విద్యాశాఖలో అన్ని ఖాళీలు భర్తీ చేస్తాం
విద్యాశాఖలో అన్ని ఖాళీలు భర్తీ చేస్తాం అన్నారు మంత్రి హరీష్ రావు. ప్రమోషన్లు, బదిలీల విషయంలో సీఎం సానుకూలంగా ఉన్నారు. మీ సమస్యలు పరిష్కరించేందుకు మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం.. మా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఉద్యోగుల విషయంలో ఫ్రెండ్లీ గవర్నమెంట్ ప్రభుత్వం. దేశంలో అతి ఎక్కువ జీతాలు పొందుతున్న ఉద్యోగులు తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు అన్నారు హరీష్ రావు. మొదటి సారి 43 శాతం ఫిట్ మెంట్ ఇవ్వగా, 11వ వేతన సవరణ ద్వారా 30 శాతం ఫిట్ మెంట్ ప్రకటించాం అన్నారు. మన పక్కన ఉన్న ఏపిలో కంటే ఇది ఎక్కువ. ఉపాధ్యాయులకు ఎలాంటి సమస్య వచ్చినా ఇప్పటివరకు మా ప్రభుత్వమే పరిష్కరించింది. ఇకపై కూడా పరిష్కరించేది మా ప్రభుత్వమే. కరోనా పరిస్థితులు, కేంద్రం సహాయ నిరాకరణ వంటి కారణాల వల్ల కొంత ఆర్థికంగా ఇబ్బంది కలిగింది. ఒకటో తారీఖు జీతం రావడం లేదంటే దానికి కారణం కేంద్ర ప్రభుత్వం అని ఆరోపించారు హరీష్ రావు.
శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా కేసులో కీలక తీర్పు
ఉత్తర్ ప్రదేశ్ మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా మసీదు వివాదంలో మథుర కోర్టు కీలక తీర్పు చెప్పింది. జనవరి 2 తర్వాత వివాదాస్పద షాహీ ఈద్గా ప్రాంతంలో భారత పురావస్తు శాఖ సర్వే చేయాలని శనివారం తీర్పును వెలువరించింది. జనవరి 20 తర్వాత నివేదిక సమర్పించాలని భారత పురావస్తు శాఖను ఆదేశించింది. గతంలో జ్ఞాన్‌వాపి మసీదులో సర్వే మాదిరిగానే ఈ సర్వే ఉండబోతోంది. హిందు సంస్థల తరుపున విష్ణు గుప్తా దాఖలు చేసిన వ్యాజ్యంపై కోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది. ఈ కేసుల తదుపరి విచారణను జనవరి 20వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. 17వ శతాబ్ధానికి చెందిన షాహీ ఈద్గా మసీదును కత్రా కేశవ్ దేవ్ ఆలయం నుంచి తొలగించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మసీదు శ్రీ కృష్ణుడి జన్మస్థలంలో నిర్మించారని హిందు సంఘాలు పేర్కొంటున్నాయి. 1669-70లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆదేశాల మేరకు శ్రీకృష్ణుడి ఆలయంలోని 13.37 ఎకరాల విస్తీర్ణంలో ఈ మసీదును నిర్మించారని హిందూసంఘాలు చెబుతున్నాయి. దీంతో ఈ వివాదాస్పద స్థలంపై విష్ణుగుప్తా పిటిషన్ దాఖలు చేశారు.
యాదాద్రిలో హెల్త్ డైరెక్టర్ పర్యటన.. ఫోర్త్ వేవ్ పై కీలక వ్యాఖ్యలు
యాదాద్రి శ్రీలక్ష్మినృసింహా స్వామివారిని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు శనివారం దర్శించుకున్నారు. అయితే.. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీనివాస్‌రావు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తరువాత శ్రీనివాస్‌రావుకు అర్చకులు ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రావు మీడియాతో మాట్లాడుతూ.. కరోనా మరో సారి వస్తుందని, సీఎం కేసీఆర్ సూచనల ప్రకారం ఫోర్త్ వేవ్ వ్యాపించకుండా వైద్య ఆరోగ్యశాఖ ద్వారా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. అంతేకాకుండా.. యాదాద్రి శ్రీలక్ష్మినృసింహ స్వామి వారి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని, కరోనా మహమ్మారి వ్యాపించకుండా చూడాలని యాదాద్రీశుడిని కోరుకున్నానన్నారు. ఫోర్త్ వేవ్‌పై వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తం అయ్యామని ఆయన స్పష్టం చేశారు. కరోనాపై గత మూడు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ పోరాటం చేస్తుందని, కరోనాపై ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావొద్దని ఆయన వెల్లడించారు. తెలంగాణాలో వ్యాక్సినేషన్ 100శాతం వేశామని శ్రీనివాస్ రావు తెలిపారు. ప్రస్తుతం వచ్చే వైరస్ ఫాస్ట్‌గా ప్రజల్లోకి వెళ్తుందని, ప్రాణాంతకమైంది కాదని భావిస్తున్నామన్నారు. గతంలో నేను చేసిన కామెంట్ ప్రస్తుతానికి అప్రస్తుతమన్నారు శ్రీనివాస్ రావు.
బూస్టర్ డోస్ తీసుకోలేదా? ఇలా చేయండి
మన దేశంలో ఎక్కువ శాతం మంది రెండు డోసుల కరోనా వ్యాక్సిన్‌ను తీసుకున్నారు. ఆ తర్వాత బూస్టర్ డోస్ తీసుకోవాలని నిపుణులు సూచించినా ప్రజల్లో అంతగా ఆసక్తి కనిపించలేదు. దీనికి కారణం కరోనా యొక్క మూడవ వేవ్ యొక్క తీవ్రత చాలా వరకు తగ్గింది. మరణాల రేటు కూడా చాలా తక్కువ. దీంతో బూస్టర్ డోస్ కోసం ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పుడు చైనాతో సహా అనేక దేశాల్లో, కరోనా BF7 వేరియంట్ ఎక్కువగా వ్యాపించడమే కాకుండా.. మరణాల రేటు ఎక్కువగా ఉండటంతో.. ప్రపంచంలోని అనేక దేశాలలో అప్రమత్తమయ్యాయి. దీంతో అలర్ట్ అయి బూస్టర్ డోస్ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం, వైద్య నిపుణులు సూచిస్తున్నారు. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన నాసికా వ్యాక్సిన్‌ను బూస్టర్ డోస్ కింద వేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిని మంజూరు చేసింది. కాబట్టి రెండు డోసులు తీసుకున్న వారు బూస్టర్ డోస్ తీసుకోవడానికి కోవిన్ యాప్‌లో నమోదు చేసుకోవాలి.
బండి సంజయ్ పై జోగు రామన్న ఫైర్
తెలంగాణలో బీజేపీ వర్సెస్ బీఆర్‌ఎస్ అన్నట్లుగా రాజకీయం సాగుతోంది. ఇరు పార్టీల నేతల ఒకరిపైఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. అయితే.. తాజాగా.. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌పై ఫైర్ అయ్యారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న. తాజాగా జోగు రామన్న ఆదిలాబాద్ జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. దమ్ముంటే రైతులను ఎనిమిదిన్నర ఏళ్లలో ఏం చేశారో చెప్పండని ఆయన సవాల్ విసిరారు. అంతేకాకుండా.. డ్రగ్స్ కేసులో కేటీఆర్ కౌంటర్ ఇస్తే తరువాత మాట మార్చారని, జనమే మిమ్మల్సి చెప్పుతో కొడుతారు అంటూ ఆయన ధ్వజమెత్తారు. ఉపాధి హామీ డబ్బులు కల్లాలకు వాడితే కడుపు మంట ఎందుకు అని, తెలంగాణ రైతులంటే అంత కోపం ఎందుకని ఆయన మండిపడ్డారు. కిషన్ రెడ్డి కబ్జాలు చేసారని ఆయన ఆరోపించారు. రైతుల గురించి బీజేపీ నేతలకు ఏం తెలియదని, రైతులను మోసం చేస్తేనే అక్కడ ధర్నా లు చేసారన్నారు. కిసాన్ సమ్మన్ నిధి ఏది అని ఆయన ప్రశ్నించారు.
జనసేనతో తప్ప వేరే పార్టీతో పొత్తులుండవ్.. బీజేపీ క్లారిటీ
సార్వత్రిక ఎన్నికలకు ఇంకా సమయంలో ఉన్నా ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడే ఎన్నికల పొత్తులపై చర్చలు సాగుతున్నాయి.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడడమే తన ధ్యేయమని ఒకరు అంటే.. అంతే ఏకమై.. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని మరికొందరు అంటున్నారు.. కానీ, తమకు జనసేన పార్టీతోనే పొత్తు.. మరో పార్టీ అవసరం లేదంటున్నారు భారతీయ జనతా పార్టీ నేతలు.. విశాఖలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ పొత్తుల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు.. జనసేనతో తప్ప ఇతర రాజకీయపార్టీలతో పొత్తులు ఉండే అవకాశం లేదని స్పష్టం చేశారు.. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో శక్తివంతమైన పార్టీగా ఎదుగుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. జనసేన పార్టీతోనే పొత్తు ఉంటుందని.. త్వరలోనే జనసేన, బీజేపీ ఉమ్మడి పోరాటాలు ప్రారంభం అవుతాయని వెల్లడించారు.
మేడమ్ మీరు కాస్త ప్యాంట్ వేసుకోండి.. ప్లీజ్
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ‘అల వైకుంఠపురములో’ సినిమాలో ‘పూజా హెగ్డే’ గురించి ‘మేడమ్ సర్, మేడమ్ అంతే’ అనే డైలాగ్ రాశాడో అప్పటినుంచి ఆమె ఫోటో ఏది బయటకి వచ్చినా, ‘మేడమ్ అంతే’ అనే డైలాగ్ ని వాడేస్తున్నారు. ఇదే సినిమాలో పూజ హెగ్డే థైస్ చూసి అల్లు అర్జున్, ‘మేడఎం మీరు ప్యాంట్స్’ వేసుకోండి అంటాడు. త్రివిక్రమ్ రాసిన మొదటి డైలాగ్ లో ఎంత నిజం ఉందో తెలియదు, రెండో డైలాగ్ మాత్రం అక్షర సత్యం. పూజ హెగ్డేలో మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఆమె ‘థైస్’, పెర్ఫెక్ట్ షేప్ లో ఉండే ఆ థైస్ ని చూసి ఫాన్స్ ఫిదా అవుతూ ఉంటారు. ‘అల వైకుంఠపురములో’ సినిమా నుంచి పూజా హెగ్డే కూడా తన థైస్ ని ప్రాజెక్ట్ చేసే ఫోటోలు సోషల్ మీడియాలో ఎక్కువగా [పోస్ట్ చేస్తోంది. అలాంటి ఫోటోలే మరోసారి బయటకి వచ్చి యూత్ లో హీట్ పెంచుతున్నాయి. బ్లాక్ డ్రెస్ లో కార్ లో నుంచి బయటకి వస్తున్నట్లు పూజా దిగిన కొత్త ఫోటోలు ట్వి ట్టర్ లో వైరల్ అవుతున్నాయి. ఈ స్టన్నింగ్ బ్లాక్ లేడీని చూసి నెటిజన్స్ రీట్వీట్స్ చేస్తున్నారు.
రెండో టెస్టులో టీమిండియా టార్గెట్ 145 పరుగులు
మీర్పూర్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 70.2 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌటైంది. ఓవరాల్‌గా బంగ్లాదేశ్ 144 పరుగుల ఆధిక్యం సంపాదించింది. దీంతో టీమిండియా ముందు 145 పరుగుల టార్గెట్ నిలిచింది. లిటన్ దాస్ 73, జకీర్ హసన్ 51 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 3 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్, సిరాజ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఉమేష్ యాదవ్, జైదేవ్ ఉనద్కట్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 227 పరుగులకు ఆలౌట్ కాగా టీమిండియా 314 పరుగులు చేసింది. ఇంకా మ్యాచ్ రెండు రోజులు జరగాల్సి ఉండగా టీమిండియా విజయం ఖాయంగా కనిపిస్తోంది. ఈ టెస్టులోనూ భారత్ విజయం సాధిస్తే రెండు టెస్టుల సిరీస్‌ను 2-0 ఆధిక్యంతో క్లీన్ స్వీప్ చేయవచ్చు.