NTV Telugu Site icon

Top Headlines @9PM: టాప్ న్యూస్

Ntv Top Hl 9pm

Ntv Top Hl 9pm

దేశవ్యాప్తంగా ఫార్మా కంపెనీలపై దాడులు.. . 18 కంపెనీలు రద్దు

దేశవ్యాప్తంగా నకిలీ ఔషధ కంపెనీలపై కేంద్రం ఉక్కుపాదం మోపింది. 20 రాష్ట్రాల్లో మొత్తం 76 ఫార్మాస్యూటికల్ కంపెనీలపై డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీసీఐ) దాడులు నిర్వహించింది. నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న 18 కంపెనీల లైసెన్సులు రద్దు చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. 18 కంపెనీలు రద్దు చేయడంతో పాటు 26 ఫార్మా కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. కేంద్ర, రాష్ట్ర బృందాలు కలిసి ఆకస్మిక తనిఖీలు చేపట్టాయి. ఫార్మా కంపెనీలపై దాడులు జరగొచ్చని గత 15 రోజులుగా ప్రచారం జరుగుతోంది. నకిలీ ఔషధాల తయారీకి సంబంధించి ఈ భారీ దాడులు జరిగాయి. డ్రగ్స్ తయారీకి కేంద్రంగా ఉన్న ఇండియా మందులపై ఇటీవల పరిణామాలు ప్రభావాన్ని చూపిస్తున్నాయి. గతేడాది గాంబియా, ఉజ్బెకిస్థాన్ దేశాల్లో ఇండియా తయారీ దగ్గుమందు వాడిన తర్వాత చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. దీంతో ఈ దగ్గు మందు తయారు చేసిన రెండు కంపెనీలను ప్రభుత్వం మూసేయించింది.

విశాఖలో కలకలం రేపుతున్న సెల్ఫీ వీడియో

ఆర్ధిక ఇబ్బందులతో సూసైడ్ చేసుకున్నామంటూ సెల్ఫీ వీడియో తీసుకున్న భార్య భర్తల మిస్సింగ్ కేసులో మిస్టరీ కొనసాగుతుంది.. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్న పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు…నిజంగానే ఏలేరు కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నారా? లేదంటే వేరే ఎక్కడికైనా వెళ్లిపోయారా అనే అనుమానాలు పోలీసులకు తలెత్తాయి..సంఘటన స్థలం వద్ద కేవలం భర్త చెప్పులు మాత్రమే లభించడం, కాలువ గట్టు పై నుండి దూకిన ఆనవాళ్ళు కానీ లభించకపోవడం తో పోలీసులు తమదైనా శైలిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు… ఉదయం నుండి కాలువలో గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టిన ఎటువంటి ఆధారాలు లభించలేదు…దీంతో మిస్సింగ్ కేసు మిస్టరీ గా మారింది…అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..సీసీటీవీ పరిశీలించడం తో పాటు, కాల్ డేటా కూడా కీలకంగా మారనుంది.

ఇసుక, మద్యం, గంజాయి మాఫియా నడుస్తోంది

ఏపీలో జగన్ పాలనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు టీడీపీ నేత కన్నా‌ లక్ష్మీనారాయణ. నదీగర్బం లో ఇసుక తోడేస్తున్నారు..ఇసుక ఆదాయం సీయం జగన్ కు చేరుతుంది…ఫైన్ మాత్రం ప్రజల‌‌ సొమ్ము నుంచి చెల్లిస్తున్నారు.ఇసుక లో వాటాలు అందలేదని యం ఎల్ ఏ లే కోర్టు లో కేసులు పెట్టించారు…ఇసుక , మద్యం జగన్ తానొక్కడే దోచుకుంటున్నారు..జగన్ పాలనలో కలెక్టర్ లకు సైతం రెండు లారీల‌‌ ఇసుక సంపాదించుకో లేక పోతున్నారు..నదీ గర్బలాలో ఇసుకను అడ్డగోలుగా తవ్వడంతో పర్యవరణ సమస్య తలెత్తింది.పర్యావరణానికి విఘాతం కలిగించారని 450 కోట్లు ఫైన్ విధించారు.తాను అధికారంలోకి‌ వస్తే ఇసుక పాలసీ అద్బుతంగా ఉంటుదని జగన్ అన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు మాసాలు ఇసుకను ఆపివేశారు. 50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు. ముత్తాయపాలెం ఇసుక రీచ్ కు పర్మీషన్ లేకపోయినా నదిలోకి రోడ్డు వేసి తవ్వేస్తున్వారు. పవిత్ర తిరుమలలో గంజాయి స్మగ్లింగ్ జరుగుతోందని మండిపడ్డారు కన్నా.

జపాన్ లో భూకంపం.. 6.1 తీవ్రతతో వణికిన దేశం

జపాన్ భూకంపంతో వణికిపోయింది. మంగళవారం ఆ దేశంలో 6.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఉత్తర జపాన్ లోని అమోరిలో ఈ భూకంపం సంభవించినట్లు జపాన్ జాతీయ వాతావరణ సంస్థ వెల్లడించింది. భూకంపం సాయంత్ర 6.18 గంటలకు 20 కిలోమీటర్ల లోతులో సంభవించింది. భూకంపం వల్ల ఎలాంటి నష్టం వాటిల్లలేదని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు సునామీ హెచ్చరికలను జపాన్ జారీ చేయలేదు. జపాన్ భూభాగం అత్యంత భారీ భూకంపాలు వచ్చే ప్రాంతంలో ఉంది. ఇక్కడ తరుచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. జపాన్ ‘‘పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్’’ ప్రాంతంలో ఉంది. ఇది ఆగ్నేయాసియా నుంచి పసిఫిక్ బేసిన్ అంతటా విస్తరించి ఉన్న తీవ్ర భూకంపాలు సంభవించే ప్రాంతం. ఈ ప్రాంతంలో సముద్ర గర్భంలో అగ్నిపర్వతాలు, టెక్టానిక్ ప్లేట్ కదలికలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి ప్రాంతంలో ఉన్నందు వల్లే జపాన్ లో అత్యంత కఠినమైన నిర్మాణాలు కలిగి ఉంది. 2011లో జపాన్ సమీపంలోని సముద్ర గర్భంలో 9.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీని ధాటికి సునామీ అలలు ఎగిసిపడి సెండాయ్ నగరాన్ని ధ్వంసం చేశాయి. 40.5 మీటర్ల ఎత్తులో ఎగిసిపడిన రాకాసి అలల కారణంగా 20 వేలకు పైగా ప్రజలు మరణించారు.

నాగాయలంక డ్వాక్రా గ్రూప్ లో వెలుగు చూసిన మోసం

కృష్ణా జిల్లా అవనిగడ్డ ప్రాంతం నాగాయలంక డ్వాక్రా గ్రూప్ లో మోసం వెలుగులోకి వచ్చింది. తమ డబ్బులు తమకు ఇప్పించండి అంటూ నాగాయలంక వెలుగు ఆఫీస్ ను ఆశ్రయించారు శ్రీ దుర్గా గ్రామైక్య సంఘం మహిళలు. శ్రీదుర్గా గ్రామైక్య సంఘంలో 90 లక్షలు స్వాహా చేసింది రమాదేవి అనే మహిళ. కరోనా సమయంలో బ్యాంకుకు వెళ్లి స్త్రీ నిధి సొమ్ము రూ.52లక్షలు స్వాహా చేసిందామె. అప్పటి బ్యాంకు మేనేజర్ సహాయంతో పొదుపు, వడ్డీలు రూ.40లక్షలు కూడా వేరే ఖాతాలకు మళ్ళింపు జరిగిందని డ్వాక్రా మహిళలు వాపోయారు. నాగాయలంక డ్వాక్రా కార్యాలయం వద్ద బాధిత మహిళల ఆందోళనతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గతంలో రమాదేవి పై పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధిత మహిళలు. అయినా చర్యలు తీసుకోలేదంటున్నారు. తమ సొమ్ముతో ఇల్లు కట్టుకుని, రెండు ట్రాక్టర్లు కొనుక్కుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సంఘ మహిళలు. సస్పెండ్ అయిన సీసీతో పాటు అప్పటి బ్యాంకు మేనేజరును కూడా బాధ్యుడిని చేయాలని డిమాండ్ చేస్తున్నారు బాధిత మహిళలు. వెలుగు అధికారులను బాధిత మహిళలు న్యాయం చేయమని కోరగా ఈ కేసు కోర్టులో ఉందని తమ ఏమి చేయలేమని చెప్పారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధిత మహిళలు.

రాజకీయాలంటే విరక్తి కలుగుతోంది

ప్రస్తుత రాజకీయాలంటే తనకు విరక్తి కలుగుతోందన్నారు ఎన్.టి.వి.తో ఉదయగిరి ఎం.ఎల్.ఏ.మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. ప్రస్తుత రాజకీయాలు తనకు పడవన్నారు. రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా అని సంచలన ప్రకటన చేశారు. కోట్లు పెట్టి రాజకీయం చేయలేను. నా వారసులు కూడా రాజకీయాల్లోకి రారు. మేకపాటి కుటుంబ సభ్యులు పోటీ చేసినా ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోను. ఉదయగిరి నుంచి నాలుగు సార్లు ఎం.ఎల్.ఏ.గా గెలిచా..ఇది చాలు నాకు..నా కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా ఉంటానన్నారు చంద్రశేఖర్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో నాకు టికెట్ ఇవ్వలేమని చెప్పారు. ఇప్పటికే ఒక వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకుని హామీ ఇచ్చారు. నన్ను రాజకీయంగా దూరం చేసేందుకే కుట్ర పన్ని నాపై ఆరోపణలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరిగిందో చెప్పినా పట్టించుకోలేదు. కొంతమంది వ్యక్తులు నాపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు మేకపాటి.

ఐపీఎల్ ఎంజాయ్ చేయండి.. డేటా అవుతుందన్న దిగుల్లేద్

ఐపీఎల్ 2023 మరో రెండ్రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 31న ప్రారంభమయ్యే తొలి మ్యాచ్‌లో గుజరాత్-చెన్నై జట్లు తలపడనున్నాయి. మిగతా క్రికెట్ మ్యాచ్‌లతో పోలిస్తే ఐపీఎల్‌కు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. ఈ సంవత్సరం Jio సినిమా యాప్ ద్వారా మ్యాచ్‌లను ఉచితంగా వీక్షించవచ్చు. స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్, ల్యాప్‌టాప్, టీవీ ద్వారా ఉచితంగా చూడవచ్చు. అయితే దీనికి హై స్పీడ్ Wi-Fi నెట్‌వర్క్ లేదా అధిక డేటా అవసరం. దీన్ని సులభతరం చేయడానికి, Jio, Airtel ,VI రోజువారీ డేటా పరిమితి లేకుండా ప్రత్యేకంగా ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టాయి.
జియో ఫ్రీడమ్ ప్లాన్: రూ 299
ఇది చాలా తక్కువ ధరలో రోజువారీ డేటా పరిమితి లేకుండా జియో నెలవారీ ప్రీపెయిడ్ ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది. జియో ఫ్రీడమ్ ప్లాన్ 30 రోజుల వాలిడిటీని కలిగి ఉంది. అపరిమిత ఇన్‌కమింగ్, అవుట్‌గోయింగ్ కాల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్ మొత్తం 25GB 4G డేటా మరియు రోజుకు 100 ఉచిత SMSలతో వస్తుంది.
ఎయిర్‌టెల్: రూ. 296
ఎయిర్‌టెల్ కూడా జియో అందించే ప్లాన్‌నే అందిస్తోంది. ఇది మొత్తం 25GB 4G డేటా, అపరిమిత కాలింగ్, 30 రోజుల చెల్లుబాటుతో రోజుకు 100 ఉచిత SMSలతో వస్తుంది. రోజువారీ డేటా భత్యం లేదు. వినియోగదారులు వారి అవసరాలకు అనుగుణంగా డేటాను ఉపయోగించడానికి అనుమతిస్తుంది