NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Ntv 1pm Headlines

Ntv 1pm Headlines

1) ముఖ్య గమనిక.. డిసెంబర్ 1 నుంచి కొత్త నిబంధనలు

మరో రెండు రోజుల్లో నవంబర్ నెల ముగియనుంది. అనంతరం ఈ ఏడాదిలోనే చివరి నెల డిసెంబర్ ప్రారంభం కానుంది. సాధారణంగా ప్రతినెల 1వ తేదీన కొన్ని మార్పులు జరుగుతుంటాయి. డిసెంబర్‌లో కూడా కొన్ని రూల్స్ మారబోతున్నాయి. ఇవి ప్రజల జీవనంపై ప్రభావం చూపనున్నాయి.

Read This: New Rules: ముఖ్య గమనిక.. డిసెంబర్ 1 నుంచి కొత్త నిబంధనలు

2) ట్రాన్స్‌జెండర్లకు ప్రభుత్వ ఉద్యోగాలు.. తెలంగాణలో తొలిసారి
తెలంగాణలో ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు చరిత్ర సృష్టించారు. డాక్టర్లు అయిన ప్రాచీ రాథోడ్, రూత్ జాన్‌పాల్ కొయ్యాల అనే ట్రాన్స్‌జెండర్స్.. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించారు. దీంతో.. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన తొలి ట్రాన్స్‌జెండర్స్‌గా వాళ్లు చరిత్రపుటలకెక్కారు. వాళ్లిద్దరు ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో మెడికల్ ఆఫీసర్స్‌గా నియమితులయ్యారు. ఇది ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి చారిత్రాత్మక విజయాన్ని సూచిస్తుంది. అయితే.. వీళ్లు ఈ స్థాయికి చేరుకోవడానికి చాలానే కష్టపడాల్సి వచ్చింది.

Read This: Transgender Doctors: ట్రాన్స్‌జెండర్లకు ప్రభుత్వ ఉద్యోగాలు.. తెలంగాణలో తొలిసారి

3) వైఎస్ వివేకా కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వివేకా హత్య కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేస్తూ తీర్పు వెలువరించింది. హైదరాబాద్ సీబీఐ స్పెషల్ కోర్టు ఈ కేసును విచారిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వివేకానందరెడ్డి కూతురు సునీత పిటిషన్‌పై విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఈ తీర్పు చెప్పింది. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించింది.

Read This:Andhra Pradesh: వైఎస్ వివేకా కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు

4) అఫ్తాబ్‌కు మళ్లీ పాలిగ్రాఫ్ పరీక్ష
సహజీవనం చేస్తున్న ప్రియురాలిని పాశవికంగా హత్య చేసి 35 ముక్కలు చేసిన అఫ్తాబ్ పూనావాలాకు మళ్లీ పాలిగ్రాఫ్‌ పరీక్షలు చేశారు. ఢిల్లీ రోహిణిలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌ సైన్సెస్‌ లాబొరేటరీలో ఈ పరీక్షలు నిర్వహించారు. ఇంతకు ముందు పాలిగ్రాఫ్ చేసే సమయంలో జ్వరం వచ్చిందని అఫ్తాభ్‌ అధికారులకు తెలపడంతో మధ్యలోనే నిలిపివేశారు. శ్రద్ధా వాకర్‌ పుర్రె, మరికొన్ని అవయవాలు ఎక్కడ పడేశాడు? అని ఈ పరీక్షలో ప్రశ్నించారు.

Read This: Shraddha Walker Case: అధిక భద్రతల నడుమ అఫ్తాబ్‌కు మళ్లీ పాలిగ్రాఫ్ పరీక్ష

5) దారుణం.. తోటి విద్యార్థులే విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా, కఠినమైన శిక్షలు విధిస్తున్నా.. కామాంధుల తీరు మాత్రం మారట్లేదు. బాలికలు, మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి, మృగాళ్ల ప్రవర్తిస్తున్నారు. తమ ఇంట్లోనూ మహిళలు ఉన్న సంగతి మర్చిపోయి, ఇతర మహిళలపై వికృత చేష్టలకు తెగబడుతున్నారు. ఇప్పుడు తాజాగా ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. తోటి విద్యార్థులే విద్యార్థినిపై సామూహిక అత్యాచారం చేశారు. ఆపై.. ఆ వికృతాన్ని వీడియో తీసి, ఆ అమ్మాయిని బెదిరించారు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది.

Read This: Hyderabad School Case: దారుణం.. తోటి విద్యార్థులే విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

6) గ్యాంగ్‌స్టర్లు, ఉగ్రవాద ముఠాలకు లింక్‌.. దేశవ్యాప్తంగా ఎన్‌ఐఏ దాడులు

గ్యాంగ్‌స్టర్లు, ఉగ్రవాద ముఠాలకు మధ్య ఉన్న సంబంధాన్ని విచ్ఛిన్నం చేసేందుకు మంగళవారం ఎన్ఐఏ అధికారులు దాడులు జరిపారు. జాతీయ దర్యాప్తు సంస్థ మంగళవారం దేశంలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఉత్తర్​ ప్రదేశ్​, పంజాబ్​, దిల్లీ, రాజస్థాన్​తో పాటు హరియాణాలోని పలువురు గ్యాంగ్‌స్టర్ల స్థలాల్లో అధికారులు దాడులు నిర్వహించారు. గ్యాంగ్‌స్టర్-టెర్రర్ కేసులో దర్యాప్తులో భాగంగా ఢిల్లీ-ఎన్‌సీఆర్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్‌లోని 20 ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ-ఎన్‌ఐఐ దాడులు జరిపింది. దేశవ్యతిరేక కార్యకలాపాలకు గ్యాంగ్‌స్టర్లను ఏవిధంగా ఉపయోగించుకుంటున్నారనే దానిపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఆరా తీస్తోంది. ఇప్పటికే యాంటీ టెర్రర్ ఏజెన్సీ నిఘాలో ఉన్న లారెన్స్ బిష్ణోయ్, నీరజ్ బవానా, టిల్లు తాజ్‌పురియా, గోల్డీ బ్రార్‌లతో సహా ఆరుగురిని దృష్టిలో ఉంచుకుని ఈ సోదాలను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Read This: NIA Raids: గ్యాంగ్‌స్టర్లు, ఉగ్రవాద ముఠాలకు లింక్‌.. దేశవ్యాప్తంగా ఎన్‌ఐఏ దాడులు