లేడీ సూపర్ స్టార్ నయనతార క్రేజ్ అంతా ఇంతా కాదు. తెలుగులో ఆమె సినిమా కోసం ఎదురు చూసే ఫ్యాన్స్ సంగతి మనకు తెలిసిందే. అయితే, తమిళంలో కేరళ కుట్టీ జోరు మరీ ఎక్కువ. అందుకే, అక్కడ ఆమెతో సినిమాలు చేయటానికి నిర్మాతలు క్యూలు కడుతుంటారు. ఇప్పటికే పలు చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నా టాలెంటెడ్ స్టార్ మరో చిత్రాలకు పచ్చజెండా ఊపిందట!
Read Also : దిల్ రాజు పేరుతో ఫేక్ సోషల్ మీడియా అకౌంట్…!
నయనతార చివరిసారిగా తెరపై కనిపించిన చిత్రం ‘మూకుతి అమ్మన్’. తెలుగులో ‘అమ్మోరుతల్లి’గా రిలీజైన ఈ ఎంటర్టైనర్ మంచి పేరునే తెచ్చిపెట్టింది. అయితే, నెక్ట్స్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘నెట్రికన్’లో కనిపించబోతోంది నయన్. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు ‘నెట్రికన్’ నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇక రజనీకాంత్ ‘అన్నాత్తే’ సినిమాలోనూ నయనతారే ఫీమేల్ లీడ్ గా కనిపించనుంది. ‘దర్భార్’ తరువాత తలైవా చేస్తోన్న నెక్ట్స్ మూవీ ‘అన్నాత్తే’నే. వరుసగా రెండు సినిమాల్లోనూ సూపర్ స్టార్ తో జోడీ కట్టింది లేడీ సూపర్ స్టార్! ‘నెట్రికన్’, ‘అన్నాత్తే’ కాకుండా ప్రియుడు విఘ్నేశ్ సినిమాలోనూ అందాల తార నటిస్తోంది. ‘కాతువాకుల రెండు కాదల్’ సినిమాలో విజయ్ సేతుపతి, సమంతలతో స్క్రీన్ షేర్ చేసుకోనుంది! ఒకవైపు విడుదలవ్వాల్సిన సినిమాలు, పూర్తి చేయాల్సిన సినిమాలు అలా ఉండగానే నయన మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ‘పెట్రోమ్యాక్స్, పెంగ్విన్’ లాంటి సినిమాలు ఈ మధ్య కాలంలో నిర్మించిన ‘ప్యాషన్ స్టూడియోస్’ బ్యానర్ ఆమెతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్యాషన్ స్టూడియోస్ పతాకంపై నయనతార సినిమాలు ఎవరితో తెరకెక్కుతాయో ప్రస్తుతానికి తెలియదు. నటీనటులు, దర్శకుల వివరాలు త్వరలోనే వెలువడవచ్చు…