హార్బర్ బ్యాక్ డ్రాప్ లో, నాలుగు భాషల్లో జెట్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుబ్రహ్మణ్యం పిచ్చుక ను దర్శకుడిగా పరిచయం చేస్తూ వేణుమాధవ్ నిర్మించిన మూవీ ‘జెట్టి’. సౌత్ ఇండియా లో తొలి హార్బర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సినిమా ఇదని నిర్మాత చెబుతున్నారు. ఈ మూవీ టైటిల్ లోగోను ఇటీవల తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో చిత్రం బృందమే విడుదల చేసింది. దక్షిణ భారత దేశంలోనే ఇప్పటివరకు రాని సరికొత్త సముద్రపు నేపథ్య చిత్రాన్ని నాలుగు భాషల్లో విడుదల చేయబోతున్నామని దర్శక నిర్మాతలు తెలిపారు. అనాదిగా వస్తున్న ఆచారాలను నమ్ముకొని జీవితం సాగిస్తున్న మత్స్య కారుల కథను దర్శకుడు సుబ్రహ్మణ్యం వెండితెరపై ఆవిష్కరించాడని, ప్రపంచీకరణతో మారుతున్న జీవనశైలిలో తాము నమ్ముకున్న సముద్రం మీద ఆధార పడుతూ, అలలతో పోటీ పడతూ పొట్ట బోసుకుంటున్న జీవితాలను అంతే సహాజంగా తెరమీద చూపించామని నిర్మాత వేణుమాధవ్ అన్నారు. మత్స్యకారుల జీవన విధానాల్ని, వారి కట్టుబాట్లని, వారు పడే కష్టాలకు పరిష్కారం ఏంటో తెలియచెప్పటమే ప్రధానాంశంగా రూపొందిన చిత్రం జెట్టి అని చెప్పారు.
`కొన్ని వందల గ్రామాలు, కొన్ని వేల మత్స్యకార కుటుంబాలు, కొన్ని తరాల పోరాటం, వారి కల అయిన ఒక గోడ, ఆ గోడ పేరే జెట్టి అని దర్శకుడు సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ సినిమా కోసం సిద్ శ్రీరామ్ పాడిన పాట హైలైట్ గా నిలుస్తుందని త్వరలోనే దానిని విడుదల చేస్తామని దర్శక నిర్మాతలు చెప్పారు. నందితా శ్వేత ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమాతో కృష్ణ హీరోగా పరిచయం అవుతున్నాడు.
Also Read
తాజావార్తలు
-
Duleep Trophy 2026: వైభవ్ సూర్యవంశీలో మరో ప్రత్యేకత.. ఎంఎస్ ధోనీ తర్వాత అదరగొడుతున్న ‘బేబీ బాస్’..
-
Mayawati’s Big Decision: మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌పై మాయావతి వేటు.. బీఎస్పీ నుంచి పూర్తిగా బహిష్కరణ
-
Imran Tahir: “ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్..” 47 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే.. ఇమ్రాన్ తాహిర్ రికార్డు.!
-
Mobile Addiction Turns Fatal: భోజనం చేస్తూ రీల్స్ చూస్తుండగా.. పదేపదే నెట్వర్క్ ప్రాబ్లం.. మహిళ షాకింగ్ నిర్ణయం
-
iPhone Duo vs iPhone 18 Pro: ఐఫోన్ ఫోల్డబుల్ ఫోన్ vs ఐఫోన్ 18 ప్రో.. రోజువారీ వాడకానికి ఏది బెస్ట్?
ట్రెండింగ్
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?
-
IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం.. ఇంకెన్నాళ్లు ఈ గాయాలు!
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..