NTV Telugu Site icon

Top Headlines @9AM: టాప్ న్యూస్

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

సంక్రాంతికి నారావారిపల్లెకు నారా, నందమూరి కుటుంబాలు

ఈ సంక్రాంతికి చిత్తూరు జిల్లా నారావారిపల్లెకి వెళ్లాలని నారా, నందమూరి కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. గత మూడేళ్ల నుంచి కరోనా కారణంగా స్వగ్రామానికి టీడీపీ అధినేత చంద్రబాబు ఫ్యామిలీ వెళ్లడం లేదు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో సంక్రాంతి సందర్భంగా నారావారిపల్లె వెళ్లాలని చంద్రబాబు కుటుంబం డిసైడ్ అయ్యింది. తన బావ కుటుంబంతో పాటు నందమూరి బాలయ్య కుటుంబం కూడా నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలను ఆస్వాదించనుంది. ఈ మేరకు బాలయ్య తన భార్య వసుంధరతో పాటు నారావారిపల్లె వెళ్లనున్నాడు. లోకేష్, బ్రాహ్మణి దంపతులు, వారి కుమారుడు దేవాన్ష్ కూడా సంక్రాంతి సంబరాల్లొ పాల్గొననున్నారు. మూడేళ్ళ తరువాత సంక్రాంతికి నారావారిపల్లెకి చంద్రబాబు, బాలకృష్ణ కుటుంబాల రాక సందర్భంగా నారావారిపల్లెలో ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. అటు ఈనెల 12న బాలయ్య నటించిన వీరసింహారెడ్డి మూవీ విడుదల అవుతుండటంతో ఈ సందడి రెట్టింపు కానుంది. కాగా చివరిసారిగా 2019లో చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో చంద్రబాబు కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ పాల్గొన్నారు. రెండు రోజుల పాటు కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు చంద్రబాబు సంక్రాంతి సంబరాలను జరుపుకున్నారు. ఊరి జనంతో రెండు కుటుంబాలు కలిసిపోయాయి. సంక్రాంతి పిండి వంటలతో కుటుంబ సభ్యులు, బంధువులు సందడి చేశారు. ఇప్పుడు కూడా అదే తరహాలో మరింతగా జోష్ పెంచేలా టీడీపీ నేతలు, బంధువులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆదిలాబాద్.. దేశంలోనే సురక్షితమయిన జిల్లా

అడవుల జిల్లా ఆదిలాబాద్ అరుదైన ఘనతను సాధించింది. దేశంలోనే ఆదిలాబాద్ జిల్లా సురక్షితమైన జిల్లాగా రిపోర్టు విడుదల చేసింది ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి. దేశ ప్రజలకు ఆదిలాబాద్ జిల్లా అత్యంత సురక్షితమైన జిల్లాగా నిలిచింది. తెలంగాణలో మొదటి స్థానాన్ని, దేశంలో 5వ స్థానాన్ని దక్కించుకుంది ఆదిలాబాద్ జిల్లా. సామాజిక ప్రగతి సూచికలో 85 మార్కులతో దేశంలోని ఐదవ స్థానాన్ని రాష్ట్రంలో మొదటి స్థానాన్ని ఆదిలాబాద్ జిల్లా కైవసం చేసుకోవడం గర్వ కారణం అన్నారు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ద్వారా సామాజిక ప్రగతి సూచిక, సురక్షితమైన జిల్లాల నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం 85 మార్కులతో ఆదిలాబాద్ జిల్లా అత్యంత సురక్షితమైన జిల్లాగా దేశంలో ఐదవ స్థానాన్ని తెలంగాణలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఈ సర్వే లో 89 సూచికలను పరిగణలోకి తీసుకున్నారు, అందులో ముఖ్యమైనవి మహిళలు, పిల్లలపై జరిగే నేరాలు, సైబర్ క్రైమ్, హత్యలు, రోడ్డు మరణాలు, హింసాత్మక నేరాలు తదితర అంశాలను వ్యక్తిగత భద్రత పరిమితిని లెక్కించేందుకు పరిగణలోకి తీసుకున్నారు.

వాల్తేరు వీరయ్యనోట వీరసింహారెడ్డి మాట

మెగాస్టార్ చిరంజీవి తొమ్మిదేళ్ల కంబ్యాక్ తర్వాత పూర్తి స్థాయి మాస్ గెటప్ లోకి మారి నటిస్తున్న మూవీ ‘వాల్తేరు వీరయ్య’. వింటేజ్ చిరుని గుర్తు చేసేలా బాబీ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మాస్ మహారాజ్ రవితేజ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్న ఈ మూవీ జనవరి 13న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సంధర్భంగా ప్రమోషన్స్ ని పీక్ స్టేజ్ కి తీసుకోని వెళ్తూ మేకర్స్ వైజాగ్ లో వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్ ఈవెంట్ కి గ్రాండ్ గా చేశారు. ఈ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి, రవితేజలు సూపర్బ్ గా మాట్లాడి అభిమానులని సంతోషపరిచారు. తన స్పీచ్ లో ఒక మ్యాజిక్ ని మైంటైన్ చేసే చిరు, ఈసారి ఆ మ్యాజిక్ ని బాలకృష్ణ విషయంలో చూపించాడు. వాల్తేరు వీరయ్య సినిమాని నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ హౌజ్ బాలయ్య నటిస్తున్న ‘వీర సింహా రెడ్డి’ సినిమాని కూడా నిర్మించింది. జనవరి 12న ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ సినిమాపై కూడా భారి అంచనాలు ఉన్నాయి. చిరు, బాలయ్యల బాక్సాఫీస్ వార్ కి తెలుగు రాష్ట్రాల అభిమానులు ప్రిపేర్ అవుతున్నారు. తమ మధ్య పోటీ సినిమాలకి మాత్రమే పరిమితం అన్నట్లు చిరు, ‘వాల్తేరు వీరయ్య’ స్టేజ్ పైన “మైత్రీ మూవీ మేకర్స్ ని రెండు సినిమాలు రెండు కళ్ళ లాంటివి, ఈ సంక్రాంతికి రెండు సినిమాలు ఆడాలి. వీర సింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు హిట్ అవ్వాలి. మిమ్మల్ని చూసి కొందరికి కుల్లు పుట్టాలి” అన్నాడు.

కడుపు ఉబ్బరంగా ఉందా? ఈ ఫుడ్స్ ట్రై చేయండి

ఈమధ్యకాలంలో వివిధ అనారోగ్య సమస్యలు తరచూ వేధిస్తున్నాయి. కడుపు ఉబ్బరంగా ఉందని చాలామంది అంటుంటారు. కడుపు ఉబ్బరం సమస్య తలెత్తడానికి మలబద్ధకం, గాలిని మింగడం, సరిగ్గా లేదా సరైన సమయానికి తినకపోవడం వంటి చాలా కారణాలు ఉంటాయి. వీటితోపాటు మనం తరచూ తినే ఆహార పదార్థాలు కూడా బ్లోటింగ్ సమస్యకు దారితీస్తాయి. చాలా మంది తాము ఆ ఫుడ్ తింటే పడడం లేదని, కడుపు బరువుగా ఉంటోందని ఫిర్యాదు చేస్తుంటారు. తమకు కొన్ని ఆహార పదార్థాలు పడవని తెలిసినా తీసుకుంటూ ఉంటారు. ఫలితంగా కడుపు ఉబ్బినట్లుగా ఉంటుంది. ఎందరు ఏం తినకపోయినా గ్యాస్‌ సమస్యలతో బాధపడుతుంటారు. వివిధ రకాల ఆహారాలు తినడం వల్ల ఎసిడిటీ, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు వస్తుంటాయి. ఒకవైపు, కొన్ని పదార్థాలు తినడం వల్ల కడుపు నొప్పి వస్తుంటుంది. జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను కొన్ని వంటింటి చిట్కాలతో నయం చేసుకోవచ్చు. ఈ చిట్కాల వల్ల మీ ఆరోగ్యం కుదుట పడడమే కాదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ దరిచేరవు.

రాజేంద్రనగర్ లో లారీ బీభత్సం
రోడ్డు ప్రమాదాలు నెత్తుడి చారికలు పారిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. హైదర్ గూడ చౌరస్తా వద్ద పాద చారులపైకి దూసుకెళ్లిందో లారీ…బస్సు కోసం వేచిచూస్తున్న భార్యా భర్తలను ఢీకొట్టిన లారీ. లారీ చక్రాల కింద నలిగిపోయిన భర్త. అక్కడక్కడే ప్రాణాలు వదిలారు. లారీ కింద నుండి భార్యను లాగేసిన స్థానికులు. అయితే పెను ప్రమాదం తప్పింది. రోడ్డు ప్రమాదంతో ఉలిక్కి పడ్డారు రోడ్డుపై ఉన్న ప్రజలు. 100 కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు స్థానికులు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణం అంటున్నారు పోలీసులు. ఆర్టీసీ బస్సు, లారీ ఓవర్ టేక్ చేయడంతో పాదచారుల పైకి లారీ దూసుకొని వచ్చిందని చెబుతున్నారు స్థానికులు. భార్య కళ్ల ముందే కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు విడిచింది భర్త. తీవ్రంగా గాయపడ్డ భార్యను ఆస్పత్రికి తరలించారు. కర్ణాటక ప్రాంతానికి చెందిన రత్తయ్య, మంజుల. పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్ కు వచ్చారు. లారీ రూపంలో దూసుకొని వచ్చింది ప్రమాదం. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు.

బీజేపీకి షాక్.. త్వరలో కాంగ్రెస్ లోకి వరుణ్ గాంధీ?

ఇందిరాగాంధీ మనుమడు, మేనకా- సంజయ్ గాంధీల వారసుడు వరుణ్ గాంధీ బీజేపీని వీడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావాలనే డిమాండ్లు జోరుగా వస్తున్నాయి. కాంగ్రెస్ మద్దతుదారులు, కింది స్థాయి నేతలు తరచుగా కాంగ్రెస్ అధిష్టానాన్ని ఈ విషయమై పదే పదే కోరుతున్నారు. గత కొంతకాలంగా అడపాదడపా సొంత పార్టీ బీజేపీ పైనే ఆయన విమర్శలు ఎక్కుపెట్టడం, మోదీ ప్రభుత్వ విధానాలను విమర్శించడమే దీనికి సంకేతంగా భావిస్తున్నారు. తాను కాంగ్రెస్ కు వ్యతిరేకం కాదని మన రాజకీయాల లక్ష్యం ప్రజలను కలిపి ఉంచేలా ఉండాలేగానీ, అంతర్గత యుద్ధాన్ని ప్రేరేపించేలా ఉండకూడదు. మతం, కులం పేరిట ఓట్లు అడుగుతున్నవారిని.. ఉపాధి, విద్య, ఆరోగ్యం వంటి తీవ్రమైన అంశాలపై మీరు ఏం చేస్తున్నారని ప్రజలు అడగాల్సి ఉందంటూ తన నియోజకవర్గ(ఫిలిబిత్‌) ప్రజలను ఉద్దేశించి వరుణ్‌గాంధీ వ్యాఖ్యానించారు. ఇవి సొంత పార్టీని ఉద్దేశించి మాట్లాడినట్లు ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు వరుణ్ గాంధీని కాంగ్రెస్ లోకి ఆహ్వానించాలంటూ డిమాండ్ చేసారు. వరుణ్ గాంధీ ప్రస్తుతం యూపీలోని సుల్తాన్ పూర్ ఎంపీగా ఉన్నారు. ఆ రాష్ట్రంలో కుదేలైన కాంగ్రెస్ కు పునర్వైభవం దక్కాలంటే వరుణ్ కు కాంగ్రెస్ పగ్గాలు అప్పగించాలని ఉమేష్ పండిట్ అనే యూపీ నేత కోరారు.

తెలంగాణపై చలి పులి పంజా.. సంగారెడ్డి జిల్లాలో అత్యల్పం

చలి పులి పంజా విసురుతోంది. తెలంగాణ వణికిపోతోంది. ఉష్ణోగ్రతలు అంతకంతకూ తగ్గుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సింగిల్ డిజిట్‌కు పడిపోతోందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. చలికి జాగ్రత్తగా ఉండాలని, స్వెట్టర్లు, మఫ్లర్లు వాడాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాని వణికిస్తున్న చలికి జనం ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు. రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు సంగారెడ్డి జిల్లాలో నమోదైంది. సంగారెడ్డి జిల్లా కోహిర్ లో 4.6 డిగ్రీలు, నల్లవల్లిలో 5.7 డిగ్రీలు నమోదైంది. న్యాల్ కల్ లో 5.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. సిద్దిపేట జిల్లా అంగడి కిష్టాపూర్ లో 7.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్ జిల్లా శివ్వంపేట, నర్సపూర్ లలో 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయింది. ఆదిలాబాద్ జిల్లాలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జనవరి 11 వరకు రాష్ట్రంలో చలి కొనసాగుతుందని ఐఎండీ హైదరాబాద్ శాఖ తెలిపింది. జనవరి 9,10 తేదీల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా నమోదయ్యే అవకాశముందని తెలిపింది. ఈ మేరకు ఉత్తరాంధ్రలోని ఆదిలాబాద్, నిర్మల్, కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి జిల్లా పై చలి పంజా విసిరింది. జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చాలా చోట్ల సింగిల్ డిజిట్ కు కనిష్ట ఉష్ణోగ్రత లు పడిపోయాయి. కొమురం భీం జిల్లా లో 4.8గా నమోదయింది. ఆదిలాబాద్ జిల్లాలో 5.6 డిగ్రీలు, నిర్మల్ జిల్లా 6.8 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా లో 8.5గా కనిష్ట ఉష్ణోగ్రత లు నమోదయ్యాయి.

యూపీలో ఘోరం.. మాజీ ఎమ్మెల్యే మనుమడి దారుణహత్య

ఉత్తరప్రదేశ్ లో ఘోరం జరిగింది. కోపగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో మాజీ ఎమ్మెల్యే దివంగత కేదార్ సింగ్ మనవడిని దుండగులు కొట్టి చంపారు. ఈ విషయాన్ని పోలీసులు ఆదివారం తెలిపారు. కేదార్‌ సింగ్‌ మనవడు హిమాన్షు సింగ్‌ మను జిల్లాలోని మహౌర్‌ గ్రామంలో ఓ పంచాయితీని పరిష్కరించడానికి వెళ్లాడు. అయితే అక్కడ చిన్న పాటి గొడవ జరిగింది. చిలికిచిలికి అదికాస్తా పెద్దదయింది. దీంతో వైరి వర్గానికి చెందిన ఏడు నుంచి ఎనిమిది మంది హిమాన్షుపై కర్రలతో విచక్షణా రహితంగా దాడిచేశారు. అనంతరం అక్కడి నుంచి తీసుకెళ్లి సమీపంలోని మరో గ్రామంలో వదిలేశారు. గుర్తించిన స్థానికులు అతడిని దవాఖానకు తీసుకెళ్లారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ మరణించాడని పోలీసులు తెలిపారు. పాత క్షక్షలతోనే ఈ దాడి జరిగిందని మను ఎస్పీ త్రిభువన్‌ త్రిపాఠి చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేశామని, దుండగుల కోసం గాలిస్తున్నామన్నారు.