విద్యాశాఖపై జగన్ సమీక్ష.. నాణ్యత విషయంలో రాజీ వద్దు
పాఠశాల విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్.జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు పంపిణీ పూర్తయిందని వెల్లడించారు అధికారులు.ట్యాబుల మెయింటైనెన్స్‌కు సంబంధించి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సర్వీస్ సెంటర్‌ను కంపెనీ ద్వారా ఏర్పాటు చేస్తున్నామన్నారు అధికారులు.ట్యాబుల్లో ఎలాంటి సమస్య ఉన్నా వారం రోజుల్లో మరమ్మత్తు చేసి లేదా కొత్త ట్యాబును విద్యార్థికి అందించాలని సీఎం ఆదేశించారు. ట్యాబుల వాడకం, పాఠాలను నేర్చుకుంటున్న తీరు తదితర అంశాలపై ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు అధికారులు. డేటా అనలిటిక్స్ ద్వారా విద్యార్థులు నేర్చుకుంటున్న తీరుపై నిరంతర పరిశీలన ఉండాలని, దీనికి అనుగుణంగా హెడ్ మాస్టర్, ఎంఈఓలు తగిన విధంగా చర్యలు తీసుకోవాలన్నారు ముఖ్యమంత్రి. తరగతి గదుల డిజిటలైజేషన్‌లో భాగంగా ఐఎఫ్‌పి ప్యానెల్స్ ఏర్పాటుపై తీసుకుంటున్న చర్యలను వివరించారు అధికారులు.వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం అయ్యే నాటికి ఐఎఫ్‌పి ప్యానెల్స్ ఏర్పాటు కావాలని సీఎం ఆదేశాలిచ్చారు. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ వద్దన్న సీఎం…ఈ డిజిటల్ స్క్రీన్లు వల్ల విద్యార్థులకు అత్యుత్తమ బోధన అందాలన్నారు.
కుప్పంలో నీ బట్టలు ఊడగొడతాం… ఖబడ్దార్
మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారున మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఒక వార్డు మెంబర్ కూడా ఇలా దిగజారి మాట్లాడారు నువ్వు అలా మాట్లాడుతున్నావు. నన్ను పుడంగి అంటున్నాడు పుడంగికి అర్థం తెలుసా అని నేను అడుగుతున్నా అన్నారు. కుప్పంలో ఘోరంగా ఓడిపోయావు పుంగనూరుకు వచ్చి నన్ను ఏం చేస్తావ్? జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక సంస్థల,సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో మూడు చెరువుల నీళ్లు తాగించాం కదా. పుంగనూరులో ఏదో తేలుస్తా అంటున్నాడు,ఆయన కాదు వాళ్ళ తాతలు దిగొచ్చిన ఆయన తరం కాదు. ఆయన అనుకుని వుంటే నేను జిల్లాలో తిరేగేవాడిని కాదట. నీకంటే 14 సంవత్సరాలు ఆయన కంటే ముందే ఆధిక్యంలోనే నేను కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చా. 14 సంవత్సరాలు నువ్వు చేసేదేంటి నీకంటే నేనే ఎక్కువ చేశా. 14.సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటే ఒక ఓటు మెజారిటీతో జిల్లా పరిషత్ సీటు కైవసం చేసుకున్నాను. జిల్లాలో నాకంటే ఎక్కువ అసెంబ్లీ స్థానాలు సాధించవచ్చు. కాలేజ్ రోజుల నుండి ఆయనకు జీవిత కాలం పట్టింది నాపై ఆధిక్యత సాధించేందుకు. ఇందిరమ్మ పేరుతో నువ్వు శాసనసభ్యుడు అయ్యావు.
జగన్ కు సాయం చేసేందుకే బీఆర్ఎస్
ఏపీలో బీఆర్ఎస్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఏపీకి చెందిన నేతలు కొందరు తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఏపీలో బీఆర్ఎస్ ప్రారంభించడంపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్లో నిజాయితీ ఉండాలన్నారు. జగన్ కు సాయం అందించడానికి జనసేన ఓటు చీల్చడానికీ బీఆర్ యస్ పెట్టారని ఆరోపించారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో టీఆర్ ఎస్ పార్టీచీలిక తెచ్చిందని మండిపడ్డారు నాదెండ్ల మనోహర్. ఇప్పుడు బీఆర్ యస్ పార్టీ ఏర్పాటుతో ఏపీకి న్యాయం ఎలా చేస్తారు….? బాధ్యత గల ప్రతిపక్షంగా జనసేన చేస్తున్న కార్యక్రమాల్ని కూడా ప్రభుత్వం దుర్మార్గంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డీజీపీ కి ఇప్పటికే యువ శక్తి కార్యక్రమం గురించి తెలియజేసాం. 175కు 175 గెలుస్తామన్న సీఎం జగన్ ప్రతిపక్షాల సభలు చూసి ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. దీనిని బట్టి చూస్తే సీఎం జగన్ అభద్రతలో ఉన్నట్టేనన్నారు. జనవరి 12 న రణస్థలంలో యువశక్తి కార్యక్రమం జరుపుతున్నాం. ఉత్తరాంధ్ర యువత,మత్స్యకారుల సమస్యలపై చర్చ జరుగుతుందని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ రేపటికి వాయిదా
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణను సీబీఐకి అప్పగించాలన్న సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ సర్కార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే.. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో ఇవాళ వాదనలు ముగిశాయి. విచారణను రేపు మ.12 గంటలకు న్యాయమూర్తి వాయిదా వేశారు. ప్రభుత్వం తరఫున దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలను కొనాలని చూశారని, అలాంటప్పుడు పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేయడంలో తప్పులేదని కోర్టుకు తెలిపారు. అయితే.. కోర్టుకు నివేదిక అందజేసిన చేసిన తర్వాత అది పబ్లిక్ డొమైన్‌లోకి వస్తుందని, ప్రజాక్షేత్రంలోకి ఎవిడెన్స్ వచ్చిన తర్వాతనే కేసీఆర్ మీడియా ముందు ప్రకటించారన్నారు. అయితే.. వాదనలు విన్న అనంతరం.. సింగిల్ బెంచ్ ఆర్డర్ పై స్టే కు నిరాకరించి.. సీబీఐ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశించింది.
మహిళా పోలీసులపై చంద్రబాబు అభ్యంతరకర వ్యాఖ్యలపై ఫిర్యాదు
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ఏపీ మహిళా కమిషన్ కి ఫిర్యాదు అందింది. సచివాలయంలో మహిళా పోలీసులపై మాజీ సీఎం చంద్రబాబు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని అందులో పేర్కొన్నారు. మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మకు సెక్రటేరియట్ మహిళా పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. మహిళల భద్రత, కుటుంబ వివాదాల పరిష్కారం, సామాజిక అంశాలపై చైతన్యం తదితర అంశాలపై గ్రామ, వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసులపై మాజీ సీం చంద్రబాబునాయుడు వ్యాఖ్యాలు మహిళా సాధికారతను దెబ్బతీసే విధంగా ఉన్నాయని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు.ఇటీవల రోడ్ షోలో చంద్రబాబు నాయుడు సచివాలయం మహిళా పోలీసులపై చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సెక్రటేరియట్ మహిళా పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్ .మహాలక్ష్మి,, జనరల్ సెక్రటరీ డి. మధులత, గుంటూరు జిల్లా అధ్యక్షురాలు MVN. దుర్గా, గౌస్యా బేగం, మంగళగిరి గీత తదితరులు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మను అమరావతిలోని వారి కార్యాలయంలో ఈరోజు కలిసి వినతి పత్రం అందజేశారు
నరేష్ ఒక నీచుడు.. రాఖీ కట్టిన అన్నతో నాకు ఎఫైర్ అంటగట్టాడు
ప్రస్తుతం టాలీవుడ్ ను షేక్ చేస్తోన్న హాట్ టాపిక్ ఏది అంటే సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్రా లోకేష్ నాలుగో పెళ్లి చేసుకోవడమే. కొత్త ఏడాది.. ఈ ముదురు జంట లిప్ లాక్ తో తమ పెళ్లి వార్తను అధికారికం చేశారు. ఇక దీంతో పవిత్రా లోకేష్ కాస్తా పవిత్రా నరేష్ గా మారింది. నరేష్ కు ఇప్పటికే మూడు పెళ్లిళ్లు అయ్యాయి. మూడో భార్య రమ్య రఘుపతికి అతను ఇంకా విడాకులు ఇవ్వలేదు. అయినా నాలుగో పెళ్ళికి సిద్దమయ్యాడు.పవిత్రా కారణంగా నరేష్, రమ్య మధ్య వివాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఒకరి మీద ఒకరు ఘాటైన ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నారు. పవిత్రా, నరేష్ ఒక హోటల్ లో అడ్డంగా బుక్ అయిన రోజు నరేష్, ఓకే అప్రెస్ మీట్ పెట్టి మరీ రమ్య గురించి ఆరోపణలు చేశాడు. ఆమెకు భర్త అంటే లెక్కలేదని, ఆమెకు నా ప్రాణాలు, ఆస్తి కావాలని, పెద్దలను పట్టించుకోదని చెప్పుకొచ్చాడు. ఎన్నోసార్లు ఆమెను మార్చాలని ప్రయత్నించినా ఆమెలో మార్పు రాలేదని, నా ఆస్తికోసం నన్ను చంపడానికి కూడా ప్రయత్నిస్తోందని అన్నాడు. వాటికి ఆధారాలుగా ఎన్నో డాక్యుమెంట్లను కూడా చూపించాడు.
టాప్, స్కర్టు ధరించిన యువతిపై దాడి… ఇరాక్ లో దారుణం
ఇస్లామిక్ దేశాల్లో చట్టాలు ఎంత ఆటవికంగా ఉంటాయో ప్రత్యేకం చెప్పనవసరం లేదు. ఇరాక్, ఇరాన్, సిరియా, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల్లో మహిళల హక్కులకు పెద్దగా ప్రాధాన్యం లేదు. ఆడవాళ్లు కేవలం పిల్లలు కనడానికి, వంట చేయడానికి మాత్రమే పరిమితం. హిజాబ్ ను కాదని.. వెస్ట్రన్ డ్రెస్సులు వేసుకుంటే అంతే సంగతులు. చట్టం శిక్షించడమో లేకపోతే ఇస్లాం మతోన్మాదులు దాడులు చేయడమో అక్కడ పరిపాటి. అయితే సరిగ్గా ఇలాంటి ఘటనే ఇరాక్ లో జరిగింది.టాప్, స్కర్టు ధరించిన ఓ 17 ఏళ్ల అమ్మాయిని 16 మంది వ్యక్తులు వెంబడించి మరీ దాడి చేశారు. తీవ్రంగా కొట్టారు. ఈ ఘటన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారింది. ఇరాక్ లో మోటార్ సైకిల్ రేస్ చూసేందుకు వచ్చిన అమ్మాయిని అక్కడ ఉన్న గుంపు అసభ్యంగా దుస్తులు ధరించిందని చెబుతూ దారుణంగా కొట్టారు. అమ్మాయి వెళ్లిపోతున్నా వెంబడించి మరీ దాడి చేశారు. కొంతమంది ఈ దాడిని మొబైల్ ఫోన్లలో షూట్ చేశారు. ఈ సంఘటన డిసెంబర్ 30, 2022లో జరిగింది. ఇరాక్ లోని కుర్దిస్థాన్ ప్రాంతంలో బైక్ రేసింగ్ ఈవెంట్ లో ఈ ఘటన జరిగింది. అయితే పోటీలో పాల్గొంటున్న మగవాళ్ల దృష్టిని మరల్చేందుకే ఇలాంటి డ్రెస్ వేసుకువచ్చిందంటూ దాడిలో పాల్గొన్నవారు ఆరోపిస్తున్నారు.
నేను శృంగారంలో పాల్గొనలేకపోతున్నా.. న్యాయం చేయండి..
తప్పు ఎవరు చేసినా శిక్ష పడాలి అని చెప్పేది చట్టం. అదే చట్టం వందమంది దోషులు తప్పించుకున్నా పర్లేదు.. ఒక నిర్దోషికి మాత్రం శిక్షపడకూడదు అని కూడా చెప్పింది. కానీ, సమాజంలో చాలామంది నిర్దోషులు జైల్లో మగ్గిపోతున్నారు. వాదించే శక్తి లేక కొందరు.. పోలీసుల బలవంతంతో కొందరు కుటుంబాలను వదిలి జైల్లోనే జీవితాలను గడిపేస్తున్నారు. వీరి దుస్థితి గురించి చెప్పుకోలేకపోతున్నారు. అప్పుడెప్పుడో ఏదో దేశంలో చేయని తప్పుకు 30 ఏళ్లకు జైలుకు వెళ్లిన ఒక వ్యక్తి 60 ఏళ్లకు బయటికి వచ్చి తన జీవితం ఇలా అవడానికి కారణమైన ప్రభత్వాన్ని ప్రశ్నించాడు. తనకు నష్టపరిహారం కావాలని, తన జీవితాన్ని మళ్లీ అనుభవించడానికి డబ్బు కావాలని కోరుతూ దావా వేశాడు. కోర్టు సైతం అతడికి న్యాయం చేసింది. తాజాగా ఇలాంటి కేసే మధ్యప్రదేశ్ లో వెలుగు చూసింది. చేయని తప్పుకు ఐదేళ్లు శిక్ష అనుభవించిన ఒక వ్యక్తి బయటికి వచ్చి ప్రభుత్వంపై దావా వేశాడు. తనకు 10 వేల కోట్లు కావాలని ఓ గిరిజన యువకుడు ప్రభుత్వంపై దావా వేశాడు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని రత్లామ్ ప్రాంతంలో కాంతిలాల్ భిల్ అలియాస్ కాంతు కుటుంబంతో నివసిస్తున్నాడు. 2017 లో అతడు ఒక గ్యాంగ్ రేప్ కేసులో ఇరుక్కున్నాడు. అతను ఆ నేరం చేయకపోయినా పోలీసులు అతడిని నేరస్తుడిగా పరిగణించి అరెస్ట్ చేయడానికి రాగా.. వారి నుంచి తప్పించుకు తిరుగుతూ మూడేళ్లు కుటుంబానికి దూరంగా బతికాడు.. ఇక రెండేళ్ల క్రితం ఒక చిన్న గ్రామంలో కాంతు ను పోలీసులు పట్టుకొని జైలుకు తరలించారు.
రాత్రి 8 గంటల తర్వాత పిల్లలు పుట్టరట పాక్ మంత్రి కొత్త సిద్ధాంతం
పాకిస్తాన్ మంత్రులు, అక్కడి ప్రజల అవివేకం చాలా సందర్భాల్లో చూశాం. తెలిసీతెలియని విధంగా కొత్తకొత్త ప్రతిపాదనలు, సిద్ధాంతాలు పుట్టించడంలో పాకిస్తాన్ ప్రజాప్రతినిధులు, అధికారులు సిద్ధహస్తులు. ఏ సమస్య వచ్చినా.. కూడా ఆర్మీ, అటామిక్ ముల్క్ అని చెప్పడం తప్పితే పాకిస్తాన్ పెద్దగా చేయగలిగింది ఏం లేదు. ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. అయినా కూడా అక్కడి ప్రభుత్వానికి తత్వం బోధపడటం లేదు. ఎంతసేపు భారత్ వ్యతిరేకత, కాశ్మీర్ అంటూ మాట్లాడటం తప్పితే, దేశంలోని ఇతర ప్రాంతాల గురించి ప్రజల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు.ఇదిలా ఉంటే పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ జనాభా పెరుగుదలపై ఓ సిద్ధాంతాన్ని ప్రకటించారు. దీనిపై నెటిజెన్లు ఓ రేంజులో పాక్ మంత్రిని ట్రోల్ చేస్తున్నారు. ‘‘రాత్రి 8 గంటల వరకు మార్కెట్లు మూతపడిన ప్రదేశాల్లో జనాభా పెరుగుదల తక్కువగా ఉంది’’ అంటూ ఓ విచిత్రమైన సిద్ధాంతాన్ని తెరపైకి తీసుకువచ్చారు. మంత్రి వ్యాఖ్యలను జర్నలిస్ట్ నైలా ఇనాయత్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీనిపై తెగ కామెంట్లు వస్తున్నాయి.
హుక్కా పార్లర్లకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్
హుక్కా పార్లర్‌ను నడపడానికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేసింది. అంతేకాకుండా.. హుక్కా పార్లర్ యజమానులను వేధించవద్దని పోలీసులను ఆదేశించింది. హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక లాంజ్ హుక్కా & కేఫ్ చాంద్రాయణగుట్ట యజమాని తరపున న్యాయవాది హబీబ్ అబూ బకర్ అల్-హమీద్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను విచారిస్తూ హైకోర్టు పై ఆదేశాలు జారీ చేసింది. సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం, 2003 ప్రకారం, సాధారణంగా COPTA చట్టం 2003 అని పిలుస్తారు. హుక్కా పార్లర్‌ను నిర్వహించడానికి ప్రత్యేక లైసెన్స్ పొందాల్సిన అవసరం లేదని, అయితే అదే చట్టం ప్రకారం హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. రెస్టారెంట్లు మరియు ఫలహారశాలలు 30 కంటే ఎక్కువ సీట్ల సామర్థ్యంతో, రెస్టారెంట్ల యజమానులు వినియోగదారులను ప్రత్యేక మూలలో పొగ త్రాగడానికి అనుమతించవచ్చు.