రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి గవర్నర్ స్వాగతం
శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి సత్యవతి రాఠోడ్ స్వాగతం పలికారు. శంషాబాద్ నుంచి రాష్ట్రపతి నేరుగా హెలికాప్టర్‌లో శ్రీశైలం బయలుదేరారు. రోడ్డు మార్గం ద్వారా 12.05కు శ్రీశైలానికి చేరుకోనున్నారు రాష్ట్రపతి. రాష్ట్రపతితో కలిసి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, గవర్నర్ తమిళిసై శ్రీశైలం వెళ్ళనున్నారు. మధ్యాహ్నం 2.45 నిమిల వరకు ఆలయ దర్శనం అనంతరం వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు సుండపెంట నుంచి బయలుదేరనున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ముర్ము బస చేయనున్నారు. సాయంత్రం 4.15కు హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ చేరుకోనున్నారు. రాష్ట్రపతి తొలిసారి తెలంగాణకు రానున్న సందర్బంగా రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ ఘనంగా స్వాగతం పలకనున్నారు. సికింద్రాబాద్ యుద్ధ స్మారకం వద్ద పుష్పాంజలి ఘటిస్తారు. బొల్లారంలో వీరనారీలకు సత్కారం చేస్తారు.
చేర్యాల జెడ్పీటీసీ మల్లేశంపై దాడి.. ఆస్పత్రిలో మృతి
చేర్యాల జెడ్పీటీసీ శేట్టే మల్లేశంపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి చేసిన ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండంలం గుజ్జకుంటలో సంచలనంగా మారింది. వాకింగ్ కు వెళ్తుండగా గొడ్డళ్లు, కత్తులతో దాడి దుండగులు చేశారు. దీంతో మల్లేశంకు తలకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తపు మడుగులో పడి ఉన్న మల్లేశంను హుటాహుటిన సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే మల్లేశం అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మల్లేశం మృతిచెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సిద్దిపేట నుంచి హైదరాబాద్ తీసుకెళ్తుండగా మార్గ మధ్యలోనే మల్లేశం మృతి చెందినట్లు కుటుంబ సభ్యలు తెలిపారని పోలీసులు పేర్కొన్నారు. ఉదయం వాకింగ్ కి వెళ్తుండగా గొడ్డళ్లు, కత్తులతో మల్లేశంపై కొందరు దుండగులు దాడి చేశారు. అయితే మల్లేశం తలకి తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడిఉంటంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే మల్లేశంను ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందినట్లు తెలిపారు.
భయం ఉంది కాబట్టే.. గెలుస్తున్నాం
టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. గుడివాడలో టెన్షన్ నెలకొన్న వేళ ఆయన సంచలన ప్రెస్ మీట్ నిర్వహించారు. చంద్రబాబు, రావి వెంకటేశ్వరరావుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వంగవీటి రంగాను పొట్ట పెట్టుకున్న పార్టీలు ఏ స్థాయికి వెళ్లాయో చూస్తున్నాం.రంగాని పాతాళానికి తొక్కేయాలని ప్రయత్నించారు.రంగాను గౌరవించని వ్యక్తులు కూడా ఇప్పుడు బూట్లు నాకాల్సిన పరిస్థితి.రంగా మాకు ఆదర్శ ప్రాయుడు.రంగా కుటుంబం వెనుక.. ఆయన అభిమానుల వెనుక అండగా ఉంటాం.అంబేద్కర్, ఎన్టీఆర్, రంగా వంటి వారు పార్టీలకు అతీతంగా ప్రదల గుండెల్లో నిలబడిన వ్యక్తులు. రంగాను హతమార్చిన టీడీపీ.. అంబేద్కర్ ను పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీలకు ఏ గతీ పెట్టిందో తెలుసు.ఎన్టీఆరును, రంగాను చంపిన వ్యక్తులే దండేసే నైజం టీడీపీది.నిన్న రావికి.. రంగా అభిమానులకు జరిగిన గొడవ.రంగా చనిపోయాక రావి కుటుంబం ఆస్తుల మీదే దాడి చేశారు.మా ఆస్తుల మీద దాడి చేయలేదే..?రావి బట్టల షాప్ మీద దాడి చేయలేదా..?రంగా హత్య తర్వాత రావి గుడివాడ నుంచి పారిపోయాడు.శోభనాద్రీని రంగా అభిమానులు బూటు కాలితో తన్నలేదా..?రంగా హత్యలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వెలగపూడి రామకృష్ణ బాబు, దేనినేని ఉమ ఏ పార్టీలో ఉన్నారని నాని ప్రశ్నించారు.
మొన్న సంగారెడ్డిలో.. నిన్న జడ్చర్లలో నడిరోడ్డుపై ప్రసవాలు
సాధారణంగా ప్రసవాలు ఆస్పత్రుల్లో జరుగుతుంటాయి. కానీ తెలంగాణలో మాత్రం నడిరోడ్డుమీద ప్రసవించాల్సి వస్తోంది. ప్రభుత్వం ఎంత మొత్తుకున్నా ప్రభుత్వాసుపత్రి సిబ్బందిలో మార్కులు రావడం లేదు. వారి కర్కశత్వానికి … ఓ నిండు గర్బిణి అర్దరాత్రి చలిలో రోడ్డు పై ప్రసవించిన ఘటన జడ్చర్లలో చోటు చేసుకుంది. అసలే నిండు గర్భిణీ…. దానికి తోడు ప్రసవ నొప్పులు…. కూత వేటు దూరంలో ఆసుపత్రి ఉన్నా చేర్చుకోలేదు సిబ్బంది. దీంతో ఎముకలు కొరికే చలిలో అర్ధరాత్రి దాటిన తర్వాత పురిటి నొప్పులు పడుతూ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఓ నిండు గర్బిణి . ఇప్పుడీ అమానవీయ ఘటనతో జడ్చర్ల వైద్యుల తీరుపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు స్థానికులు. నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం అవంచ గ్రామానికి చెందిన గర్బిణి యాదమ్మ ఇటీవల చికిత్స కోసం జడ్చర్ల ఆసుపత్రికి వచ్చి వైద్యులను కలిసింది . నెలలు నిండలేదని సరియైన సలహాలు సూచనలు ఇవ్వకుండా అక్కడి నుంచి పంపించేసారు వైద్యులు. మద్యానికి బానిసై పట్టించుకోని భర్త , ఆస్పత్రిలో చేరాలనే ఉద్దేశ్యంతో గత రెండు రోజుల నుండి యాదమ్మ జడ్చర్ల పట్టణంలోని తన మూడు సంవత్సరాల కొడుకు చరణ్ తో కలిసి ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లోనే తలదాచుకుంటోంది. గాంధీ కూడలిలో ఓ రేకుల షెడ్డు కింద తలదాచుకుంది. గత అర్ధరాత్రి దాటిన తర్వాత యాదమ్మకు పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో సమీపంలో ఎవరూ లేకపోవడంతో అక్కడే ఎముకలు కొరికే చలిలో ఇబ్బంది పడుతూ ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
విశాఖ జిల్లాలో విషాదం..అపార్ట్ మెంట్ నుంచి పడి విద్యార్థి మృతి
విశాఖ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఎండాడ లోని వైశాఖి స్కైలైన్ లో ఘోరం జరిగింది. అపార్ట్మెంట్ పై నుంచి పడి గోగినేని గిరితేజ అనే మెడికల్ విద్యార్థి మృతి చెందాడు. గోగినేని గిరితేజ ఎంబిబిఎస్ ద్వితీయ సంవత్సరం గీతంలో చదువుతున్నాడు. బి 4 బ్లాక్ లో అపార్ట్మెంట్ పైనుండి కిందపడి పోయాడు యువకుడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు విద్యార్థి గిరితేజ. సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు ఆరిలోవ పోలీసులు. మృతుడు సీతమ్మధార వాసిగా గుర్తించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు అన్వేషిస్తున్నారు. దీంతో కుటుంబంలో విషాదం నెలకొంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఉద్రిక్తతలకు కారణం అవుతున్న మంగళూర్ హత్య
కర్ణాటకలో మంగళూర్ హత్య ఉద్రిక్తతలకు కారణం అవుతోంది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. ఇప్పటికే ఈ కేసులో విచారణ ప్రారంభించారు పోలీసులు. ఘటనకు కారణం అయినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై హామీ ఇచ్చారు. ఆందోళన చేస్తున్న ప్రజలు శాంతి భద్రతలు కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు శాంతిగా ఉండాలని కోరారు. శనివారం రాత్రి కర్ణాటక మంగళూర్ లోని సూరత్ కల్ తో గుర్తు తెలియని వ్యక్తులు జలీల్ అనే వ్యక్తిని పొడిచి హత్య చేశారు. జలీల్ తన దుకాణం ముందు నిలబడి ఉండగా దండగులు కత్తిలో పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు. అయితే ఈ హత్య మతపరమైన కోణంలో జరిగిందా..? అనేదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కత్తిపోట్లతో గురైన జలీల్ ను ఆస్పత్రికి తరలించగా..చికిత్స పొందుతూ మరణించాడు.
చంచల్ గూడ జైలుకి ఈడీ.. నందకుమార్ ని విచారించనున్న అధికారులు
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నందకుమార్ ను నేడు ఈడీ అధికారులు విచారించనున్నారు. నందకుమార్ ను విచారించేదుకు ఈడీ అధికారులు చంచల్ గూడా జైలుకు వెళ్లనున్నారు. నందకుమార్ ను ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ సుమిత్ గోయల్ టీమ్ విచారించనున్నారు. అసిస్టేంట్ డైరెక్టర్లు సుమతిమ్, గోయల్ తో పాటు దేవేందర్ కుమార్ సింగ్, అజిత్ లను కోర్టు అనుమతిచ్చింది. నందకుమార్ స్టేట్‌మెంట్ రికార్డు చేసేందుకు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కోర్టు అనుమతిచ్చింది. నందకుమార్ న్యాయవాది సమక్షంలోనే స్టేట్ మెంట్ రికార్డు చేయనున్నారు ఈడీ అధికారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ లోని సెక్షన్ 50 కింద నందు నుండి స్టేట్‌మెంట్ రికార్డ్ చేసేందుకు సిద్దమయ్యారు. స్టేట్‌మెంట్ రికార్డు చేసిన తరువాత వాటికి సంబంధించిన డాక్యుమెంట్లును నేరుగా కోర్టుకు సమర్పించాలిని ఈడీ డైరెక్టర్ కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సెవెన్ హిల్స్ మాణిక్ చంద్ యజమాని అభిషేక్ ఆవలను విచారించిన ఈడీ, ఈ కేసు విచారణలో బయటపడ్డ ఆర్థికలావాదేవీలపై నందును ఈడీ విచారించనుంది.
శ్రద్ధా వాకర్ కేసులో కీలక సాక్ష్యం.. అఫ్తాబ్ కి వాయిస్ టెస్ట్
దేశాన్ని కుదిపేసిన శ్రద్ధావాకర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు అఫ్తాబ్ పూనావాాలా, శ్రద్ధాతో గొడవపడుతున్న ఆడియో క్లిప్ ను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఈ ఆడియో క్లిప్ కీలకంగా పరిగణిస్తున్నారు పోలీసులు. దీన్ని పెద్ద సాక్ష్యంగా పరిణిస్తున్నారు. ఈ భయంకరమైన హత్యకు సంబంధించి అఫ్తాబ్ ఉద్దేశాన్ని నిర్థారించేందుకు ఈ ఆడియో క్లిప్ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. తాజాగా ఢిల్లీ కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఫోరెన్సిక్ టీం అఫ్తాబ్ వాయిస్ శాంపిల్ ను ఈ రోజు సేకరించనున్నారు. ఈ కేసులో పురోగతిని సాధించేందుకు అఫ్తాబ్ వాయిస్ ను ఆడియో క్లిప్ తో పోల్చనున్నారు. దేశ రాజధానిలోని సీబీఐ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (సీఎఫ్‌ఎస్‌ఎల్)లో వాయిస్ శాంప్లింగ్ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. శుక్రవారం శ్రద్ధా కేసులో ఢిల్లీ కోర్టు విచారణ జరిపింది. అఫ్తాబ్ జ్యుడిషియల్ కస్టడీని మరో 14 రోజులు పొడగించింది. నవంబర్ 26 నుంచి నిందితుడు జ్యుడిషియల్ కస్టడీలోనే ఉన్నాడు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరయ్యాడు.
ప్రపంచ ఉక్కు ఉత్పత్తిలో మనమే నెంబర్ 2
ప్రపంచవ్యాప్తంగా ఉక్కు ఉత్పత్తిలో ప్రస్తుతం మన దేశమే నంబర్-2 పొజిషన్‌లో ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గడచిన 8 ఏళ్లలో స్టీల్ ప్రొడక్షన్ రెట్టింపైందని మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రాజ్యసభలో వెల్లడించారు. ఇండియా చరిత్రలో ఎప్పుడూ ఈ స్థాయిలో పురోగతి చోటుచేసుకోలేదని చెప్పారు. 2013-14లో ఏడాదికి 6 కోట్ల టన్నుల ఉక్కును మాత్రమే ఉత్పత్తి చేసేవాళ్లం.ఇప్పుడు 12 కోట్ల టన్నులను ఉత్పత్తి చేయగలుగుతున్నాం. మరో 8 ఏళ్లలో మళ్లీ రెట్టింపు స్థాయికి చేరుకోవాలని మోడీ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. అంటే.. 2030 నాటికి.. ఈ 12 కోట్ల టన్నుల స్టీల్ ప్రొడక్షన్ లెవల్ నుంచి 30 కోట్ల టన్నులకి ఎదగాలని ఆశిస్తోంది. గత 8 ఏళ్లలో ఉక్కు ఉత్పత్తి డబుల్ అయింది కాబట్టే ఇండియా రెండో ర్యాంకును పొందగలిగింది. స్టీల్ కెపాసిటీ విషయానికొస్తే.. అప్పట్లో మన దగ్గర కేవలం ఏడున్నర కోట్ల టన్నుల ఉక్కు మాత్రమే స్టాక్ ఉండేది. ఇప్పుడు 15 పాయింట్ 4 కోట్ల టన్నుల నిల్వలు ఉన్నాయి. భారతదేశంలో స్టీల్ ప్రొడక్షన్‌కి సంబంధించి అద్భుతమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఉన్నందున ఈ దశాబ్దం చివరి నాటికి మన స్టాక్ కెపాసిటీ 15 కోట్ల టన్నుల నుంచి 30 కోట్ల టన్నులకు ఈజీగా చేరుకోగలం. ఈ లక్ష్య ఛేదనలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా.. సెయిల్.. మరియు బొకారా స్టీల్ ప్లాంట్ కూడా భాగస్వాములు కానున్నాయని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా వివరించారు.