NTV Telugu Site icon

Top Headlines @9AM: టాప్ న్యూస్

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

వందేభారత్ ట్రైన్ ప్రారంభానికి అంతా రెడీ

వందే భారత్ ట్రైన్.. రైల్వే ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. రైల్వే శాఖ అత్యంత ప్రతిష్టాత్మకం గా నడుపుతున్న వందే భారత్ రైలు రాకపట్ల తెలుగు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇవాళ ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ నుంచి వందే భారత్ ట్రైన్ ప్రారంభం అవుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పటికి దేశవ్యాప్తంగా 5 ట్రైన్లను ప్రారంభించారని.. సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య ఇవాళ ప్రారంభం అయ్యే రైలు ఆరవది. దేశవ్యాప్తంగా 100 వందేభారత్ ట్రైన్లను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది రైల్వేశాఖ. ప్రధాని మంత్రి నరేంద్రమోదీ ఢిల్లీ నుంచి వందేభారత్ ట్రైన్ ను వర్చువల్ గా ప్రారంభిస్తారు. ప్రోటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్ తో సహా మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలను ఆహ్వానించారు. ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ నుంచి ప్రారంభం అయి విశాఖపట్నం చేరుకుంటుంది. వందేభారత్ ఎక్స్ ప్రెస్ వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం స్టేషన్లలో ఈ ట్రైన్ కు హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. ఇవాళ ఒక్క రోజు మాత్రం 22 రైల్వే స్టేషన్లలో ఆగుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. చర్లపల్లి, భువనగిరి, జనగాం, ఖాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, కొండపల్లి, విజయవాడ, నూజివీడు, ఏలూరు, తాడేపల్లి గూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ, విశాఖపట్నం స్టేషన్లలో ఆగుతుందని వెల్లడించారు. అందరికి పరిచయం కావాలనే ఉద్దేశంతో అన్ని రైల్వే స్టేషన్లలో ఆపుతున్నారు. సంక్రాంతి పండగరోజు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పండగ కానుకగా వందేభారత్ ట్రైన్ ను ప్రారంభిస్తుంది.

చికోటి ప్రవీణ్ కి పోలీసుల షాక్.. తూర్పుగోదావరిలో తనిఖీలు

ఒకవైపు సంక్రాంతి… మరోవైపు గోదావరి జిల్లాల్లో కోడిపందాలు, క్యాసినోలు, గుండాటలు.. తెలుగు రాష్ట్రాల్లో చికోటి ప్రవీణ్ పేరు పరిచయం చెయ్యాల్సిన పనిలేదు. ప్రముఖ క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా్లో ప్రయాణిస్తున్నారు. అంతవరకూ బాగానే ఉంది. ఆయన ప్రయాణిస్తున్న కార్లను అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆపేశారు. నగరం పోలీసులు తనిఖీ చేశారు. నగరం పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా చికోటి ప్రవీణ్ మిత్రబృందం కార్లు వచ్చాయి. దీంతో వారు ప్రయాణిస్తున్న నాలుగు కార్లు నిలిపివేశారు. రెండు గంటలపాటు చీకోటి ప్రవీణ్ ను పోలీసులు ప్రశ్నించారు. ఇదిలా ఉండగా తాను క్యాసినో ఆడేందుకు కోనసీమకు రాలేదంటున్నారు ప్రవీణ్. ఇక్కడ ఆలయాలు సందర్శిస్తున్నానని చెప్పారు. పోలీస్ తనిఖీల అనంతరం చీకోటి ప్రవీణ్. ఈస్ట్ గోదావరి జిల్లా మామిడికుదురు సమీపంలో ప్రవీణ్ చికోటిని అడ్డుకున్నారు పోలీసులు. లక్ష్మీనారాయణ స్వామి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో అడ్డుకున్నారు పోలీసులు, 4 వాహనాలను రోడ్ పై నిలిపివేశారు పోలీసులు. ఎలాంటి కారణాలు చెప్పకుండా అడ్డుకోవడంతో చికోటి ప్రవీణ్ నిరసన తెలిపారు.

కుక్క దాడిలో డెలివరీ బాయ్ మృతి.. గత మూడు రోజులుగా కోమాలో..

స్విగ్గి డెలివరీకి వెళ్లి పెంపుడు కుక్క దాడి ఘటనలో డెలివరీ బాయ్ రిజ్వాన్ మృతి కలకలం రేపింది. నాలుగు రోజుల క్రితం బంజారాహిల్స్ లుంబిని రాక్ క్రిస్టల్ అపార్ట్మెంట్ కు రిజ్వాన్ ఫుడ్ డెలివరీకి వెళ్లాడు. డెలివరీ ఇచ్చే సమయంలో డోర్ ఓపెన్ చేయగా రిజ్వాన్ పై పెంపుడు కుక్క దాడి చేసింది. కుక్క దాడి నుంచి తప్పించుకునేందుకు థర్డ్ ఫ్లోర్ పై నుంచి రిజ్వాన్ కిందకు పడిపోయాడు. రిజ్వాన్ తలకు తీవ్ర గాయం కావడంతో నిమ్స్ కి తరలించారు. నాలుగు రోజులుగా కోమలోనే రిజ్వాన్ ఉన్నాడు. నిమ్స్ లో చికిత్స పొందుతూ రిజ్వాన్ నిన్న రాత్రి మృతి చెందాడు.

చైనాలో కోవిడ్ కల్లోలం.. ఒక్క నెలలో 60 వేల మరణాలు..

చైనాను కోవిడ్ మహమ్మారి కమ్మేస్తోంది. అక్కడ జీరో కోవిడ్ విధానం ఎత్తేయడంతో ఎప్పుడూ చూడని విధంగా కేసులు నమోదు అవుతున్నాయి. జనవరి, ఫిబ్రవరి నెలల్లో చైనాలో కేసుల సంఖ్య గరిష్ట స్థాయికి చేరబోతున్నట్లు అంచనా వేస్తున్నారు నిపుణులు. అయితే చైనా మాత్రం మరణాలు, కేసుల వివరాలను స్పష్టంగా ప్రకటించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే చైనాలో ఒకే నెలలో కోవిడ్ బారినపడి ఏకంగా 60,000 మంది మరణించినట్లు చైనా నేషనల్ హెల్త్ కమిషన్ (ఎన్‌హెచ్‌సి) వెల్లడించింది.

గుడి వద్ద హిందువులే వ్యాపారాలు చేయాలి..వీహెచ్‌పీ వార్నింగ్

కర్ణాటకలో మరో వివాదం రాజుకుంది. దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలోని శ్రీ మహాలింగేశ్వర ఆలయ ప్రాంగణంలో హిందువులు మాత్రమే వ్యాపారం చేయాలని విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) మరో వర్గం వారికి వార్నింగ్ ఇస్తోంది. దీనికి సంబంధించి ఆలయ పరిసరాల్లో ఓ పోస్టర్ కూడా ఏర్పాటు చేసింది. హిందూ మతం, సంప్రదాయాలపై విశ్వాసం ఉన్న హిందూ వ్యాపారులు మాత్రమే వాణిజ్యం నిర్వహించడానికి అవకాశం ఉంటుందని బ్యానర్ లో పేర్కొన్నారు. దక్షిణ కన్నడ జిల్లా జిల్లాకు చెందిన వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ నాయకులు శనివారం మంగళూర్ నగర సమీపంలోని కావూరు లో జరిగిన మతపరమైన ఉత్సవంలో ముస్లిం వ్యాపారులకు వ్యతిరేకంగా బ్యానర్ ఏర్పాటు చేసింది. జనవరి 14 నుంచి 18 వరకు మహాలింగేశ్వర ఆలయంలో ఉత్సవాలు జరగుతున్నాయి. ఇంతకు ముందు ఎక్కువగా ముస్లిం స్టాల్స్ మాత్రమే ఉండేవని.. ఈ సారి స్టాల్స్ కాంట్రాక్టుల కేటాయింపులను భజరంగ్ దళ్ కార్యకర్తలకు కేటాయించారు.

శరవేగంగా ఎయిర్‌పోర్ట్ మెట్రో నిర్మాణం.. 21 కిలోమీటర్లు సర్వే పూర్తి

ఎయిర్‌పోర్ట్ మెట్రో పనులను వేగవంతం చేయడానికి సమాంతరంగా అనేక ముందస్తు నిర్మాణ కార్యకలాపాలు ప్రారంభించబడ్డాయని, అవి శరవేగంగా సాగుతున్నాయని హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ (HAML) MD శ్రీ NVS రెడ్డి ప్రకటించారు. జనరల్ కన్సల్టెంట్ (జిసి) కోసం బిడ్‌ల సమర్పణకు ఈ నెల 20 చివరి తేదీ కాగా, ఈ నిపుణులైన ఇంజినీరింగ్ కన్సల్టెంట్లు వచ్చే నెల మొదటి వారంలో నియమితులవుతారు. ఈలోగా మెట్రో అలైన్‌మెంట్ ను పక్కాగా సరిదిద్దడానికి, స్టేషన్ల స్థానాలను నిర్ణయించడానికి సర్వే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.

క్లీన్‌స్వీప్ పై భారత్ కన్ను..పరువు కోసం శ్రీలంక.. నేడు మూడో వన్డే

భారత్, శ్రీలంక మధ్య నేడు తిరువనంతపురం గ్రీన్ ఫీల్డ్ స్టేడియం వేదికగా చివరిదైన మూడో వన్డే జరగనుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. మూడు వన్డేల సిరీస్ లో రెండు వన్డేలు గెలిచి టీం ఇండియా ఫుల్ జోష్ లో ఉంది. మూడో వన్డేలో గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. మరోవైపు రెండు వన్డేల్లో దారుణ పరాజయం చవిచూసిన శ్రీలంక మూడో వన్డేలో గెలిచైనా పరువు దక్కించుకోవాలని భావిస్తోంది.

శృంగారం చేస్తూ దొరికిపోయిన భార్య, ప్రియుడు.. తల నరికేసిన భర్త
తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న యువకుడిని దారుణంగా హత్య చేశాడు భర్త. తన భార్యతో కలిసి అభ్యంతరకర స్థితిలో ఉన్న ప్రియుడిని చూసిన భర్త తట్టుకోలేకపోయాడు. దీంతో కోపంతో ప్రియుడిని అంతం చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. జార్ఖండ్ లోని లోంజో గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. లోంజో గ్రామానికి చెందిన విశ్వనాథ్ సుండి అనే వ్యక్తి తన భార్య ప్రేమికుడితో కలిసి ఉండటాన్ని చూసి గొడ్డలిగో తలను నరికేశాడు.