తగ్గేదే లే అంటున్న ‘ఖిలాడి’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రూపొందుతోన్న సినిమా ‘ఖిలాడీ’. కోనేరు సత్య నారాయణ నిర్మిస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. జనవరి 26 రవితేజ పుట్టిన రోజు సందర్భంగా మూవీలోని ‘ఫుల్ కిక్కు… ‘ అంటూ సాగే నాలుగో పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ మాస్ సాంగ్ కు రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అద్భుతమైన ట్యూన్ సమకూర్చారు. సాగర్, మమతా శర్మ ఈ పాటను ఫుల్ ఎనర్జీ తో ఆలపించారు. ఇక శ్రీమణి అందించిన సాహిత్యం మాస్‌ను ఆకట్టుకునేలా ఉంది. శేఖర్ మాస్టర్ ఈ పాటకు కొత్త స్టెప్పులు వేయించారు. రవితేజ, డింపుల్ హయతి కలిసి తమ డాన్స్ తో అభిమానులను ఫుల్ ఖుషీ చేశారు. లుంగీలో రవితేజ మాస్ స్టెప్పులు, తెరపై ఆయన ఎనర్జీ అభిమానులకు కన్నుల పండువగా ఉంది.
బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘ఖిలాడి’లో రవితేజ భిన్నపాత్రలను పోషిస్తున్నారు. ప్లే స్మార్ట్ అంటూ ట్యాగ్ లైన్‌తో రాబోతోన్న ఈ చిత్రం హవీష్ ప్రొడక్షన్‌పై తెరకెక్కుతోంది. రవితేజ సరసన మీనాక్షి చౌదరి మరో హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో అర్జున్, ఉన్ని ముకుందన్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణులు కెమెరామెన్లుగా వ్యవహరిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా, దేవీ శ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ ఈ సినిమాకు డైలాగ్స్ అందిస్తున్నారు. ముందుకు అనుకున్న విధంగానే ‘ఖిలాడి’ మూవీని ఫిబ్రవరి 11న థియేటర్లలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. విశేషం ఏమంటే.. పస్తుతం ఉన్న కరోనా పాండమిక్ సిట్యుయేషన్ లో అదే రోజు విడుదల కావాల్సిన ‘మేజర్’ మూవీ విడుదల వాయిదా పడింది. కానీ మన ‘ఖిలాడి’ మాత్రం తగ్గేదే లే! అంటున్నాడు.
Also Read
తాజావార్తలు
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు