NTV Telugu Site icon

Top Headlines @9 PM: టాప్ న్యూస్

Top Headlines

Top Headlines

టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా జెలన్ స్కీ

Time Person Of The Yaar

అత్యంత శక్తివంతమైన రష్యాను ధిక్కరించి యుద్ధంలో ఉక్రెయిన్ దేశాన్ని రష్యాకు ధీటుగా నిలబెట్టినందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలన్ స్కీ ఈ ఏడాది ‘‘టైమ్స్ పర్స్ ఆఫ్ ది ఇయర్’’గా ఎంపికయ్యారు. రష్యా యుద్ధంతో తన దేశాన్ని ఎదురొడ్డి నిలిచేలా చేసిన జెలన్ స్కీ ధైర్యాన్ని టైమ్స్ మ్యాగజీన్ ప్రశంసించింది. ధిక్కరణ, ప్రజాస్వామ్యానికి చిహ్నంగా ఎదిగారని టైమ్స్ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎడ్వర్డ్ ఫెల్సెంతల్ అన్నారు. స్వేచ్ఛను రక్షించడానికి ప్రజల్ని ఉత్సాహపరిచడం , ప్రజాస్వామ్యం, శాంతి గురించి ప్రపంచానికి తెలియజేసినందుకు టైమ్స్ 2022కు గానూ ఈ పురస్కారాన్ని ప్రకటించింది. రష్యా యుద్ధ సమయంలో తమ దేశపౌరులను ధృడసంకల్పంగా నిలిచేలా చేయడంతో పాటు తన ప్రసంగాలతో ప్రజలను, ఆ దేశ సైన్యాన్ని ఉత్తేజపరిచారు. దీంతో ప్రజలతో పాటు ఉక్రెయన్ సైన్యం రష్యా బలగాలకు ఎదురొడ్డి నిలిచారు. రష్యా యుద్ధం తీవ్రం అవుతున్న సమయంలో ఉక్రెయిన్ విడిచిరావాల్సిందిగా అమెరికా జెలన్ స్కీని కోరినా.. అందుకు తిరస్కరించి దేశంలో ప్రజలతోనే ఉన్నారు. దేశానికి, సైన్యానికి కావాల్సిన సహాయాన్ని వెస్ట్రన్ దేశాల నుంచి సంపాదించడంలో జెలన్ స్కీ సఫలం అయ్యాడు.

సింగరేణి ప్రైవేటీకరణపై కేంద్రప్రభుత్వం క్లారిటీ


సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణపై కేంద్రప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీలు అడిగిన ప్రశ్నకు బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సమాధానం ఇచ్చారు. బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని కేంద్రం స్పష్టం చేసింది. బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం కేంద్రానికి లేదని తెలిపారు. సింగరేణిలో 51 శాతం తెలంగాణ ప్రభుత్వానికే వాటా ఉందని.. అలాంటప్పుడు కేంద్రం ఎలా జోక్యం చేసుకుంటుందని ప్రశ్నించారు. ప్రైవేటీకరణలో తెలంగాణ నేతలు ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేశారు. బొగ్గు కుంభకోణంలో ఇరుకున్న నేతలే వేలాన్ని వ్యతిరేకిస్తున్నారు. వేలంలో వచ్చిన డబ్బంతా రాష్ట్రానికే దక్కుతుందని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. అవినీతికి చోటు లేకుండా పూర్తి పారదర్శకంగా వేలం నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. కోల్ బ్లాక్స్ ని ప్రైవేటు కంపెనీలకు కేటాయించడంపై తెలంగాణ ఎంపీలు ప్రశ్నించారు. అయితే ఇది వేలం ప్రకారం జరుగుతోందని..దీంట్లో ఎవరైనా పాల్గొనవచ్చని కేంద్రమంత్రి అన్నారు. చత్తీస్ గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కూడా కోల్ బ్లాక్స్ వేలం కొనసాగుతోందని.. ఆ రాష్ట్రాలు, కేంద్రానికి సహకరిస్తున్నాయని..తెలంగాణ సమస్య ఏంటని ప్రశ్నించారు. వేలం ద్వారా వచ్చిన ఆదాయం మొత్తం రాష్ట్రానికే వెళ్తుందని ఆయన అన్నారు.

తెలంగాణ గడ్డపై కాషాయజెండా ఎగరేస్తా

తెలంగాణ గడ్డపై కాషాయ జెండాను రెపరెపలాడించేదాకా తన పోరాటాన్ని కొనసాగిస్తానని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తేల్చి చెప్పారు. ఖానాపూర్ ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా మాట్లాడిన ఆయన.. సీఎం కేసీఆర్ యుద్ధం ప్రారంభించారని, తాము యుద్ధానికి కూడా సిద్ధమేనని అన్నారు. కేసులు, రౌడీ షీట్లు, దాడులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. బీజేపీని బదనాం చేసేందుకు కేసీఆర్ కుట్రలను పన్నుతున్నారని ఆరోపణలు చేశారు. దేశం కోసం, ధర్మం కోసం, సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు కష్టపడి పని చేస్తున్న బీఎల్ సంతోష్‌పై తప్పుడు కేసులు బనాయిస్తున్నారన్నారు. ఒక్క పైసా దొరక్కపోయినా.. అవినీతి కేసు ఎలా పెడతారంటూ ఏసీబీ కోర్టు చెంప ఛెళ్లుమనిపించినా కేసీఆర్‌కు సిగ్గు రాలేదని వ్యాఖ్యానించారు. కేసీఆర్ బిడ్డ దొంగ సారా దందా చేసిందని.. ఈ కేసులో అడ్డంగా బుక్కైన ఆమెను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తే, తెలంగాణ సెంటిమెంట్ రగిలించాలని కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని బండి సంజయ్ ఆరోపణలు చేశారు. కేసీఆర్ బిడ్డ చేసిన పనికి నేడు తెలంగాణ తలదించుకునే దుస్థితి వచ్చిందని.. కేసీఆర్ కుటుంబాన్ని దేశమంతా అసహ్యించుకుంటోందని పేర్కొన్నారు. ప్రజా సంగ్రామ యాత్రతో కేసీఆర్‌కు నిద్ర పట్టడం లేదన్నారు.

ఆప్-బీజేపీ మధ్య ట్వీట్ వార్.బీజేపీ జెండాలు ఊడ్చేస్తున్న ఆప్ ట్వీట్
బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లు ఎంతో కీలకంగా భావించిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(డీఎంసీ) ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. ఆప్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ని సొంతం చేసుకుంది. 15 ఏళ్లుగా ఢిల్లీ కార్పొరేషన్ ను ఏలుతున్న బీజేపీ ఆధిపత్యానికి గండి కొట్టింది చీపురు పార్టీ. మొత్తం 250 వార్డుల్లో ఆప్ 134 స్థానాలను కైవసం చేసుకుంటే, బీజేపీ 104 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ కేవలం 9 స్థానాల్లో విజయం సాధించింది. ఆప్ సునాయాసంగా మ్యాజిక్ ఫిగర్ 126 స్థానాలను క్రాస్ చేసి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ఢిల్లీ అసెంబ్లీ, మున్సిపల్ కార్పొరేషన్లలో ఇక ఆమ్ ఆద్మీ పార్టీనే అధికారంలో ఉండనుంది. ఇదిలా ఉంటే బీజేపీ, ఆప్ ల మధ్య వార్ మొదలైంది. చిన్న పార్టీ అయిన ఆప్, ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అయిన బీజేపీని ఓడించిందని ఆ పార్టీ నేత రాఘవ్ చద్ధా సెటైర్లు వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ రోడ్డుపై చెత్త ఊడుస్తూ.. అక్కడే పడి ఉన్న బీజేపీ జెండాను కూడా ఊడవడాన్ని ఆప్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఢిల్లీ ప్రజలు చెత్త(బీజేపీ)ని ఊడ్చేశారంటూ కామెంట్ చేస్తూ ఈ వీడియోను పోస్ట్ చేసింది.

హత్యకేసులో సౌదీ యువరాజుకి ఊరట.. కేసు కొట్టేసిన యూఎస్ కోర్టు
యుఎస్ ఆధారిత జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి హత్య కేసులో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్‌పై దావా వేసిన యుఎస్ ఫెడరల్ న్యాయమూర్తి మంగళవారం ఈ కేసులో యువరాజుకు చట్టబద్ధంగా రోగనిరోధక శక్తి ఉన్నారని బిడెన్ పరిపాలన పట్టుబట్టడంతో కొట్టివేసింది.కొలంబియా జిల్లా US జిల్లా న్యాయమూర్తి జాన్ D. బేట్స్ “ఖషోగ్గి హత్యలో అతని ప్రమేయంపై విశ్వసనీయమైన ఆరోపణలు” అని బేట్స్ పేర్కొన్నప్పటికీ, ప్రిన్స్ మొహమ్మద్‌ను వ్యాజ్యం నుండి రక్షించడానికి US ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. సౌదీ అధికారుల బృందం 2018లో ఇస్తాంబుల్‌లోని సౌదీ కాన్సులేట్‌లో ఖషోగ్గిని హత్య చేసింది. ది వాషింగ్టన్ పోస్ట్‌కు కాలమిస్ట్ అయిన ఖషోగ్గి, సౌదీ అరేబియా యొక్క వాస్తవ పాలకుడు ప్రిన్స్ మహ్మద్ యొక్క కఠినమైన మార్గాలను విమర్శిస్తూ రాశారు. ఖషోగ్గిపై ఆపరేషన్‌కు సౌదీ యువరాజు ఆదేశించినట్లు అమెరికా నిఘా వర్గాలు నిర్ధారించాయి. ఈ హత్య బిడెన్ పరిపాలన మరియు సౌదీ అరేబియా మధ్య చీలికను తెరిచింది, ఉక్రెయిన్ యుద్ధంతో దెబ్బతిన్న ప్రపంచ మార్కెట్లో చమురు ఉత్పత్తి కోతలను రద్దు చేయమని యుఎస్ విఫలమైనందున, పరిపాలన మూసివేయడానికి ఇటీవలి నెలల్లో ప్రయత్నించింది.

యుఎస్ హ్యాండ్యూమ్ రీసెర్చ్‌ స్కాలర్‌ తో కేటీఆర్ భేటీ

తెలంగాణ చేనేత కళాఖండాలకు అమెరికాకి చెందిన రీసెర్చ్ స్కాలర్లు అబ్బురపడ్డారు. తెలంగాణ మంత్రి కే.తారకరామారావుతో అమెరికన్ హ్యాండ్లూమ్ రీసెర్చ్ స్కాలర్ సమావేశం అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చేనేత ఉత్పత్తులు, చేనేత కళలపై సుదీర్ఘ పరిశోధనలో భాగంగా తెలంగాణలో పర్యటిస్తున్న కైరా మంత్రి కేటీఆర్ ని కలిశారు. తెలంగాణ చేనేత క్లస్టర్లను సందర్శించిన కైరా వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. ఇక్కడి నేతన్నల కళా నైపుణ్యం వారి నిబద్ధత పట్ల అబ్బురపడిన కైరా.. వివరాలు అడిగి మంత్రి ద్వారా తెలుసుకున్నారు. తన అధ్యయనంలో భాగంగా గుర్తించిన పలు అంశాలను మంత్రి కేటీఆర్ తో పంచుకున్నారు కైరా.ఇంతటి కళా నైపుణ్యానికి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన డిమాండ్ ఉంటుందని తెలిపారు కైరా. ఈ సందర్భంగా తెలంగాణ టెక్స్ టైల్ రంగం, నేతన్నల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కైరాకు వివరించారు మంత్రి కేటీఆర్.

టీటీడీ విజిలెన్స్ ఉచ్చులో మరో అక్రమార్కుడు

ఏడుకొండలకు రోజూ వేలాదిమంది భక్తులు పోటెత్తుతుంటారు. తిరుమలలో స్వామి దర్శనం కోసం భక్తులు అక్రమార్కులను ఆశ్రయిస్తుంటారు. టీటీడీ విజిలెలెన్స్ వలలో మరో అక్రమార్కుడు చిక్కడం కలకలం రేపుతోంది. సిఫార్సు లేఖలపై పొందే విఐపి దర్శనాలను పెద్ద మొత్తంలో విక్రయిస్తూ పట్టుబడ్డాడు ఎండోమెంట్ సెల్ ఉద్యోగి శ్రీహరి. గతంలో మాజీ టీటీడీ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ కార్యాలయంలో విధులు నిర్వర్తించాడు శ్రీహరి. అక్రమాలకు అలవాటుపడి…..ప్రధానమైన పోస్టులోనే ఉద్యోగం వుండేలా పైరవీలు సాగించాడు శ్రీహరి. నందిగామ ఎమ్మెల్యే సిఫార్సు లేఖలపై పొందిన 6 వీఐపీ బ్రేక్ దర్శన టిక్కెట్లను 18 వేల రూపాయలకు విక్రయించాడు టీటీడీ ఉద్యోగి శ్రీహరి. దీంతో రంగంలోకి దిగారు విజిలెన్స్ అధికారులు. అక్రమాలకు పాల్పడిన శ్రీహరిని అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు విజిలెన్స్ అధికారులు. నకిలి సుప్రభాత సేవా టిక్కెట్లతో దర్శనానికి వెళుతున్న ఘటనలు ఎక్కువయిపోయాయి. తాజాగా ఇలాంటి ఘటనలు గుర్తించింది విజిలెన్స్. నిన్న 21 మంది భక్తులు నకిలీ టికెట్ల పై దర్శనానికి వెళుతుండగా గుర్తించింది విజిలెన్స్. ఇవాళ ఇద్దరు భక్తులు కూడా నకిలీ టిక్కెట్లు పై సుప్రభాత సేవకు వెళుతుండగా గుర్తించిన విజిలెన్స్ దీనిపై ఆరా తీస్తోంది. సేలం కేంద్రంగా నకీలి టిక్కెట్లు విక్రయిస్తున్నట్లు గుర్తించారు విజిలెన్స్ అధికారులు. దర్యాప్తు కోసం సేలంకు ప్రత్యేక బృందాన్ని పంపించింది టీటీడీ విజిలెన్స్.

కేజీఎఫ్ తాత ఇకలేడు..కన్నడ చిత్రసీమలో విషాదం

కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. కెజిఎఫ్ చిత్రంలో నటించి మెప్పించిన నటుడు కృష్ణ. జి. రావు మృతి చెందాడు. గత కొన్నిరోజులుగా వృద్ధాప్య సమస్యలతో పోరాడుతున్న ఆయన కొద్దిసేపటి క్రితం మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కృష్ణ జి. రావు కెజిఎఫ్ కు ముందు పలు సినిమాల్లో నటించినా అంత గుర్తింపు రాలేదు. కెజిఎఫ్ సినిమాను మలుపు తిప్పే పాత్రలో ఆయన నటించాడు. కెజిఎఫ్ ఇంటర్వల్ లో రాఖీ భాయ్ మనసు మారడానికి కారణం ఈ తాతనే. అంధుడు అయిన తాతను విలన్స్ చంపడానికి ప్రయత్నిస్తుండగా అతడిని కాపాడడానికి రాఖీ భాయ్ రంగంలోకి దిగి వారిని చితక్కొట్టి తాతను కాపాడతాడు. ఇక కెజిఎఫ్ 2 లోనూ రాఖీ భాయ్ కు ఎలివేషన్స్ ఇచ్చేది ఈ తాతనే. ఈ సినిమా ద్వారా ఈయనకు మంచి గుర్తింపు లభించింది. ఎక్కడ చూసినా కెజిఎఫ్ తాత అని గుర్తుపడుతున్నారని అప్పట్లో చెప్పుకొచ్చాడు. కృష్ణ. జి.రావు మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు