పవన్ పొలిటికల్ జోకర్.. రోజా హాట్ కామెంట్స్
ఏపీలో రాజకీయ పరిణామాలు తీవ్రంగా మారుతున్నాయి. పొత్తు పొడుపులు.. విమర్శలు.. పెదవి విరుపులు.. విమర్శలు.. ఇవే ఏపీలో నడుస్తున్నాయి. మంత్రి రోజా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. పవన్ డైమాండ్ రాణి మాటకు రోజా కౌంటర్ వేశారు. అది కూడా మామూలుగా కాదు.. కాస్త వెటకారంగా. పవన్ కల్యాణ్ పొలిటికల్ జోకర్ అనేశారు రోజా సెల్వమణి. జగన్ లా నేను పోటీ చేయలేను.. నాకు చేత కాదు అని పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నాడన్నారు. అదీ జగన్ పవరంటే అన్నారు. 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టలేనని నిస్సహాయత వ్యక్తం చేశారన్నారు. సంక్రాంతికి చిరంజీవి వాల్తేరు వీరయ్య కలెక్షన్లు వచ్చాయి… బాలయ్య వీరసింహారెడ్డి కలెక్షన్లు వచ్చాయి…పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు నుండి కలెక్షన్లు అందాయి…కాని జనసేన నాయకులే ఎమీ లేకుండా పోయింది. సిఎం జగన్ పరిపాలనలో రైతులందరికి సంతోషంగా పండుగ జరుపుకుంటున్నారు. మంత్రిగా తొలి సంక్రాంతి జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు.
బ్యాట్ పట్టిన సంజయ్.. యువతతో సరదాగా
నిత్యం రాజకీయాలతో బిజీగా ఉండే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యువతతో క్రికెట్ ఆడారు. కరీంనగర్ లో జరిగిన పోటీల్లో బ్యాట్ పట్టుకుని పార్టీ శ్రేణుల్లో ఆనందాన్ని నింపారు. మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని, బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు.స్వామి వివేకానంద జయంతి, జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ పట్టణంలోని కోటి రాంపూర్ గిద్ద పెరుమాండ్ల ఆలయ మైదానంలో రెండు రోజుల పాటు జరిగిన క్రీడా పోటీలు శుక్రవారం సాయంత్రం ముగిశాయి. బండి సంజయ్ క్రీడా కార్యక్రమం ముగింపు కార్యక్రమానికి, బహుమతి ప్రదానోత్సవానికి హాజరయ్యారు. క్రికెట్ గేమ్‌లో గెలుపొందిన జట్టు, రన్నర్ టీమ్, బెస్ట్ బ్యాట్స్‌మెన్, బెస్ట్ బౌలర్‌లకు మెమెంటోలు, ట్రోఫీలు అందజేశారు.
భోగి పండుగనాడు పిల్లలపై రేగిపళ్లు ఎందుకు పోస్తారు?
సంక్రాంతి పండగ ముందురోజు భోగీని నిర్వహించుకుంటారు. భోగి రోజు అన్ని చెడు కర్మలు తొలగాలని పాతవస్తువులను భోగి మంటలో వేస్తారు. అంతేకాకుండా భోగీ నాడు సాయంత్రం పూట ఐదేళ్ల పిల్లలందరికీ భోగి పళ్లు పోస్తారు. పిల్లలకు ఉండే బాలారిష్టాలు, దిష్టి తొలగిపోయి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ భోగి పళ్ళు పోస్తారు. అయితే భోగి పళ్లలో రేగి పళ్లను మాత్రమే వాడతారు. ఎందుకంటే చిన్న పిల్లలకు బ్రహ్మరంధ్రం పలుచగా ఉంటుంది. రేగిపండు అరా కూడా పలచగా ఉంటుంది. ఈ రేగి పళ్లకు రోగనిరోధక శక్తిని ఇచ్చే పోషక విలువలు ఉంటాయి. భోగి పళ్లను పోసిన సమయంలో రేగి పళ్ల నుండి వచ్చే వాయువు పిల్లల తలపైన బ్రహ్మరంధ్రానికి శక్తిని ఇస్తుంది. రేగి పళ్లు తలపైన నుంచి పడటం వల్ల తలలోని మెదడులోని నరాలకు రేగి పళ్ల నుండి వచ్చే వాయువు వల్ల ఆక్టివ్ అవుతారు. శీతాకాలంలో వచ్చే జబ్బులు వల్ల పిల్లలు మెతక బడిపోతారు. ఈ రేగి పళ్లలో అరా ఎక్కువగా ఆకర్షించే గుణం వల్ల పిల్లలకు ఆరోగ్యం లభిస్తుంది. ఎటువంటి పరిస్థితులను అయినా ఎదురుకునే శక్తి పిల్లలకు రావాలనే ఉద్దేశంతో ఈ రేగి పళ్లనే పోస్తారు, అలాగే పిల్లలకు ఎక్కువగా దిష్టి ప్రభావం తగ్గుతుంది. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల వారు కూడా వచ్చి వారు కూడా రేగి పళ్లు పోయడం వల్ల పిల్లలకు అందరి ఆశీర్వాదం కలుగుతుంది.
సీఐ సుధాకర్ కు బెయిల్ మంజూరు
భూ వివాదం, ఫోర్జరీ కేసులో అంబర్‌పేట ఇన్‌స్పెక్టర్ పేరం సుధాకర్‌ను వనస్థలిపురం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అతడి అరెస్ట్ తర్వాత హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్ శ్రీ సుధాకర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి విచారణ ప్రారంభించారు. వనస్థలిపురం పోలీసులు ఈ వారం ప్రారంభంలో ఈ సంఘటనపై విచారణ ప్రారంభించారుజ ఒక ప్రవాస భారతీయుడు తాను భూ మోసానికి గురైనట్లు ఫిర్యాదు చేశాడు. అతని పిటిషన్ ప్రకారం.. అతను రంగారెడ్డి జిల్లా కందుకూరు గ్రామంలో భూమి కొనుగోలు కోసం శ్రీ సుధాకర్‌కు రూ.54 లక్షలు చెల్లించాడు. మహేశ్వరంలో ల్యాండ్ ఇప్పిస్తానని నకిలీ ఎమ్మార్వోను సృష్టించి ఎన్ఆర్ఐ దగ్గర నుంచి సీఐ సుధాకర్ డబ్బులు కొట్టేశారు. పోలీసులు విచారణ జరిపి సుధాకర్‌ను అరెస్ట్ చేశారు. అయితే.. ఈమేరకు సీఐ సుధాకర్‌ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. న్యాయవూర్తి ఇద్దరు షురిటీలతో 15వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేశారు.
బాస్మతి రైస్ కు నాణ్యతా ప్రమాణాలు.. ఆగస్ట్ 1 నుంచి అమలు
మీకు మంచి ఆకలి వేస్తోంది. ఏంచేస్తారు హాయిగా బిర్యానీ ఆర్డర్ చేస్తారు. ఆ బిర్యానీలో వాడే బాస్మతి బియ్యం గురించి మీకు తెలుసా? ఏ బియ్యం అంటే ఆ బియ్యం వాడితే బిర్యానీ రుచిగా ఉండదు. బాస్మతి బియ్యానికి నాణ్యతా ప్రమాణాలను రూపొందించింది కేంద్రం. బాస్మతి బియ్యంతో వండే బిర్యానీ ఎంతో బాగుంటుంది. దేశంలో వివిధ రకాల బాస్మతి బియ్యం అందుబాటులో వున్నాయి. వివిధ కంపెనీలు, వివిధ రేట్లలో అమ్ముతారు. కల్తీలు, నాసిరకం బాస్మతి బియ్యంపై దృష్టి సారించింది కేంద్రం. బియ్యం పొడవు, ఈ బియ్యం నుంచి వచ్చే పరిమళం వంటి అంశాలతో నాణ్యతా ప్రమాణాలు రూపొందించింది. హైదరాబాద్ లో బిర్యానీ రైస్ ఫ్యామస్. మంచి బిర్యానీ వండాలంటే బాస్మతి బియ్యం వెతికి తేవాల్సిందే. బిర్యానీకి బాస్మతి బియ్యంతో మరింత రుచి వస్తుందని అందరికీ తెలిసిందే. బాస్మతి బియ్యంలో ఈమధ్య కాలంలో బాగా కల్తీ జరుగుతోంది. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బాస్మతి బియ్యానికి నాణ్యతా ప్రమాణాలు రూపొందించింది. ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ప్రమాణాలు ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. వినియోగదారులకు మంచి బాస్మతీ బియ్యం అందించేందుకు వీలుగా ఈ నియంత్రణ ప్రమాణాలు రూపొందించినట్టు ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది. ఈ ప్రమాణాలు దేశీయ మార్కెట్లకు, విదేశీ ఎగుమతులకు కూడా వర్తిస్తాయని తెలిపింది. ఈ మేరకు ఒరిజినల్ బాస్మతి రకాలుగా బ్రౌన్ బాస్మతి బియ్యం, మర పట్టించిన బాస్మతీ బియ్యం, మర పట్టించిన పారాబాయిల్డ్ బియ్యంను నోటిఫికేషన్లో వెల్లడించింది.
కంటి వెలుగు నిర్వహణపై సీఎస్ సమీక్ష
కంటి వెలుగు నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ శాంతి కుమారి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. ఈనెల 18 వతేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కంటి వెలుగు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు. 2018 లో నిర్వహించిన తొలివిడత కంటి వెలుగు కన్నా ఎక్కువ మందికి కంటి పరీక్షలు నిర్వహించడం ద్వారా మన రికార్డు మనమే బద్దలుకొట్టి సరికొత్త రికార్డు సృష్టించాలని అన్నారు.ఇప్పటికే 15 లక్షలకు పైగా కళ్లజోడ్లను రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక వైద్య కేంద్రాలకు, అర్బన్ వైద్య కేంద్రాలకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వహణకు గాను రాష్ట్ర వ్యాప్తంగా 1500 బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు. కంటి వెలుగు పై ప్రతి ఇంటికి , ప్రతీ ఒక్కరికీ తెలిసేలా విస్తృత ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని, అత్యంత ఉన్నత ప్రమాణాలతోకూడిన సేవలను అందించాలని సీఎస్ ఆదేశించారు.
పండుగ పూట విషాదం…. తల్లిని కడతేర్చిన తనయుడు
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం భవానిపేట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. కడుపులో పెట్టుకుని కని పెంచి ఓస్థాయికి తెచ్చిన తల్లి తండ్రులపైనే పిడ్డలే కడతేర్చుతున్నారు. గుండెల్లో పెట్టుకుని పెంచిన తల్లిదండ్రులను గుండెపై తల్లి ఊపిరి ఆగిపోయేలాచేస్తున్నారు. వారి కడుపున కొట్టకుని కన్న బిడ్డ ఆకలి నింపే తల్లిదండ్రుపై కడుపుకొడుతూ వారిపై దాడులు చేస్తూ పైశాచిక ఆనందాన్ని నింపుకుంటున్నారు. కన్నపేగుపై కర్కసత్వాన్ని చూపిస్తూ తల్లి దండ్రులపై అతికిరాతకంగా హింసించి చంపడానికైనా వెనుకాడటం లేదు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం భవానిపేట గ్రామంలో నర్సవ్య, కొడుకు నర్సారెడ్డి కుటుంబం నివాసం ఉండేది. నర్సారెడ్డికి కొద్ది నెలల క్రితం పెళ్లి చేసింది నర్సవ్య. కానీ నర్సారెడ్డి భార్య తనని వదిలి వెళ్లిపోయింది. రోజు సైకోలా ప్రవర్తిస్తుండటంతో విసుగు చెందిన భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే నర్సారెడ్డి, తల్లి నర్సవ్యతోనే ఉంటున్నాడు. కానీ భార్య వదిలి వెళ్లిపోయిన నర్సారెడ్డిలో మార్పు రాలేదు.. వ్యసనాలకు బాలిసై తల్లితో రోజు గొడపడేవాడు. నిన్నటి రోజు పండుగ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో.. ఫుల్ గా మద్యం సేవించి ఇంటి వచ్చాడు. తల్లితో గొడవపడ్డాడు.