NTV Telugu Site icon

Top Headlines @9PM: టాప్ న్యూస్

Top Headlines

Top Headlines

అభిమానిపై రెచ్చిపోయిన బాలయ్య.. మరోసారి ట్రోలింగ్

నందమూరి బాలకృష్ణ కోపం అందరికి తెల్సిందే. ఆయనకు నచ్చని పనిచేస్తే ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నాం అనేది కూడా చూసుకోడు. అభిమానులను చితకబాదడంలో బాలయ్య ఎక్స్ పర్ట్. అయితే కొట్టినా బాలయ్యే పెట్టినా బాలయ్యే అని అభిమానులకు తెలుసు కాబట్టి బాలయ్యపై ఏరోజు ఎవరు ఒక్క మాట కూడా అనరు. అందులోను బాలయ్యకు ఎక్కువగా చిరాకు తెప్పిస్తే తప్ప ఆయన కోపగించుకోడు. ఇక అభిమానులు అంటే ఆయనకు ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. తన అభిమానులు కొట్టడానికి బౌన్సర్లను డబ్బు ఇచ్చి పెట్టుకోవాల్సిన అవసరం తనకు లేదని.. వారికీ నన్ను అనే హక్కు ఉంది.. నాకు వారిని కొట్టే హక్కు ఉంది.. మా ఇద్దరి మధ్య అనుబంధం అలాంటిది అని చెప్పుకొచ్చేవాడట బాలయ్య. అందుకే బాలయ్య చుట్టూ బౌన్సర్లు ఉండరు. ఇక తాజాగా మరోసారి బాలయ్య తన కోపాన్ని ప్రదర్శిచాల్సి వచ్చింది. వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలులో జరుగుతున్న విషయం విదితమే. స్పెషల్ చాఫర్ లో ఒంగోలు కు చేరుకున్న బాలయ్యకు అభిమానులు, చిత్ర యూనిట్ ఘనస్వాగతం పలికారు. అదే సమయంలో ఒక వ్యక్తి తన అత్యుత్సాహాన్ని ప్రదర్శించాడు.

ఒంగోలులో బాలయ్య సందడి.. అందరి చూపు బ్యాగ్ పైనే

వీరసింహారెడ్డి జాతర మొదలయ్యింది.. నందమూరి అభిమానులు ఒంగోలులో రచ్చ చేయడం స్టార్ట్ చేశారు. బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా నటించిన చిత్రం వీరసింహారెడ్డి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెన్ ఒంగోలులో ఘనంగా నిర్వహిస్తున్నారు. గత రెండు రోజులుగా ఈ ఈవెంట్ జరుగుతుందా..? లేదా అన్న అనుమానాల మధ్య ఎట్టకేలకు ఈవెంట్ మొదలయ్యింది. ఇక హైదరాబాద్ నుంచి బాలయ్య స్పెషల్ ఛాపర్ లో ఒంగోలుకు చేరుకున్నారు. బాలయ్యతో పాటు హీరోయిన్ శృతి హసన్, నిర్మాతలు ఉన్నారు. ఇక ఛాపర్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో శృతి, బాలయ్య సందడి చేశారు. శృతి రాగానే బాలయ్య కాళ్లకు నమస్కారం చేసి ఆశీర్వాదాలు తీసుకుంది. ఇక బ్లాక్ కలర్ చీరలో శృతి అందంగా కనిపించగా.. మల్టీ కలర్ సూట్ లో బాలయ్య మరింత హ్యాండ్సమ్ గా కనిపించాడు. ఇక ఆ సమయంలో బాలయ్య చేతిలో ఉన్న బ్యాగ్ పై అందరి కన్ను పడింది. ఆ బ్యాగ్ పై వీరసింహరెడ్డి లోగో ఉండడం విశేషం. ఉగ్ర రూపం లో ఉన్న నరసింహుడు బొమ్మ ఆ బ్యాగ్ పై చిత్రించి ఉండడం విశేషం. అయితే ఈ బ్యాగ్ ఎవరిది అనేది తెలియాల్సి ఉంది.

యువతి, మరో ఇద్దరిపై దాడి కేసు.. నిందితుడి అరెస్ట్
ప్రేమించలేదనే కోపంతో ఓ ప్రేమోన్మాది యువతితో పాటు ఆమె తల్లి,చెల్లెలుపై కత్తితో దాడిచేసిన ఘటన పశ్చిమగోదావరిజల్లాలో చోటు చేసుకుంది. కొండ్రుప్రోలు గ్రామానికి చెందిన మాణిక్యం అనే యువతిని ప్రేమ పేరుతో రాజులపాటి కళ్యాణ్ అనే ప్రేమోన్మాది రెండు నెలలుగా వేదించడంతో ఆమె అతని ప్రేమను నిరారకరించింది. దీంతో కక్ష పెంచుకున్న కళ్యాణ్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తాడేపల్లిగూడెం రూరల్ పరిధిలో యువతితో పాటు మరో ఇద్దరిపై కత్తి తో దాడికి పాల్పడిన కళ్యాణ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.. రిమాండ్ కి తరలించారు. గత రాత్రి కొండ్రుప్రోలు లో మాణిక్యం అనే యువతిని ప్రేమ పేరుతో వేధిస్తూ ఒప్పుకోకపోయేసరికి అమ్మాయి , ఆమె కుటుంబ సబ్యులపై దాడికి పాల్పడ్డాడు కళ్యాణ్ అనే యువకుడు. ఇంట్లో కరెంటు తీసేసి, కరెంటు పోయిందని వారు బయటకు రాగానే తనతో తెచ్చుకున్న చాకుతో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై విచారించిన పోలీసులు…. ముద్దాయిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు ఎస్పీ రవి ప్రకాష్ .

బీఆర్ఎస్‌తో పొత్తుకు కాంగ్రెస్‌ అంగీకారం తెలిపిందట..!

తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు, ఆరోపణల పర్వం కొనసాగుతూనే ఉంది.. జాతీయ రాజకీయాల్లో ప్రవేశించిన కేసీఆర్‌.. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చేశారు.. అయితే, జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో కలిసి కేసీఆర్‌ పనిచేస్తారని ఆది నుంచి ఆరోపిస్తూ వస్తోంది భారతీయ జనతా పార్టీ.. మరోసారి కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పొత్తుపై హాట్‌ కామెంట్లు చేశారు.. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి.. కాంగ్రెస్.. బీఆర్ఎస్‌తో పొత్తుకు అంగీకారం తెలిపిందని వార్తలు వస్తున్నాయన్న ఆయన.. ఈ విషయాన్ని మేం ఎప్పుడో చెప్పాం అన్నారు.. అధికారం కోసం వాళ్లిద్దరూ ఒక్కటి అవ్వడం ఖాయమని జోస్యం చెప్పారు.. ఎమ్మెల్యేలు పార్టీ మారడంపై కాంగ్రెస్ పార్టీ కేసు పెట్టడం చూస్తుంటే.. దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మోరిగినట్టు ఉందని విమర్శలు గుప్పించారు. ఇక, రేపు తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల సమ్మేళనం నిర్వహించనున్నట్టు వెల్లడించారు ప్రేమేందర్‌రెడ్డి.. ఈ సమ్మేళనాన్ని ఉద్దేశించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మధ్యాహ్నం 12 గంటలకు వర్చువల్ గా సందేశం ఇస్తారని తెలిపారు.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నుంచి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బూత్ కమిటీ సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తారని.. జూబ్లీ హిల్స్ లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, గద్వాల్ లో డీకే అరుణ, ముషీరాబాద్ లో డాక్టర్ కె. లక్ష్మణ్ పాల్గొంటారని వివరించారు

చంద్రబాబు డ్రామాలు ప్రజలు గమనించాలి

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు వైసీపీ నేతలు. తాజాగా వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఒక రేంజ్ లో చంద్రబాబుని ఆడేసుకున్నారు. కందుకూరులో జరిగిన మారణకాండకు చంద్రబాబు బాధ్యత వహించాలని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అమాయకుల ప్రాణాలు బలికావడానికి చంద్రబాబే కారణమన్నారు. కందుకూరులో నిబంధనలు పాటించి ఉంటే అమాయకులు బలయ్యేవారు కాదన్నారు. చంద్రబాబు ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నారని, ఆయనకు కనీస సంస్కారం లేదన్నారు. వారం రోజులుగా చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారు. పోలీసు యాక్ట్‌కు లోబడే ప్రభుత్వం జీవో తీసుకువచ్చింది. ఈ నిర్ణయం అన్ని పార్టీలకు వర్తిస్తుంది. జీవోను ఉల్లంఘిస్తామని టీడీపీ ఛాలెంజ్‌ చేస్తోంది. చట్టాన్ని ఉల్లంఘించడం సబబు కాదని సూచించారు. కుప్పానికి చంద్రబాబు దండయాత్రలా బయల్దేరారు. సభలు పెట్టుకోవద్దని చంద్రబాబుకు ఎవరూ చెప్పలేదన్నారు.

మహిళపై మూత్రవిసర్జన ఉదంతం…వ్యక్తి ఉద్యోగంనుంచి తొలగింపు

ఎయిర్ ఇండియా విమానంలో మహిళా ప్రయాణికురాలిపై శంకర్ మిశ్రా అనే వ్యక్తి మూత్రవిసర్జన చేసిన ఘటన విమానయాన రంగంలో ప్రకంపనలు రేపుతోంది. నవంబర్ 26న న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిరిండియా విమానంలో శంకర్ మిశ్రా తన తోటి ప్రయాణికురాలు సీనియర్ సిటిజన్ అయిన మహిళపై మూత్ర విసర్జన చేశాడు. మద్యంమత్తులో ఇలాంటి అసభ్యకరంగా ప్రవర్తించాడు. అయితే ఆ సమయంలో ఎయిర్ ఇండియా క్యాబిన్ క్రూ మెంబర్లు కూడా చూసీచూడనట్లు వ్యవహరించారు. ఈ ఘటనపై మహిళ ఎయిర్ ఇండియా సిబ్బందికి తెలియజేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) విచారణ జరుపుతోంది. దీంతో పాటు ఢిల్లీ పోలీసులు నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంలో జాతీయ మహిళా కమిషన్ కూడా ఇన్వాల్వ్ అయింది.

ఎమ్మెల్యేల ఎర కేసు.. ఢిల్లీ సీబీఐ విభాగానికి బదిలీ

సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణ జరుపుతుండగా.. దానిని సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టు సింగిల్‌ బెంజ్‌ ఆదేశాలు జారీ చేసింది.. అయితే, ఈ పరిణామాన్ని హైకోర్టు ధర్మాసనం ముందు సవాల్‌ చేశారు.. దీనిపై ఇవాళ వాదనలు హాట్‌హాట్‌గా సాగాయి.. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది హైకోర్టు.. మరోవైపు.. ఈ కేసు విచారణ కోసం సీబీఐ ఉత్సాహంగా ఉన్నట్టు తెలుస్తోంది.. ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐ ఢిల్లీ విభాగానికి అప్పగించారు.. ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తు చేయాలని సీబీఐ డైరెక్టర్‌ను హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. దర్యాప్తు బాధ్యతలను ఢిల్లీ విభాగానికి అప్పగించారు సీబీఐ డైరెక్టర్.. దీంతో, హైదరాబాద్‌కు వచ్చింది సీబీఐ ఢిల్లీ ఎస్సీ నేతృత్వంలోని బృందం. ఎమ్మెల్యేల కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లను సిట్ నుంచి తమకు ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌కు లేఖ రాసింది సీబీఐ.. అయితే, ఈ రోజు వాదన సమయంలో.. సీబీఐ వాదనలు కూడా వింటామని తెలిపిన హైకోర్టు..

పెళ్లాం విడాకులు కోరిందని.. కుటుంబాన్ని కాల్చేసిన ఉన్మాది
తన భార్య విడాకులు కోసం దరఖాస్తు చేసుకున్న విషయం తెలుసుకుని కోపోద్రిక్తుడయ్యాడు. ఏం చేస్తున్నానో కూడా తెలియకుండా తన ఐదుగురు పిల్లలను, అత్త, భార్యను కాల్చి చంపాడు. ఆ తరువాత తనను తాను కాల్చకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అమెరికాలో కలకలం రేపింది. తన భార్య విడాకుల కోసం దాఖలు చేయడంతోనే ఈ దారుణానికి తెగించాడని, కుటుంబంలోని ఏడుగురి మీద తుపాకీతో కాల్పులకు పాల్పడ్డాడని అమెరికా అధికారులు గురువారం తెలిపారు. ఉతాహ్ రాష్ట్రంలోని నోచ్ సిటీలోని ఒక నివాసంలో ఎనిమిది మృత‌దేహాల‌ను పోలీసులు క‌నుగొన్నారు. మృతుల్లో నాలుగేళ్ల పాప కూడా ఉంది. అనుమానితుడిని మేఖేల్ హెయిట్‌గా పోలీసులు గుర్తించారు. గతేడాది డిసెంబ‌ర్ 21న మేఖేల్ భార్య విడాకుల‌కు అప్లై చేసింది. దాంతో, అత‌ను కోపం ఆపుకోలేకపోయాడు. ఆమెతో పాటు అత్త, ఐదుగురు బిడ్డల‌ను తుపాకీతో కాల్చి చంపాడు. బుధ‌వారం రాత్రి నిర్వహించిన వెల్ఫేర్ చెకింగ్‌లో ఆ ఇంటి వాళ్లంతా చనిపోయార‌నే విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.