పాన్ ఇండియా స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవలే సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. ఇక ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి పెద్దగా ప్రచారం చెయ్యక పోయిన సినిమా షూటింగ్ ను మొదలు పెట్టాక సినిమా గురించి అనౌన్స్ చేశారు.. యువి క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందిస్తున్న సినిమా కావడంతో గొప్యంగా ఉంచిన్నట్లు సమాచారం..
ప్రభాస్ ఓ వైపు పాన్ ఇండియా డైరెక్టర్స్, పాన్ ఇండియా సినిమాలు చేస్తూ, ఇలా మారుతితో సినిమా చేయడం ఏంటని డార్లింగ్ ఫ్యాన్స్ మొదట అప్సెట్ అయ్యారు.. కథ నచ్చడంతో ఈ సినిమాకు ఓకే చెప్పినట్లు ప్రభాస్ చెప్పడంతో సినిమా అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు.. అయితే ఈ సినిమా బడ్జెట్ కూడా చాలా తక్కువలోనే కానిస్తున్నారని టాక్ . ప్రభాస్ సినిమా కాబట్టి ఎలాగు హైప్ ఒక రేంజ్ లో ఉంటుంది. అందుకు తగినట్టుగానే బిజినెస్ చేసేలా ఉంది. ఈ సినిమాకు టైటిల్ విషయంలో తెర మీద ఎన్నో పేర్లు వినిపించాయి..
అయితే మొదట రాజా డీలక్స్ అనే టైటిల్ మారుతి ప్రభాస్ సినిమాకు ఫిక్స్ అని ప్రచారంలో ఉంది. కాగా,పాన్ ఇండియా రిలీజ్ అవుతున్న సినిమా కాబట్టి ఆ రేంజ్ లోనే టైటిల్ ఉండేలా ప్లాన్ చేశారు మారుతి.. తాజాగా ఈ సినిమా టైటిల్ ఇదే అనే టాక్ వినిపిస్తుంది..ఫైనల్ గా ఈ సినిమాకు రాజా సాబ్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారని తెలుస్తుంది. రాజా డీలక్స్ అనే ఒక పాత సినిమా హాల్ చుట్టూ సినిమా కథ నడుస్తుందట. సినిమా లో ప్రభాస్ క్యారెక్టర్ కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త గా ఉంటుందని అంటున్నారు.. మారుతీ మార్క్ ఈ సినిమాలో చూపించబోతున్నాడని టాక్.. మరి ఈ సినిమా కథ ఎలా ఉండబోతుందో చూడాలి..