NTV Telugu Site icon

Top Headlines @9AM: టాప్ న్యూస్

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

మోడీ టూర్ తో తెలంగాణలో పొలిటికల్ హీట్

ఇవాళ తెలంగాణలో మోడీ పర్యటించనున్నారు. ప్రధాని మోదీ పర్యటనకు పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. మోదీ పర్యటన కు 1000 మంది పోలీస్ సిబ్బంది తో బందోబస్త్ ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర పోలీస్ సిబ్బంది తో పాటు కేంద్ర బలగలాతో భారీ బందోబస్త్. ఉంటుంది. Advance security liason (AsL) రిహార్సల్స్ పూర్తిచేశారు. బేగంపేట్ నుండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. మోదీ పర్యటన అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు పోలీసులు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. పరేడ్ గ్రౌండ్ ను అధీనం లోకి తీసుకుంది ఎస్పీజీ బృందం. ప్రధాని మోడీ పర్యటనతో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. పరేడ్ గ్రౌండ్స్ బహిరంగసభలో ప్రధాని మోడీ ఏం మాట్లాడతారోనని ఉత్కంఠ నెలకొంది.

ప్రధాని మోడీ హటావో-సింగరేణి బచావో.. కేంద్రంపై జంగ్‌ సైరన్‌

బొగ్గు బావులను ప్రయివేటు పరం చేస్తే ఊరుకోబోమని, కేంద్రంపై జంగ్‌సైరన్‌ మోగిస్తామని సింగరేణి కార్మికులు భగ్గుమంటున్నారు. సింగరేణిని ప్రైవేటీకరించబోమని తెలంగాణ ప్రజల సాక్షిగా చెప్పిన ప్రధాని మోడీ… కేంద్ర ప్రభుత్వానికి హటావో సింగరేణి బచావో నినాదం వినిపించేలా మహాధర్నా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. సింగరేణి బ్లాకులను ప్రయివేటుకు అప్పగించాలన్న కేంద్రం యోచనపై కార్మికులు భగ్గుమంటున్నారు. తెలంగాణకు జీవనాడి అయిన సింగరేణిని తొలగిస్తే శాంతి ఉండదని హెచ్చరిస్తున్నారు. లాభాల్లో ఉన్న కంపెనీని నిర్వీర్యం చేస్తే సహించేది లేదని స్పష్టం చేస్తున్నారు. కేంద్రం వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వానికి బొగ్గు బ్లాకులను కేటాయించాలని డిమాండ్ చేశారు. బొగ్గు బావుల ప్రైవేటీకరణ తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా మారిందని మూడు కోట్ల మంది తెలంగాణ ప్రజల గొంతు నొక్కేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తుంటే సింగరేణి మహాధర్నాతో సింగరేణిని ఆదుకుంటామన్నారు.

అదాని, అంబానీలపై దాడి చేయడం కరెక్ట్ కాదు

రాజకీయ ప్రయోజనాల కోసం ముఖేష్ అంబానీ, గౌతమ్ అదాని వంటి పారిశ్రామికవేత్తలపై దాడి చేయడం ఏమాత్రం సరైంది కాదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ పేర్కొన్నారు. ఒక న్యూస్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలకు ప్రైవేట్ రంగాన్ని లక్ష్యంగా చేసుకునే సుదీర్ఘ చరిత్ర ఉందని, అయితే ఈ దృగ్విషయం మారాలని సూచించారు. ‘‘ప్రైవేట్ రంగాన్ని లక్ష్యం చేసుకోవడం అనేది మన దేశంలో చాలా ఏళ్లుగా జరుగుతోంది. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలంటే, టాటా-బిర్లాకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్లం. ఆ తర్వాత ఈ దేశానికి టాటా అందించిన సేవల గురించి తెలుసుకొని.. మేము ఇన్నాళ్లు టాటా-బిర్లా అంటూ వ్యతిరేక వ్యాఖ్యలు ఎందుకు చేశామని ఆశ్చర్యం వేసింది’’ అని తెలిపారు.అయితే.. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎవరినో ఒకరిని టార్గెట్ చేయాలి కాబట్టి, తామంతా టాటా-బిర్లాని టార్గెట్ చేసేవాళ్లమని శరద్ పవర్ చెప్పారు. అయితే.. ఇప్పుడు టాటా-బిర్లా పేరు ముందంజలో లేదని, ఎంతోమంది టాటా-బిర్లాలు వచ్చారని అన్నారు. ఈరోజుల్లో ప్రభుత్వం మీద దాడి చేయాలంటే.. అదాని, అంబానీ పేర్లను తెరమీదకు తీసుకొస్తున్నారని ఆయన కుండబద్దలు కొట్టారు.

మంత్రి వేణుగోపాల్ తనయుడికి గన్ మెన్

రాజు తలచుకుంటే ఏదైనా సాధ్యమే. సాక్షాత్తూ ముఖ్యమంత్రే ఆర్డర్ వేస్తే ఇంకేముంది? ఓ మంత్రిగారి కొడుక్కి గన్ మెన్ల నియామకం గోదావరి జిల్లాల్లో హాట్ టాపిక్ గా మారింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ తనయుడు నరేన్ కి గన్ మెన్ లను కేటాయించింది ప్రభుత్వం. వేణుగోపాల్ తనయుడు నరేన్ కి 1+1 గన్ మెన్ భద్రత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. తన తండ్రి మంత్రి హోదా లో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నందున ఆయన తరపున రామచంద్రపురం నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు తాను చూసుకుంటున్నానని తనకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు నరేన్. రామచంద్రపురం నియోజకవర్గంలో మంత్రి తరఫున గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్నారు నరేన్. తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైనా కూడా చెల్లుబోయిన వేణుగోపాల్ కు జగన్ మంత్రి పదవిని కట్టబెట్టారు.2008 నుండి 2012 వరకు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు వేణుగోపాల్. కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. జెడ్పీ ఛైర్మన్ గా కూడా పనిచేశారు. వైఎస్ జగన్ పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత వైఎస్ఆర్‌సీపీలో చేరారు వేణుగోపాల్. 2014 ఎన్నికల్లో కాకినాడ రూరల్ అసెంబ్లీ స్థానం నుండి ఆయన పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 2019 ఎన్నికల్లో ఆయన రామచంద్రాపురం అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి విజయం సాధించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏడాది తర్వాత జగన్ కేబినెట్లోకి వేణుగోపాల్ కు స్థానం దక్కింది. ప్రస్తుతం సీఎం జగన్ కి నమ్మకస్తుడిగా ఉన్న వేణుగోపాల్ మంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా మంత్రి కొడుక్కి గన్ మెన్లను కేటాయించడం పార్టీలోనూ చర్చకు దారితీస్తోంది.

డాక్టర్ల నిర్లక్ష్యం.. కట్టుకట్టి బ్లేడ్ మరిచిపోయారు

వైద్యో నారాయణో హరి అంటారు. వైద్యుడు ఆ దేవుడితో సమానం అంటారు. విజయవాడ ప్రభుత్వ దవాఖానాలో దారుణం జరిగింది. ఓ డాక్టర్ నిర్లక్ష్యం రోగికి ప్రాణసంకటంగా మారింది. డాక్టర్ల నిర్లక్ష్యంతో కూలి మహిళ చేతిని తీసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందనే సామెతలా మారింది ఈ ఉదంతం. ఆపరేషన్లు చేసి కడుపులో కత్తెర మరిచిపోయిన ఘటనలు చూశాం మనం, కానీ ఇప్పుడు చేతికి కట్టుకట్టి బ్లేడ్ మరిచిపోయాడా డాక్టర్. వైద్య విధానాలలో ప్రభుత్వ అనేక పెను మార్పులు తీసుకువచ్చిన నేడు డాక్టర్ల పనితీరు కళ్ళకు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కొంతమంది డాక్టర్లు తమకున్న నైపుణ్యంతో రోగులకు మంచి వైద్యం అందిస్తారు. కానీ ఇది రివర్స్ అయింది. విజయవాడ కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ నందు అయోమయ స్థితిలో పేద కుటుంబం ఉంది. తిరువూరు నియోజకవర్గం విసన్నపేట గ్రామానికి చెందిన నందిపాం సురేష్ భార్య తులసి తనకున్న పూరిల్లు సర్దుకునే సమయంలో తెలియని పురుగు ముట్టిందని అనుమానంతో స్థానిక ఆసుపత్రికి వెళ్లారు. అక్కడనుండి మెరుగైన వైద్యం కోసం నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు

ఏపీలో పలువురు ఐపీఎస్ ల బదిలీలు

ఏపీలో ఇప్పటికే ఐఎఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం. ఇప్పుడు ఐపీఎస్ అధికారుల బదిలీపై ఫోకస్ పెట్టింది. భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈమేరకు ఉత్తర్వులు జారీచేసింది ప్రభుత్వం.సీఎం త్రివిక్రమ్ వర్మ – విశాఖ సిటీ కమిషనర్ గా బదిలీచేసింది. విక్రాంత్ పాటిల్ ను పార్వతీపురం మన్యం ఎస్పీగా నియమించింది. వాసన్ విద్యా సాగర్ నాయుడుకి లా అండ్ ఆర్డర్ డీసీపీ,విశాఖ సిటీగా బాధ్యతలు అప్పగింంచింది. గరుడ్ సుమిత్ సునీల్ – ఎస్పీ,SIBగా నియమించింది. హిన్ సిన్హా – ఎస్పీ,అల్లూరి జిల్లాగా, ఎస్.సతీష్ కుమార్ – కాకినాడ జిల్లా ఎస్పీగా బదిలీ చేసింది. ఎం. రవీంద్రనాధ్ బాబు -GAD కి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. కేవీ మురళి కృష్ణను – అనకాపల్లి జిల్లా ఎస్పీగా, గౌతమి శాలి – APSP 16వ బెటాలియన్ కమాండెంట్ గా నియమించింది. సీహెచ్.సుధీర్ కుమార్ రెడ్డి – తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా నియమితులయ్యారు. .పి.శ్రీధర్ – కోనసీమ జిల్లా ఎస్పీగా, డి.మేరీ ప్రశాంతి – ఏలూరు జిల్లా ఎస్పీగా నియమితులయ్యారు.

ఏపీలో ఐఏఎస్ ల బదిలీలు..సవరణలు
ఏపీలో పలువురు ఐఏఎస్ ల బదిలీలు జరిగాయి. రెండు రోజుల కిందట చేసిన బదిలీల్లో కొన్ని సవరణలు చేసిన ప్రభుత్వం. ఈమేరకు ఉత్తర్వులు జారీచేసింది. 8 మంది ఐఏఎస్ ల బదిలీ చేస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. ట్రాన్స్ కో చైర్మన్ & ఎమ్‌డీగా విజయానంద్
పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు. అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్, SSA గా B. శ్రీనివాసరావు కు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. పాఠశాల విద్య స్పెషల్ ఆఫీసర్ గా వెట్రిసల్వి కొనసాగించారు. కర్నూలు జిల్లా జేసీగా నారపురెడ్డి మౌర్యను నియమించింది ప్రభుత్వం. నెల్లూరు మున్సిపల్ కమిషనర్ గా వికాస్ మర్మత్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా డి. హరిత, బాపట్ల జిల్లా జేసీగా చామకూరి శ్రీధర్, ప్రకాశం జిల్లా జేసీగా కె. శ్రీనివాసులుని నియమించారు.

సన్ రైజర్స్ టీం బ్యాటింగ్ పై పేలుతున్న మీమ్స్

ఐపీఎల్ 2023 సీజన్ 16లో టైటిల్ ఫెవరెట్ టీమ్స్ లో ఒకటిగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఉంది. అయితే రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో చిత్తుగా ఓడిన ఆరెంజ్ ఆర్మీ జట్టు.. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లోను అదే విదమైన వైఫల్యాలను ముట్టగట్టుకుంది. అయితే సన్ రైజర్స్ జట్టు రెగ్యూలర్ కెప్టెన్ వచ్చిన ఆ జట్టు తలరాత మాత్రం మారలేదు. ఫస్ట్ మ్యాచ్ లో వైస్ కెప్టెన్ గా ఉన్న భువనేశ్వర్ కుమార్ రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో కెప్టెన్సీ లోపాలతో మ్యాచ్ ఓటమికి కారణంగా కాగా.. రెండో మ్యాచ్ లో లక్నో తో జరిగిన మ్యా్చ్ లో అయిడిన్ మార్క్రమ్ డకౌట్ అయ్యాడు. అతడు మార్క్ వుడ్ బౌలింగ్ లోనో లేదా అద్భుతమైన స్పిన్నర్ బౌలింగ్ లో ఔట్ అయితే పెద్దగా బాధపడేవాళ్లు కాదు.. కాని స్పిన్ అని చెప్పి.. విసిరి వేసినట్లుగా బౌలింగ్ చేసే కృనాల్ పాండ్యా బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

పోస్ట్ ఆఫీస్ లో 5 లక్షలు డిపాజిట్ చేస్తే.. 2.5 లక్షల వడ్డీ

ఇటీవల ఆర్థిక మంత్రిత్వ శాఖ చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను మార్చింది. వడ్డీ రేట్ల మార్పు పోస్టాఫీసులోని అన్ని పథకాలపై కూడా ప్రభావం చూపింది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌కు సంబంధించి మాత్రమే వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. ఇండియా పోస్ట్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ఇప్పుడు 5 సంవత్సరాల టైమ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 7.5 శాతానికి పెరిగింది. కొత్త వడ్డీ రేటు ఏప్రిల్ 1 నుంచి వర్తిస్తుంది. గతంలో ఈ పథకంపై కేవలం 7 శాతం వడ్డీ మాత్రమే అందేది. పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ ఖాతాలో వార్షిక ప్రాతిపదికన వడ్డీ చెల్లింపులు ఉంటాయి. ఇందులో కనీసం 1000 రూపాయలు పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు. ఒక పెట్టుబడిదారుడు 5 సంవత్సరాలకు 5 లక్షల రూపాయలను డిపాజిట్ చేస్తే ఐదేళ్లలో రూ.2.25 లక్షల వడ్డీ లభిస్తుంది.
పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ కాలిక్యులేటర్ ప్రకారం, రూ. 5 లక్షల మొత్తం పెట్టుబడిపై 5 సంవత్సరాలలో ప్రస్తుత రేటు (7.5 శాతం) ప్రకారం మొత్తం రూ. 2 లక్షల 24 వేల 974 వడ్డీగా అందుతుంది.

తెర మీదే కాదు.. బిజినెస్లో కూడా తారలే
హైదరాబాద్ నిజాం రాజులు పాలించిన నగరం.. గొప్ప చరిత్ర, సంస్కృతికి మారుపేరు. అంతే కాకుండా రుచికరమైన వంటలకు ప్రసిద్ధి. అందుకే హైదరాబాద్‌లో చాలా మంది సినీ సెలబ్రిటీలు ఆహార వ్యాపారంలోకి ప్రవేశించారు. తమ అభిమానుల భోజన అనుభవానికి తమదైన ప్రత్యేక రుచులను తీసుకువచ్చారు. ఈ కథనంలో భోజన ప్రియుల దృష్టిని ఆకర్షించిన హైదరాబాద్‌లోని ప్రముఖుల యాజమాన్యంలోని కొన్ని కేఫ్‌లు, రెస్టారెంట్‌ల జాబితాను చూద్దాం.

శర్వానంద్ — ‘బీంజ్ కాఫీ షాప్’(Beenz coffee shop)
హీరో శర్వానంద్.. గ్రామీణ నేపథ్యంతో కూడిన బీంజ్ కాఫీ షాప్‌ని కలిగి ఉన్నారు. అరటి కాయ బజ్జీ, పునుగులు, మిర్చి బజ్జీ వంటి తెలుగు స్నాక్స్ అక్కడ స్పెషల్. వాటిని తప్పనిసరిగా ఓ సారి ప్రయత్నించాలి. ఈ షాప్ జూబ్లీ హిల్స్‌లో ఉంది.

సురేందర్ రెడ్డి — ‘ఉలవచారు’(Ulavacharu)
టాలీవుడ్ దర్శకుడు సురేందర్ రెడ్డి ఉలవచారు ఫ్రాంచైజీ దక్షిణ భారత వంటకాలను భోజన ప్రియులకు అందిస్తోంది. రెస్టారెంట్ లోపలికి వెళితే అక్కడి వాతావరణం, డెకరేషన్ మొత్తం మీరు ఇంట్లోనే ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. ఇది గచ్చిబౌలి, జూబ్లీ హిల్స్‌తో సహా హైదరాబాద్ అంతటా అనేక అవుట్‌లెట్‌లను కలిగి ఉంది.