ఎదగాలన్న ఫైర్ ఉంటే ఎక్కడిదాకానైనా వెళ్లవచ్చు! అటువంటి ఫైర్ కి విద్యా బాలన్ కంటే గొప్ప ఎగ్జాంపుల్ ఇంకెవరు? బక్కపల్చటి భామల హవా కొనసాగే బాలీవుడ్ లో ఆమె భారీగా ఉంటుంది. అయినా, అంతే భారీగా తన సినిమాలతో బాక్సాఫీస్ విజయాలు కూడా కొల్లగొడుతుంది! ‘డర్టీ పిక్చర్’ టాలెంటెడ్ బ్యూటీ రీసెంట్ గా ‘షేర్నీ’గా బరిలోకి దిగింది. పులినే ఢీకొట్టే ఫారెస్ట్ ఆఫీసర్ గా దట్టమైన అడవిలో సత్తా చాటింది!
విద్యా బాలన్ రొటీన్ బాలీవుడ్ హీరోయిన్ అయితే కాదు. ఆమె గుండెల నిండా ఫైర్ ఉన్న ఇంటెన్స్ యాక్ట్రస్. అందుకే, ఓ ఫైరింగ్ రేంజ్ కే ఆమె పేరుని పెట్టేశారు ఇండియన్ ఆర్మీ అధికారులు. కాశ్మీర్ లోని ‘గుల్ మార్గ్’లో ఇప్పుడు ఓ ఫైరింగ్ రేంజ్ ‘విద్యా బాలన్ ఫైరింగ్ రేంజ్’గా పిలవబడుతోంది. కొన్నాళ్ల క్రితం విద్యా ‘గుల్ మార్గ్ వింటర్ ఫెస్టివల్’లో కూడా ఆర్మీ జవాన్లతో కలసి పాల్గొంది. ఆమె నటిగా, వ్యక్తిగా ఎందరికో, ఎన్నో విధాలుగా ప్రేరణనిస్తుండటంతో ఇండియన్ ఆర్మీ తన పేరుని ఓ ఫైరింగ్ రేంజ్ కి పెట్టింది! ఈ తాజా పరిణామంతో, ఇప్పుడున్న బాలీవుడ్ కథానాయికల్లో, విద్యా తనదైన ప్రత్యేకతని చాటినట్టైంది…