సుమంత్ నటించిన తాజా చిత్రం ‘మళ్ళీ మొదలైంది’. వర్షిణీ సౌందర్ రాజన్, నైనా గంగూలీ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను టీజీ కీర్తి కుమార్ దర్శకత్వంలో రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఇప్పటికే తొలికాపీ సిద్ధమైన ‘మళ్ళీ మొదలైంది’ మూవీని ఫిబ్రవరిలో ఓటీటీ ద్వారా విడుదల చేస్తున్నట్టు నిర్మాత తెలిపారు. తాజాగా ఈ సినిమాను ఫిబ్రవరి 11న ప్రేమికుల రోజు కానుకగా స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు జీ 5 సంస్థ ప్రకటించింది. దీనికి సంబంధించిన…