ఎదగాలన్న ఫైర్ ఉంటే ఎక్కడిదాకానైనా వెళ్లవచ్చు! అటువంటి ఫైర్ కి విద్యా బాలన్ కంటే గొప్ప ఎగ్జాంపుల్ ఇంకెవరు? బక్కపల్చటి భామల హవా కొనసాగే బాలీవుడ్ లో ఆమె భారీగా ఉంటుంది. అయినా, అంతే భారీగా తన సినిమాలతో బాక్సాఫీస్ విజయాలు కూడా కొల్లగొడుతుంది! ‘డర్టీ పిక్చర్’ టాలెంటెడ్ బ్యూటీ రీసెంట్ గా ‘షేర్నీ’గా బరిలోకి దిగింది. పులినే ఢీకొట్టే ఫారెస్ట్ ఆఫీసర్ గా దట్టమైన అడవిలో సత్తా చాటింది! విద్యా బాలన్ రొటీన్ బాలీవుడ్ హీరోయిన్…