మలయాళ సుందరి మాంజిమా మోహన్ ది స్పెషల్ క్రేజ్! బాలనటిగానే గ్లామర్ ప్రపంచంలో కాలుమోపిన కేరళ కుట్టి హీరోయిన్ గా మారాక మల్లూవుడ్ లో ఫుల్ బిజీగా ఉంటోంది. తమిళంలోనూ మాంజిమా మంచి పేరే సంపాదించుకుంది. కథానాయికగా ఆమె మొదటి చిత్రం మలయాళంలో కాగా రెండో చిత్రమే తమిళంలో చేసింది. కెరీర్ మొదట్నుంచీ నివిన్ పాలీ, శింబు లాంటి క్రేజీ హీరోలతో జత కట్టటంతో మాంజిమా ఖాతాలో హిట్ చిత్రాలు బాగానే ఉన్నాయి. అయితే, లెటెస్ట్ గా ఆమె రిలేషన్ షిప్ స్టేటస్ పై సొషల్ మీడియాలో చర్చ జరిగింది. అందుక్కారణం మాంజిమా షేర్ చేసిన ఒక మీమే!
మాంజిమా ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ అంటూ ఇన్ స్టాగ్రామ్ లో ఫ్యాన్స్ కి బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఒక అభిమాని ‘సింగిలా? కమిటెడా?’ అంటూ ప్రశ్నించగా… మాంజిమా ఓ క్లాసిక్ మీమ్ ని షేర్ చేసింది! అది చూసిన నెటిజన్స్ స్మైల్ చేయకుండా ఆగలేకపోతున్నారు!
ఇన్ స్టాగ్రామ్ కొశన్ అండ్ యాన్సర్ సెషన్ లోనే… ‘ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్, ఫ్యామిలీ, కంపాషన్’… ఈ మూడు తనకు ముఖ్యమని ఓ ప్రశ్నకు బదులిచ్చింది మాంజిమా. సొషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమె సామాజిక కోణంలోనూ తన వంతు కృషి చేస్తుంటుంది. స్కూలు విద్యార్థులు, టీచర్స్ లో మానసిక ఒత్తిడి, రుగ్మతలు అనే సమస్యపై ఆన్ లైన్ క్యాంపైన్ నిర్వహిస్తోంది కొంత కాలంగా…