NTV Telugu Site icon

Top Headlines @5PM: టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

బీజేపీ గెలుపు… విపక్షాల నిరసనలపై ప్రధాని కీలక వ్యాఖ్యలు

బీజేపీ ఎక్కువ ఎన్నికల్లో గెలిస్తే, ప్రతిపక్షాల నుంచి మరిన్ని నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుందని బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఏప్రిల్ 6న పార్టీ వ్యవస్థాపక దినోత్సవం నుంచి ఏప్రిల్ 14 బీఆర్ అంబేద్కర్ జయంత్రి మధ్య సామాజిక న్యాయ వార్షికోత్సవం కోసం సమాయన్ని కేటాయించాలని ఎంపీలను ప్రధాని కోరారు. బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టి 9 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా తొమ్మిదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మే 15 నుంచి ఒక నెలపాటు ప్రభుత్వ పథకాలను తమ నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలని పార్టీ నేతలకు సూచించారని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ చెప్పారు.. మాతృభూమి కోసం పనిచేయాలని పార్టీ నాయకులకు మోదీ పిలుపునిచ్చారు. విషపూరిత రసాయనాలతో భూమాత కలుషితం అవుతోందని, చెట్ల పెంచడం ద్వారా మెరుగుపరచాలని సూచించారు. రాజకీయ నాయకులు రాజకీయేతర అంశాలపై పనిచేయాలని, ఇది సమాజంపై చాలా ప్రభావం చూపిస్తాయని ఆయన అన్నారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ‘‘ బేటీ బచావో ’’ కార్యక్రమం గురించి ప్రస్తావించారు. లింగ నిష్పత్తిని మెరుగుపరచడంలో సహాయపడిందని ప్రధాని అన్నారు.

టీడీపీ వచ్చాకే అట్టడుగు, బలహీనవర్గాలకు న్యాయం

కష్టపడిన వారికే పార్టీలో ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది టీడీపీ. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 40శాతం యువతకే టికెట్లు ఇవ్వాలని నిర్ణయం. వంద రూపాయల నాణేన్ని విడుదల చేస్తోన్న కేంద్రం, ప్రధానమంత్రికి అభినందనలు తెలుపుతూ పొలిట్ బ్యూరో తీర్మానం చేసింది. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా రేపటి నుంచి మే 28వరకు వివిధ ప్రదేశాల్లో వంద సమావేశాలు ఏర్పాటు చేస్తారు. 42పార్లమెంట్ నియోజకవర్గాల్లో శతజయంతి ఉత్సవాలు జరపాలని నిర్ణయించాం అన్నారు ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు. ఎమ్మెల్యేల కొనుగోలుపై వైసీపీ పిచ్చి ప్రేలాపనలు ఆపాలి.సైకిల్ గుర్తుపై గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలను ఎంతకు కొన్నాడో జగన్ చెప్పాలి?వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు గురిచేసినా.. యువగళం పాదయాత్ర విజయవంతంగా సాగుతోంది. ఏపీకి చెందిన 13.. తెలంగాణకు చెందిన 4.. పొలిట్ బ్యూరో లో మెత్తం 17అంశాలపై చర్చించాం.. అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ముఖ్యమంత్రి కనీసం‌ సమీక్ష జరకకపోవటం దుర్మార్గం. తన తప్పును ఒప్పుకొని సీఎం జగన్ జీవో నంబర్ 1ని వెనక్కి తీసుకోవాలి. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించాం. టీడీపీ వచ్చాకనే ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని వర్గాలకు న్యాయం జరిగిందన్నారు అచ్చెన్నాయుడు.

శ్రీరామనవమికి భద్రాద్రి ముస్తాబు.. 30న కళ్యాణం

శ్రీరామ నవమి వేడుకలకు భద్రాద్రి ముస్తాబవుతుంది. భద్రాచలంలో మార్చి 30న ఆలయ సమీపంలోని మిథిలా మండపంలో సీతారాముల కల్యాణం జరపనున్నారు. భద్రాద్రిలో ఎటుచూసినా స్వాగత తోరణాలు, చలువ పందిళ్లతో కల్యాణ వైభవం కనిపిస్తోంది. రాములోరి కల్యాణ వేడుకను కనులారా వీక్షించేందుకు తరలిరానున్న అశేష భక్తజనానికి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 15వేల మంది స్టేడియం నుంచి ఉచితంగా రాములోరి కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉంది. ఈనెల 31న శ్రీరామ సామాజ్ర్య పట్టాభిషేకం నిర్వహించనున్నారు. ఈవేడుకలను భక్తులు వీక్షించేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రాచలంలో శ్రీసీతారామ చంద్ర స్వామి కళ్యాణం మార్చి 30న నిర్వహించనున్నారు. దీని కోసం ఏర్పాట్లను చేస్తున్నారు. ఏటా శ్రీరామ నవమి రోజునే భద్రాచలంలో అభిజిత్ లగ్నంలో కళ్యాణం జరుగుతుంది. మిట్ట మధ్యాహ్నం ప్రతి యేడాది ఈ కళ్యాణం జరుగుతుంది. అయితే శ్రీరామ నవమి రోజునే కళ్యాణం భద్రాచలంలో ఎప్పుడు జరుగుతుందో అదే సమయంలో అయోధ్యలో కూడా కళ్యాణం జరుగుతుంది. వాడవాడలా కళ్యాణాలు జరుగుతుంటాయి.

టవల్స్ కోసం ఆర్డర్ చేస్తే.. ఉన్నదంతా ఊడ్చేశారు

బీజేపీ ఎక్కువ ఎన్నికల్లో గెలిస్తే, ప్రతిపక్షాల నుంచి మరిన్ని నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుందని బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఏప్రిల్ 6న పార్టీ వ్యవస్థాపక దినోత్సవం నుంచి ఏప్రిల్ 14 బీఆర్ అంబేద్కర్ జయంత్రి మధ్య సామాజిక న్యాయ వార్షికోత్సవం కోసం సమాయన్ని కేటాయించాలని ఎంపీలను ప్రధాని కోరారు. బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టి 9 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా తొమ్మిదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మే 15 నుంచి ఒక నెలపాటు ప్రభుత్వ పథకాలను తమ నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలని పార్టీ నేతలకు సూచించారని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ చెప్పారు. మాతృభూమి కోసం పనిచేయాలని పార్టీ నాయకులకు మోదీ పిలుపునిచ్చారు. విషపూరిత రసాయనాలతో భూమాత కలుషితం అవుతోందని, చెట్ల పెంచడం ద్వారా మెరుగుపరచాలని సూచించారు. రాజకీయ నాయకులు రాజకీయేతర అంశాలపై పనిచేయాలని, ఇది సమాజంపై చాలా ప్రభావం చూపిస్తాయని ఆయన అన్నారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ‘‘ బేటీ బచావో ’’ కార్యక్రమం గురించి ప్రస్తావించారు. లింగ నిష్పత్తిని మెరుగుపరచడంలో సహాయపడిందని ప్రధాని అన్నారు.

అమృత్ పాల్ సింగ్ సహాయకుడికి పాక్ మాజీ ఆర్మీ చీఫ్ కొడుకుతో సంబంధాలు

ఖలిస్తానీ వేర్పాటువాద నేత, ‘ వారిస్ పంజాబ్ దే ’ చీఫ్ అమృత్ పాల్ సింగ్ కోసం గత 10 రోజులుగా వేట సాగిస్తున్నారు పంజాబ్ పోలీసులు. అయితే ఆయన తప్పించుకు తిరుగుతున్నాడు. హర్యానా మీదుగా ఢిల్లీ చేరినట్లు తెలుస్తోంది. పూర్తిగా వేషధారణ మార్చి, తలపాగా తీసేసి మోడ్రన్ లుక్ తో తన రూపాన్ని మార్చుకుని పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. నేపాల్ కు పారిపోయి అక్కడి నుంచి విదేశాలకు వెళ్లేందుకు అమృత్ పాల్ సింగ్ ప్లాన్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే అమృత్ పాల్ విషయంలో నెమ్మనెమ్మదిగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే అతడికి పాకిస్తాన్ గూఢాచర్య సంస్థ ఐఎస్ఐతో పాటు విదేశాల్లో ఉన్న ఖలిస్తాన్ రాడికల్ సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు తేలింది. పాకిస్తాన్ తో పాటు విదేశాల నుంచి నిధులు అందుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.

శ్రీరామనవమికి ముస్తాబవుతున్న, ఒంటిమిట్ట

కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం శ్రీరామనవమికి ముస్తాబవుతోంది. ఏటా ఇక్కడ శ్రీరామనవమి తర్వాత అత్యంత వైభవంగా శ్రీరాముడి కళ్యాణం నిర్వహిస్తారు. ఇక్కడి మూలమూర్తులు కోదండరాముడు, సీతాదేవి, లక్ష్మణస్వామి. కడప నుంచి రాజంపేటకు వెళ్ళే మార్గంలో 27 కి.మీ. దూరంలో ఒంటిమిట్ట ఉంది. సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలలో వున్నందున ఈ క్షేత్రము ఏకశిలానగరము అని ప్రసిద్ధి చెందినది. నవ్యాంధ్ర ఏర్పడిన తరువాత ఈ ఆలయమున్న ఒంటిమిట్టను ఆంధ్రా భద్రాచలం గా పిలవడం మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీరామనవమి రోజున ఈ ఆలయంలోనే అధికారికంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. శ్రీరామనవమి రోజున ప్రభుత్వం తరపున సీఎం పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తారు. భద్రాచలంలో శ్రీరాముడి కళ్యాణం తర్వాత ఇక్కడ ఆ సకలగుణాభిరాముడి కళ్యాణ మహోత్సవం జరపడం ఆనవాయితీగా వస్తోంది. యావత్ తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి వేలాదిమంది భక్తులు తరలివస్తారు. అందుకు తగిన విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తుంటారు. ఈ ఆలయానికి చేరడం సులభమే. కడప-తిరుపతి రహదారిపై కడపనుంచి 26 కి.మీ.దూరం ప్రయాణిస్తే ఈ ఒంటిమిట్ట ఆలయానికి చేరుకోవచ్చు. రైలులో రాజంపేట లేక కడప సమీప రైల్వేస్టేషన్లలో దిగవచ్చు. ఈ ఆలయానికి తిరుపతి విమానాశ్రయం 100 కి.మీ.దూరంలో వుంది.ఈ ఆలయంలోని ప్రధాన విగ్రహం ఒకే శిలలో రాముడు, సీత, లక్ష్మణుడు విగ్రహాలు చెక్కబడ్డాయి. దేవాలయాలలోని మూల విగ్రహాలలో రాముని విగ్రహం పక్కన హనుమంతుడు విగ్రహం లేని రామాలయం భారతదేశంలో ఇదొక్కటే. శ్రీరామహనుమంతుల కలయికకు ముందే ఒంటిమిట్టలో సీతారామలక్ష్మణుల ఏకశిలా విగ్రహం స్థాపించినట్లు కథనం.

అనసూయ షో.. అందరి చూపు ఆ పుట్టుమచ్చ మీదనే

టాలీవుడ్ హాట్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ.. సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతాఇంతా కాదు. మొన్నటివరకు ఆంటీ అన్నందుకు గొడవ చేసి.. పోలీసుల వరకు వెళ్ళింది. ఆ తరువాత తన భర్తను ఎవరో నెటిజన్ వాడు అన్నందుకు.. తనదైన శైలిలో బుద్ధిచెప్పి షాక్ ఇచ్చింది. ఇక నిత్యం తన అందాల ప్రదర్శన చేస్తూ ఒకపక్క ప్రశంసలను, ఇంకోపక్క విమర్శలను అందుకుంటూ.. కెరీర్ ను కొనసాగిస్తోంది. అనసూయ.. ఇద్దరు బిడ్డల తల్లి. ఎంత ఏజ్ కాకపోయిన తల్లి అయ్యాకా.. తన బిడ్డలు తనను చూసి ఎబెట్టు గా ఫీల్ అవ్వకూడదు అనేలా ఉండాలి అని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. కానీ, అను మాత్రం నా జీవితం, నా ఇష్టం అంటూ నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాను హీట్ ఎక్కిస్తోంది. తాజాగా అనసూయ క్యాజువల్ డ్రెస్ లో కిక్ ఎక్కించింది. మేకప్ లేకుండా.. పిల్లలతో పాటు గేమ్ సెంటర్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. చిన్న షార్ట్ వేసుకొని థైస్ అందాలను అలా వదిలేసింది. అంతేకాకుండా తన షర్ట్ పై ఉన్న కొటేషన్ ను చదువుకోమని క్యాప్షన్ ఇచ్చింది. దానిపై.. ‘థిక్ థైస్.. థిన్ పేషెన్స్’ అని రాసి ఉంది. దీని అర్ధం ఈ ఫోటోలకు అనసూయ ఫోజ్ ఇచ్చినప్పుడే తెలిసిపోయి ఉంటుంది. థిక్ థైస్ ను చూపిస్తూ.. అమ్మడు కొంటె చూపులతో గిలిగింతలు పెడుతుంది.

స్టాక్ మార్కెట్.. మీడియా ఇండెక్స్‌.. వరస్ట్‌..

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ మంగళవారం తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగింది. గ్లోబల్‌ మార్కెట్‌ల నుంచి సానుకూల సంకేతాలు అందటంతో ఉదయం రెండు కీలక సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. కానీ.. ఇంట్రాడేలో లాభనష్టాల నడుమ ఊగిసలాడాయి. సాయంత్రం స్వల్ప నష్టాలతో ముగిశాయి. బీఎస్‌ఈ ఇండెక్స్‌ 57 వేల 550 లెవల్‌ వద్ద 100 పాయింట్లు కోల్పోయింది.ఎన్‌ఎస్‌ఈ సూచీ 16 వేల 950 పాయింట్ల వద్ద టెస్టింగ్‌కి గురైంది. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌లు సున్నా పాయింట్‌ 7 శాతం పడిపోయాయి. నిఫ్టీలో మీడియా ఇండెక్స్‌ వరస్ట్‌ పెర్‌ఫార్మర్‌గా మిగిలిపోయింది. ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ స్టాక్స్‌ స్వల్ప లాభాలతో బయటపడ్డాయి. పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్‌ 8 శాతం ర్యాలీ తీయగా కళ్యాణ్‌ జ్యూలర్స్‌ షేర్‌ ధర 11 శాతం పతనమైంది.సెన్సెక్స్‌ స్వల్పంగా 40 పాయింట్లు తగ్గి 57 వేల 613 పాయింట్ల వద్ద ఎండ్‌ అయింది. నిఫ్టీ కూడా అతితక్కువగా 34 పాయింట్లు కోల్పోయి 16 వేల 951 పాయింట్ల వద్ద క్లోజ్‌ అయింది.సెన్సెక్స్‌లోని మొత్తం 30 కంపెనీల్లో 11 కంపెనీలు మాత్రమే లాభాల్లో నడిచాయి. మిగతా 19 కంపెనీలు నష్టాలను చవిచూశాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ, రిలయెన్స్‌ ఇండస్ట్రీస్‌ మాత్రమే చెప్పుకోదగ్గ పనితీరు కనబరిచాయి.కళ్యాణ్‌ జ్యూలర్స్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ నేలచూపులు చూశాయి. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్‌, స్పార్క్‌, టొరెంట్‌ పవర్‌, సీఎస్‌బీ బ్యాంక్‌ రాణించగా విజయ డయాగ్నాస్టిక్స్‌, రేమండ్‌ కంపెనీలు వెనకబడ్డాయి. 10 గ్రాముల బంగారం రేటు 73 రూపాయలు పెరిగి.. గరిష్టంగా 58 వేల 599 రూపాయల వద్ద ట్రేడ్‌ అయింది. కేజీ వెండి ధర 243 రూపాయలు తగ్గి.. అత్యధికంగా 69 వేల 683 రూపాయలు పలికింది.