NTV Telugu Site icon

Top Headlines @1PM: టాప్ న్యూస్

Top Headlines

Top Headlines

సెకనుకో దాడి.. అరగంటకో మరణం.. ఐసీఎంఆర్‌ వెల్లడి

కుక్కలు అంటూనే బాబోయ్ అంటున్నారు ప్రజలు. కుక్కలను చూడగానే ఆమడదూరంలో పరుగెడుతున్నారు. వీధిల్లో తిరగాలంటేనే భయాందోళన చెందుతున్నారు. ఇక.. దేశంలో ప్రతి రెండు సెకన్లకు ఒక కుక్క కాటు నమోదవుతున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. ఫలితంగా అరగంటలోనే మరణం సంభవించినట్లు గుర్తించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ , ఢిల్లీ ఎయిమ్స్ సంయుక్తంగా ఈ పరిశోధనను నిర్వహించాయి. ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఈ అధ్యయన ఫలితాలను ప్రచురించింది. అయితే.. ప్రపంచంలో కుక్కల సంఖ్య 100 కోట్లు కాగా.. వివిధ దేశాల్లో వీధికుక్కల సంఖ్య 70 కోట్లు ఉంది. ప్రపంచంలో వీధికుక్కలు లేని మొదటి దేశం నెదర్లాండ్స్ మాత్రమే కావడం గమనార్హం. అక్కడ వీధి కుక్కలు అనే మాటే కాదు కదా అస్సలు కనిపించవు. అయితే, 2030 నాటికి రేబిస్ మరణాలను పూర్తిగా నియంత్రించాలన్నది భారత్‌తో సహా ప్రపంచ దేశాలు విధించిన గడువు. AIIMS అధ్యయనం ప్రకారం, కుక్కకాటు మరియు ఇతర జంతువుల కాటు వల్ల వచ్చే రేబిస్ కారణంగా ప్రతి సంవత్సరం 18,000 నుండి 20,000 మంది మరణిస్తున్నారని ICMR వెల్లడించింది. దేశంలో 93% రేబిస్ మరణాలు కుక్క కాటు వల్లనే సంభవిస్తున్నాయనేది వెలుగులోకి వచ్చింది. ఇందులో 63% వీధి కుక్కల వల్ల వస్తుంది. పట్టణాల్లో 60%, గ్రామాల్లో 64% వీధికుక్కల ద్వారా మరణాలు సంభవిస్తున్నాయి. అయితే.. భారత్‌లో 2 కోట్ల కుక్కలు ఉండగా అందులో వీధికుక్కల సంఖ్య 1.53 కోట్లు ఉంది. ICMR అధ్యయనం ప్రకారం, వీధి కుక్కల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం వ్యర్థాలను సరిగ్గా పారవేయకపోవడమే. అందుకే చెత్తకుప్పల దగ్గర వీధికుక్కలు ఎక్కువవుతున్నాయి. అయితే దేశంలోని చాలా ఆసుపత్రులు కుక్కలకు ఆశ్రయం కల్పిస్తున్నాయి.

సెంటు భూమి ఆక్రమించలేదు.. నిరూపిస్తే మీకే ఇచ్చేస్తా

టీడీపీ నేతలపై, లోకేష్ తీరుపై మండిపడ్డారు ఏపీ ప్రభుత్వ విద్యా సలహాదారు సాంబశివారెడ్డి. తనపై లోకేష్ చేసిన విమర్శలపై ఆయన స్పందించారు. నేను మా కుటుంబం అవినీతి అక్రమాలు చేసినట్లు ధైర్యం ఉంటే నిరూపించండి. ఒక్క సెంటు భూమి నేను ఆక్రమించినట్టు చూపినా మీకే రాసిస్తా.శింగనమలకు 6 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెబుతున్నారు.బహుశా లోకేష్ కు నియోజకవర్గానికి ఒక్క ఎమ్మెల్యే ఉంటారని తెలియకపోవచ్చు.మండలానికి ఒక ఎమ్మెల్యే ఉంటారని నారా లోకేష్ అనుకుంటున్నాడు.లోకేష్ ఎప్పుడు ఎమ్మెల్యే కాలేదు.. తన తండ్రి భిక్షతో మండలికి వెళ్లారు.నా సతీమణి ఎమ్మెల్యే పద్మావతి నాకన్నా విద్యావంతురాలు. ఆమెకు నేనో మరొకరు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు.ఆమె కు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై, నియోజకవర్గ అభివృద్ధి పై పూర్తి స్థాయిలో అవగాహన వుంది.ఆమె కుటుంబ సభ్యుల్లో 20 మంది సివిల్ సర్వీసెస్ లో ఉన్నారు. నేను రాజకీయాల్లోకి రాకముందే 2007లోనే నాకు విద్యాసంస్థలు ఉన్నాయి.నేను కోట్ల రూపాయలు సంపాదించలేదు.అంతకుమించి ప్రజాభిమానం సంపాదించాను.మీ పర్యటనలో ఒక టీడీపీ ఇంఛార్జి దళిత మహిళపై దాడులు జరుగుతుంటే స్పందించలేదు నారా లోకేష్ ఒక నాయకుడైన .ఎస్సీ నియోజకవర్గంలో ఇద్దరు అగ్రవర్ణాల నేతలకు పెత్తనం ఇచ్చారు.ఈనెల 14న అంబేద్కర్ జయంతిని భారీగా నిర్వహిస్తున్నాం అని తెలిపారు సాంబశివారెడ్డి.

ఎమ్మెల్యేలకు జగన్ పై నమ్మకం ఉందా?

ఏపీలో ఎన్నికల సందడి మొదలయింది. ఇంకా ఏడాది కాలం ఉన్నా.. అధికార పార్టీ జగనే మా భవిష్యత్తు అంటూ వైసీపీ నేతలు జనంలోకి వెళుతున్నారు. గతంలో గడపగడపకు అని తిరిగిన నేతలు.. జగన్ స్టిక్కర్ అతికిస్తూ ..పథకాల గురించి, లబ్ధిదారుల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. అయితే అధికార పార్టీపై ప్రజల్లో అసహనం, అసంతృప్తి ఉందని, జగన్ పై ఎమ్మెల్యేలకు నమ్మకం ఉండడం లేదని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. తిరుమలలో టీడీపీ నేత, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడారు. ఏపీలో పాలనపై ఆయన విమర్శలు చేశారు. పథకాలు ఇస్తూన్నామంటునే….దేవాలయాలలో ధరలు మాత్రం పెంచేస్తుందన్నారు.రాష్ర్టం అప్పులు పాలైపోయింది…రాష్ర్టానికి చంద్రబాబు అవసరం వుందని ప్రజలు గుర్తించారు. జనసేన-టీడీపీ పొత్తు పై అధినాయకత్వం మాట్లాడుతుంది…రాబోయే ఎన్నికలలో కలిసే వెళతాం అన్నారు చినరాజప్ప. ఎమ్మెల్యేలకే జగన్ పై నమ్మకం లేకపోతే….175 సీట్లు గెలుస్తామనడం హాస్యాస్పదం అన్నారు.

90శాతం మంది జగనే మా నమ్మకం అంటున్నారు

తిరుమలలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి స్వామివారిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. దేవుడు అంటే భయం వుంది కాబట్టి అవినీతి పరులు సంపాదించిన కోట్ల రూపాయలు హుండీలో సమర్పిస్తున్నారన్నారు డిప్యూటి సియం నారాయణస్వామి. హుండీలో భక్తులు వేసిన డబ్బుతో టీటీడీ పేదవారి విద్యకు,ఆరోగ్యానికి వినియోగిస్తుందన్నారు. చంద్రబాబు మ్యానిఫెస్టో ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబుది పిచ్చి పార్టీ ఆయనతో వున్నవారందరిది రాక్షస మనస్తత్వం. జగన్ననే మా నమ్మకం అని 90 శాతం మంది ప్రజలు చెప్పకపోతే నేను రాజకీయం వదిలేస్తాను అని సవాల్ విసిరారు. YSRCP ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. జగనన్న మా భవిష్యత్ స్టిక్కర్లతో టీడీపీ. నాయకులు గుండెల్లో గునపాలు దిగుతున్నాయి అన్నారు. టిడ్కో ఇళ్ల దగ్గర సెల్ఫీ దిగిన చంద్రబాబు సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి నిర్మిస్తున్న ఇళ్ల దగ్గర చంద్రబాబు సెల్ఫీ దిగడంతోనే వైఫల్యం ఒప్పుకున్నారు. చంద్రబాబు హయాంలో ఒక్క టిడ్కో ఇల్లయినా కట్టగలిగారా….? అని ఆమె ప్రశ్నించారు.

పోలీస్ స్టేషన్ ముందు పెళ్లి జంట నిరసన

మరికొన్ని నిమిషాల్లో పెళ్లి చేసుకోవాల్సిన కొత్త పెళ్లి జంట కాస్త పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగింది. పోలీసులు తమ సమస్య పరిష్కరిస్తే కానీ వివాహానికి ససేమిరా అన్నారు. ఇద్దరి మధ్య ఏదో గొడవ జరిగిందని ఊహిస్తున్నారు.. అందరూ.. అస్సలు కానే కాదు అసలు విషయం తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు.. అయితే మధ్య ప్రదేశ్ లోని రత్లాం జిల్లాలో ఓ వివాహ వేడుక గ్రాండ్ గా మొదలైంది. అందరూ సందడి చేస్తున్నారు. ఓ వైపు పెద్ద డీజే మ్యూజిక్ అదిరిపోయింది. అప్పుడే పోలీసులు వచ్చారు. దీంతో వెంటనే డీజే ఆపమని చెప్పారు. పెళ్లివారు వినలేదేమో పోలీసులు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయారు. ఇక పెళ్లి చేసుకోవాల్సిన జంట పోలీస్ స్టేషన్ దగ్గరకి వెళ్లింది. అక్కడే పోలీస్ స్టేషన్ ఎదురుగా ఆందోళనకు దిగింది. పోలీసులు పెళ్లి మండపం దగ్గర తమవారితో అనుచితంగా ప్రవర్తించారిని.. పెళ్లి పందరిలో నానా హంగామా చేశారని పెళ్లిజంట ఆరోపించారు. పోలీసులు వచ్చి చర్యలు తీసుకునే వరకు తామ పెళ్లి చేసుకోబోమని ఆ జంట పోలీస్ స్టేషన్ ముందు దాదాపు 3 గంటల పాటు నిరసనకు దిగింది. చివరికి పోలీసులు వారికి సర్ది చెప్పి హామీ ఇవ్వడంతో పెళ్లి జంట మ్యారేజ్ చేసుకోవాడానికి వేదిక వద్దకు చేరుకున్నారు. మొత్తానికి పోలీసుల వల్ల ఆగిపోయిన పెళ్లి జరగడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
అయితే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మహిళతో రిలేషన్ షిప్.. ఏఆర్ ఎస్‌ఐని చితకబాదిన భార్య

ఈమధ్యకాలంలో తమకు ఆమె/అతడు నచ్చారంటూ సహజీవనం చేస్తూ భార్య/భర్తకు అన్యాయం చేస్తున్నారు. అడ్డొస్తే ఏమవుతామో అని కూడా ఆలోచించకుండా అడ్డంగా చంపేస్తున్నారు. ప్రియుడి కోసం భార్య, ప్రియురాలి కోసం భర్త కట్టుకున్నవారిని కాటికి పంపేస్తున్నారు. భార్య ఉండగానే విలాసాల కోసం మరో మహిళతో వివాహేతర సంబంధాలు పెట్టుకుని చివరకు రోడ్డున పడుతున్నారు. నెల్లూరు జిల్లాలోని నెల్లూరు టౌన్ నెల్లూరు పోస్టల్ కాలనీలో ఏఆర్ ఎస్.ఐ. వాసు కు దేహశుద్ధి చేసింది. తనను కాదని, మరో మహిళతో కలిసి వున్న భర్తను చితకబాదేసింది. ఓ మహిళతో సహజీవనం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని దేహశుద్ధి చేశారు మొదటి భార్య సామ్రాజ్యం , ఆమె కుటుంబ సభ్యులు.. గత కొన్నేళ్లుగా మొదటి భార్య , పిల్లలకు దూరంగా ఉంటున్నాడు వాసు. వీరికి 30 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. భార్య భర్తలు ఇద్దరిదీ గుంటూరు. వీరికి ఇద్దరు పిల్లలు. కొడుకు, కూతురు. 2017 నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. 2018లో తన భర్త మౌనిక అనే మహిళను వివాహం చేసుకున్నాడని మొదటి భార్య ఆరోపిస్తోంది. అప్పటినుంచి ఆమెతోనే కలిసి ఉంటున్నాడని, తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని వాసు భార్య సామ్రాజ్యం మండిపడుతోంది. తన భర్త తనకు కావాలని భార్య డిమాండ్ చేస్తోంది.

రెహమాన్ కంపోజిషన్ కి సలాం కొట్టాల్సిందే

మూవీ మేకింగ్ మాస్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ ఫ్రాంచైజ్ నుంచి సెకండ్ పార్ట్ రిలీజ్ కావడానికి రెడీగా ఉంది. పొన్నియిన్ సెల్వన్ 2, PS-2 అనే టైటిల్స్ తో ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 28న రిలీజ్ కానున్న ఈ మూవీ వెయ్యి కోట్ల బెంచ్ మార్క్ ని టార్గెట్ చేసింది. మొదటి పార్ట్ పొన్నియిన్ సెల్వన్ 500 కోట్లు రాబట్టింది కానీ ఈ కలెక్షన్స్ తమిళులు ఉన్న ప్రాంతానికి మాత్రమే పరిమితం అయ్యాయి. ఇతర ప్రాంతాల్లో పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని మెప్పించలేకపోయింది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి కానీ అన్నింటికన్నా ముఖ్య కారణం సినిమాలో తమిళ నేటివిటీ ఎక్కువ ఉండడం. చోళ రోజుల కథ చూస్తూ తమిళ నేటివిటీ ఉండకూడదు అనుకోవడం అవగాహనరాహిత్యం అనే అనుకోవాలి.తమిళ నేలపై కొన్ని వందల ఏళ్ల క్రితం జరిగిన, ఒక గొప్ప భారతీయ కథగా పొన్నియిన్ సెల్వన్ సినిమాలని చూడాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఆ కథకి అన్ని సెంటర్స్ లో రీచ్ దొరుకుంతుంది. పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 చూడకున్నా పార్ట్ 2 అర్ధమవుతుంది అని మణిరత్నం ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి మరి సాలిడ్ ప్రమోషన్స్ ని చేస్తే పాన్ ఇండియా మొత్తం పొన్నియిన్ సెల్వన్ 2 సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత లాంగ్ రన్ ని బట్టి PS-2 ఫైనల్ రన్ ఎక్కడి వరకూ వచ్చి ఆగుతుంది అనే విషయం అర్ధమవుతుంది.

సీఎస్ కే కు షాక్.. పలు మ్యాచ్ లకు దీపక్ చాహర్ దూరం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2023లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యా్చ్ లో పేసర్ దీపక్ చాహర్‌ను కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్ శనివారం చేదు అనుభవం ఎదుర్కొంది. చాహర్ గాయం కారణంగా అతని బౌలింగ్ స్పెల్ కేవలం ఒక ఓవర్‌కే పరిమితం చేయబడింది. ఇప్పుడు, అతని ఎడమ కాలుకు గాయం మరోసారి తిరగబడినట్లు తెలుస్తోంది. దీంతో అతను చెన్నై సూపర్ కింగ్స్ ఆడే కొన్ని మ్యాచ్ లకు దూరంగా ఉండే అవకాశం ఉంది. చాహర్ కాలు గాయం కారణంగా 2022లో మంచి టోర్నీకి దూరంగా ఉన్నాడు.. ముంబై ఇండియన్స్‌పై ఒక ఓవర్ బౌలింగ్ చేసిన తర్వాత అతను గ్రౌండ్ విడిచి వెళ్లిపోవడం చాలా నిరాశపరిచింది. దీపక్ 4-5 గేమ్‌లకు దూరంగా ఉంటాడని తెలుస్తోంది అని CSK లెజెండ్ సురేష్ రైనా తెలిపాడు. అతను మళ్లీ కాలు గాయంతో బాధపడుతున్నాడని తెలుస్తోందని ఆయన పేర్కొన్నాడు. మిగతా IPL వేదికలన్నీ చాలా దూరంగా ఉన్నాయి. చెన్నై నుండి మరియు చాలా ప్రయాణాలలో పాల్గొంటారు. తొలి ఓవర్‌లోనే చాహర్‌ సేవలను తమ జట్టు కోల్పోయినందుకు విజయం సంతృప్తికరంగా ఉందని సారథి ఎంఎస్ ధోని మ్యాచ్ అనంతరం ప్రజెంటేషన్‌లో పేర్కొన్నాడు. మొదటి ఓవర్‌లోనే దీపక్‌ని కోల్పోయాము.. మరిచిపోకూడదు. అతను మా కొత్త బాల్ బౌలర్.. మగాలా అతని మొదటి మ్యాచ్ ఆడాడు. మంచి విషయం ఏమిటంటే స్పిన్నర్లు బాగా బౌలింగ్ చేసారు అని ధోని తెలిపాడు.

హాట్ సమ్మర్ లో మంచి వెకేషనల్ సాంగ్

ఇండస్ట్రీలో హిట్ కాంబినేషన్ కి ఎప్పుడూ మంచి గిరాకీ ఉంటుంది, అది కూడా పాత్ బ్రేకింగ్ కాంబినేషన్ అయితే మరింత హైప్ ఉంటుంది. అలాంటి కాంబినేషన్స్ లో ఒకటి అల్లరి నరేష్-విజయ్ కనకమేడలది. హిట్ సినిమా తీయడం వీరు, హీరో ఇమేజ్ నే మార్చేసే సినిమా తీయడం వేరు. అలాంటి సినిమానే అల్లరి నర్రేష్-విజయ్ కలిసి చేసి చేశారు. నాందితో మొదలైన ఈ హిట్ కాంబినేషన్ నుంచి ఇప్పుడు ‘ఉగ్రం’ సినిమా వస్తోంది. నాంది స్టైల్ లోనే అల్లరి నరేష్ ని పూర్తిగా కొత్త మేకోవర్ లో, పవర్ ఫుల్ పోలిస్ ఆఫీసర్ గా విజయ్ ప్రెజెంట్ చేస్తున్నాడు. షైన్ స్క్రీన్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీపై పాజిటివ్ బజ్ ఉంది. ఇప్పటివరకూ రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ సినీ అభిమానులని ఆకట్టుకుంది. ఉగ్రం సినిమా అబోవ్ యావరేజ్ టాక్ రాబడితే చాలు అల్లరి నరేష్-విజయ్ కనకమేడల కాంబినేషన్ లో సెకండ్ హిట్ పడినట్లే. మిర్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఎంత యాక్షన్ ఉన్నా ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే హార్ట్ టచింగ్ ఎమోషన్ కూడా ఉగ్రం సినిమాలో ఉందని చెప్తూ మేకర్స్, ఈ మూవీ నుంచి ఒక ఫీల్ గుడ్ వీడియో సాంగ్ ని రిలీజ్ చేశారు. ‘అల్బెలా’ అంటూ సాగే ఈ సాంగ్ ని నేచురల్ స్టార్ నాని లాంచ్ చేశాడు. హీరో తన ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్లిన టైం వచ్చే ఈ సాంగ్ ఇంప్రెస్ చేసింది. శ్రీచరణ్ పాకాలా సోల్ ఫుల్ కంపోజింగ్, మంచి లోకేషన్స్ లో, క్యాచీ లిరిక్స్ తో, పాప క్యూట్ డాన్స్ తో అల్బెలా సాంగ్ ‘ఉగ్రం’ సినిమా కలర్ ని మార్చింది. మరి మే 5న రిలీజ్ కానున్న ఉగ్రం మూవీతో అల్లరి నరేష్, విజయ్ కనకమేడల హిట్ హిస్టరీని రిపీట్ చేస్తారేమో చూడాలి.