NTV Telugu Site icon

Top Headlines @1PM: టాప్ న్యూస్

Top Headlines

Top Headlines

19న తెలంగాణకు ప్రధాని మోడీ…పరేడ్ గ్రౌండ్స్ లో సభ

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈనెల 19న హైదరాబాద్ రానున్నారు ప్రధాని మోడీ. ఆయన పర్యటనలో భాగంగా పెరేడ్ గ్రౌండ్ లో చిన్న సభ ఏర్పాటుచేస్తున్నారు. సికింద్రబాద్ లో కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్ల పై ఎంపీ డా.కె.లక్ష్మణ్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పరిశీలించారు. ప్రధాని పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించనున్నారు మోడీ…. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకి శంకుస్థాపన చేస్తారు. కాజీపేట రైల్వే కోచ్ ఓవరాలింగ్ వర్క్ షాప్ కు కూడా శంకుస్థాపన చేస్తారు ప్రధాని మోడీ. వందే భారత్ ఎక్స్ ప్రెస్ సికింద్రాబాద్ నుంచి విజయవాడ వరకూ తిరగనుంది. ఈ ట్రైన్ కోసం ప్రయాణికులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీ డెవలప్ మెంట్ వర్క్స్ వేగంగా చేయనున్నారు. 700 కోట్లతో ఆధునికీకరణ పనులు చేపట్టారు. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రకటన తర్వాత తొలిసారి సికింద్రాబాద్ రానున్న మోడీ ఏం మాట్లాడతారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ నెల 18న ఖమ్మంలో BRS సభకు మూడు రాష్ట్రాల సీఎంలు రానున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తో పాటు కేరళ సీఎం పినరయి విజయన్.. మాజీ సీఎం అఖిలేష్ లకు ఆహ్వానం పంపారు సీఎం కేసీఆర్. BRS ఏర్పాటయ్యాక తొలి బహిరంగ సభ ఇదే. తొలుత ఢిల్లీలో నిర్వహించాలని అనుకున్న సభ ఖమ్మంకు మార్పు చేశారు.

ఐటీ ఉద్యోగాల కల్పనలో మనమే బెస్ట్.. ఫస్ట్

దేశంలో ఐటీ ఉద్యోగాల కల్పనలో హైదరాబాద్ బెంగళూర్ను క్రాస్ చేసిందన్నారు తెలంగాణ ఐటీమంత్రి కేటీఆర్. తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో అద్భుతంగా ఐటీ అభివృద్ధి చెందుతుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. దేశంలోని ఐటీ ఉద్యోగుల్లో 20 శాతం హైదరాబాద్‌లోనే ఉన్నారని చెప్పారు. ఐటీ రంగంలో తెలంగాణ ప్రగతి తమకు గర్వకారణమన్నారు. హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్డులోని థ్రిల్‌ సిటీలో ఐటీ పరిశ్రమల ప్రతినిధుల ముఖాముఖి సమావేశానికి మంత్రి కేటీఆర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఐటీ రంగంలో ఇన్నోవేషన్‌ ఎకో సిస్టమ్‌ను అద్భుతంగా అభివృద్ధి చేశామన్నారు. మహిళా పారిశ్రామికవేత్తల కోసం వీ-హబ్‌ ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఏ రాష్ట్రంలోనైనా సుస్థిర ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి జరుగుతుందన్నారు.పెట్టుబడులకు హైదరాబాద్‌ అనువైన నగరమని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ఐటీ రంగంలో లక్షలాది ఉద్యోగాలు కల్పించిందని, ఉద్యోగాల కల్పనలో బెంగళూరును హైదరాబాద్‌ దాటిందన్నారు. అయితే, బెంగళూరును తక్కువ చేసి చూపించడం తన ఉద్దేశ్యం కాదన్నారు కేటీఆర్. ఐటీలో గత రెండేండ్లలో కొత్తగా 40 వేల ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. నగరంలో ఉత్తరంవైపు ఐటీ రంగాన్ని విస్తరిస్తున్నామన్నారు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగంలో ఇన్నోవేషన్‌ ఎకోసిస్టమ్‌ అద్భుతంగా పనిచేస్తున్నదని కితాబిచ్చారు. తొలిరెండు స్పేస్‌టెక్‌ స్టార్టప్‌లు హైదరాబాద్‌కు చెందినవేనని పేర్కొన్నారు. వ్యాపారవేత్తలు హైదరాబాద్‌ వైపు ఆకర్షితులవుతున్నారని చెప్పారు. తెలంగాణలో టీఫైబర్‌ నెట్‌ ద్వారా ఇంటర్నెట్‌ అందిస్తామని వెల్లడించారు.

అగ్నివీర్ ఫస్ట్ బ్యాచ్ రెడీ.. ఫిబ్రవరి నుంచి ఎంట్రీ

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అగ్నివీర్ స్కీం ఎంతటి వివాదం రేపిందో అందరికీ తెలిసిందే. మూడేళ్ల విరామం అనంతరం ఆర్మీ చేపట్టిన అగ్నివీర్ పథకంలో భాగంగా తొలి బ్యాచ్ రెడీ అయింది. ఆర్మీలో ఉద్యోగాల నియామకం కోసం ప్రయోగాత్మకంగా చేపట్టిన పథకం అగ్నివీర్ లు. హైదరాబాద్ లోని ఆర్టిలరీ సెంటర్లో రిపోర్టు చేశారు తొలి బ్యాచ్ అగ్నివీర్లు. శిక్షణ కేంద్రంలో రిపోర్టు చేసిన అగ్నివీర్లకు స్వాగతం పలికారు ఆర్మీ ఉన్నతాధికారులు. అగ్నివీర్ శిక్షణకు అవసరమైన సకల సదుపాయాలను కల్పిస్తున్నామంటున్నారు అధికారులు. కమాండెంట్ రాజీవ్ చౌహన్ మాట్లాడుతూ.. అగ్నివీరులకు శిక్షణ ఇవ్వడంలో బెస్ట్ క్యాంపస్ గోల్కొండ అన్నారు. 300 మంది సభ్యులు ఈ సెంటర్ కు వచ్చారన్నారు. వీరంతా దేశంలోని పలు రీజియన్లకు చెందినవారు. 3300 మంది అగ్నివీర్లు ఫిబ్రవరి చివరిలో సైన్యంలో చేరబోతున్నారని ఆయన చెప్పారు. మొత్తం 5500 మందికి గోల్కొండ ఆర్టిలరీ సెంటర్లో శిక్షణ ఇవ్వబోతున్నాం అని చెప్పారు. ఏడాది పాటు ఆర్టిలరీ సెంటర్లో ట్రైనింగ్ ఇచ్చామన్నారు. అత్యాధునిక పరికరాలు, శిక్షణకు కావాల్సిన సదుపాయాలు ఇక్కడ బాగున్నాయన్నారు. జనవరి ఒకటితో అగ్నివీర్ల శిక్షణ పూర్తయ్యిందరి చౌహాన్ వివరించారు.

మీటర్లు పెట్టలేదని 30 వేల కోట్లు మోడీ ఆపేశారు 

కరోనా కష్టకాలంలో ఉద్యోగుల, ఎమ్మెల్యేల, జీతాలు ఆపి రైతులకు రైతుబంధు వేశాం.రైతులు ఉపయోగించే ట్రాక్టర్లకు పన్ను రద్దు చేశాం. దేశంలో వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అన్నారు. దేశంలో తెలంగాణలో తప్ప ఎక్కడ చూసిన బోరు బావులకు మీటర్లు పెట్టారు..రైతు ఇంటి దగ్గరికి బిల్లు పంపారు.బాయిలకాడ మీటర్లు పెట్టలేదని కేంద్ర ప్రభుత్వం 30 వేల కోట్లు ఆపింది. మీటర్లు పెడతామని సంతకం పెడితే 30 వేల కోట్లు ఇస్తామని కేంద్రం చెబుతుంది. అయినా సీఎం కేసీఆప్ ఒప్పుకోలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో తూప్రాన్ లో మూడు మార్కెట్లు వచ్చాయి. గతంలో ఈ ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఉన్న వారు ఒక్క మార్కెట్ కూడా ఇవ్వలేదు.

కాపులకు RIP.. కమ్మోళ్లకు కంగ్రాట్స్..!!

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కావడంపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన రీతిలో సెటైర్లు వేశాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి విమర్శలు గుప్పించాడు. కేవలం డబ్బులు కోసం పవన్ తన సొంత కాపులను కమ్మోళ్లకు అమ్మేస్తాడని అస్సలు ఊహించలేదని వర్మ అన్నాడు. దీంతో ‘RIP కాపులు , కంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్లు’ అంటూ సోషల్ మీడియాలో వర్మ ట్వీట్ చేశాడు. అయితే వర్మ ట్వీట్‌పై జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు మండిపడుతున్నారు.అయితే ఆర్జీటీ చేసిన ట్వీట్ పట్ల టీడీపీ నేత బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. ‘కామంతో కాళ్ళు నాకావ్ అనుకున్నా, కానీ పేటీఎం డబ్బుల కోసం ఏమైనా నాకుతావని ఊహించలేదు.. RIP RGV, కంగ్రాట్స్ జగన్ రెడ్డి’ అంటూ చురకలు అంటించారు. ఇటీవల అషూరెడ్డి కాళ్లు నాకుతూ వర్మ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయ్యాయి. ఈ అంశంతో పాటు తాజాగా వర్మ చేసిన ట్వీట్‌ను జత చేసి టీడీపీ నేత బుద్ధా వెంకన్న తనదైన శైలిలో స్పందించారు. కాగా పవన్ అన్నా.. టీడీపీ అన్నా వర్మకు ఈమధ్య అసలు పడటం లేదు.

ప్రయాణికుల పాలిట ఉరి తాళ్లుగా మారుతున్న కేబుల్స్

రోడ్లపై వెళ్తున్న ప్రయాణికుల పాలిట కేబుల్స్ ఉరితాళ్లుగా మారుతున్నాయి. తెగిపడిన టెలిఫోన్, ఇంటర్నెట్, టీవీ కేబుల్ వైర్లు రోడ్లపై వేలాడుతుండడంతో ఆ దిశలో పోయే ప్రయాణికుల మెడకు చుట్టకుని ప్రాణాల పైకి తెస్తున్నాయి. ఇలాంటి ఘటనలు చాలా చోట్ల జరుగుతున్న సదరు సంస్థలు పట్టించుకున్న పాపాన పోవడంలేదు. కరెంట్ సప్లయ్ తక్కువగా ఉండే కేబుల్స్ కాబట్టి ఎలాగో వాహనదారులు ప్రాణాపాయం నుంచి బయటపడుతున్నారు. అదే కరంట్ వైర్లు పడితే ప్రమాదస్థాయి ఎక్కువగా ఉంటుంది. కావున రోడ్లపై వేసే వైర్లపై ఎప్పటికప్పుడు మానిటరింగ్ ఉండాలని వాహనదారులు కోరుతున్నారు.
కొచ్చిలో రోడ్డుపై వెళ్తున్న మహిళ మెడకు కేబుల్ చిక్కుకోవడంతో ఆమె ఆస్పత్రి పాలైంది. కలమసెరి తేవకల్-మనాలిముక్ రహదారిపై పొన్నకుడం దేవాలయం సమీపంలో ఆదివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన శ్రీని అనే మహిళను అప్పక్కూడా ఆస్పత్రిలో చేర్పించారు. ఆదివారం కావడంతో ఆమె తన కుమారుడితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఆమె ముఖం, మెడకు కేబుల్ తగిలింది. కేబుల్‌ తెగి వీధిలైట్‌ పగిలి కింద పడింది. బైక్ బోల్తా పడకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని శ్రీని చెబుతున్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేస్తానని ఆమె చెప్పారు.

జగన్ ప్రజా సంకల్ప యాత్ర ముగిసి ఇవాళ్టికి నాలుగేళ్లు

వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్ర ముగిసి ఇవాళ్టికి నాలుగేళ్లు పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఇతర నేతలు కట్ చేశారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, లేళ్ల అప్పిరెడ్డి, ఎంపీ నందిగం సురేష్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. జగన్ పాదయాత్రకు టైమ్ బాండ్ పెట్టుకోలేదని.. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు ఆయన పాదయాత్ర చేశారని తెలిపారు. సుదీర్ఘ పాదయాత్ర చేసిన తర్వాత కేవలం రెండు పేజీలతోనే మేనిఫెస్టో సిద్ధం చేశారన్నారు. నాయకుడు అంటే ఇచ్చిన మాటను ఎంత వరకు పూర్తి చేశాడు అనే విషయాన్ని ప్రజలు కూడా గమనిస్తారని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. జగన్ మ్యానిఫెస్టోలో హామీలను 98 శాతం పూర్తి చేశారన్నారు. మ్యానిఫెస్టోలో 98 శాతం పూర్తి చేసిన నాయకుడు చరిత్రలో లేడని.. అధికారంలోకి వచ్చిన మూడో రోజే మ్యానిఫెస్టోను మాయం చేసిన పార్టీలు ఉన్నాయని టీడీపీని ఉద్దేశించి ఉమ్మారెడ్డి ఆరోపించారు.

జాతీయ కార్‌ రేసింగ్‌ ఛాంపియన్ షిప్‌లో విషాదం

తమిళనాడులో జరుగుతున్న జాతీయ కార్‌ రేసింగ్‌ ఛాంపియన్ షిప్‌లో విషాదం చోటు చేసుకొంది. వెటరన్‌ రేసర్‌ కేఈ కుమార్‌ (59) కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. రెండో రౌండ్ పోటీల్లో భాగంగా మద్రాస్ అంతర్జాతీయ సర్క్యూట్‌లో ఈ ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన కేఈ కుమార్ కారు మరో పోటీదారుడి వాహనాన్ని ఢీకొట్టి ట్రాక్‌ నుంచి పక్కకు వెళ్లి బోల్తా పడింది. వెంటనే రేసును నిలిపివేసిన నిర్వాహకులు కారులో నుంచి కేఈ కుమార్‌ను బయటకు తీశారు. అక్కడే ఏర్పాటు చేసిన వైద్య కేంద్రంలో ప్రథమ చికిత్స అందించిన తర్వాత స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే కుమార్‌ను కాపాడేందుకు వైద్యుల బృందం ప్రయత్నించినా తీవ్ర గాయాల కారణంగా అతడు మరణించాడు. కాగా ఇదో దురదృష్టకరమైన ఘటన అని ఎమ్ఎమ్ఎస్‌సీ ఎఫ్ఎమ్‌సీఐ మీట్ ఛైర్మన్ విక్కీ చంధోక్ వెల్లడించారు. కేఈ కుమార్ అనుభవజ్ఞుడైన రేసర్ అని.. ఓ స్నేహితుడిగా, పోటీదారుడిగా కొన్ని దశాబ్దాల నుంచి అతడు తనకు తెలుసన్నారు. కుమార్ మరణం రేసింగ్ కుటుంబానికి బాధ కలిగిస్తోందన్నారు. ఈ ప్రమాద ఘటనపై విచారణ జరుపుతామని తెలిపారు. కాగా కుమార్ గౌరవార్ధం మిగిలిన రేసులను రద్దు చేస్తున్నట్లు మద్రాస్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ (ఎమ్ఎమ్ఎస్‌సీ) తెలిపింది. జీవిత కాల సభ్యుడు మరణించడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది.