NTV Telugu Site icon

Top Headlines @5PM: టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

రాజధాని అంటే అందరూ ఉండే ప్రాంతం

అమరావతిలోని R5 జోన్ లో ఇళ్ల స్థలాల కేటాయింపు జీఓ 45పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని దాఖలైన 2 అనుబంధ పిటిషన్లు కొట్టివేసింది ఏపీ హైకోర్ట్. ఈ తీర్పుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఇది ఒక విజయం అని అనుకోవటం లేదు.. అడ్డంకులు సృష్టించే ప్రయత్నాన్ని కోర్టు అడ్డుకుంది.. అన్యాయమైన డిమాండ్ ను కోర్టు డిస్మిస్ చేసింది..రాజకీయ దురుద్దేశాలతో అడ్డుకునే ప్రయత్నం చేశారు… రాజధాని అంటే ప్రజలు అందరూ ఉండే ప్రాంతం.. డిమొగ్రాఫిక్ ఇన్ బ్యాలెన్స్ అనే అన్యాయమైన వాదనను తీసుకుని వచ్చారన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. లబ్ధిదారులకు ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమం త్వరలోనే ప్రారంభం అవుతుందన్నారు. ఇప్పటికే భూమి చదును వంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. టీడీపీ ప్రభుత్వం చట్టం ప్రకారం 5 శాతం భూమిని పేదలకు కేటాయించాలనే నిబంధనను పట్టించుకోలేదు. మూడు ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా ఇక్కడ కూడా తగిన విధంగా అభివృద్ధి జరుగుతుందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. హైకోర్ట్ తీర్పు నేపథ్యంలో అధికారులు ఇళ్ళ పట్టాల పంపిణీకి అంతా సిద్ధం చేస్తుండడంతో లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి ప్రాంతంలో ఇళ్ళ స్థలాల పంపిణీ కోసం ఎంపిక చేసిన మొత్తం లబ్దిదారులు 48379. గుంటూరు జిల్లా పరిధిలో 24152 మంది లబ్దిదారులు.ఎన్టీఆర్ జిల్లా పరిధిలో 24587 మంది లబ్దిదారులు. రాజధాని పరిధిలో పేదల ఇళ్ల పట్టాల కోసం 1134.58 ఎకరాల కేటాయించింది ప్రభుత్వం. హైకోర్టు ఉత్తర్వులతో లబ్ధిదారులకు ఇళ్ళ పట్టాల పంపిణీ శరవేగంగా సాగనుంది.

ప్రచ్ఛాయ చంద్రగ్రహణం.. ఏంచేయాలో తెలుసా?

సూర్య, చంద్రగ్రహణాలపై ప్రజలకు ఆసక్తి వుంటుంది. గ్రహణాల రోజు ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఆలోచిస్తుంటారు. ఈరోజు ప్రచ్ఛాయ చంద్రగ్రహణం.. ఎవరు ఏ నియమాలు పాటించాలో వివరిస్తున్నారు పండితులు. ఈ ఏడాదిలో మొత్తం నాలుగు గ్రహణాలు (Eclipses) ఏర్పడనున్నాయి. వీటిలో రెండు సూర్య, రెండు చంద్రగ్రహణాలు. ఇప్పటికే ఏప్రిల్ 20న మొదటి గ్రహణం సంభవించింది. ఇది సూర్యగ్రహణం (Solar Eclipse) కాగా.. ఇది ఏర్పడిన రెండు వారాలకే చంద్రగ్రహణం (Lunar Eclipse) ఏర్పడుతోంది. శుక్రవారం (మే 5న) రెండో గ్రహణం సంభవిస్తోంది. ఈ చంద్ర గ్రహణం ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో కనువిందు చేయనుంది. చంద్రుడి కంటే భూమి పెద్ద కావడం వల్ల నీడ కూడా ఎంతో ఎక్కువ. చంద్రుడు ఎరుపు రంగులో కాకుండా మరింత చీకటిలో ఉన్నట్లు కనిపిస్తాడు. ఎందుకంటే, ఏర్పడబోయే చంద్రగ్రహణంలో భూమి కోణం 5 డిగ్రీల ఎత్తులో ఉంటుంది. దీని వల్ల భూవాతావరణ ప్రభావం చంద్రుడిపై ఉండదు కాబట్టి గ్రహణం తేలికైన రంగులో కనిపిస్తుంది. గ్రహణం సందర్భంగా ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనేది తెలుసుకోండి.

రాష్ట్రంలో ఉద్యోగాల కోసం కన్నీటి ఎదురు చూపులే

మరోసారి సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌. ట్విటర్ వేదికగా బండి సంజయ్ విమర్శలకు దిగారు. “ఏండ్లుగా కొలువుల పంచాయితి. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో వలస పాలకుల నుంచి ఈనాడు స్వరాష్ట్రంలో నయా నిజాం వరకు ద్రోహమే. ఉద్యోగాల కోసం కన్నీటి ఎదురు చూపులే. దగాపడ్డ నిరుద్యోగుల రణ నినాదమే ‘సాలు దొర నీకు సెలవు దొర” అని ఓ వీడియోను షేర్ చేస్తూ ట్విట్టస్త్రాలు సంధించారు. ఇదిలా ఉంటే.. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన పబ్బ అనిల్ నిన్న జమ్మూకాశ్మీర్ లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు. జవాన్ అనిల్ మృతి పట్ల బండి సంజయ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే బండి సంజయ్ అనిల్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. కుటుంబ పెద్దను కోల్పోయి విలపిస్తున్న కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు యత్నించారు బండి సంజయ్. అక్కడే ఉన్న జిల్లా నేతలతో మాట్లాడిన ఆయన.. అనిల్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉండాలని ఆదేశించారు. అంతిమ సంస్కార ఏర్పాట్లతోపాటు తదుపరి ఏర్పాట్లను దగ్గరుండి చూసుకోవాలని కోరారు.

చంద్రబాబుకి వైద్య రంగంపై మాట్లాడే హక్కు లేదు

ఏపీలో అధికార పార్టీ నేతలు.. విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం రోజురోజుకీ పెరిగిపోతోంది. మంత్రి విడదల రజిని మాజీ సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. అసలు వైద్యరంగం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు.. సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వైద్య రంగంలో సంస్కరణలు తెచ్చారు…నాడు – నేడు కార్యక్రమం కింద రాష్ట్రంలోని ప్రతి హాస్పిటల్ రూపురేఖలు మార్చాం. రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను తెచ్చి దేశానికే ఆదర్శం అయ్యాం. ప్రభుత్వం వైద్య రంగం కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తోంది. క్షేత్రస్థాయిలో సేవలు ఎలా ఉన్నాయో చూడడానికి వచ్చాం అన్నారు. వైద్యం కోసం వచ్చే వారికి ఎక్కడ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నాము.టీడీపీ హయాంలో ఒక్క డాక్టర్ ని కూడా నియమించలేదన్నారు మంత్రి విడదల రజనీ. వైద్య రంగాన్ని పూర్తిగా నీరుగాగార్చారు. వైద్య రంగానికి ఎంత మంచి చేస్తుంటే వైసీపీ ప్రభుత్వం పై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడుకి వైద్య రంగంపై మాట్లాడే హక్కు లేదన్నారు మంత్రి విడదల రజినీ.

ఉపాధ్యాయులు, ఉద్యోగులకు కామన్ బదిలీలు వద్దు

సర్వశిక్షా అభియాన్ కార్యాలయం వద్ద ఎస్.టి.యు. అధ్యక్షుడు నివాస్, యూ.టి.ఏఫ్ నేత వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. పిల్లకు ఇచ్చే కిట్ లు ఒకేసారి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ నెలాఖరు‌ వరకు మాత్రమే యాప్ లో హాజరు నమోదు చేస్తారు. బదిలీల కు సంబంధించి పాత సర్వీస్ లు పరిగణలోకి తీసుకుంటారు. అవసరమైతే బదిలీ కోడ్ కూడా తెస్తామన్నారు. పాత జిఒ లను యధాతధంగా అమలు చేస్తాం అన్నారు. 1752 ప్లస్ టూ జూనియర్ లెక్చరర్ పోస్ట్ లు భర్తీ చేస్తాం అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే అన్నీ చేస్తామని హామీ ఇవ్వడం హర్షణీయం అన్నారు ఎస్.టి.యు. అధ్యక్షుడు నివాస్. యూ.టి.ఏఫ్ నేత వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. 292 ప్లస్ టూ పాఠశాలల్లో ప్రమోషన్ లను స్వాగతిస్తున్నాం. జీవీకే కిట్ ల కోసం ఉపాధ్యాయులు అనేకసార్లు తిరగాల్సి వచ్చింది. స్కూళ్ళకే కిట్ లు పంపాలని అడిగాం. కన్వర్షన్ కు సంబంధించి మరో అవకాశం ఇవ్వాలని కోరాం, ఉపాధ్యాయులు, ఉద్యోగులకు కామన్ బదిలీ వద్దని చెప్పాం. మంత్రి గారు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే పోరాటం చేస్తాం. కోర్టు పరిధిలో ఉన్న అంశాలను కూడా పరిశీలించాలని చెప్పాం అన్నారు యూటీఎఫ్ నేత వెంకటేశ్వర్లు. గురుకుల పాఠశాలల్లో పోస్ట్ లు భర్తీ చేయలేదు. 117 జీఓ వల్ల ఉపాధ్యాయులు ఇబ్బందులు పడ్డారు. జీఓ 117 రద్దు చేయాలని,‌16 రకాల యాప్ ల స్థానంలో నాలుగు యాప్ లు అమలు చేస్తాం అన్నారు. వేసవి సెలవులు ముగిసే లోపు అన్నీ సరిచేయాలన్నారు.

ITRకి కావాల్సిన డాక్యుమెంట్లు. ఈ చెక్ లిస్ట్ ఫాలో అయితే ఫైలింగ్ ఈజీ

ఆర్థిక సంవత్సరం ముగిసింది. 2023-24 అసెస్‌మెంట్ ఇయర్ ప్రారంభమైంది. దీంతో.. ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్‌ ఫైలింగ్‌కి.. అంటే.. ఐటీఆర్ సమర్పణకు సమయం ఆసన్నమైందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో.. అసలు ఐటీఆర్ ఎన్ని రకాలు?, వాటికి ఎలాంటి డాక్యుమెంట్లు జతపరచాలి అనే విషయాలను తెలుసుకుందాం.ఐటీఆర్ అనేది ముఖ్యంగా ఏడు రకాలు. ఐటీఆర్-వన్‌ని సహజ్ అని, ఐటీఆర్-ఫోర్‌ని సుగమ్ అని కూడా అంటారు. ఏడాదికి 50 లక్షల రూపాయలు లేదా అంతకన్నా తక్కువ ఆదాయం వచ్చేవాళ్లు ఐటీఆర్-వన్ పరిధిలోకి వస్తారు. శాలరీ లేదా పెన్షన్, సింగిల్ హౌజ్ ప్రాపర్టీ మరియు ఇతరత్రా మార్గాల ద్వారా ఆదాయం వచ్చేవాళ్లు ఈ ఐటీఆర్ సబ్మిట్ చేయాలి. ఒక వేళ అగ్రికల్చరల్ ఇన్‌కం గనక 5 వేల రూపాయల వరకు వస్తుంటే.. వాళ్లు కూడా ఐటీఆర్-1 దాఖలుచేయొచ్చు. దీనికోసం.. ఫామ్-16, ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ అంటే టీడీఎస్.. సర్టిఫికెట్, బ్యాంక్ స్టేట్మెంట్లు ఎటాచ్ చేయాలి.వార్షికాదాయం 50 లక్షల రూపాయల కన్నా ఎక్కువ వచ్చే వ్యక్తులు లేదా హిందూ అవిభాజ్య కుటుంబం ఐటీఆర్-2 పరిధిలోకి వస్తుంది. మూలధన లాభాలు, మల్టిపుల్ హౌజ్ ప్రాపర్టీస్, ఫారన్ అసెట్స్, కంపెనీలో డైరెక్టర్‌షిప్, అన్‌లిస్టెడ్ ఈక్విటీ షేర్లు కలిగినవాళ్లు ఈ రెండో కేటగిరీలో ఐటీఆర్ సమర్పించాలి. సెక్షన్ 194-ఎన్ ప్రకారం కోటి రూపాయల కంటే ఎక్కువ క్యాష్ విత్‌డ్రా చేసినందుకు ట్యాక్స్ చెల్లించేవాళ్లు సైతం ఇదే కోవలోకి వస్తారు. ఇందులోభాగంగా ఫామ్-16, ఫామ్-16ఏ, క్యాపిటల్ గెయిన్స్ వివరాలు, బ్యాంక్ స్టేట్మెంట్లు జతపరచాలి.

జియోలో వాటా కావాలా.. అయితే అక్టోబర్ వరకూ ఆగాల్సిందే

రిలయెన్స్ జియో కంపెనీ ప్రజల్లోకి ఎంత వరకు వెళ్లిందంటే.. ఇప్పుడు ఆ పేరు తెలియనివారు లేరనే రేంజ్‌కి చేరుకుంది. అదే స్థాయిలో జియో ఫైనాన్షియల్ సంస్థ కూడా జనంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అక్టోబర్ నెలలో ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌కి రావాలనుకుంటోంది. రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తన డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ యూనిట్‌ పేరునుసాధ్యమైనంత తొందరగా.. అంటే.. మరో ఐదారు నెలల్లో స్టాక్ మార్కెట్‌లో నమోదు చేయించనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.ముఖేష్ అంబానీ సారథ్యంలోని ఈ వ్యాపార సామ్రాజ్యం.. జియో ఐపీఓకి సంబంధించిన అనుమతులు పొందేందుకు నియంత్రణ సంస్థలతో చర్చలు జరుపుతోంది. ఈ సంప్రదింపులు కొనసాగుతున్నాయని, పూర్తయ్యే నాటికి మార్పులు చేర్పులు ఉండొచ్చని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఐపీఓకి షేర్ హోల్డర్లు మరియు క్రెడిటర్ల అంగీకారం కూడా తీసుకునేందుకు మే నెల 2వ తేదీన మీటింగ్ ఏర్పాటుచేస్తున్నట్లు మార్చి నెలలో స్టాక్ ఎక్స్ఛేంజ్‌లకు సమర్పించిన నివేదికలో పేర్కొన్న సంగతి తెలిసిందే.

జాతిరత్నం హీరోని ఉంచుకుంటానంటున్న హీరోయిన్

ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన హీరోయిన్ మాళవిక నాయర్. మొదటి సినిమాతోనే తన నటనతో మెప్పించిన ఈ చిన్నది వరుస అవకాశాలను అయితే అందుకోగలిగింది కానీ, ఎందుకో విజయాలను మాత్రం అందుకోలేకపోయింది. ఇక ఆ విజయం కోసం అమ్మడు పోరాడుతూనే ఉంది. ఇక తాజాగా అన్ని మంచి శకునములే అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. కుర్ర హీరో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అన్నీ మంచి శకునములే. వైజయంతీ మూవీస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మే 18 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచేశారు. ఇక ఈ నేపథ్యంలోనే ఒక చిన్న సీక్రెట్ ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ సినిమా కోసం జాతిరత్నం డైరెక్టర్ అనుదీప్ కెవి కూడా కష్టపడినట్లు తెలుస్తోంది.

మార్చిలో జనం మెచ్చిన యాప్ లు ఇవే.. డౌన్ లోడ్ అయినవి

రోటీ.. కప్డా.. ఔర్ మకాన్.. అంటే.. తిండి.. బట్ట.. మరియు ఇల్లు. ఇది రాజకీయ పార్టీల నినాదం కాదు. ఓట్లు రాల్చే ప్రచార మంత్రం అసలే కాదు. ఇవి.. వినియోగదారులు వెతికిన సేవలు. వీటి కోసమే యూజర్లు మొబైల్‌లో తెగ సెర్చ్ చేశారు. సంబంధిత యాప్‌లను ఎక్కువగా డౌన్‌లోడ్ చేశారు. మార్చి నెలకు సంబంధించిన ఈ వివరాలను వివిధ సంస్థలు వెల్లడించాయి.కరోనా మహమ్మారి తర్వాత కూడా భారతీయులు సెల్‌ఫోన్లకు మరియు వాటిలో కొన్ని యాప్‌లకు అడిక్ట్ అవుతున్నారు అనటానికి ఇదే సాక్ష్యమని సర్వేలు తెలిపాయి. ఫుడ్ కోసం ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టడం దగ్గర నుంచి అద్దె ఇళ్ల కోసం, ఇళ్ల కొనుగోలు కోసం మరియు డ్రెస్‌ల సెలక్షన్ కోసం యాప్‌లను అధికంగా వాడుతున్నారు.కరోనా లాక్‌డౌన్‌లకు కాలం చెల్లిపోయి ఆర్థిక కార్యకలాపాలు పూర్తి స్థాయిలో జరుగుతున్నప్పటికీ జనం ఎక్కువ శాతం కీలకమైన కన్జ్యూమర్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌లపైనే ఆధారపడుతున్నారు. నిత్యావసర సరుకులు.. చివరికి ఉద్యోగాల కోసం కూడా యాప్‌లనే ఆశ్రయిస్తున్నారని సెన్సార్ టవర్స్ మంత్లీ డేటా ప్రింట్ పేర్కొంది.

 

 

 

Show comments