నో పెయిన్ … నో గెయిన్ అంటోంది ఊర్వశీ రౌతేలా! స్వర్గంలోని అప్సరస పేరు పెట్టుకున్న ఊర్వశీ… నిజంగానే కళ్లప్పగించి చూడాలనిపించేలా తన ఫిగర్ ని మెయింటైన్ చేస్తుంటుంది. అయితే, అదంతా అప్పనంగా వచ్చేస్తుందా? చెక్కిన శిల్పంలా కనిపించాలంటే జిమ్ములో చిక్కుకుపోయి చెమట చుక్కల్ని లెక్కలేకుండా చిందించాలి. అది కూడా చేసేస్తున్నారు ఈతరం అందగత్తెలు. అయితే, ఊర్వశీ మరో అడుగు ముందేకేసింది! తన నెక్ట్స్ మూవీ కోసం ఏకంగా పిడి గుద్దుల వర్షాన్ని ధైర్యంగా భరిస్తోంది, ముద్దుగుమ్మ!…