NTV Telugu Site icon

Top Headlines @9AM: టాప్ న్యూస్

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

ఏపీ, తెలంగాణల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పర్యటించనున్నారు. ఉదయం 10.40కి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు చేరుకోనున్నారు. శంషాబాద్‌నుంచి హెలికాప్టర్లో నేరుగా శ్రీశైలం వెళ్లనున్నారు రాష్ట్రపతి ముర్ము. ఉదయం 11.45కు సుండిపెంట హెలిప్యాడ్‌ చేరుకోనున్నారు. రోడ్డు మార్గం ద్వారా 12.05కు శ్రీశైలానికి చేరుకోనున్నారు రాష్ట్రపతి. మధ్యాహ్నం 2.45 నిమిల వరకు ఆలయ దర్శనం అనంతరం వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు సుండపెంట నుంచి బయలుదేరనున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ముర్ము బస చేయనున్నారు. సాయంత్రం 4.15కు హకీంపేట ఎయిర్‌ ఫోర్స్‌ స్టేషన్‌ చేరుకోనున్నారు. రాష్ట్రపతి తొలిసారి తెలంగాణకు రానున్న సందర్బంగా.. రాష్ట్రపతికి గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌ ఘనంగా స్వాగతం పలకనున్నారు. ఈనెల 30 వరకు హైదరాబాద్‌లో రాష్ట్రపతి శీతాకాల విడిది ఉంటుంది. తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ నెల 26 నుంచి 30 వరకు పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఈ మేరకు తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా బొల్లారం, సోమాజిగూడతో పాటు నగరంలోని పలు ప్రాంతాల మధ్య ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. హకీంపేట్, తిరుమలగిరి, కార్ఖానా, సికింద్రాబాద్ క్లబ్, టివోలి, ప్లాజా, బేగంపేట, రాజ్ భవన్ రోడ్, సోమాజిగూడ మధ్య సోమవారం ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు.

గుడివాడలో టెన్షన్.. టెన్షన్.. 144 సెక్షన్ అమలు

విజయవాడ రాజకీయాలంటే హాట్ హాట్ గా ఉంటాయి. అందునా గుడివాడ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కృష్ణాజిల్లా గుడివాడలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోటాపోటీగా రంగా వర్దంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి వైసీపీ – టీడీపీ. రంగా వర్దంతి మీరెలా నిర్వహిస్తారంటూ రావి వెంకటేశ్వరరావుకి మాజీ మంత్రి కొడాలి నాని అనుచరుల ఫోన్లు చేయడం కలకలం రేగింది. టీడీపీ ఆఫీసులోకి దూసుకొచ్చే ప్రయత్నం చేశారు వైసీపీ నేతలు. ఎట్టి పరిస్థితుల్లోనూ రంగా వర్దంతి జరిపి తీరతామంటోంది టీడీపీ. దీంతో గుడివాడలో టెన్షన్.. టెన్షన్ నెలకొంది. స్థానిక ఏజీకే స్కూల్ వద్ద రంగా వర్దంతి కార్యక్రమం నిర్వహించడానికి టీడీపీ ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు టీడీపీ కార్యాలయం నుంచి ఏజీకే స్కూల్ వద్దకు వెళ్లనున్నారు టీడీపీ నేతలు. శరత్ టాకీస్ వద్ద కొడాలి నాని నేతృత్వంలో రంగా వర్దంతి కార్యక్రమం నిర్వహించనున్న వైసీపీ. నిన్నటి గొడవతో అలెర్టైన పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. వర్దంతి సభ మీరెలా నిర్వహిస్తారంటూ టీడీపీపై నిన్న దాడికి దిగారు వైసీపీ నేతలు. ఎలాంటి పరిణామాలు వచ్చినా రంగా వర్దంతి కార్యక్రమం నిర్వహించి తీరతామంటోంది టీడీపీ.దమ్ముంటే ఆపాలంటూ కొడాలికి రావి వెంకటేశ్వరరావు సవాల్ విసిరారు. దీంతో అక్కడేం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది.

గచ్చిబౌలి విప్రో సర్కిల్ లో టిప్పర్ బీభత్సం

నగరంలో టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. సిగ్నల్ వద్ద ఆగి ఉన్న 4 కార్లు 2 బైక్ ల మీదకు టిప్పర్‌ లారీ దూసుకెళ్లడంతో ఒకరు చనిపోగా.. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక సమచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.భాగ్యనగరంలో గచ్చిబౌలి పీఎస్ పరిధిలోని విప్రో కూడలి వద్ద రెడ్‌ సిగ్నన్‌ పడటంతో కార్లు, బైక్‌ లు నిలబడ్డాయి. అయితే రెడ్‌ సిగ్నల్‌ పడినా పట్టించుకోకుండా టిప్పర్‌ లారీ డ్రైవర్‌ ముందుకు కదిలాడు దీంతో ముందుగా వున్న 4కార్లు, 2బైక్‌ లు సిగ్నల్ వద్ద ఆగి ఉన్న 4 కార్లు 2 బైక్ ల మీదకు టిప్పర్‌ లారీ దూసుకెళ్లడంతో నాలుగు కార్లు, 2 ద్విచక్ర వాహనాలు నుజ్జు నుజ్జు అయ్యాయి. కార్లులో వున్న వారికి, రెండు బైక్‌ లపై ప్రయాణించే మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, 6 గురికి స్పల్ప గాయాలయ్యాయి. అయితే ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.

విశాఖలో కాపునాడు బహిరంగసభ.. సర్వత్రా ఉత్కంఠ

విశాఖ సాగరతీరం ఇవాళ కాపునాడు బహిరంగ సభతో వేడెక్కనుంది. రాధా-రంగా రీ యూనియన్ ఛలో వైజాగ్ కు పిలుపు నిచ్చింది. వంగవీటి మోహన్ రంగా జయంతిని పురస్కరించుకుని వజ్రోత్సవాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 34ఏళ్ళ తర్వాత మరోసారి కాపునాడు జరగనుంది. కాపుల ఐక్యత ప్రధానంగా తలపెట్టిన ఈ సభలో ఎటువంటి రాజకీయ అంశాలు ప్రస్తావనకు వస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఎంవీపీ కాలనీలోని ఏ.ఎస్.రాజా గ్రౌండ్స్ లో భారీ డయాస్ ఏర్పాటు చేశారు. 2500మంది సీటింగ్ కోసం కుర్చీలు వేశారు. ప్రధాన పార్టీలకు చెందిన ముఖ్య నాయకత్వం అంతా ఈ సభకు వస్తున్నారని నిర్వాహకులు చెబుతున్నారు.మరోవైపు., పోస్టర్ రిలీజ్ లో పాల్గొన్న మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు ఈ సభకు వస్తారా….?.రారా…!!? అనేది ఆసక్తికరంగా మారింది. డిసెంబర్ 26న భారీ ఎత్తున కాపులతో సభను నిర్వహిస్తుండడంతో ఏపీ రాజకీయాలు హీటెక్కాయి. ఈ సభకు ఉత్తరాంధ్రా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కాపు సోదరులు తరలిరానున్నారు. కాపునాడు మహాసభను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామంటున్నారు. ఈ సభ ద్వారా ఏపీలో కాపులకు ఉన్న ప్రాధాన్యతను రాజకీయపార్టీలకు తెలియచేస్తామంటున్నారు. ఇది రాజకీయాలకు అతీతంగా జరుగుతుందన్నారు.

టీటీడీ వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ .. ఎక్కడంటే?

కలియుగ వైకుంఠం తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. ఏడాది చివరకు రావడం, సెలవులు కూడా కలిసి రావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. ఇదిలా ఉంటే.. జనవరి 1వ తేదిన ఆఫ్ లైన్ విధానంలో వైకుంఠ ద్వార దర్శనానికి టోకెన్లు జారీచేయనుంది టీటీడీ. తిరుపతిలోని 9 కేంద్రాలు ద్వారా టోకెన్లు జారీ చేస్తోంది.
టోకెన్లు జారీచేసే కేంద్రాలివే!
1.భూదేవి కాంప్లెక్స్
2.రామచంద్ర పుష్కరిణి
3.జీవకోన జేడ్పి హైస్కూల్
4.తుడా ఇందిరా మైదానం
5.విష్ణు నివాసం
6.శ్రీనివాసం
7.గోవిందరాజ సత్రాలు
8.బైరాగిపట్టేడ జడ్పి హైస్కూల్
9.శేషాద్రినగర్ జడ్పి హైస్కూల్…ఈ కేంద్రాలు ద్వారా టోకెన్లు జారీచేస్తామని టీటీడీ తెలిపింది. రోజుకి 50 వేల చోప్పున….జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు సంబంధించిన 5 లక్షల టోకెన్లు జారీచేస్తామని, భక్తులు ఈ సౌకర్యం వినియోగించుకోవాలని టీటీడీ అధికారులు కోరారు.

నెహ్రూ వారసుడి మాటలు.. గాడ్సే వారసులను రెచ్చగొడుతున్నాయి

భారత్ జోడో యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీపై ప్రశంసల జల్లు కురిపించారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. ఆయన చేస్తున్న ప్రసంగాలు దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయని అన్నారు. లౌకికవాదం, సమానత్వం వంటి విలువలను కాపాడేందుకు దేశానికి నెహ్రూ, గాంధీల వంటి నాయకులు అసవరం అని అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నేత ఏ గోపన్న రాసిన ‘మమనితార్ నెహ్రూ’ పుస్తకాన్ని చెన్నైలో విడుదల చేసిన ఆయన నెహ్రూపై ప్రశంసలు గుప్పించారు. నెహ్రూ నిజమైన ప్రజాస్వామ్యవాది, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ప్రతీక. అందుకే అన్ని ప్రజాస్వామ్య శక్తులు ఆయనను కీర్తిస్తున్నాయని అన్నారు. ప్రస్తుతం పార్లమెంట్ లో ముఖ్యమైన అంశాలపై చర్చించేందుకు కూడా అనుమతి ఇవ్వడం లేదని బీజేపీని ఉద్దేశించి విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలు మూతపడుతునప్పుడు.. ఇప్పుడు మనకు నెహ్రూ గుర్తుకు వస్తున్నారని అన్నారు. తమిళనాడుకు పెరియార్, అన్నాదురై, కలైంజర్(కరుణానిధి) లాగే దేశంలో సమాఖ్య, సమానత్వం, లౌకికవాదాన్ని పెంపొందించడానికి గాంధీ, నెహ్రూ వంటి నాయకులు అవసరం అని అన్నారు.

అణ్వాయుధాలే మమ్మల్ని కాపాడుతున్నాయి.. రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వదేవ్
పది నెలలు గడుస్తున్నా రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ అమెరికా పర్యటనకు వెళ్లి ఆయుధాలు, ఆర్థిక సాయం గురించి చర్చించారు. దీంతో ఇప్పట్లో ఉక్రెయిన్ కు యుద్ధం ఆపాలనే ఉద్దేశం లేనట్లుగా తెలుస్తోంది. ఇక రష్యా చర్చలకు సిద్ధం అని ప్రకటిస్తున్నా.. పుతిన్ గద్దె దిగితేనే చర్చలంటూ ఉక్రెయిన్ డిమాండ్ చేస్తోంది. ఉక్రెయిన్ ను ముందుపెట్టి అమెరికా, వెస్ట్రన్ దేశాలు తమపై పరోక్ష యుద్ధం చేస్తున్నాయని రష్యా ఆరోపిస్తోంది. ఇదిలా ఉంటే రష్యా అణ్వాయుధాలే తమను రక్షిస్తున్నాయని పుతిన్ మిత్రుడు మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వదేవ్ అన్నారు. తమపై వెస్ట్రన్ దేశాలు యుద్ధ ప్రకటించకుండా అణ్వాయుధాలే అడ్డుకుంటున్నట్లు వెల్లడించాయి. ఉక్రెయిన్ లో ఫాసిస్ట్, అసహ్యకరమైన పాలన తొలగించే వరకు రష్యా యుద్ధాన్ని చేస్తుందని ప్రకటించారు. మెద్వదేవ్ 2008 నుంచి 2012 వరకు రష్యా అధ్యక్షుడిగా ఉన్నారు. అంతకుముందు పుతిన్ ఉక్రెయిన్ తో చర్చలకు సిద్ధం అని వెల్లడించారు. పాశ్యాత్య దేశాలు రష్యాను వీలైనంత వరకు అవమానించడం, కించపరచడం, విచ్ఛిన్నం చేయాలని, నాశనం చేయాలని కోరికతో ఉన్నాయని.. మెద్వదేవ్ అన్నారు.

అమెరికాను అల్లాడిస్తున్న మంచు తుఫాన్.. 31 మంది మృతి

అమెరికాను మంచు తుఫాను అల్లాడిస్తోంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఎమర్జెన్సీ విధించారు. ముఖ్యంగా దేశంలోని తూర్పు ప్రాంతాలు మంచు తుఫాను ధాటికి ప్రభావితం అవుతున్నాయి. ఇప్పటి వరకు మంచు తుఫాన్ వల్ల 31 మంది మరణించారు. న్యూయార్క్ లోని బఫెలో ప్రాంతంలో సంక్షోభ పరిస్థితి ఏర్పడింది. మంచు తుఫాన్ కారణంగా న్యూయార్క్ నగరం అతలాకుతలం అవుతోంది. అత్యవసర సేవలపై హిమపాతం తీవ్ర ప్రభావం చూపిస్తోంది.తీవ్రమైన హిమపాతం వల్ల దేశంలో క్రిస్మస్ పండగను ఎంజాయ్ చేద్ధాం అనుకున్న ప్రజలకు నిరాశే మిగిలింది. భారీ హిమపాతం వల్ల జనాలు ఇళ్లకే పరిమితం అయ్యారు. రోడ్లపై ఎక్కడికక్కడ మంచు పేరుకుపోయింది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని పలు రాష్ట్రాల అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. మంచు వల్ల దేశవ్యాప్తంగా వేలల్లో విమానాలు రద్దయ్యాయి. యూఎస్ఏలోని తూర్పు రాష్ట్రాల్లో 2 లక్షల కన్నా మంది క్రిస్మస్ రోజున విద్యుత్ లేకుండా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్రిస్మస్ రోజున వివిధ ప్రాంతాలకు వెళ్దాం అనుకున్న ప్రయాణికులు ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. మంచుతుఫాన్ వల్ల కొలరొడోలో నలుగురు, న్యూయార్క్ స్టేట్ లో సుమారుగా 12 మంది మరణించారు. తొమ్మిది రాష్ట్రాల్లో మరణాలు నమోదు అయ్యాయి.

Show comments