Ravi Teja: ‘టైగర్ నాగేశ్వరరావు’కు దొరకని థియేటర్లు.. మండిపడుతున్న ఫ్యాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలివుడ్ స్టార్ హీరో మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ తొలి పాన్ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’ మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ దసరాకు ప్రేక్షకులకు రవితేజ మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారని ట్రైలర్ ద్వారా అర్థమైంది. కొత్త దర్శకుడు వంశీ ఎంతో పరిశోధన చేసి ఒక సెలబ్రేటెడ్ థీఫ్ను జనాలకు చూపించే ప్రయత్నం చేశాడు.. అభిషేక్ అగర్వాల్ కూడా బాగానే ఖర్చు చేశాడు.. ఈ సినిమా కోసం బాలివుడ్ లో కూడా బాగానే ప్రచారం చేశారు.. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ నెల 20 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..
హిందీ మినహా మిగిలిన భాషల్లో ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాకు పెద్దగా ప్రచారం కల్పించకపోవడం ఇప్పుడు ఆ సినిమాకు మైనస్‌గా మారినట్టుంది. ఎందుకంటే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ సినిమాకు థియేటర్లు దొరకడం లేదట. ‘టైగర్ నాగేశ్వరరావు’ విడుదల కావడానికి ఒక్కరోజు ముందు దళపతి విజయ్ ‘లియో’ సినిమా థియేటర్లలోకి వస్తోంది. తమిళనాడులో అన్ని థియేటర్లను ఈ సినిమా ఆక్యుపై చేసేసిందట. దీంతో నిన్నటి వరకు ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాకు ఓకే అయిన థియేటర్లు కేవలం 27 మాత్రమేనని సమాచారం..
Also Read
ఇక పోతే కర్ణాటకలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అయితే విజయ్ లియో సినిమా కొనుకున్న సూర్యదేవర నాగవంశీ తమ కోసం ‘భగవంత్ కేసరి’ థియేటర్లు తగ్గించే ప్రసక్తే లేదని, బాలయ్య బాబుకే ఫస్ట్ ప్రయారిటీ అని ఆ మధ్య కామెంట్ చేశారు. అంటే ఆ రెండు సినిమాలు ఓకే కానీ ఈ సినిమాలు విడుదలైన ఒక్కరోజు తర్వాత వస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు’కు మాత్రం తెలుగు రాష్ట్రాల్లోనూ ఆశించిన స్థాయిలో థియేటర్లు దక్కలేదని వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ సినిమాకు ఇచ్చిన ప్రియారిటి తెలుగు సినిమాకు ఇవ్వ లేదని రవితేజ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: వీబీజీ రామ్‌జీ పథకానికి శ్రీకారం.. గ్రామాల అభివృద్ధిపై చంద్రబాబు భారీ ప్రకటనలు
-
Moto G77 Power: మోటో జి77 పవర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. 7000mAh బ్యాటరీ, 50MP Sony LYTIA 600 కెమెరా
-
KTR: సీఎం సవాల్ విసిరారు, మధ్యలో జూపల్లి వచ్చారు.. కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది!
-
Jailer 2 : ‘జైలర్ 2’ రిలీజ్ డేట్‌కు కౌంట్‌డౌన్.. ఈ సాయంత్రం రజనీ అభిమానులకు బిగ్ సర్ప్రైజ్!
-
Topudurthi Prakash Reddy: టిప్పర్‌తో ఢీకొట్టి నన్ను హత్య చేయాలని కుట్ర.. తోపుదుర్తి సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?