NTV Telugu Site icon

Top Headlines @9 PM: టాప్ న్యూస్

Top Headlines

Top Headlines

గుజరాత్ లో బీజేపీ… హిమాచల్ లో హోరాహోరీ పోటీ

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో మళ్లీ బీజేపీని తిరుగులేని స్థానంలో నిలబెట్టారు అక్కడి ప్రజలు. మళ్లీ అధికారం బీజేపీ కైవసం చేసుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. మొత్తం 182 స్థానాలు ఉన్న గుజరాత్ అసెంబ్లీలో 100కు పైగా స్థానాలు గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఇక హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కూడా బీజేపీనే గెలుస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచానా వేస్తున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలకు రెఫరెండంగా భావిస్తున్న ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ వేవ్ స్పష్టంగా కనిపిస్తోంది. గుజరాత్ రాష్ట్రంలో గత రెండు దశాబ్ధాలుగా బీజేపీ అధికారంలో ఉంది. ఇక హిమాచల్ ప్రదేశ్ లో వరసగా రెండోసారి కాషాయపార్టీ అధికారం చేజిక్కించుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టంగా తెలుపుతున్నాయి.
గుజరాత్ లో మళ్ళీ బీజేపీదే హవా..
గుజరాత్ లో బీజేపీకి 130కి పైగా స్థానాలు-ఎగ్జిట్ పోల్స్
జన్ కీ బాత్ సర్వేలో బీజేపీకి 117-140, కాంగ్రెస్ 34-51, ఆప్ -6-13 స్థానాలు
బీజేపీ-125-143, కాంగ్రెస్ 30-48, ఆప్ 3-7: పీపుల్స్ పల్స్ సర్వే
న్యూస్ ఎక్స్: బీజేపీకి 117-140, కాంగ్రెస్ 34-51, ఆప్ 6-13
హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటాపోటీ
పీపుల్స్ పల్స్: బీజేపీ-29-39, కాంగ్రెస్ 27-37, ఇతరులు 2-5

ఢిల్లీ మునిసిపల్ పీఠం ఆమ్ ఆద్మీ పార్టీదే

ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో చీపురు పార్టీ స్వీప్ చేయబోతోంది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో ఆమ్ ఆద్మీ పార్టీ మెజారిటీ సీట్లను కైవసం చేసుకుంటుందని ఆజ్ తక్, టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. డిసెంబర్ 4న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లోని 250 వార్డులకు ఎన్నికలు జరిగాయి. డిసెంబర్ 7న ఫలితాలు వెల్లడి కానున్నాయి. డీలిమిటేషన్ తర్వాత తొలిసారిగా ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 50.47 శాతం ఓటింగ్ నమోదు అయింది. మొత్తం 250 వార్డుల్లో 1349 మంది పోటీ చేశారు. ఈ నేపథ్యంలో ఆజ్ తక్ ఎగ్జిట్ పోల్స్ లో ఆప్ కి ఎక్కువ సీట్లు వస్తున్నట్లు తేలింది. బీజేపీకి 35 శాతం, ఆప్ కి 43 శాతం, కాంగ్రెస్ పార్టీకి 10 శాతం ఓట్లు రానున్నట్లు వెల్లడించింది. మొత్తం 250 వార్డుల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి (ఆప్) 149-171 స్థానాలు గెలుచుకుంటుందని..బీజేపీ 69-91 స్థానాలు, కాంగ్రెస్ 03-07, ఇతరులు 05-09 స్థానాలను గెలుచుకుంటుందని ఆజ్ తక్ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఇక టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ ప్రకారం ఆప్ 146-156 స్థానాల్లో గెలుపొందితే.. బీజేపీ 84-94 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేసింది.

వ్యవసాయ, పౌరసరఫరాలశాఖలపై జగన్ రివ్యూ
ఖరీప్‌ ధాన్యం సేకరణ, ఇతర పంటలపై వ్యవసాయ, పౌరసరఫరాలశాఖలతో క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష చేపట్టారు. మిల్లర్ల ప్రమేయంలేకుండా సేకరిస్తున్న కొత్త విధానం అమలు తీరును సమగ్రంగా సమీక్షించారు సీఎం. రైతులకు కనీస మద్దతు ధర కన్నా.. ఒక్కపైసా తగ్గకుండా రేటు రావాలనే ఉద్దేశంతో కొత్త విధానానికి శ్రీకారం చుట్టాం అన్నారు జగన్. దీనికోసం ధాన్యం సేకరణలో తొలిసారిగా మిల్లర్ల ప్రమేయాన్ని తీసివేశాం అన్నారు. ఈ కొత్తవిధానం ఎలా అమలవుతున్నదీ గమనించుకుంటూ ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను ఎక్కడికక్కడే పరిష్కరించేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. చేయాల్సిన ధాన్యంసేకరణపై ముందస్తు అంచనాలు వేసుకుని, ఆ మేరకు ముందస్తుగానే గోనెసంచులు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. వెంటనే దీనిపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. రవాణా, లేబర్‌ ఖర్చుల రీయింబర్స్‌మెంట్‌లో జవాబుదారీతనం ఉండాలి. అత్యంత పారదర్శకంగా ఈ చెల్లింపులు ఉండాలి. ఈ విధానాన్ని ఒకసారి పరిశీలించి.. రైతులకు మేలు చేసేలా మరింత మెరుగ్గా దీన్ని తీర్చిదిద్దాలని ఆదేశించారు. రవాణా ఖర్చులు, గన్నీ బ్యాగుల ఖర్చులను ప్రభుత్వం చెల్లిస్తోందన్న విషయం రైతులకు తెలియాలన్నారు.

రాజకీయకక్షతోనే మాపై ఐటీ, ఈడీ దాడులు 

తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలు, ఈడీ విచారణ, రాబోయే ఎన్నికలు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న పరిస్థితులపై మంత్రి గంగుల కమలాకర్ తనదైన రీతిలో స్పందించారు. ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ లో అనేక అంశాలను ఆయన ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రంలో ఈడీ, సీబీఐ దాడులపై ఆయన మాట్లాడారు. తమ కుటుంబం నలభై యాభై ఏళ్ళ నుంచి కాంట్రాక్టులు చేసుకుంటున్నాం అన్నారు. చట్టానికి మేం సహకరించామన్నారు. గ్రానైట్ అసోసియేషన్ స్పందిస్తుంది. మేం దాచేది లేదు. చెక్ పోస్టులు వుంటాయి. బీజేపీ నేతలకే ఎక్కువ గ్రానైట్ కంపెనీలు వున్నాయన్నారు. గ్రానైట్ లో అనేక పార్టీలు వున్నాయన్నారు. గ్రానైట్ మాఫియా విషయంలో మాపై ఆరోపణలు వచ్చాయన్నారు. పెట్టుబడులపై ఈడీ, ఐటీ దాడుల ప్రభావం వుంటుందన్నారు. కాపు సమావేశంలో నకిలీ ఐపీఎస్ అధికారి వ్యవహారం వివాదాస్పదం అయింది. అధికారులు నన్ను గంటల కొద్దీ విచారించారన్నారు. నేను తప్పుచేయలేదు కాబట్టి భయపడలేదు. నకిలీ ఐపీఎస్ అధికారి అంటూ కులసంఘాన్ని మోసం చేశాడని బాధకలిగిందన్నారు.

చైనాలో కాలుష్యంతో గర్భంలోనే 64వేలమంది బలి
చైనాలో కాలుష్యం తీవ్రత అక్కడి ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ముఖ్యంగా పిల్లల పుట్టుకపై ప్రభావం కనిపిస్తోంది. తాజా నివేదిక ప్రకారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గర్భంలోనే పిండం మరణించే దేశాల్లో చైనా నాలుగో స్థానంలో ఉంది. ప్రతీ ఏడాది అక్కడి 64,000 మంది శిశువులు గర్భంలోనే మరణిస్తున్నారు. దీనంతటికి చైనా వ్యాప్తంగా ఉన్న కాలుష్యమే కారణం అని తెలిసింది. రాజధాని బీజింగ్ లో గత పదేళ్ల నుంచి కాలుష్యం తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది చైనా ప్రభుత్వం. అయినప్పటికీ శిశువుల మరణాలు సంభవిస్తున్నాయిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక వెల్లడించింది. 137 దేశాల్లో జరిగిన అధ్యయనం ప్రకారం 2015లో ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలలో 40 శాతం శిలాజ ఇంధనాల దహనం వల్ల గాలిలో పార్టిక్యులర్ మ్యాటర్ (పీఎం) 2.5 పెరగడానికి కారణం అయింది. నేచర్ కమ్యూనికేషన్స్ ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. గాలిలో కాలుష్యం పెరగడం వల్ల గర్భంలోనే పిండం మరణించే సంఖ్యలో చైనా 4వ స్థానంలో ఉంది. గాలి నాణ్యత మెరుగుపరచడం వల్ల మరణాల సంఖ్యను తగ్గించవచ్చని పెకింగ్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు.

నూజివీడు పోలీస్ స్టేషన్ పై దాడి.. ఉద్రిక్తత
ఏలూరు జిల్లా నూజివీడు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీస్ స్టేషన్ పై దాడికి దిగారు ఫిర్యాదు దారులు. బాధితుల దాడితో తలుపులు మూసేశారు పోలీసులు. పెళ్ళైన మూడు నెలలకే వరకట్న వేధింపులతో పోలీసులను ఆశ్రయించింది ఒక మహిళ. అదనపు కట్నం కోసం భార్య ఐశ్వర్యను తీవ్ర వేధింపులకు గురి చేస్తున్న భర్త రాజ్ కుమార్ పై ఫిర్యాదు చేశారు. అయితే, నిన్నటి నుండి ఐశ్వర్య కనిపించకపోవటంతో పోలీసులని ఆశ్రయించారు ఆమె తల్లితండ్రులు. దీంతో భర్త రాజ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రాజ్ కుమార్ అరెస్ట్ వార్త తెలిసి పోలీస్ స్టేషన్ వద్ద ఇరు వర్గాలు గొడవకు దిగాయి. పోలీసులు పట్టించుకోక పోవటం వల్లే ఐశ్వర్య కనిపించటం లేదని ఆమె తల్లి తండ్రులు ఒక పక్క ఆందోళనకు దిగారు. ఈ వ్యవహారంలో రాజ్ కుమార్ తప్పేం లేదని వారి కుటుంబ సభ్యులు మరో పక్క పోలీసు స్టేషన్ పై దాడికి తెగబడ్డారు. ఆగ్రహంతో వున్న మహిళలకు , పోలీసులకు మధ్య తోపులాటతో స్టేషన్ గేట్లు మూసేశారు సిఐ , ఎస్సైలు. తమ కూతురు జాడ చెప్పాలంటూ స్టేషన్ ముందు బైఠాయించారు ఐశ్యర్య తల్లిదండ్రులు, బంధువులు, గ్రామ ప్రజలు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.

హైదరాబాద్‎లో ల్యాండైన ఎయిర్ బస్ బెలూగా

ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో ఎయిర్ క్రాఫ్ట్‌లో ఒకటైన ఎయిర్ బస్ బెలూగా హైదరాబాదులో ల్యాండైంది. తిమింగలం ఆకారంలో ఉన్న ఎయిర్ బస్ బెలూగా విమానం కోల్‌కతాలోని జాయ్ సిటీ విమానాశ్రయంలో ఇటీవల ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఆ తిమింగలం ఆకారంలోని ఎయిర్‌బస్ బెలూగా మన హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయింది. ఈ విమానానికి హైదరాబాద్ ఎయిర్ పోర్టు వర్గాలు స్వాగతం పలికాయి. ఎయిర్ బస్ బెలూగా గత రాత్రి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. ఈ భారీ విమానం ల్యాండింగ్, పార్కింగ్ కోసం ఎయిర్ పోర్టు అథారిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ విమానం రాత్రి 7.20 నిమిషాల వరకు హైదరాబాదులోనే ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద విమానాల్లో ఒకటైనా దీనిని సరుకు రవాణా కోసం ఉపయోగిస్తారు. 56 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పు ఉన్న ఈ విమానం ఫోటోలను తీసిన పలువురు ప్రయాణికులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. భారీతనానికి మారుపేరుగా నిలిచే ఏఎన్ ఆంటోనోవ్ కార్గో విమానం కూడా 2016లో ఇక్కడి విమానాశ్రయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ల్యాండైంది.

శభాష్.. చేతులు లేకున్నా.. కాళ్ళో ఓటేశాడు..

ఓట్లొచ్చాయంటే చాలు నాయకుల హడావుడి అంతాఇంతా కాదు.. అప్పటి వరకు మర్చిపోయిన ప్రజలు ఠక్కున గుర్తుకు వస్తారు.. వాళ్లు అడిగిందే ఆలస్యం.. ఏది కావాలంటే అది తథాస్తు అన్నట్లు హామీల వరాలు గుప్పిస్తారు. మద్యం, డబ్బులు, గిఫ్టులు.. ఇలా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు సకల ప్రయత్నాలు చేస్తారు. కానీ ఓటరు తనకు ఎవరు బాగా సేవ చేస్తారని తలుస్తారో వారికే ఓటు వేస్తారు.. ఐదేళ్ల కొకసారి వచ్చే ఎన్నికల్లో సరైన వ్యక్తిని ఎన్నుకోకపోతే అభివృద్ధి కుంటుపడుతుంది. అందుకే తప్పకుండా ఓటు వేయాలి.. రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కును తప్పకుండా వినియోగించుకోవాలి. ఎన్నికల సమయంలో చాలా మంది తమ హక్కును వినియోగించుకోరు. కొందరైతే ఆఫీసుకు సెలవిస్తే అదేదో హాలిడే అన్నట్లు ఫీలవుతారు. ఇంట్లోనే ఉండిపోవడమో, మరేదైనా పనిలో నిమగ్నమవుతారు. కానీ పోలింగ్‌ బూత్‌కు వెళ్లి ఓటు మాత్రం వేయరు. అలాంటి వాళ్లకు ఓటు విలువ తెలిసి కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలంటే బద్ధకం. కానీ, ఇవాళ గుజరాత్‌లో రెండో దశ అసెంబ్లీ ఎన్నికల్లో అంకిత్‌ సోని అనే వ్యక్తి తనకు రెండు చేతులు లేకపోయినా కాలితో ఓటువేసి ఔరా అనిపించాడు. ఒంట్లో అన్ని అవయవాలు మంచిగున్నా ఓటు వేసేందుకు బద్దకించేవాళ్లకు చెంపమీద కొట్టినట్లు రాజ్యాంగం తనకు కల్పించిన హక్కును వినియోగించుకున్నాడు. 20 ఏండ్ల క్రితం తను ఓ ప్రమాదంలో రెండు చేతులు పోగొట్టుకున్నానని అంకిత్‌ సోని తెలిపాడు. అయినా గత ఇరవై ఏళ్లలో ఏనాడూ ఓటు వేయకుండా ఉండలేదన్నాడు. చేతులు లేకపోయినా కాలి వేళ్లతో తాను ఓటు వేస్తానని చెప్పాడు.