NTV Telugu Site icon

Top Headlines @5PM: టాప్ న్యూస్

Ntv Top Hl 5pm

Ntv Top Hl 5pm

దేశంలో అత్యధికంగా డ్రగ్స్‌ స్వాధీనం.. ఇది మా చిత్తశుద్ధికి నిదర్శనం

దేశ వ్యాప్తంగా సాగుతున్న స్మగ్లింగ్‌లో మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకోవడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండటం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ చిత్తశుద్దికి నిదర్శనం అంటున్నారు రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత . ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి సమర్థతే దీనికి కారణమని, పోలీసు యంత్రాంగం మెరుగైన పనితీరు ఇందుకు నిదర్శనమంటూ కొనియాడారు. గంజాయి, ఎర్రచందనం స్మగ్లింగ్, మత్తు పదార్థాలు రవాణాను ఆరికట్టడంలో గత ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించారు.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన హోంశాఖ మంత్రి తానేటి వనిత… రాష్ట్రంలో గంజాయి రవాణాశాఖ ఆరికట్టడానికి మా సర్కార్‌ ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు.. గంజాయి సాగే జీవనాధరంగా జీవిస్తున్న గిరిజనల్లో అవగాహన కల్పిస్తున్నామని ఆమె వెల్లడించారు.

ఎమ్మెల్యేల ఎర కేసులో హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా

ఎమ్మెల్యేల ఎర కేసులో హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది. ఈ కేసును సిబిఐకి ఇవ్వాలని ఇప్పటికే హైకోర్టు లో పలు పిటిషన్ లు దాఖలయిన సంగతి తెలిసిందే. అన్ని పిటిషన్ లపై కౌంటర్ దాఖలు చేసింది సిట్..ఇప్పటికే ఈ కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు.. అన్ని పిటిషన్ లపై నేడు మరోసారి విచారణ చేపట్టింది హైకోర్టు. విచారణ రేపటికి వాయిదా పడింది. రేపు మరోసారి వాదనలు వినిపించనున్నారు నిందితుల తరపు న్యాయవాది ఉదయ్ హుల్లా.. సిట్ తరపున వాదనలు వినిపించారు సీనియర్ లాయర్ దవే. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది హైకోర్టు

రైతుల్ని కూలీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దే

సీబీఐ, ఈడీలు మా చేతుల్లో లేవంటూ లిక్కర్ స్కాం పై ఎంపీ అర్వింద్‌ స్పందించారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. నోటీసులు వస్తే విచారణకు సహకరిస్తామని అన్నారని, చట్టాన్ని గౌరవిస్తామని చెప్పారు. చేయమని చెబుతున్నామన్నారు. ఓ ఛానెల్‌లో దర్యాప్తు సంస్థలపై జేడీ లక్ష్మీనారాయణ చాలా క్లారిటీగా చెప్పారని, సోనియా గాంధీ ముద్దాయి, ఆమె నేరుగా హాజరు కావాల్సి ఉంటుంది. ఇప్పటికి కవిత లిక్కర్ కేసులో విట్నెస్ మాత్రమే, ఆమె విచారణకు వెళ్లాల్సిన అవసరం లేదని, సాక్షి దగ్గరకు విచారణ అధికారులు వెళ్తారు. నిందితులను తమ దగ్గరకు పిలుచుకుంటారన్నారు. బీజేపీ తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఒక కమిటీ వేశారన్నారు. అధ్యాయం చేస్తున్నాం, జాతీయ అంతర్జాతీయంగా స్టడీ చేస్తున్నామన్నారు అర్వింద్‌. రానున్న ఎన్నికలకు మా రిపోర్ట్ చాలా కీలకం కానుందని, మా రిపోర్టులో సగానికి పైగా ముఖ్యమంత్రికి తెలుసన్నారు అర్వింద్‌.

కేసీఆర్.. తెలంగాణ నీ అబ్బ సొత్తు కాదు

సిద్ధిపేటలో నిన్న డబుల్ బెడ్రూం రాలేదని మనస్తాపానికి గురై కలెక్టరేట్ సమీపంలో చీలసాగరం రమేష్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ రోజు రమేష్‌ స్వగ్రామం గజ్వేల్‌ మండలంలోని అహ్మదీపూర్ లో అంత్యక్రియలు జరుగుతున్నాయి. అయితే.. ఈ నేపథ్యంలో.. రమేష్ కుటుంబాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావులు పరామర్శించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. కేసీఆర్ ఇలాకాలో ప్రతినిత్యం ఏదో ఒక మూల దళితులు పేదవర్గాల వారు న్యాయం జరగడం లేదని ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ఇలాంటి ఘటనలను నాయకులు పోలీసులతో బెదిరించి బయట పొక్కకుండా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ధరణితో భూముల సమస్యలు పరిష్కారం కాక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, సంక్షేమ పథకాలు రావాలంటే మా పార్టీలో ఉండాలని టీఆర్‌ఎస్ ఎమ్మేల్యేలు, మంత్రులు అనడం విడ్డూరమన్నారు.

వంశీరాం బిల్డర్స్ లో హవాలా లావాదేవీలపై ఆరా

వంశీరాం బిల్డర్స్ వ్యవహారాలపై ఆరా తీస్తోంది ఐటీ శాఖ. వంశీరాం బిల్డర్స్ లో కొనసాగుతున్న సోదాల్లో అనేక కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. వంశీరాం బిల్డర్స్ చైర్మన్ సుబ్బారెడ్డి ఇంట్లో భారీగా ఆస్తుల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. రెండు సూట్ కేస్ లో డాక్యుమెంట్లను ఐటీ అధికారులు తీసుకుని వెళ్లినట్టు తెలుస్తోంది. ఉదయం నుంచి కొనసాగిన సోదాల్లో భారీగా ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకుంది ఐటీ శాఖ. వంశీ రాం బిల్డర్స్ సంస్థ పలువురు ప్రైవేటు వ్యక్తులతో ఒప్పందాలు చేసుకున్న పత్రాలను సాధనపరచుకుంది ఐటీ శాఖ. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పెద్ద మొత్తంలో పత్రాలను, అక్రమాలను గుర్తించింది ఐటీ. ఉదయం నుంచి కొనసాగుతున్న సోదాలు కలకలం రేపుతున్నాయి. పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. కంపెనీ ఉద్యోగుల పేర్ల మీద భారీగా బ్యాంకు ఖాతాలు ఉన్నాయని ఐటీ అధికారులు గుర్తించారు. ఉద్యోగుల ఖాతాల నుంచి భారీగా లావాదేవీలు జరిగినట్లు గుర్తించింది ఐటీ. పలు కంపెనీలతో చేసుకున్న ఒప్పంద పత్రాలను స్వాధీనపరచుకుంది ఐటీ.

ఒకేరోజు నలుగురు టీమిండియా ఆటగాళ్ల బర్త్ డే
ఒక స్టార్ క్రికెటర్ పుట్టినరోజు జరుపుకుంటేనే సోషల్ మీడియాలో మాములు హడావిడి ఉండదు. అలాంటిది ఒకేరోజు టీమిండియాకు చెందిన నలుగురు స్టార్ క్రికెటర్లు బర్త్ డే జరుపుకుంటే సోషల్ మీడియాలో జరిగే హంగామా అంతా ఇంతా కాదనే చెప్పాలి. తాజాగా మంగళవారం అంటే డిసెంబర్ 6వ తేదీన ఏకంగా నలుగురు క్రికెటర్లు బర్త్ డే జరుపుకుంటున్నారు. పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా, స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, శ్రేయాస్ అయ్యర్, టెస్టు స్పెషలిస్టు కరుణ్ నాయర్ ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా నెటిజన్‌లు విషెస్ తెలుపుతున్నారు. బుమ్రా 29వ బర్త్ డే, జడేజా 34వ బర్త్ డే, శ్రేయాస్ అయ్యర్ 28వ బర్త్ డే, 32వ బర్త్ డే జరుపుకుంటున్నారు. దీంతో బీసీసీఐ కూడా ఆయా ఆటగాళ్లకు ప్రత్యేకంగా విషెస్ తెలియజేసింది. గాయాల కారణంగా బుమ్రా, జడేజా కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్నారు. వీళ్లిద్దరూ టీ20 ప్రపంచకప్ ఆడలేదు. అయితే జడేజా మాత్రం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తన భార్య తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. ఇక శ్రేయాస్ అయ్యర్ వన్డే జట్టులో కీలకంగా రాణిస్తూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌లో శ్రేయాస్ అయ్యర్ ఇప్పుడే కర్చీఫ్ వేసినట్లు కనిపిస్తోంది. అటు టెస్టు స్పెషలిస్ట్ కరుణ్ నాయర్ భారత్ తరఫున ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు.

ఇంట్లో శవమై కనిపించిన ఆ నిర్మాత.. అసలేమైంది?
మాలీవుడ్ లో విషాదం చోటుచేసుకొంది. ప్రముఖ మలయాళీ నిర్మాత జైసా జోసెఫ్ తన ఇంట్లో శవమై కనిపించాడు. గతరాత్రి కొచ్చిలోని అపార్ట్మెంట్ లో విగతజీవిగా కనిపించాడు. అయితే అతని మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఒక్కసారిగా ప్రముఖ నిర్మాత మృతి ఇండస్ట్రీలో కలకలం సృష్టిస్తోంది. ఇంత చిన్న వయస్సులోనే జోసెఫ్ మరణం కలిచివేస్తోందని పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఇకపోతే జోసెఫ్.. జమ్నా ప్యారి, బీజు మీనన్ హీరోగా నటించిన లవ కుశ లాంటి సినిమాలనుఁ నిర్మించాడు. త్వరలోనే ఆయన మృతికి గల కారణాలను తెలియజేస్తామని పోలీసులు తెలిపారు.