తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ సినిమాలు తెలుగులో కూడా విడుదల అవుతున్నాయి.. దాంతో ఇక్కడ కూడా ఈయనకు ఫ్యాన్స్ ఉన్నారు..ఇటీవల విజయ్ చేస్తున్న సినిమాలు భారీ కలెక్షన్స్ ను అందుకుంటూ దూసుకుపోతున్నాయి..ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ వస్తున్నారు.. అందులోనూ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ ‘లియో’ సినిమా ప్రకటించినప్పటి నుంచి దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ యాక్షన్ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే విజయ్ బర్త్ డే సందర్బంగా ఈ చిత్రం నుంచి తాజాగా వచ్చిన ఫస్ట్ లుక్ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది..
ఈ పోస్టర్ లో హీరో విజయ్‌తో పాటు పక్కనే ఓ తోడేలు కనిపిస్తుంది. అంతేకాకుండా వెనక మంచు కొండలు, ఊడిన పళ్లు, చేతిలో సుత్తి, గాల్లో రక్తం ఇవన్నీ చూస్తుంటే విలన్ గ్యాంగ్‌ను విజయ్ ఉతికారేసినట్లు అర్థమవుతుంది. విజయ్ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ పోస్టర్ ఫ్యాన్స్‌కు తెగ నచ్చేసింది.. ఇక ఈ పోస్టర్ ను చూసిన తర్వాత ఇక ఫ్యాన్స్ సంతోషానికి అవద్దులేవు.. ఇక పోస్టర్ పై కథలు అల్లేస్తున్నారు..విజయ్‌పై దాడి చేసిన విలన్ గ్యాంగ్.. ‘రోలెక్స్’దే అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కానీ దీనిపై క్లారిటీ రావాలంటే ట్రైలర్, టీజర్ ఏదైనా రిలీజ్ కావాలి. ఇంతకుముందు ‘ఖైదీ’, ‘విక్రమ్’ సినిమాలు తీసిన లోకేశ్.. లియోను కూడా దానికి లింక్ చేస్తున్నాడని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.. విజయ్ మార్క్ ఈ సినిమాలో ఉండబోతుందని పోస్టర్ ను చూస్తే తెలుస్తుంది..ఈ చిత్రానికి కూడా అనిరుధ్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఈ ఏడాది అక్టోబరు 19న సినిమా రిలీజ్ కానుంది. సినిమాలో విజయ్ పక్కన త్రిష జోడిగా చేయనుంది..ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లోనే కాకుండా ఇంకా గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారట. అంటే ప్రధాన భారతీయ భాషలలో మాత్రమే కాకుండా విదేశీ భాషలలో కూడా విడుదల కాబోతున్నట్లు మేకర్స్ ఎప్పుడో అనౌన్స్ చేశారు..ఇక ఈ సినిమా హక్కులను ఇప్పుటికే నెట్‌ఫ్లిక్ భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. దీంతో నెట్‌ఫ్లిక్స్ ద్వారా జర్మన్ సహా ఇతర విదేశీ భాషలలో కూడా సినిమాను విడుదల చేయనున్నారని టాక్ వినిపిస్తుంది..
#LeoFirstLook is here! Happy Birthday @actorvijay anna!
Elated to join hands with you again na! Have a blast! 🤜🤛❤️#HBDThalapathyVIJAY #Leo 🔥🧊 pic.twitter.com/wvsWAHbGb7— Lokesh Kanagaraj (@Dir_Lokesh) June 21, 2023