తెలంగాణలో బోనాల పండుగ సందర్భంగా.. జులై 11న మంగ్లీ తన అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్ లో బోనాల సాంగ్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటపై కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో దుమారం కొనసాగుతున్నది. ఈ పాటలో వాడిన పదాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హిందూ సంఘాలు, ఇవాళ బీజేపీ కార్యకర్తల ఎంట్రీతో వివాదం మరింత పెద్దదైంది. ఇక బీజేపీ పార్టీ కార్యకర్తలు కేసు కూడా పెట్టేశారు. అయితే, ఈ వివాదంపై మంగ్లీ క్లారిటీ ఇచ్చారు.
‘ఈ పాటలో ఎలాంటి వివాదస్పద పదాలను వాడలేదంటూ మంగ్లీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. గ్రామదేవతల ఒగ్గు కథలు, బైండ్లోల కొలుపులు ఇలా రకరకాల ఆచారాలు ఉన్నాయి. భక్తిలో కూడా మూఢ భక్తి, వైరి భక్తి అని రకరకాలుగా ఉన్నాయి.. అందులో భాగంగానే ఈ పాటను రూపొందించాము.’ అంటూ మంగ్లీ క్లారిటీ ఇచ్చారు.
ఈ పాటలో ‘మోతెవరి’ అనే పదంపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయని, ఇక ఈ లిరిక్స్ లో మార్పులు చేశామని, ఈ కొత్త పాట వీడియోను రిలీజ్ చేస్తున్నామని తెలిపారు. రచయిత రామస్వామిగారి అభిప్రాయం ప్రకారం మోతెవరి అంటే గ్రామంలో ‘పెద్ద’ అనే అర్థంలో ఈ పాట సాగుతుంది. కానీ, కాలక్రమంలో ఆ పదం వ్యతిరేక పదంగా వాడుకలోకి వచ్చిందని మంగ్లీ చెప్పుకొచ్చారు. 80 సంవత్సరాలు కలిగిన ఆ పెద్దాయన 25 ఏళ్ళ క్రితమే ఈ పాటను రచించారు. యాసను వివాదం చేసి ఆయన్ను కించపరచొద్దని మంగ్లీ కోరారు.