NTV Telugu Site icon

Top Headlines @9AM: టాప్ న్యూస్

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు మహారాష్ట్ర ఔరంగాబాద్ లో బీఆర్ఎస్ బహిరంగసభ

ప్పటికే రెండుసార్లు మహారాష్ట్రలో సభలు నిర్వహించిన బీఆర్‌ఎస్ మరో భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధం చేసింది. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టిన బీఆర్‌ఎస్ భారీ జనసమీకరణతో ప్రజలను, నేతలను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తోంది. గతంలో నాందేడ్, కాందర్ లోహ సభలతో మహారాష్ట్ర రాజకీయాల్లో దృష్టిని ఆకర్షించిన బీఆర్‌ఎస్.. ఇప్పుడు ఔరంగాబాద్‌ సభ కోసం ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఇవాళ ఔరంగాబాద్ ఛత్రపతి శంభాజీనగర్‌లోని జబిందా మైదానంలో బీఆర్‌ఎస్‌ సభను నిర్వహిస్తోంది. ఇవాళ సభకు బీఆర్‌ఎస్‌ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ హాజరకానున్నారు. రాష్ట్రం నుంచి వెళ్లిన బీఆర్‌ఎస్ నేతలు అక్కడ జనసమీకరణపై కొన్ని రోజులుగా కసరత్తు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, షకీల్, బీఆర్ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారీ సహా తదితరులు కొంతకాలంగా ఔరంగబాద్‌లోనే ఉండి సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. చాలా కాలం నుంచి మరాఠా ప్రజల్లో ఆలోచన రేకెత్తించిలా బీఆర్‌ఎస్ ప్రచారం చేస్తోంది. మహారాష్ట్రలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ దృష్టి సారించింది. వివిధ పార్టీల నుంచి నేతలు చేరేలా ప్రోత్సహిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇవాళ కేసీఆర్ సమక్షంలో 150 మందికి పైగా నేతలు బీఆర్ఎస్‌లో చేరనున్నారు. 30 మందికి పైగా ఛత్రపతి శంభాజీ నగర్ మునిసిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్స్ బీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు సమాచారం

పాకిస్థాన్ మాజీ ప్రధానే లక్ష్యం.. ఇమ్రాన్‌పై దాడికి ఉగ్రవాద సంస్థ ప్లాన్

పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) ఛైర్మన్ ఇమ్రాన్ ఖాన్‌ను లక్ష్యంగా చేసుకుని నిషేధిత ఉగ్రవాద సంస్థ ప్లాన్ చేస్తోందని పాకిస్థాన్ రక్షణ మంత్రిత్వ శాఖ రహస్య నివేదిక వెల్లడించింది. దేశంలోని ఇతర ప్రముఖ రాజకీయ ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద సంస్థ ప్రణాళికలు రచిస్తున్నట్లు రహస్య నివేదికలో పేర్కొంది. ఇమ్రాన్ ఖాన్‌తో పాటు పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్, అంతర్గత మంత్రి రాణా సనావుల్లాను కూడా దేశంలో శాంతికి విఘాతం కలిగించడానికి శత్రు శక్తులు లక్ష్యంగా చేసుకోవచ్చని నివేదిక వెల్లడించింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ బహిరంగ ర్యాలీలు లేదా ఉద్యమాల సమయంలో ఇమ్రాన్ ఖాన్‌పై దాడి చేయవచ్చు అని హెచ్చరించింది. తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP), విదేశీ ప్రాయోజిత నిషేధిత సంస్థలు పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N), పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (PPP) నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకోవచ్చని తెలిపింది. ఇమ్రాన్ ఖాన్, రాణా సనావుల్లా, ఖవాజా ఆసిఫ్‌లతో సహా ప్రముఖ రాజకీయ నేతలపై తీవ్రవాద దాడులు జరుగుతాయని రెండు ప్రావిన్సులలో ఎన్నికలకు సంబంధించి రక్షణ మంత్రిత్వ శాఖ సుప్రీంకోర్టుకు సమర్పించిన రహస్య నివేదికలో భయాన్ని వ్యక్తం చేసింది. PTI చీఫ్‌ని తన ఉద్యమం సమయంలో లేదా బహిరంగ ర్యాలీలో లక్ష్యంగా చేసుకోవచ్చు, అదే సమయంలో మతపరమైన తీవ్రవాదులు కూడా ఆయనను లక్ష్యంగా చేసుకోవచ్చని నివేదిక పేర్కొంది. ఇమ్రాన్ ఖాన్ భద్రతా సిబ్బందిని నిశితంగా పరిశీలించాలని సున్నితమైన ఏజెన్సీలను కోరింది.

వీడని అప్పన్న చందనోత్సవం వివాదం.. భక్తుల ఆగ్రహం

విశాఖపట్నం సింహాచలం దేవస్థానం ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. తాజాగా ఏర్పడిన చందనోత్సవం వివాదం ఇంకా వీడలేదు. దేవస్థానం అధికారుల వైఫల్యాలపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విచారణకు కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అంతరాలయ దర్శనాలు 10 వేలని చెప్పి 20 వేలకు పైగా టిక్కెట్లు జారీచేశారు. పరిమితికి మించి వివిఐపీ టిక్కెట్ల జారీతో లేని సమస్యలు తెచ్చిపెట్టుకుంది ఉత్సవ కమిటీ. సమన్వయం లోపంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు వేలాదిమంది భక్తులు.. ఘాట్ రోడ్ జామ్, గంటలకొద్దీ దర్శన సమయం, కనీస వసతుల కల్పించక పోవడంపై ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనలకు పిలుపునిచ్చాయి రాజకీయ పార్టీలు. సింహాచలం చందనోత్సవంలో భక్తుల ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. వీవీఐపీ టిక్కెట్లు కొనుగోలు చేసిన గంటల తరబడి క్యూ లైనల్లో ఉండిపోవడంపై భక్తులు మండిపడ్డారు. EO డౌన్ డౌన్ అంటూ భక్తులు నినాదాలు చేశారు. టైం స్లాట్ విధానం ఫెయిల్ అయిందని అప్పన్న స్వామి భక్తులు మండిపడుతున్నారు. కనీస సౌకర్యాలు కల్పించడంలో దేవస్థానం ఘోర వైఫల్యం చెందిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో భక్తులు బారిగేడ్లు విరగ్గొట్టారు. సింహాచలం అప్పన్న స్వామి దర్శనానికి వెళ్తున్న మంత్రి కొట్టు సత్యన్నారాయణకు భక్తుల నుంచి నిరసన సెగ ఎదురుకాక తప్పలేదు. క్యూ లైనల్లోనే భక్తులు నిరసనకు దిగడంతో గందరగోళం ఏర్పడింది.

తెరుచుకున్న స్ట్రాంగ్ రూం తాళాలు..26న హైకోర్టుకు నివేదిక

జగిత్యాల జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గం ఈవీఎంల స్ట్రాంగ్‌రూమ్‌ను అధికారులు ఎట్టకేలకు తెరిచారు. కలెక్టర్ యాస్మిన్‌భాషా ఆధ్వర్యంలో జగిత్యాల వీఆర్కే ఇంజినీరింగ్ కాలేజీలో ఉంచిన స్ట్రాంగ్‌రూంను కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ సమక్షంలో తాళాలు పగులగొట్టి గదిని తెరిచారు. అందులోని పత్రాలు, సీసీ ఫుటేజీని పరిశీలించారు. వాటిని స్వాధీనం చేసుకుని ఈ నెల 26న హైకోర్టుకు అధికారులు సమర్పించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్ట్రాంగ్ రూమ్ వద్ద పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. 17సీ, 17ఏ పత్రాలను పరిశీలించారు. 17 గంటల పాటు డాక్యుమెంట్లు పరిశీలించి స్కాన్ చేసి అధికారులు, సిబ్బంది ప్రక్రియను పూర్తి చేశారు. 17A,17C డాక్యుమెంట్లతో పాటుగా పూర్తి స్థాయి నివేదికను సీల్డ్ కవర్‌లో హైకోర్టుకు ఎన్నికల అధికారులు అందించనున్నారు. ఈ నెల 26 వరకు నివేదిక ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో అధికారులు ఇచ్చే సీల్డ్ కవర్‌లో ఎలాంటి రిపోర్ట్ ఉందనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ అభ్యర్ధి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 2018లో హైకోర్ట్ ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. విచారించిన న్యాయస్థానం, అప్పటి ఈవీ ప్యాడ్​లు ఉన్న స్ట్రాంగ్​ రూంను తెరిచేందుకు ఆదేశించింది.

బుర్కినా ఫాసోలో దారుణం.. 60 మందిని చంపిన దుండగులు


ఉత్తర బుర్కినా ఫాసోలో దారుణం జరిగింది. బుర్కినాబే సాయుధ దళాల యూనిఫాం ధరించిన వ్యక్తులు దాదాపు 60 మంది పౌరులను చంపారు. మాలి సమీపంలోని సరిహద్దు ప్రాంతంలోని యటెంగా ప్రావిన్స్‌లోని కర్మ గ్రామంపై దాడి జరిగింది. అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధం ఉన్న ఇస్లామిక్ గ్రూపులచే ఆక్రమించబడిన ప్రాంతం ఇది. ఇక్కడ సంవత్సరాలుగా పదే పదే దాడులు చేసింది. 2022 నుండి, పౌరులపై సాయుధ సమూహాల దాడులు పెరిగాయి. అయితే రాష్ట్ర భద్రతా దళాలు, స్వచ్ఛంద రక్షణ దళాలు అనేక ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను నిర్వహించాయి. ఏప్రిల్ 15న ఒవాహిగౌయా సమీపంలోని ఉత్తర బుర్కినా ఫాసోలోని అదే ప్రాంతంలో సైన్యం, స్వచ్ఛంద దళాలపై దాడిలో గుర్తుతెలియని దుండగులు 40 మందిని చంపారు. ఈ ఘటనలో 33 మంది గాయపడ్డారు. 2012లో మాలిలో టువరెగ్ వేర్పాటువాద తిరుగుబాటును ఇస్లామిస్టులు హైజాక్ చేయడంతో ఈ ప్రాంతంలో అశాంతి మొదలైంది. అప్పటి నుండి హింస బుర్కినా ఫాసో, నైజర్‌లలో వ్యాపించింది. వేలాది మంది మరణించారు మరియు 2.5 మిలియన్ల మంది ప్రజలను స్థానభ్రంశం చేశారు. కాగా, పశ్చిమ ఆఫ్రికా దేశం 2015లో పొరుగున ఉన్న మాలి నుండి వ్యాపించిన జిహాదీల తిరుగుబాటుతో పోరాడుతోంది.

ఏపీలో అక్కడ వర్షాలు.. పిడుగులు పడే అవకాశం

వాతావరణం మారిపోతోంది. మండు వేసవిలో అకాల వర్షాలు రైతుల్ని ఇబ్బంది పెడుతున్నాయి. నేడు శ్రీకాకుళం,మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ,ఉభయగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, వైఎస్ఆర్, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వుంది. కాసేపట్లో ఉభయగోదావరి,కోనసీమ, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం వుందని హెచ్చరించింది. సాయంత్రం నుంచి రాయలసీమలో అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం వుంది. ఎక్కడైనా ఎపుడైనా ఉరుములు మెరుపులతో వర్షం ఉన్నప్పుడు చెట్ల క్రింద ఉండరాదని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. పొలంలో రైతులు, కూలీలు, గొర్రె కాపరులు జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డా.బీఆర్ అంబేద్కర్ వెల్లడించారు. ఈ నెల 25 వరకు కోస్తా, రాయలసీమల్లో వర్షాలు పడతాయన్న వాతావరణశాఖ. ఏపీలోని పలు జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

రాముడు ఎవరైతే బాగుంటుంది

ఫ్యాన్ వార్స్ గురించి ప్రత్యేకించి ఈరోజు కొత్తగా చెప్పేది ఏముంది… ఏదో ఒక విషయంలో ఫాన్స్, తమ హీరోని డిఫెండ్ చేస్తూ, ఇంకో హీరోని ట్రోల్ చేస్తూ కామెంట్స్ చేస్తూ ఉంటారు. ప్రతి హీరో ఫ్యాన్ ఇది డైలీ కర్యచరణలో భాగం అయిపొయింది. దశాబ్దాలుగా జరుగుతున్న ఈ ఆనవాయితీని ఇప్పటికీ ఫాన్స్ కొనసాగిస్తూనే ఉన్నారు. ఒకప్పుడు ఏ హీరో సినిమా ఎన్ని రోజులు ఆడింది అని ఫ్యాన్ వార్ జరిగేది, అది నెమ్మదిగా ఎన్ని కోట్లు రాబట్టింది, మొదటి వీకెండ్ ని ఎవరి సినిమా ఎక్కువ కలెక్ట్ చేసింది, ఓపెనింగ్ డే రికార్డ్ ఎవరి పేరు పైన ఉంది, ఏ సెంటర్ లో ఎవరు ఎక్కువ వసూల్ చేస్తున్నారు, ఎవరి ఫస్ట్ లుక్ కి ఎక్కువ లైక్స్ వచ్చాయి, ఎవరు పేరు ఎక్కువ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది, బర్త్ డే రోజు కామన్ డీపీని ఎంత మంది రీట్వీట్ చేశారు, యుట్యూబ్ లో ప్రమోషనల్ కంటెంట్ ని ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఇన్స్టాలో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అని డిబేట్స్ చేసుకోని కొట్టుకోని, చంపుకునే వరకూ వచ్చాయి ఫ్యాన్ వార్స్. ఇలా రోజుకో టాపిక్ వెత్తుక్కోని మరీ గొడవపడే ఫాన్స్ కి కొత్తగా దొరికిన టాపిక్ ‘రాముడు ఎవరు అయితే బాగుంటుంది’. ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమా నుంచి రీసెంట్ గా ఒక మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఇందులో ప్రభాస్ లుక్ అండ్ ‘జై శ్రీరామ్’ చాంటింగ్ వస్తున్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయి. ప్రభాస్ ఫాన్స్ ని మాత్రమే కాకుండా ఇతర హీరోల అభిమానులు కూడా ఆదిపురుష్ మోషన్ పోస్టర్ చూసి ఇంప్రెస్ అయ్యారు.

సమంతకు మ్యాథ్స్ లో 100, ఫిజిక్స్ లో 95, ఇంగ్లీషులో 90..

సినిమాల్లో నటించే వాళ్లకు చదువు అబ్బదని విష ప్రచారం ఉంది. కానీ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో కూడా చదువులో గొప్పగా రాణించిన వాళ్లు చాలామందే ఉన్నారు. నటి సాయి పల్లవి ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ఓవైపు చేస్తూనే మరోవైపు సినిమాల్లో రాణిస్తున్నారు. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చదువులోనూ ముందుండేవాడు. పిల్లలకు ట్యూషన్లు చెబుతూ మరీ సుశాంత్ సినిమాల కోసం ప్రయత్నించాడు. అంతే కాకుండా సుశాంత్ ఇంట్లో ఉండి కోడింగ్ నేర్చుకున్నాడు. అదేవిధంగాఇక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా చదువులో టాలెంటెడ్ స్టూడెంట్ అని తెలుస్తోంది. ప్రస్తుతం సమంత స్కూల్ మార్కుల రిపోర్ట్ కార్డు మరోసారి సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఈ రిపోర్ట్ కార్డులో సమంత సాధించిన మార్కులు చూసిన వాళ్ళు షాక్ అవుతున్నారు. సమంత 10వ తరగతిలో 1000 మార్కులకు 887 మార్కులు సాధించింది. సమంత మ్యాథమెటిక్స్‌లో 100/100, ఫిజిక్స్‌లో 95/100 మార్కులు సాధించింది. ఇంగ్లీషులో 90, బోటనీలో 84, హిస్టరీలో 91, జాగ్రఫీలో 83 మార్కులు సాధించి తన భాష (తమిళం) పేపర్‌లో 88 మార్కులు సాధించింది. అన్ని సబ్జెక్టులను సమంతకు 80 శాతానికి పైగా మార్కులు వచ్చాయి. సమంత 2001- 2002 లో చెన్నైలోని హోలీ ఏంజిల్స్ స్కూల్లో పదవ తరగతి వరకు చదువుకుంది. అంతే కాకుండా సమంత డిగ్రీ 2007లో పూర్తి చేసింది. సమంత చెన్నైలోని స్టెల్లా మేరీ కాలేజ్ లో బీకాం గ్రూప్ తీసుకుని డిగ్రీ పూర్తి చేసింది. ఇక పదవ తరగతి లోనే కాకుండా డిగ్రీలోనూ సమంత చదువులో రాణించింది. కానీ సమంత నటన పై ఉన్న ఆసక్తి తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక చదువుకొనే కాదు నటనలోనూ తాను గ్రేట్ అని నిరూపించుకుంది