Site icon NTV Telugu

Top Headlines @1PM: టాప్ న్యూస్

Top Headlines

Top Headlines

రేపు మధ్యాహ్నం ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీసు ప్రారంభం

రేపు మధ్యాహ్నం 12.37 నుంచి 12.47 మధ్య BRS ఢిల్లీ కార్యాలయం ప్రారంభం అవుతుందని. ముందుగా పార్టీ జెండాను కేసీఆర్ ఆవిష్కరించనున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. రేపు మధ్యాహ్నం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయయన్నారు. ఆ ముహూర్తానికి కేసీఆర్ ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయంలోకి ప్రవేశిస్తారన్నారు. ఢిల్లీలోని ఎస్పీ మార్గ్ లో పెద్ద భవనాన్ని తీసుకున్నాం అన్నారు. రేపు తెలంగాణ నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతర ప్రజా ప్రతినిధులు హాజరుకానున్నారని తెలిపారు. పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, ఒరిస్సా, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన రైతు నాయకులు బిఅరెస్ కార్యాలయ ప్రారంభానికి హాజరుకానున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేవలం 8 సంవత్సరాల కాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్వన్ రాష్ట్రంగా నిలబెట్టిన వ్యక్తి కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే రైతుల కోసం పేదల కోసం అనేక కార్యక్రమాలు తీసుకోబడ్డాయో అవన్నీ కూడా దేశవ్యాప్తంగా అమలు కావాలని కేసీఆర్ భావిస్తున్నారు.

అంతర్జాతీయ సంస్థలకు హైదరాబాద్ గమ్యస్థానం

రోనా తర్వాత తెలంగాణకు ముఖ్యంగా హైదరాబాద్ కు పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం సంతోషంగా వుందన్నారు మంత్రి కేటీఆర్. ఢైపుక్ తెలంగాణలో 450 కోట్ల రూపాయలతో పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిందన్నారు. కరోనా తర్వాత అనేక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెడుతున్నాయి. చైనాలో పెద్ద ఎత్తున మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉన్నాయి అనేక దేశాలకు ఎగుమతులు చేస్తున్నారు. ఇండియాలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఫెడరల్ స్ట్రక్చర్ ఉంటుంది. చైనా అలా కాదన్నారు. జపాన్ లో మ్యూజియం వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద ఎత్తున యూనిఫాంలో ఉన్న పాఠశాల పిల్లలు కనిపించారు. అక్కడ ఉన్నవారిని అడిగాను.. కార్లు డిజైన్ చేస్తున్నారు కలర్స్ తో అని చెప్పారు. అంటే అక్కడ పిల్లలు చిన్నతనం నుంచి ఆలోచన విధానాన్ని పెంచుతారు. జపాన్ అద్భుతమైన టెక్నాలజీని ఉపయోగించుకునే ముందుకు వెళ్తుందన్నారు. ప్రపంచం ఇవాళ చైనా కాకుండా ఇతర దేశాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ల ఏర్పాట్లకు చూస్తున్నారు. మన దగ్గర బాసర IITవిద్యార్థులకు అద్బుతమైన టాలెంట్ ఉంది. IIT తో ఒప్పందం చేసుకోండి. తెలంగాణ ఇండస్ట్రియల్ ఫెడరేషన్ తెలంగాణ ప్రభుత్వం కలిసి రాష్ట్రంలోని అతి పెద్ద పారిశ్రామిక పార్క్ దండుమైలారంలో తీసుకొచ్చిందన్నారు మంత్రి కేటీఆర్.

30 రోజులు అసెంబ్లీ నిర్వహించే దమ్ముందా?

ఏపీ కేబినెట్ సమావేశంపై టీడీపీ సీనియర్ నేత, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేబినెట్‌లో నిర్ణయాలు ప్రజల కోసం కాకుండా అయిన వారి కోసమే నిర్ణయాలు ఉంటాయని ఆయన ఎద్దేవా చేశారు. కేబినెట్‌లో నిర్ణయాలు తీసుకుంటే ఎలాంటి చిక్కులు తమ మెడకు చిక్కుకోవని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారని పయ్యావుల ఆరోపించారు. లక్ష కోట్ల రూపాయల విలువైన సుమారు 20 వేల మెగావాట్ల మేర హైడ్రో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను ప్రభుత్వం అస్మదీయులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందని.. హైడ్రో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను అస్మదీయులకు కట్టబెడుతూ కేబినెట్లో నిర్ణయం తీసుకునే సూచనలు కన్పిస్తున్నాయని విమర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా హైడ్రో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను తాము బ్యాక్ గ్రౌండ్‌గా ఉన్న కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. టెండర్ల ద్వారా లేదా బిడ్డింగ్ ద్వారా హైడ్రో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను కేటాయింపులు జరపాలని.. నామినేషన్ విధానంలో హైడ్రో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను ఏ విధంగా కట్టబెడతారని పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. నెడ్ క్యాప్‌తో సర్వే చేయించి.. నెడ్ క్యాప్ సంస్థ గుర్తించిన స్థలాల్లో హైడ్రో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను ప్రారంభించారని.. ప్రభుత్వ సొమ్ముతో సర్వేలు చేయించుకుని.. టెండర్లు పిలవకుండా ప్రాజెక్టులు నామినేటెడ్ పద్దతిన కట్టబెట్టేస్తారా అని నిలదీశారు.

తెలంగాణ ప్రజలు బీజేపీకి బుద్ధి చెబుతారు

తెలంగాణ సంస్కృతి ఎంతో ఉన్నతమయిందన్నారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వాడుతున్న పదజాలం అవమానంగా ఉందని మండిపడ్డారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఆయన పదవికి వన్నె తెచ్చేలా లేదు. బండి సంజయ్ అసభ్యంగా మాట్లాడుతున్నారు. నా పట్ల మాట్లాడుతున్న భాషకు బాధ పడుతున్నా అన్నారు కవిత. చిట్ చాట్ లో కవిత మాట్లాడారు. తన అభిప్రాయాలు పంచుకున్నారు. నిన్న కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. బండి సంజయ్ భాష ఆయన పదవికి మచ్చ తెచ్చేలా ఉందన్నారు కవిత. మోడీ నుంచి బండి సంజయ్ వరకు మహిళను అవమానించే సంస్కృతి ఉందన్నారు. తెలంగాణ ప్రజలు బిజెపిని సరైన సమయంలో తిప్పికొడుతారన్నారు. నా పట్ల బండి సంజయ్ కామెంట్స్ పై బాధ పడుతున్నా అన్నారు. బతుకమ్మ పండగ వెనుక నా 12 ఏళ్ల కష్టం ఉందన్నారు. అది డిస్కో డాన్స్ అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కవిత. అభివృద్ధి లో బిజెపి నీ కౌంటర్ చేస్తాం. తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఅర్ ఉన్నారు. కేసీఅర్ రాష్ట్రంలో బాధ్యత ఎవరికి ఇస్తారో అన్నది సస్పెన్స్ అన్నారు. తెలంగాణలో తెలంగాణ జాగృతి ఉంటుంది…భారత జాగృతి పేరుతో ఇతర రాష్ట్రాల్లో ఉంటుంది. తెలంగాణ జాగృతి,భారత జాగృతి సంస్థలు కలిసి పనిచేస్తాయి. జాతి వ్యతిరేకులు,అర్బన్ నక్సలైట్ అంటూ ముద్ర వేయడం దారుణం అన్నారు కవిత.

అయోధ్యలో మసీదుకి అడ్డంకి క్లియర్.. ఆస్పత్రికి కూడా
2019లో అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో (బాబ్రీ మసీదును కూల్చివేసిన) రామాలయం నిర్మాణానికి అనుకూలంగా తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు.. అదే సమయంలో అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి వీలుగా ఐదు ఎకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డుకి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పు వెలువడిన తర్వాత రామాలయం నిర్మాణం ప్రారంభం అవ్వగా.. ఇప్పుడు మసీదు పనులు కూడా మొదలు కాబోతున్నాయి. ఇన్నాళ్లూ స్థలం అనుమతి విషయాన్ని పెండింగ్‌లో ఉన్న వ్యవహారంపై అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ తాజాగా క్లియరెన్స్ ఇచ్చింది. అయోధ్య సమీపంలోని లక్నో-ఫైజాబాద్ హైవే పక్కనున్న దన్నిపూర్ గ్రామంలో మసీదుని నిర్మించబోతున్నారు. మసీదు నిర్మాణం కోసం స్థలం అనుమతి కోసం ఎంతోకాలంగా వెయిట్ చేయగా.. ఎట్టకేలకు ఇన్నాళ్లకు అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ నుంచి అనుమతి లభించిందని ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ సెక్రటరీ ఆథర్ హుస్సేన్ తెలిపారు.

మంత్రి కాబోతున్న యంగ్ హీరో
పదేళ్ళ క్రితం ‘ఒరు కాల్ ఒరు కన్నాడి (ఓకే ఓకే)’ మూవీతో హీరో అయిపోయాడు ఉదయనిధి స్టాలిన్. అప్పటికే నిర్మాతగా, పంపిణీదారుడిగా హల్చల్ చేస్తున్న ఉదయనిధికి తాతయ్య కరుణానిధి, తండ్రి స్టాలిన్ ఆశీస్సులు దివ్యంగా దక్కాయి. హీరోగానూ రాణిస్తూ ముందుకు సాగుతున్న అతగాడికి సొంత పార్టీ డీఎంకే రాజకీయాలలోనూ బాగానే ఆసక్తి ఉంది. అందులో యూత్ వింగ్ కు కార్యదర్శిగా ఉదయనిధి సేవలు అందిస్తున్నాడు. విశేషం ఏమంటే… ఆ మధ్య జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయనిధి స్టాలిన్ ఎంఎల్ఎగా నిలిచి, గెలిచాడు. స్టాలిన్ తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో కొడుకు ఉదయనిధికి కూడా మంత్రి పదవి దక్కుతుందని అంతా భావించారు. అయితే అప్పుడు వారసత్వ రాజకీయాలపై వాడీవేడీ చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఉదయనిధిని మంత్రి వర్గానికి కాస్తంత దూరంగా ఉంచాడు స్టాలిన్. కానీ కన్నప్రేమ ఆయన్ని ఎక్కువ కాలం ఆ పని చేయనివ్వలేకపోయింది. అందుకే ఇప్పుడు కొడుకును మంత్రిని చేసి, మురిసిపోవాలని భావిస్తున్నాడు.

డాక్టర్ వైశాలి కేసులో పురోగతి.. నవీన్ కారు లభ్యం

హైదరాబాద్ లో సంచలనం కలిగించిన డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆదిభట్ల పోలీస్ స్టేషన్ లో వైశాలి కిడ్నాప్ కి నవీన్ రెడ్డి వాడిన వోల్వో కార్ లభ్యమయింది. కార్ వుంది కానీ నవీన్ రెడ్డి ఎక్కడ ఉన్నది ఆచూకీ తెలియలేదు. ఈ కారు నెంబర్ TS 07 HX 2111, నవీన్ రెడ్డి, S/O కోటి రెడ్డి 8-7-93-NE/95 HASTINAPUR HYDERABAD పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. ఈకారులో వైశాలిని కిడ్నాప్ చేశాడు నవీన్ రెడ్డి. ఆ తర్వాత ఈ కార్లో తిరిగితే దొరికిపోయే అవకాశాలు ఉన్నాయని… శంషాబాద్ తొండుపల్లి వద్ద కారును వదిలేసి వెళ్లిపోయాడు నవీన్ రెడ్డి. ఇదే కార్లో గతం లో వైశాల్ ఇంటి వద్ద హంగామా చేస్తూ ఫోటోలు దిగుతూ హడావిడి సృష్టించిన నవీన్ రెడ్డి. వోల్వో కారు డోర్స్ ఓపెన్ కావడంలేదు. డోర్స్ ఓపెన్ చేయటానికి కంపెనీ ప్రతినిధులను రప్పిస్తున్నారు పోలీస్ లు..ఉన్నతాధికారుల సమక్షంలో లో కార్ డోర్స్ ఓపెన్ చేయనున్నారు పోలీస్ లు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పరిధిలో సంచలనం సృష్టించిన మన్నెగూడ యువతి కిడ్నాప్ కేసులో నిందితుడైన నవీన్ రెడ్డి పై గతంలో వరంగల్ లోనూ కేసు నమోదు అయినట్టు తెలుస్తోంది.

Exit mobile version