‘‘ఇంత కాలం ‘తెల్ల’బోయింది చాలు! ఇక మీదట వద్దు’’ అంటోంది అవికా గోర్! ఆమె వద్దకి వచ్చిన ఓ బ్రాండ్ ఎండార్స్ మెంట్ ని సెకండ్ థాట్ లేకుండా రిజెక్ట్ చేసిందట. ఆమె ప్రమోట్ చేయాల్సింది ఫెయిర్ నెస్ ప్రాడక్ట్ కావటంతో గట్టిగా ‘నో’ చెప్పేసిందట. భారీగా డబ్బులు వచ్చే అవకాశం ఉన్నా ‘చిన్నారి పెళ్లికూతురు’ ఛాన్సే లేదని చెప్పేశానంటూ స్వయంగా తెలిపింది!
నల్లటి వార్ని తెల్లగా చేస్తామని బయలుదేరే ఫెయిర్ నెస్ క్రీముల పట్ల జనాల్లో క్రమంగా మార్పు వస్తోంది. గతంలో మాదిరిగా వాట్ని ఎగబడి కొనటం లేదు. అయితే, ఇంతకు ముందు చాలా మంది టాప్ సినీ స్టార్స్ తెల్ల తోలు తమాషాల్ని బాగానే ఎంకరేజ్ చేశారు. వైట్ స్కిన్ ఉంటే ఇంకేం అక్కర్లేదు అన్నట్టుగా ఉండేవి బోలెడు యాడ్స్. అయితే, ఆ మధ్య సాయి పల్లవి రెండు కోట్లు ఇస్తామన్నా వద్దు పొమ్మంది. భారతీయులు పాశ్చాత్యులంత తెల్లగా ఉండరు. అలాగే, ఆఫ్రికా వారు మనకంటే నల్లగా ఉంటారు. ఎవరు ఏ కలర్ లో ఉన్నా అందంగానే ఉంటారని ఆమె అభిప్రాయపడింది. కోట్లు ఖాతాలో పడే బ్రాండ్ ఎండార్స్ మెంట్ వదిలేసుకుంది!
కంగానా రనౌత్ కూడా ఓ ఫ్రెయిర్ నెస్ బ్రాండ్ కి షాక్ ఇచ్చింది. యాడ్ చేయమని వచ్చిన కంపెనీ వారికి గెట్ లాస్ట్ అంటూ గేటు చూపింది! తన స్వంత చెల్లెలే తెల్లగా ఉండదని చెప్పిన కంగనా… ఆమె అందంగా లేదని ఎలా అనగలం అంటూ తరువాత ప్రశ్నించింది. కంగనా కూడా ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్ వదులుకుని కోట్లు కోల్పోయింది.
సాయి పల్లవి, కంగనా రనౌత్ లాగే ఇప్పుడు అవికా కూడా ఫెయిర్ నెస్ క్రీమ్ కి సారీ చెప్పేసింది. కలర్ పెద్ద ఇంపార్టెంట్ కాదంటోంది. అందం అంటే కేవలం రంగు మాత్రమే కాదని బహిరంగంగా వ్యాఖ్యానించింది. సినిమా హీరోలు, హీరోయిన్స్ మరింత మంది ఇలా బోల్డ్ గా మాట్లాడితే మన దేశంలో తెల్ల తోలు క్రేజ్ త్వరగా తగ్గే చాన్స్ ఉంది!