NTV Telugu Site icon

Top Headlines @1PM: టాప్ న్యూస్

Top Headlines

Top Headlines

ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కు 20 ఏళ్ళు.. చీఫ్ గెస్ట్ గా చంద్రబాబు

నేడు దక్షిణ భారత దేశానికే హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సంస్థ తలమానికంగా నిలుస్తోంది. గచ్చిబౌలిలోని ఇండియన్ బిజినెస్ స్కూల్ (ఐఎస్‌బీ) ప్రస్తుతం ద్విదశాబ్ది వేడుకలు జరుపుకుంటోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు హైదరాబాద్‌లో ఐఎస్‌బీ ఏర్పాటుకు ఎంతగానో కృషి చేశారు. 1999లో ఐఎస్‌బీకి శంకుస్థాపన జరగ్గా 2001లో నాటి ప్రధాన మంత్రి వాజ్ పేయి చేతుల మీదుగా ప్రారంభమైంది. ఇప్పుడీ బిజినెస్ స్కూల్‌కు 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం 5 గంటలకు నిర్వహిస్తున్న ద్విదశాబ్ది వేడుకలకు స్కూల్ అధికారులు టీడీపీ అధినేత చంద్రబాబును ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సంస్థ ఏర్పాటులో చంద్రబాబు కృషికి గుర్తింపుగానే ఈ ఆహ్వానం లభించినట్టు తెలుస్తోంది. కాగా వేడుకల్లో పాల్గొననున్న చంద్రబాబు అనంతరం విద్యార్థులతో జరిగే మముఖిలోనూ పాల్గొంటారు. ఆనాడు ఐఎస్‌బీ కోసం అనేక రాష్ట్రాలు పోటీ పడినా ప్రతిష్టాత్మక సంస్థను నాడు రాష్ట్రానికి తీసుకువచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కింది.

డియర్ పూరీ జీ… అలాచేస్తే పెట్రోల్‌, డీజల్‌ రూ.70, 60కే ఇవ్వొచ్చు
తెలంగాణ సహా ఏపీ, తమిళనాడు, కేరళ, ఝార్ఖండ్‌ ప్రభుత్వాలు ఇంధనాలపై అధిక వ్యాట్‌ వసూలు చేస్తున్నాయన్న కేంద్ర మంత్రి హరిదీప్‌ సింగ్‌ పూరీ పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కేటీఆర్ ట్విటర్‌ వేదికగా ఖండించారు. అయితే ఆయా రాష్ట్రాల్లో ప్రజలపై పెట్రో ఎక్కువగా పడుతుందని లోక్‌సభలో కేంద్ర మంత్రి పేర్కొనడాన్ని ట్విట్టర్‌ వేదిక కేటీఆర్‌ విమర్శించారు. కాగా.. కేంద్ర ప్రభుత్వ చర్యలతో ఇంధన ధరలు పెరిగాయని ఆరోపించిన కేటీఆర్‌, 2014 నుంచి ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం వ్యాట్‌ పెంచలేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా.. కేంద్ర ప్రభుత్వం సెస్‌ను తొలగిస్తే పెట్రోల్‌ రూ.70కి, డీజిల్‌ రూ.60కి అందిస్తామని చెప్పారు. అయితే.. కేంద్ర సెస్‌ వల్ల రాష్ట్రాలకు హక్కుగా రావాల్సిన 41శాతం వాటా కోల్పోయమన్నారు. దీంతో.. ఇప్పటికే సెస్‌ రూపంలో వసూలు చేసిన రూ.30లక్షల కోట్లు సరిపోవా? అని కేంద్రాన్ని ప్రశ్నించారు. అయితే.. దేశంలో బీజేపీయేతర పార్టీలు పాలిస్తున్న ఆరు రాష్ట్రాల్లో పెట్రో ఉత్పత్తులపై వ్యాట్‌ తగ్గించలేదని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ గురువారం లోక్‌సభలో వెల్లడించిన విషయం తెలిసిందే. దీనివల్లే ఆయా రాష్ట్రాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు.

పోలీస్ ఇన్ ఫార్మర్ నెపంతో నక్సల్స్ దారుణం
పోలీసు ఇన్ ఫార్మర్ నెపంతో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఛత్తీస్ ఘడ్-దంతెవాడ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఓ గ్రామస్థుడిని పోలీసు ఇన్‌ఫార్మర్‌ నెపంతో హత్య చేసిన మావోయిస్టులు. పోలీస్ ఇన్ ఫార్మర్ నెపంతో గ్రామస్తుడిని హతమార్చారు. గ్రామస్తుడి హత్య అనంతరం ఆ మృతదేహాన్ని మాలేవాహి చౌక్‌లో రహదారిపై వదిలి వెళ్ళిపోయారు మావోయిస్టులు. హత్యకు సంబంధించి ఘటన స్థలంలో కరపత్రాలు వదిలి వెళ్ళిపోయారు మావోయిస్టులు. మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన వ్యక్తిని జై రామ్ కశ్యప్ గా గుర్తించారు. రెండు రోజుల క్రితం స్వగ్రామం కచనార్ వెళ్లిన క్రమంలో అపహరించుకు వెళ్ళి అనంతరం హత్య చేశారు మావోయిస్టులు. మలేవాహి పోలీస్ స్టేషన్ పరిధిలోని జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది.

మేడ్చల్ జవహర్ నగర్ లో బాలిక మిస్సింగ్ విషాదాంతం

మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ కు చెందిన 4వ తరగతి విద్యార్థిని మిస్సింగ్ కేస్‌ విషాదాంతంగా మారింది. 26 గంటల తరువాత బాలిక మృతదేహం చెరువులో లభ్యమైంది. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. నిన్న స్కూల్‌ కు వెళ్లిన బాలిక 26గంటల తరువాత చెరువులో లభ్యం కావడంతో పలు అనుమానాలకు దారితీస్తోంది. పోలీసులు సీసీకెమెరా అధారంగా బాలికను ఆచూకీ ఛేదించేందుకు చర్యలు చేపట్టడంతో ఎవరికైనా తెలిసి బాలికను ఏమైన చేసి చెరువులో పడేశారా? లేక నిన్ననే బాలికపై ఏమైనా అఘ్యాయిత్యం చేసి ఈపని చేశారా? అనే కోణంగా విచారన చేపట్టారు. అసలు బాలిక స్కూల్‌ కు వెళ్లి బ్యాగ్‌ స్కూల్లో పెట్టే ఎందుకు బయటకు వచ్చింది? ఎవరైనా రమ్మని పిలిచారా? అనే కోణంలో కూడా విచారణ చేపట్టారు. నిన్న మిస్సైన బాలిక ఇవాల చెరువులో విగత జీవిగా లభ్యమవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. బాలికను చంపిన వారిని కఠినంగా శిక్షించి, న్యాయం చేయాలని కోరుతున్నారు తల్లిదండ్రులు.

శంషాబాద్ లో భారీగా బంగారం సీజ్.,.. ఎక్కడ దాచాడో తెలుసా?

విమానాశ్రయాలు పేరు చెబితే బంగారం విచ్చలవిడిగా దొరుకుతోంది. ప్రయాణికులు ఏదో విధంగా బంగారం స్మగ్లింగ్ చేస్తున్నారు. కొత్తదారులు వెతుక్కుంటూ మరీ అడ్డదారులు తొక్కుతున్నారు. ఎన్ని ఎత్తుగడలు వేసినా.. కస్టమ్స్ అధికారుల ముందు కేటుగాళ్ళ ఆటలు సాగడం లేదు. తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి వచ్చిన ప్రయాణికుని వద్ద బంగారం సీజ్ చేశారు. ప్రయాణికుని వద్ద 957 గ్రాముల బంగారం దొరికింది. పట్టుకున్న బంగారం విలువ 46 లక్షల 53 వేలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు. ఇంతకీ ఎయిర్ పోర్టులో బంగారం ఎక్కడ దాచాడో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవకమానదు. కస్టమ్స్ అధికారులకు నిందితుడు కాళ్లకు బంగారం అతికించుకుని వచ్చాడు. కాళ్లకు కట్టు కట్టుకున్నట్టుగా అతను బంగారం దాచుకుని రావడం కస్టమ్స్ అధికారులను బురిడీ కొట్టించాలని చూశాడు. కానీ కస్టమ్స్ అధికారులు మాత్రం అతడి ఆటలు సాగనివ్వలేదు. అన్నీ చెక్ చూసి అతని గుట్టు రట్టుచేశారు. ఈమధ్యకాలంలో ఎయిర్ పోర్టులు అక్రమ బంగారానికి అడ్డాలుగా మారాయి. రెండునెలల క్రితం భారీగా బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ఓ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు క‌స్టమ్స్ అధికారులు.

మురికివాడ ధారవి రూపం మారనుందా?

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ఉన్న ధారవి ఏరియా ప్రపంచంలోనే అత్యధిక జనసాంద్రత గల ప్రాంతం. ఆసియా ఖండంలో అతిపెద్ద మురికివాడ. తమకు మంచి రోజులు ఎప్పుడొస్తాయా, తమ పరిసర ప్రాంతాలు పరిశుభ్రతతో ఎప్పుడు మెరిసిపోతాయా అని స్థానికులు దాదాపు 20 ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఈ అంశం ప్రభుత్వ చర్చల్లో చాలా కాలంగా నలుగుతోంది. ధారవి రీడెవలప్‌మెంట్‌ ప్రాజెక్టును ప్రారంభించాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి మూడు సార్లు ప్రయత్నించింది. కానీ.. ఫలించలేదు. అయితే.. ఈ కల ఎట్టకేలకు సాకారం కాబోతోంది. ధారవి రీడెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు చేపట్టేందుకు ముందుకు రావాలంటూ సంస్థలను ఆహ్వానించగా అదానీ గ్రూపు అత్యధిక విలువకు బిడ్‌ దాఖలు చేసి విజయం సాధించింది. ప్రాజెక్టును దక్కించుకునేందుకు 5 వేల 69 కోట్ల రూపాయలకు బిడ్‌ వేసింది. డీఎల్‌ఎఫ్‌ గ్రూప్‌ 2 వేల 25 కోట్ల రూపాయలకు మాత్రమే బిడ్‌ దాఖలు చేసింది. ఈ ప్రాజెక్టు కోసం అదానీ గ్రూపు ప్రాథమికంగా 20 వేల కోట్ల రూపాయలను ఖర్చుపెట్టనుంది. ఈ మేరకు స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌ని ఏర్పాటుచేయాల్సి ఉంటుంది.

ఏషియన్ టాప్ 5లో ఐదుగురు భారతీయులు

ఈ ఏడాది గూగుల్‌ మోస్ట్‌ సెర్చ్‌డ్‌ ఏషియన్‌ జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో టాప్-5లో ముగ్గురు భారతీయులు ఉన్నారు. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టాప్-3లో ఉన్నాడు. ఆ తర్వాత బాలీవుడ్ హీరోయిన్‌లు కత్రినా కైఫ్ నాలుగో స్థానంలో, ఆలియా భట్ ఐదో స్థానంలో నిలిచారు. నాలుగు పదుల వయసుకు దగ్గరలో ఉన్నా కుర్ర హీరోలను కాదని కత్రినా కైఫ్ నాలుగో స్థానం సంపాదించడం విశేషం. ఈ లిస్టులో సౌత్ కొరియా బ్యాండ్ బీటీఎస్ సభ్యులు తేయుంగ్, జంగ్ కుక్ తొలి రెండు స్థానాలను దక్కించుకున్నారు. అన్ని రంగాల నుంచి గూగుల్ మోస్ట్ సెర్చ్ డ్ లిస్ట్ తీస్తే.. ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి మాత్రం కత్రినాకైఫ్‌ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. బాలీవుడ్‌లో యంగ్ స్టార్స్ చాలా మంది ఉన్నారు. పాపులర్ స్టార్స్ ఉన్నారు. సౌత్ నుంచి పాన్ ఇండియా స్టార్లు కూడా ఉన్నారు. బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ సినిమాలతో ప్రభాస్, ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు. ఇంత మంద ఉన్నా టాప్-5లో కత్రినా స్థానం దక్కించుకోవడం విశేషం. ఆకట్టుకునే అందం, అభినయంతో పాటు యూత్‌ను అట్రాక్ట్ చేసే హాట్ నెస్ కారణంగా ఇప్పటి యంగ్ స్టార్స్‌లో కూడా కత్రినాకైఫ్‌ తిరుగులేని ఫాలోయింగ్‌ సొంతం చేసుకుంది.

ఎలాన్ మస్క్ వేధింపులు… అక్కడ మిగిలింది 80 మంది ఉద్యోగులే!

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్న తర్వాత కంపెనీలో పలు విప్లవాత్మకమైన మార్పులు చేపట్టారు. ఈ ఏడాది అక్టోబరు చివరిలో ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేసినప్పటి నుండి ట్విట్టర్ ఉద్యోగుల జీవితాలు చాలా కష్టతరంగా తయారయ్యాయి. కొనుగోలు చేసిన కొన్ని రోజుల తర్వాత, ఢిల్లీ, బెంగళూరు, ముంబైలోని కార్యాలయాల్లో పనిచేస్తున్న ఎంతో మందిని ట్విట్టర్ తొలగించింది. కంపెనీ వెల్లడించనప్పటికీ, 250 మంది ట్విట్టర్ ఇండియా ఉద్యోగుల్లో దాదాపు 170 మంది ఉద్యోగులు సంస్థ నుండి వెళ్లిపోయారు. ఇందులో ఎక్కువ మందిని మస్క్ తొలగించ‌గా కొందరు స్వచ్ఛందంగా రాజీనామాలు చేశారు. దీంతో ట్విట్టర్ కు భారత్ లో కేవలం 80 మంది ఉద్యోగులే మిగిలారు. అంటే ఇప్పటి వరకు 250 మంది సంయుక్తంగా చేసిన పనిని.. ఇక మీదట కేవలం 80 మంది ఉద్యోగులే నిర్వహించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. రోజుకు 12 గంటల నుంచి 16 గంటల‌ వరకు పనిచేయాల్సి వస్తోంది. వేతనాలు కూడా ఏమీ పెంచకుండానే అధిక పనిగంటలు పని చేయిస్తున్నారు. గతంలో భారత ట్విట్టర్ ఉద్యోగులకు సాయంత్రం స్నాక్స్ ఇచ్చే వాళ్ళు. మస్క్ రాగానే స్నాక్స్ ఇవ్వడం ఆపేశారు.