా కోసం వచ్చావయ్యా
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు అంటే పాన్ ఇండియా సినిమాలు ఎక్కువ అయ్యి యాక్షన్ మోడ్ లోకి వెళ్తున్నాయి కానీ ఒక దశాబ్దం క్రితం వరకూ ప్రతి సినిమాలో కామెడీ ఉండేది. కామెడీ అంటే బ్రహ్మానందం గారు ఉండాల్సిందే. వెయ్యికి పైగా సినిమాలలో కనిపించి, ఒక్క డైలాగ్ కూడా చెప్పకుండా కేవలం ఎక్స్ప్రెషన్స్ తో మనల్ని నవ్వించిన బ్రహ్మానందం గారు ఇటివలే సినిమాలు బాగా తగ్గించారు. అప్పుడప్పుడూ జాతిరత్నాలు, వీర సింహా రెడ్డి లాంటి సినిమాల్లో అలా కనిపించి మనల్ని కాసేపు నవ్వించి వెళ్ళిపోతున్నారు కానీ బ్రహ్మానందం గారి మార్క్ తో ఫుల్ లెంగ్త్ సినిమా రాలేదు. మీమ్ పేజస్ ని, ట్రోల్స్ కి, సరదా జోకులకి ఇలా ఈరోజు సోషల్ మీడియాలో జరిగే ప్రతి కాన్వర్జేషణ్ కి బ్రహ్మానందం గారి టెంప్లేట్లే నడిపిస్తున్నాయి. ఆయన మరోసారి ఫుల్ లెంగ్త్ కామెడీ క్యారెక్టర్ సినిమా చేస్తే ఎలా ఉంటుంది? మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న ఆ మ్యాజిక్ ని తెరపై మరోసారి చూపించడానికి దర్శకుడు తరుణ్ భాస్కర్ రెడీ అయ్యాడు. మన ‘బ్రహ్మీ’ని రీలాంచ్ చేస్తున్నట్లు తరుణ్ భాస్కర్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు.