NTV Telugu Site icon

Top Headlines @9 AM: టాప్ న్యూస్

2c57bcd9 10a3 4039 8332 09cb35e2e0e6

2c57bcd9 10a3 4039 8332 09cb35e2e0e6

మహబూబ్ నగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటన

నేడు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు. పలు అభివ‌ృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్ నుండి రోడ్డు మార్గం ద్వారా మధ్యాహ్నం 12.45 నిలకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చేరుకొనున్న కేసీఆర్. ముందుగా జిల్లా అధికారుల కాంప్లెక్స్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం 1.15 నిలకు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటలకు నూతన కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవం చేయనున్న కేసీఆర్. మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషాలకు కొత్తగా నిర్మించిన టీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. సాయంత్రం 4 గంటలకు ఎంవీఎస్ కళాశాల మైదాన ప్రాంగణంలో నిర్వహించనున్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించనున్నారు.

తమిళ ఇండస్ట్రీలో విషాదం.. స్టంట్ మాస్టర్ మృతి
సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. తమిళ సినిమా ‘విడుదలై’ షూటింగ్‌లో ప్రమాదం జరిగింది. చెన్నై శివారులో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ప్రమాదవశాత్తూ స్టంట్ మాస్టర్ సురేష్ ప్రాణాలు కోల్పోయాడు. షూటింగ్‌లో భాగంగా తాడుకు వేలాడుతున్న స్టంట్ మాస్టర్ సురేష్ తాడు తెగిపోవడంతో కింద పడిపోయాడు. తీవ్రగాయాలపాలైన అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. ఈ ఘటన చెన్నైకి సమీపంలోని కేలంబక్కంలో చోటు చేసుకుంది. ప్రముఖ తమిళ్ డైరెక్టర్ వెట్రిమారన్, హీరో సూరి కాంబినేషన్ లోతెరకెక్కుతున్న ‘విడుదలై’ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీకి సంబంధించిన యాక్షన్ చిత్రాలను తెరకెక్కిస్తున్న సమయంలోనే స్టంట్ మాస్టర్ సురేష్ ప్రమాదవశాత్తూ కిందపడిపోయి మృతి చెందాడు. స్టంట్ మాస్టర్ మృతితో తమిళ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. కాగా ఈ సినిమాలో తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి అతిథి పాత్రలో కనిపించనున్నాడు.

చలి తగ్గింది… పొగమంచు ఇబ్బంది పెడుతోంది
రెండుమూడు రోజుల తెలంగాణ రాష్ట్రాన్ని గతంలో చలి వణికించింది. చలికి రావాలంటేనే జనాలు బెంబేలు ఎత్తారు. పగటి ఉష్ణోగ్రతలు తగ్గడంతో చలి తీవ్రత ఎక్కువైంది. దుప్పట్లు కప్పుకున్న నరాలు తెగే చలి మాత్రం ఆగలేదు. రోజు రోజుకు పెరుగుతూ చలి చంపేసింది. చలికి తోడు పొగ మంచు ఊటీని తలపించింది. ఒక వైపు చలి మరో వైపు పొగ మంచు, దీంతో.. చలితీవ్రతతో ప్రజలు ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఎక్కడ చూసిన ఉదయం అయితే చలిమంటలు వేసుకుని దుప్పట్లు కప్పుకుని చలి కాచుకున్నారు. అయితే రెండు రోజుల నుంచి చలి తీవ్రత కాస్త తగ్గింది. కానీ.. పొగ మంచు మాత్రం కుమ్మెస్తోంది. దీంతో వాహనదారులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సాగర్ హైవే పై భారీగా పొగ మంచు పేరుకుపోయింది. వాహన దారులు ఇబ్బంది ఎదుర్కొన్నారు. వరంగల్ జిల్లా ఏజెన్సీని పొగమంచు కమ్మేస్తుంది.. ములుగు జిల్లా ఏటూరు, నాగారం, వాజేడు ప్రాంతాలతో పాటు వరంగల్ జిల్లా నర్సంపేట కొత్తగూడ అటవీ ప్రాంతాల్లో పొగమంచు పెరిగింది.

బీసీల పేరెత్తే అర్హత జగన్ కి ఎక్కడిది?
ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు. బీసీల పేరెత్తే అర్హత కూడా జగన్ రెడ్డికి లేదు. 56 కార్పొరేషన్లు పెట్టి, పైసా ఖర్చు చేయని దుర్మార్గ చరిత్ర జగన్ రెడ్డిదే. రాష్ట్రంలోని బీసీలంతా జగన్ పాలనలో మాకు ‘‘ఇదేం ఖర్మ’’ అంటున్నారు.టీడీపీ స్లోగన్ అయిన ‘జయహో బీసీ’ కాపీ కొట్టడం సిగ్గుచేటు. బీసీలకు టీడీపీ అమలు చేసిన పథకాలు రద్దు చేసి బీసీ సభ ఏర్పాటా..?బీసీలకు రాజకీయంగా అండగా నిలిచిన పార్టీ తెలుగుదేశం మాత్రమే అని స్పష్టం చేశారు యనమల. నిధులు విధులు, అధికారాలు సొంత వారికి.. పదవులు మాత్రం బీసీలకా? సబ్ ప్లాన్ నిధులు మళ్లించడం బీసీలను వంచించడం కాదా? టీడీపీ జయహో బీసీ అంటూ పదవులిస్తే.. జగన్ రెడ్డి నైనై బీసీ అంటూ తొక్కిపెట్టాడు. స్థానిక సంస్థల్లో 10 శాతం రిజర్వేషన్లు కోత బీసీల ఉద్దారణా..? రాష్ట్రాన్ని రెడ్లకు ధారబోసి బీసీలను అణగదొక్కడం నిజం కాదా..? అని యనమల ప్రశ్నించారు. వెయ్యికి పైగా ఉన్న నామినేటెడ్ పదవుల్లో బీసీలెంతమంది? అని ఆయన అన్నారు. 12 యూనివర్శిటీల్లో బీసీ వీసీలు ఎంత మంది..?

వివాదాస్పద వ్యక్తులపై ఎలాన్ మస్క్ ట్విట్టర్ పోల్
ట్విట్టర్ ను సొంతం చేసుకున్న తర్వాత వరసగా వివాదాల్లో నిలుస్తున్నారు మల్టీ బిలియనీర్ ఎలాన్ మస్క్. ఇప్పటికే ఉద్యోగుల తొలగింపుతో పాటు ట్విట్టర్ లో మార్పులు చేస్తూ గత కొంత కాలంగా వార్తల్లో నిలుస్తున్నారు. మరోవైపు ట్విట్టర్ పోల్స్ ద్వారా కొన్ని అంశాలపై నెటిజెన్ల అభిప్రాయాలను కోరుతున్నారు. మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై ట్విట్టర్ విధించిన నిషేధాన్ని ఎత్తేయాలా..? అంటూ ఇటీవల యూజర్ల అభిప్రాయాన్ని కోరారు. చాలా మంది నిషేధం ఎత్తేయడానికే ఓటేయడంతో ట్రంప్ ఖాతా మళ్లీ పునరుద్ధరించారు. ఇదిలా ఉంటే ఇటీవల ఎలాన్ మస్క్ ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై పెట్టిన ట్విట్టర్ పోల్ వివాదాస్పదం అయింది. దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఆదివారం మరో ట్విట్టర్ పోల్ పెట్టారు. వివాదాస్పద వ్యక్తులు అయిన విజిల్ బ్లోయిర్ ఎడ్వర్డ్ స్నోడెన్, వికీలీక్స్ సహవ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేలపై ట్విట్టర్ పోల్ నిర్వహించారు. వీరిద్దరు క్షమింపబడాలా..? అంటూ యూజర్ల అభిప్రాయాలను కోరారు. దీనిపై ఆయన ట్వీట్ చేశారు. అసాంజే, స్నోడెన్ ఇద్దరూ యూఎస్ సైనిక విషయాలను బహిర్గతం చేశారు. సున్నిత సమాచారాన్ని బహిర్గతం చేయడంపై వీరిద్దరిపై అమెరికా ఆగ్రహంతో ఉంది.

సుజిత్ దర్శకత్వంలో పవన్.. డీవీవీ నుంచి ప్రకటన వచ్చేసింది
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ దూకుడు మీద ఉన్నారు. ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో కెరీర్‌లో దూసుకుపోతున్నారు. ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో హరిహరవీరమల్లు సినిమాలో నటిస్తున్న ఆయన హరీష్ శంకర్‌తో భవదీయుడు భగత్‌సింగ్ సినిమా చేయాల్సి ఉంది. ఇప్పుడు ఆయన మరో సినిమాకు కూడా పచ్చజెండా ఊపేశారు. సాహో ఫేం దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో పవన్ నటించబోతున్నారు. తొలుత ఈ కాంబినేషన్ పుకారు అని పవన్ అభిమానులు భావించారు. కానీ ఈ సినిమాపై ఆర్.ఆర్.ఆర్ సినిమా నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారిక ప్రకటన చేసింది ఈరోజు ఉదయం 8 గంటల 55 నిమిషాలకు ఈ సినిమా గురించి డీవీవీ బ్యానర్ ట్వీట్ చేసింది. దీంతో సుజిత్-పవన్ కాంబో సినిమా నిజమే అని స్పష్టమైంది. ఈ మేరకు ఓ పోస్టర్ విడుదల చేసింది. ఇందులో ‘they call him #OG’ అని పేర్కొన్నారు. ఈ పోస్టర్‌లో పవన్ వెనుకవైపు నిలబడి ఉన్నట్లు కనిపిస్తున్నాడు. ఈ మూవీకి రవి.కె.చంద్రన్ డీవోపీ అందించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని డీటైల్స్ తెలియనున్నాయి. ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ విజయం తరువాత నిర్మాత డీవీవీ దానయ్య నుంచి వస్తున్న సినిమా ఇదే కావడం విశేషం.

హిందువులపై చేసిన వ్యాఖ్యలకు సిగ్గుపడుతున్నా..క్షమించండి
అస్సాంకు చెందిన ఏఐయూడీఎఫ్ రాజకీయ పార్టీ అధ్యక్షుడు బద్రుద్దీన్ అజ్మల్ హిందువులపై వివాదాస్పద వ్యాఖ్యల చేయడం దేశవ్యాప్తంగా పొలిటికల్ దుమారానికి దారి తీశాయి. అయితే ఈ వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు బద్రుద్దీన్. ఎవరి మనోభావాలు దెబ్బతీయాలనే ఉద్దేశ్యం లేదని, హిందువులపై చేసిన వ్యాఖ్యలపై సిగ్గుపడుతున్నా అంటూ శనివారం ప్రకటించారు. సీనియర్ నాయకుడిగా ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని.. నా వ్యాఖ్యలతో బాధపడుతున్న ప్రతీ ఒక్కరికీ నేను క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. నేను చేసిన వ్యాఖ్యలపై సిగ్గుపడుతున్నా అని అన్నారు. మైనారిటీలకు ప్రభుత్వం న్యాయం చేయడం, వారి విద్య, ఉపాధి ఇవ్వాలని కోరుతున్నట్లు వెల్లడించారు. జనాభా నియంత్రణ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని అజ్మల్ అన్నారు. శుక్రవారం బద్రుద్దీన్ అజ్మల్ హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. హిందువులు చిన్న వయసులో పెళ్లి చేసుకునేందుకు ముస్లిం ఫార్ములాను పాటించాలని సూచించారు. ముస్లిం యువకులు 20-22 ఏళ్ల వయసులో అమ్మాయిలు 18 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంటారని.. హిందువులు మాత్రం 40 ఏళ్ల వయసులో తల్లిదండ్రుల ఒత్తడితో పెళ్లి చేసుకుంటారని అన్నారు. హిందువులు పెళ్లికి ముందు రెండుమూడు అక్రమ సంబంధాలు కలిగి ఉంటారని వ్యాఖ్యానించాడు. పిల్లలు కనకుండా ఖర్చులను ఆదా చేసే పనిలో హిందువులు ఉంటారని అన్నారు. ముస్లింలు చిన్న వయసులు పెళ్లి చేసుకుని ఎంతమంది పిల్లల్ని కంటున్నారో చూడంటూ కామెంట్స్ చేశారు.

హైదరాబాద్-విజయవాడ మధ్య ‘వందేభారత్’.. ఈనెలలోనే ప్రారంభం
దేశంలో అనేక ప్రాంతాల్లో నడుస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు త్వరలో తెలుగు రాష్ట్రాల్లో కూడా పట్టాలెక్కనుంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులకు అధికారిక సమాచారం అందింది. ఇప్పటికే విశాఖ కేంద్రంగా వందేభారత్ రైలును కేటాయిస్తూ స్వయంగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటన చేశారు. ఈ మేరకు సికింద్రాబాద్-విజయవాడ మార్గంలో వయా కాజీపేట మీదుగా ఈ నెలలోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా రైలును ప్రారంభించేందుకు దక్షిణమధ్య రైల్వే సన్నాహాలు చేస్తోంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఐదు వందేభారత్ రైళ్లు నడుస్తుండగా తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే రైలు ఆరోది కానుంది. వందేభారత్ రైలు గరిష్టంగా 180 కి.మీ వేగంతో వెళ్తుంది. రెండు నిమిషాల్లోనే 160 కి.మీ. వేగం అందుకుంటుంది. ఈ రైలులో సీట్లు మాత్రమే ఉంటాయి. బెర్తులు ఉండవు. బెర్తులు అందుబాటులోకి వచ్చాక ఈ రైలును విశాఖ వరకు పొడిగించి నడిపించనున్నారు. సికింద్రాబాద్ నుంచి విజయవాడ మద్య కాజీపేట మార్గంలో ట్రాక్ గరిష్ఠ వేగ సామర్ధ్యం గంటకు 130 కిలోమీటర్లుగా ఉంది. వందేభారత్ రైలు కోసం ట్రాక్ సామర్థ్యాన్ని 180 కిలోమీటర్లకు పెంచాల్సి ఉంటుంది. త్వరలోనే ట్రాక్ అప్‌గ్రేడ్, సిగ్నలింగ్, ఇతర పనులు చేపట్టే అవకాశం ఉంది.