నో పెయిన్ … నో గెయిన్ అంటోంది ఊర్వశీ రౌతేలా! స్వర్గంలోని అప్సరస పేరు పెట్టుకున్న ఊర్వశీ… నిజంగానే కళ్లప్పగించి చూడాలనిపించేలా తన ఫిగర్ ని మెయింటైన్ చేస్తుంటుంది. అయితే, అదంతా అప్పనంగా వచ్చేస్తుందా? చెక్కిన శిల్పంలా కనిపించాలంటే జిమ్ములో చిక్కుకుపోయి చెమట చుక్కల్ని లెక్కలేకుండా చిందించాలి. అది కూడా చేసేస్తున్నారు ఈతరం అందగత్తెలు. అయితే, ఊర్వశీ మరో అడుగు ముందేకేసింది! తన నెక్ట్స్ మూవీ కోసం ఏకంగా పిడి గుద్దుల వర్షాన్ని ధైర్యంగా భరిస్తోంది, ముద్దుగుమ్మ!
ఊర్వశీ రౌతేలా మరోసారి తన జిమ్ వర్కవుట్ వీడియో ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అయితే, ఈసారి బ్యూటీ క్వీన్ సాహసం చూసిన జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఎందుకంటే, ఆమెని తన ట్రైనర్ ఎడాపెడా కడుపులో బాదేస్తున్నాడు. అతను పిడిగుద్దులు కురిపిస్తుంటే… కడుపు కండరాల్ని బిగించి… సుకుమారి నొప్పిని భరిస్తోంది. ఇదంతా తన రాబోయే చిత్రం కోసమేనట! అదో యాక్షన్ థ్రిల్లర్ కావటంతో ఊర్వశీ ప్రస్తుతం రాటుదేలుతోంది. అందుకే, జిమ్ కోచ్ వద్ద పిడిగుద్దుల పరీక్షకి సిద్ధమైంది!
హీరోయిన్ అంటే చాలా కాలం… మూడు ముద్దులు, ఆరు పాటలు అన్నట్టుగా సాగేది వ్యవహారం. కానీ, క్రమంగా ఇండియన్ సినిమా స్క్రీన్ పై సీన్ ఛేంజ్ అవుతోంది. ఇప్పుడు హీరోయిన్స్ ఒక్కో సినిమాకు ఒక్కో డిఫరెన్స్ ప్రదర్శిస్తున్నారు. అందుకే, అందాల పోటీల్లో కిరీటాలు గెలిచిన ఊర్వశీ లాంటి పిక్చర్ పర్ఫెక్ట్ బ్యూటీస్ కూడా సాహసాలకు రెడీ అంటున్నారు. చూడాలి మరి, సెక్సీ సుందరి హాట్ యాక్షన్ ఎలా ఉంటుందో…
A post shared by URVASHI RAUTELA ??Actor?? (@urvashirautela)