ప్రధాని మోడీపై నితీష్ కుమార్ తీవ్ర విమర్శలు
Nitish Kumar
బీహర్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ప్రధాని నరేంద్రమోదీపై విమర్శలు గుప్పించారు. ఇటీవల మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ నరేంద్ర మోదీని ‘‘న్యూ ఇండియా ఫాదర్ ఆఫ్ నేషన్’’అని ప్రశంసించింది. అయితే ఈ వ్యాఖ్యలపై సెటైరికల్ గా స్పందించారు నితీష్ కుమార్. కొత్త జాతిపిత దేశానికి ఏం చేశారని ప్రశ్నించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)కు స్వాతంత్య్ర పోరాటంతో సంబంధం లేదని, బీజేపీకి సంబంధం లేదని అన్నారు. న్యూ ఫాదర్ ఆఫ్ నేషన్ అని ఇటీవల చదివానని.. దేశంకోసం కొత్త జాతిపిత ఏం చేశారు అని అడిగారు. మహాత్మా గాంధీని ఎవరితో పోల్చలేమని బీజేపీ న్యూ ఇండియా విమర్శలపై మహారాష్టర పీసీసీ అధ్యక్షుడు నానా పటోలే కామెంట్స్ చేశారు. జాతి పితామహుడిని ఎవరితోనూ పోల్చలేము. బీజేపీ నవభారతం కొద్ది మంది ధనవంతులైన మిత్రుల కోసమే అని ఆరోపించారు. భారతదేశంలో చాలా మంది ఆకలితో బాధపడుతున్నారని.. మాకు కొత్త భారత దేశం అవసరం లేదని ఆయన అన్నారు. కొంతమంది ధనవంతులైన వ్యాపారవేత్తల కోసం వారు మోడీజీని ‘నేషన్ ఆఫ్ ది నేషన్’గా మార్చాలనుకుంటే, వారిని చేయనివ్వండి. అందుకు నేను వారిని అభినందిస్తున్నానని వ్యాఖ్యానించారు.
జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. ఆ భూములకు డి పట్టాలు
Image14
ఏపీ ప్రభుత్వం మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతంలోని లంక భూములకు డి పట్టాలివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏ, బీ కేటగిరీలుగా గుర్తించిన లంక భూములకు సంబంధించి వివాదాల్లేకుండా సాగు చేసుకుంటున్న అర్హులకు పట్టాలు ఇవ్వడంతోపాటు సి కేటగిరీలో ఉన్న భూములకు ఐదేళ్ల లీజు పట్టాలు ఇవ్వాలని భావిస్తోంది. ఈ మేరకు లంక భూముల అసైన్డ్ నిబంధనలను సవరిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ సాయిప్రసాద్ జీఓ జారీ చేశారు. ఆయా ప్రాంతాల్లోని ఒండ్రు మట్టి ఒక దగ్గర చేరి ఉన్న భూములు కాలక్రమేణా సాధారణ భూములుగా మారి సారవంతంగా ఉండడంతో రైతులు వాటిని సాగు చేసుకుంటున్నారు. ఏ, బీ కేటగిరీ భూముల్లోని కొందరికి గతంలో డి పట్టాలిచ్చారు. మునిగిపోయే అవకాశం ఉండడంతో సీ కేటగిరీ భూములకు పట్టాలివ్వకుండా ఒక సంవత్సరం లీజుగా ఇచ్చారు.
కొనసాగుతున్న పెన్షన్ల పంపిణీ.. 64 లక్షలకు చేరిన లబ్ధిదారులు
ప్రతి నెల ఒకటవ తేదీ వచ్చిందంటే చాలు ఏపీలో వాలంటీర్లు బిజీ అయిపోతారు. తెల్లవారకముందే తలుపు తట్టి మరీ పెన్షన్లు అందచేస్తుంటారు. 2023 నూతన సంవత్సరం వేళ వాలంటీర్లు పెన్షన్ల పంపిణీలో బిజీగా వున్నారు. నూతన సంవత్సరం రోజు తెల్లవారుజాము నుంచి రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పండుగ కొనసాగుతుంది. కొత్త సంవత్సరంతో పాటే రాష్ట్రంలో పింఛన్ వారోత్సవాలు మొదలయ్యాయి. కోట్లాది రూపాయలు పంపిణీ చేస్తున్నారు. లక్షలాది మంది అవ్వాతాతలు, వితంతు, ఒంటరి మహిళ, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల ఇళ్లలో కొత్త వెలుగులు వచ్చేశాయి. ఇప్పటి వరకు ప్రతి నెలా రూ.2,500 చొప్పున అందుకుంటున్న పింఛను డబ్బులు ఈరోజు నుంచి ప్రతి నెలా రూ.2,750 చొప్పున అందుకుంటున్నారు. వైయస్ జగన్ ప్రభుత్వం పెంచిన పెన్షన్ మొత్తం 2,750 రూపాయలు వాలంటీర్లు లబ్ధిదారులకు అందజేస్తున్నారు. మరోవైపు ఈ నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 2,31,989 మందికి వైయస్ జగన్ ప్రభుత్వం కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. జనవరి 3వ తేదీన సీఎం వైయస్ జగన్ రాజమండ్రిలో పింఛను పెంపు వారోత్సవ కార్యక్రమంలో స్వయంగా పాల్గొని లబ్ధిదారులతో మాట్లాడనున్నారు. రాష్ట్రంలో రికార్డు స్థాయికి చేరాయి పెన్షన్లు. 64.06 లక్షలకు చేరాయి పింఛన్లు. ప్రభుత్వం తాజాగా మంజూరు చేసిన 2,31,989 పింఛన్లతో కలిపి జనవరి నెలలో రాష్ట్రంలో సామాజిక పింఛన్ల లబ్ధిదారుల సంఖ్య 64,06,240కి చేరుకుంది.
ఆ స్టూడెంట్స్‌కి రక్త పరీక్ష.. బాడీలు కుటుంబ సభ్యులకు అప్పగింత
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నం.3లో ఘోర రోడ్డు ప్రమాదానికి కారణమైన నిందితులకు పోలీసులు రక్త పరీక్షలు నిర్వహించారు. రిపోర్ట్స్ వచ్చిన తర్వాతే వాళ్లు మద్యం సేవించారా? లేదా? అనే విషయంపై క్లారిటీ వస్తుందని అధికారులు చెప్తున్నారు. ఈ ప్రమాదంలో నిందితులు ప్రణవ్, వర్ధన్ రావు స్వల్ప గాయాలతో బయటపడ్డారని వెల్లడించారు. వీళ్లిద్దరు మణిపాల్ యూనివర్శిటీలో ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌గా తేల్చారు. ప్రణవ్ తండ్రి డెంటిస్ట్ కాగా.. వర్ధన్ తండ్రిది ఒక చిన్నపాటి బిజినెస్ అని పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ కారు ప్రమాదానికి గల కారణాలమైన విచారణ చేస్టున్నామని.. ప్రణవ్, వర్ధన్‌లకు చికిత్స అందిస్తున్నామని పోలీసులు స్పష్టం చేశారు. ప్రణవ్ నడుపుతున్న కారు.. అతని తండ్రి విజయ్ కుమార్ పేరు మీద ఉన్నట్టు గుర్తించారు. ప్రణవ్ మద్యం సేవించి కారు నడిపాడని ప్రాథమిక విచారణలో తేలగా, రిపోర్ట్స్ వచ్చేవరకూ ఏది తేల్చలేమని అధికారులు చెప్తున్నారు.
ఇదే కొనసాగితే 2024లో మార్పు ఖాయం.. రాహుల్ గాంధీపై సంజయ్ రౌత్ వ్యాఖ్యలు
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నాయకత్వానికి గతేడాది కొత్త ఊపు వచ్చిందని.. ఇది 2023లో కూడా ఇదే విధంగా కొనసాగితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో రాజకీయ మార్పును చూడవచ్చని శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం నేత సంజయ్ రౌత్ ఆదివారం పేర్కొన్నారు. శివసేన పార్టీ పత్రిక ‘సామ్నా’లో రోఖ్‌థోక్ కాలంలో సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు దేశంలో ద్వేషం, విభజన విత్తనాలు నాటవద్దని అన్నారు. ప్రస్తుతం రామమందిర సమస్య పరిష్కారమైందని కాబట్టి ఈ అంశంపై ఒట్లు అడగలేవని రౌత్ సామ్నాలో పేర్కొన్నారు. అందుకే కొత్తగా ‘లవ్ జిహాద్’ అనే దాన్ని వెతుకుతున్నారని విమర్శించారు. ఎన్నికల్లో గెలవడానికి హిందువుల్లో భయాన్ని సృష్టించడానికి ఈ లవ్ జిహాద్ ను ఉపయోగిస్తారా..? అని బీజేపీని ప్రశ్నించారు. గత నెలలో జరిగిన నటి తునీషా శర్మ, శ్రద్ధా వాకర్ కేసులను ప్రస్తావిస్తూ.. ఇవి లవ్ జిహద్ కేసులు కాదని అన్నారు. అయితే ఏ మతానికి చెందిన ఏ స్రీ కూడా అఘాయిత్యాలకు గురికావద్దని అన్నారు.
న్యూ ఇయర్ వేళ గ్యాస్ బాంబ్ పేల్చిన కేంద్రం… ధర పెంపు
ఎవరైనా కొత్త సంవత్సరం రోజు శుభవార్త చెప్తారు. కానీ.. మన కేంద్ర ప్రభుత్వం మాత్రం చేదువార్త అందించింది. శుభమా అని కొత్త సంవత్సరంలోకి ఇలా అడుగుపెట్టామో లేదో, అప్పుడే కేంద్రం బాంబ్ పేల్చింది. ఇప్పటికే పెరిగిన ధరలతో బతుకుజీవుడా అంటూ జీవనం కొనసాగిస్తున్న సామాన్య ప్రజలపై మరో భారం మోపింది. కమర్షియల్ సిలిండర్ ధరను రూ. 25 మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రకటించాయి. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆ సంస్థలు వెల్లడించాయి. ఈ తాజా పెంపు.. రెస్టారెంట్లు, ఇతర వాణిత్య సంస్థలపై ప్రభావం చూపనుంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు రూ.1768కి చేరింది. ముంబైలో రూ.1721కి పెరగ్గా.. కోల్‌కతాలో రూ.1870కి, చెన్నైలో రూ.1917కి గరిష్టంగా చేరింది. అయితే.. గృహావసరాలకు వినియోగించే 14 కిలోల గ్యాస్ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1105గా ఉంది. గతేడాది జనవరిలో సిలిండర్ ధర రూ. 952 ఉండగా, డిసెంబర్ నాటికి అది రూ. 1105కి చేరింది.
హర్యానా క్రీడా శాఖ మంత్రి సందీప్ సింగ్ పై లైంగిక వేధింపుల కేసు
హర్యానా క్రీడా శాఖ మంత్రి సందీప్ సింగ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. మహిళా జూనియర్ కోచ్ పోలీసులకు లైంగిక వేధింపుల ఆరోపణలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. చండీగఢ్ పోలీసులు శనివారం సందీప్ సింగ్ పై వేధింపులు, అక్రమంగా నిర్భందించడం, లైంగిక వేధింపులు, నేరపూరిత బెదిరింపులు కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఒలింపియన్, భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ అయిన సిందీప్ సింగ్ పై శనివారం రాత్రి సెక్టార్ 26 పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు అయింది. అయితే మంత్రి తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారం అయినవని అన్నారు. ఫిబ్రవరి-నవంబర్ మధ్యకాలంలో మంత్రి తన కార్యాలయంలో, ఇతర ప్రదేశాల్లో తనను వేధించారని మహిళా కోచ్ మంత్రిపై ఆరోపణలు చేశారు. ఒకసారి తనను సెక్టార్ 7లో కలవమని అడిగారని.. మంత్రి ఎక్కువగా తనను సోషల్ మీడియా ద్వారా కమ్యూనికేట్ చేసేవాడని.. చండీగఢ్ లోని తన ఇంట్లో తనను అనుచితంగా తాకాడు అని మహిళ ఆరోపించారు. ఈ వేధింపులపై మహిళా కోచ్ శుక్రవారం చండీగఢ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో మంత్రిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
రూ. 18 వేలకే రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్.. వైరల్ అవుతోన్న బిల్లు
Royal Enfield Bike
న దేశంలో ఎంతో ప్రజాదరణ పొందిన బైక్స్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350సీసీ ఒకటి. ఇది మార్కెట్‌లోకి వచ్చి దశాబ్దాలు అవుతున్నా, ఇప్పటికీ దీని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అందుకే.. మేకర్స్ కూడా దీని లుక్ మార్చట్లేదు. కాలానికి అనుగుణంగా టెక్నికల్ మార్పులైతే చేస్తున్నారు కానీ, ఈ బైక్ పట్ల జనాలకు అనుభూతి దెబ్బతినకుండా ఉండేందుకు లుక్ విషయంలో మార్పులు చేపట్టడం లేదు. ఇది లాంగెస్ట్ రన్నింగ్ మోడల్ కావడంతో.. ఇదొక లెజెండరీ బైక్‌గా అవతరించింది. ప్రస్తుతం మార్కెట్‌లో దీని విలువ రూ. 2.2 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. కానీ.. ఒకప్పుడు ఈ బైక్ ధర కేవలం రూ. 18,700 మాత్రమేనన్న విషయం మీకు తెలుసా? అవును.. 1986లో దీని ఖరీదు వేలల్లోనే ఉండేది. ఇందుకు సంబంధించిన బిల్లుని ఒక వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. దాన్ని ఇన్‌స్టాలో ఇలా పోస్ట్ చేయడమే ఆలస్యం, క్షణాల్లో వైరల్ అయ్యింది.
