NTV Telugu Site icon

Top Headlines @1PM: టాప్ న్యూస్

Top Headlines

Top Headlines

అర్ధరాత్రి నడిరోడ్డుపై తల్లీకూతురు …దిశ యాప్ కి కాల్ చేస్తే…

ఈమధ్యకాలంలో నేరాలు బాగా పెరిగిపోయాయి. ఎప్పుడేం జరుగుతుందో తెలీని పరిస్థితి. అర్థరాత్రి మహిళలు అర్థరాత్రి స్వేచ్ఛగా బయట తిరిగినప్పుడే నిజమయిన స్వాతంత్ర్యం అన్నారు. కానీ పట్టపగలే మహిళలు, యువతులపై దాడులు పెరిగిపోతున్నాయి. ఓ తల్లీకూతురికి విచిత్రమయిన, భయానకమయిన పరిస్థితి ఏర్పడింది. నడి రోడ్డుపై కారు పంక్చర్ అయింది. కారులో ఉన్నది కేవలం ఓ తల్లి, ఆమె కూతురు. చుట్టూ చిమ్మ చీకటి. కారు దిగి పంక్చర్ వేద్దామనుకున్నా బయటకు రాలేని నిస్సహాయ పరిస్థితి.రు డోరు తెరిచి, తెగించి దిగితే ఏమవుతుందో అనే భయం. ఏదైనా అఘాయిత్యం జరిగితే, అరిచి గీ పెట్టినా వినిపించుకునే నాధుడుండడు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఏం చేయాలి? సరిగ్గా అదే చేశారు, ఆ తల్లీ, కూతురు. ఎంచక్కా దిశా యాప్ కి ఎస్.ఓ.ఎస్. కాల్ చేశారు. నిమిషాల్లో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఒక ఆడపిల్ల దిశ యాప్ కాల్ కు స్పందించిన నెల్లూరు జిల్లా పోలీసులకు అంతా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

వసతి గదుల అద్దె పెంపుపై నిరసన గళం

కలియుగ వైకుంఠం తిరుమల ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ఏడుకొండలపై ఇప్పుడో వివాదం నెలకొంది. తిరుమలలో వసతి గదుల అద్దెను అమాంతం పెంచివేస్తూ టిటిడి తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోది. టీటీడీ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద బిజెపి నేతలు నిరసనకు దిగారు. తిరుమలలో భక్తుల వసతి గదుల రేట్లను టి.టి.డి పెంచడాన్ని నిరసిస్తూ రాజమండ్రిలో కలెక్టరేట్ ఎదుట బి.జె.పి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ధర్నా చేపట్టారు.టీటీడీ అధికారులు పెంచిన రేట్లను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన చేస్తున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ అవలంభిస్తున్న వైఖరి మానుకోవాలని నినాదాలు చేశారు. టీటీడీ చర్యలకు వ్యతిరేకంగా కలెక్టరేట్ ఎదుట సోము వీర్రాజు బైఠాయించి నిరసన తెలియజేశారు. బిజెపి ఆందోళనతో రాజమండ్రిలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. నిన్నటి వరకు సాధారణ భక్తులకు సైతం అందుబాటులో ఉండే విధంగా వందల్లో ఉండే గదులు..ఇప్పుడు వేల రూపాయలకు చేరిపోయాయి. అసలు కొండపై ఉన్న వసతి గదులు ఇప్పుడు ఖరీదుగా మారిపోయాయి.

ఆప్‌కు భారీ షాక్.. 164 కోట్లు కట్టాల్సిందే 

ఆప్‌ ఆద్మీ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ విభాగం రూ. 164 కోట్ల రికవరీ నోటీసులు జారీ చేసింది. 10 రోజుల్లోగా ఈ మొత్తం సొమ్మును తిరిగి చెల్లించాలని నోటీసులు పంపింది. ఆ ప్రకటనల ఖర్చులు వసూలు చేయాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశించారు. డిపాజిట్ చేయని పక్షంలో చట్ట ప్రకారం తదుపరి చర్యలుంటాయని ఆ రికవరీ నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రకటనల ముసుగులో ఆప్‌ ప్రకటనలు ఇచ్చుకుందని, అందుకోసం వందల కోట్ల ప్రజాధనాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ వృధాగా ఖర్చు చేసిందని పేర్కొంటూ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా ఆ పార్టీ మీద చర్యలకు ఆదేశించారు. డిసెంబర్‌ 20వ తేదీన 97 కోట్ల రూపాయల్ని ఆప్‌ నుంచి రికవరీ చేయాలంటూ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించారు. అయితే రాజకీయ ప్రకటనల మీద 2017, మార్చి 31 దాకా రూ.99 కోట్లు ఖర్చు చేశారని, మిగిలిన రూ.64 కోట్లను ఖర్చు చేసినదానికి వడ్డీగా తాజా నోటీసుల్లో పేర్కొంది. ఎల్జీ ఆదేశాలను ఆమ్‌ ఆద్మీ పార్టీ మొదటి నుంచి బేఖాతరు చేస్తూ వస్తోంది. బీజేపీతో కలిసి ఆప్‌ ఉనికి లేకుండా చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఎల్జీపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు.

డబ్బుపై ఆశతో బాలుడు నరబలి

కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రా నగర్‌ హవేలీలోని సిల్వాస్సాలో నరబలి ఉదంతం తెరపైకి వచ్చింది. ధనవంతులు కావాలనే ఆశతో తొమ్మిదేళ్ల బాలుడిని కిడ్నాప్‌ చేసి, ఆపై నరబలి ఇచ్చారు. ఆపై మృతదేహాన్ని ముక్కలు చేశారు. ఈ దారుణ ఘటనలో మైనర్‌తో సహా ముగ్గురిని పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. నరబలి ఇస్తే డబ్బులు వస్తాయన్న మూఢనమ్మకంతో.. లోకజ్ఞానం కూడా తెలియని తొమ్మిదేళ్ల చిన్న పిల్లాడిని కొందరు దుండగులు తలనరికి చంపేశారు. 9 ఏళ్ల బాలుడిని కిడ్నాప్‌ చేసి.. ఆపై తలనరికి చంపినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. అనంతరం నిందితులు మృతదేహాన్ని ముక్కలు చేయగా.. మృతుడి శరీర భాగాల కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ క్రూరమైన నేరంపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారి వెల్లడించారు.

నుపుర్‌శర్మకు తుపాకీ లైసెన్స్

గత ఏడాది టీవీ చర్చలో ప్రవక్త మహమ్మద్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి నిరసనలు, హింసకు కారణమై పార్టీ నుంచి సస్పెండ్ చేయబడిన బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ ఇప్పుడు తుపాకీ లైసెన్స్ కలిగి ఉన్నారు. నుపుర్ శర్మ కోరిన తర్వాత స్వీయ రక్షణ కోసం ఢిల్లీ పోలీసులు ఆమెకు లైసెన్స్ ఇచ్చారని అధికారులు ఈరోజు తెలిపారు. మే 26న తన బాధ్యతారాహిత్య వ్యాఖ్యలతో దేశంలో నిరసనలకు కారణమైనందుకు క్షమాపణలు చెప్పాలని జులైలో సుప్రీంకోర్టు చేసిన ఘాటైన వ్యాఖ్యల తర్వాత కూడా ఆమె తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసింది. ఆమెకు మద్దతుగా మాట్లాడిన వారిని కూడా బెదిరించారు. దేశంలో జరిగిన రెండు హత్యలు ఈ వివాదంతో ముడిపడి ఉన్నాయి. ఆమెకు మద్దతుగా నిలిచిన ఉమేష్ కోల్హే అనే ఫార్మసిస్ట్ జూన్‌లో మహారాష్ట్రలోని అమరావతిలో హత్యకు గురయ్యాడు. కొన్ని రోజుల తర్వాత, సోషల్ మీడియాలో నుపుర్ శర్మకు మద్దతు ఇచ్చిన ఉదయపూర్‌లోని ఒక టైలర్ అతని దుకాణంలో నరికి చంపబడ్డాడు.

షోకాజ్ నోటీసులు చెత్తబుట్టలోపడేశా.. పీసీసీ కమిటీలను పట్టించుకోను

తెలంగాణ కాంగ్రెస్ నూతన ఇంఛార్జీ మాణిక్ రావ్ థాక్రే తో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ ముగిసింది. హైద్రాబాద్ హైదర్ గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉన్న థాక్రేతో సమావేశమైన కోమటిరెడ్డి మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించదని చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. తనకిచ్చిన AICC షోకాజ్ నోటీసులు ఎప్పుడో చెత్తబుట్టలో పడ్డాయని సంచలన వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి. పీసీసీ కమిటీలను నేను పట్టించుకోనని అన్నారు. నాలుగైదుసార్లు ఓడిపోయినవాళ్లతో నేను కూర్చోవాలా? అంటూ ప్రశ్నించారు. నిన్న నియోజకవర్గ పర్యటనల వల్ల థాక్రేను కలవలేకపోయానని అన్నారు. సీతక్క, వీరయ్య, జగ్గారెడ్డి ఎందుకు మీటింగ్ రాలేదో అడగండి ముందు అంటూ కోమటిరెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. కొన్నిసార్లు నియోజకవర్గ పనులతో కలవలేమన్నారు. నా ఫోటో మార్ఫింగ్ అయిందని స్వయానా సీపీ నాకు చెప్పారని కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

హిమాచల్ లో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు
హిమాచల్‌ ప్రదేశ్‌లో కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు కొత్త మంత్రులకు శాఖలను కేటాయించారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్‌కు పబ్లిక్ వర్క్స్, యువజన, క్రీడా శాఖల బాధ్యతలు ఇవ్వడంతో సహా మంత్రులకు శాఖలను కేటాయించారు. విక్రమాదిత్య సింగ్ హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వీరభద్ర సింగ్ కుమారుడు. అతని తల్లి ప్రతిభా సింగ్, లోక్‌సభ నియోజకవర్గం మండి నుంచి పార్లమెంటు సభ్యురాలు. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్‌ సుఖు సలహా మేరకు గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌ శాఖలను పంపిణీ చేశారు. ఆర్థిక, హోం, ప్లానింగ్, సిబ్బంది, ఇతర ఏ ఇతర మంత్రికి కేటాయించని అన్ని శాఖలను ముఖ్యమంత్రి తన వద్దే ఉంచుకోగా, జలశక్తి విభాగం, రవాణా భాషా కళలు, సంస్కృతిని ఉప ముఖ్యమంత్రి ముఖేష్ అగ్నిహోత్రికి అప్పగించారు. సోలన్ నియోజకవర్గానికి చెందిన ధని రామ్ షాండిల్‌కు ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, సామాజిక న్యాయం, సాధికారత, కార్మిక, ఉపాధి శాఖల బాధ్యతలు అప్పగించారు. ధనిరామ్ షాండిల్ గతంలో కూడా సామాజిక న్యాయం, సాధికారత మంత్రిగా చేశారు.

ఆరోగ్యం విషయంలో ఈ అపోహలు వద్దంటే వద్దు

మనలో చాలామందికి ఆరోగ్యం విషయంలో కొన్ని సందేహాలు, సందిగ్ధ పరిస్థితులు ఉంటాయి. అపోహలతో కొన్ని పనులకు దూరంగా ఉండాల్సి వుంటుంది. అయితే అసలు అపోహలేంటి? వాస్తవాలేంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం గురించి ఇప్పటికీ ప్రజల్లో కొన్ని అపోహలు ఉన్నాయి. వాటిని నమ్మవద్దని వైద్య నిపుణులు చెబుతున్నారు. చాలామంది రోజుకి ఎనిమిది గ్లాసుల నీరు తాగాల్సిందే అంటారు. అయితే ఇది అపోహ మాత్రమే అంటున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎనిమిది గ్లాసుల నీరు తాగాలని. శరీరంలో అధికశాతం ఉండేది నీరే. శరీరంలో జరిగే ప్రతి చర్యకూ నీరు కావాలి. మూత్రవిసర్జన ద్వారా నీరు బయటకు పోయినా.. తిరిగి శరీరంలో నీటిశాతాన్ని సమతుల్యం చేయాలంటే మంచినీరు తాగాల్సిందే. అయితే ఎనిమిది గ్లాసుల నీరు కచ్చితంగా తాగాలనే నియమం లేదు. తాగే నీటితోపాటు మనం తీసుకునే ఆహారంలో ఉండే నీరు కూడా శరీరంలోకి వెళ్తుంటుంది. అది కూడా లెక్కలోకి తీసుకోవాలంటున్నారు వైద్యులు. మన శరీరం అవసరాన్ని బట్టి తాగే నీటి పరిమాణం ఎక్కువైనా, తక్కువైనా ఫర్వాలేదు. అలా అని అసలు నీరు తాగకపోతే డీ హైడ్రేషన్ జరిగి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ట్రస్టెడ్ సోర్స్ ప్రకారం, ఆరోగ్యకరమైన వ్యక్తి రెండు సాధారణ పనులను చేయడం ద్వారా వారి రోజువారీ నీటి అవసరాలను తీర్చుకోవచ్చు: మీకు దాహం వేసినప్పుడు తాగడంతో పాటు భోజనంతో పాటు నీరు తాగడం చేయాలి.