మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మెగా అనౌన్స్ మెంట్ చేశాడు. మెగా స్టార్ 153వ చిత్రానికి తాను పాటలు అందించబోతున్నట్టు అధికారికంగా ట్వీట్ చేశాడు. ‘చిరంజీవి పట్ల తన ప్రేమ చాటుకునే టైం వచ్చేసిం’దంటూ ఫుల్ జోష్ తో తాజా మ్యూజిక్ సిట్టింగ్స్ సంగతి నెటిజన్స్ తో పంచుకున్నాడు. చిరు 153వ చిత్రం దర్శకుడు మోహన్ రాజా సారథ్యంలో తెరకెక్కనుంది.
‘ఆచార్య’ రిలీజ్ కోసం ప్రస్తుతం వెయిట్ చేస్తోన్న చిరంజీవి నెక్ట్స్ మూవీ కూడా తమ హోమ్ బ్యానర్ ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’లోనే చేయబోతున్నాడు. కొణిదెల వారితో సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్త నిర్మాణంలో మెగా మూవీ సెట్స్ మీదకి వెళ్లనుంది. ఆర్బీ చౌదరీ, ఎన్వీ ప్రసాద్ ప్రొడ్యూసర్స్ గా తమిళంలో మంచి హిట్ చిత్రాలు అందించిన టాలెంటెడ్ డైరెక్టర్ మోహన్ రాజా తొలిసారి చిరుతో వర్క్ చేయబోతున్నాడు. థమన్ బాస్ చిత్రానికి మాస్ పాటలతో ఇరగదీస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. చూడాలి మరి, ‘మెగాస్టార్ 153’ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా ఏ భామ లక్కీ ఛాన్స్ కొట్టేస్తుందో…