సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సమయం వచ్చేసింది.. ఈరోజు భారీ అంచనాల నడుమ గుంటూరు కారం సినిమా విడుదలైంది.. పన్నెండేళ్ల తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ సినిమా చేస్తుండటంతో ‘గుంటూరు కారం’ మీద అంచనాలు ఏర్పడ్డాయి. ‘కుర్చీ మడత పెట్టి…’ సాంగ్ సినిమాకు కావాల్సిన ప్రచారాన్ని తీసుకొచ్చింది. మహేష్ బాబు మాస్ అవతార్, డ్యాన్సుల్లో ఎనర్జీ చూసి జనాలు థియేటర్లకు క్యూ కట్టారు.. సినిమా మొదటి షో కే పాజిటివ్ టాక్ ను అందుకుంది..
‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో త్రివిక్రమ్ చెప్పినట్లు… రమణ పాత్రకు మహేష్ వందకు 200 శాతం న్యాయం చేశారు. పాటల్లో డ్యాన్స్ ఇరగదీయడమే కాదు… డైలాగ్ డెలివరీలోనూ కొత్త మహేష్ బాబును చూపించారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా మహేష్ ను చూపించినట్లు ఫ్యాన్స్ అంటున్నారు..అంత మాసీ క్యారెక్టర్లోనూ సూపర్ స్టైలిష్గా కనిపించారు. శ్రీ లీల డ్యాన్స్ కుమ్మేశారు. లంగా ఓణీలు, చీరల్లో మరింత అందంగా కనిపించారు. మీనాక్షి చౌదరి పాత్ర పరిధి తక్కువ. ఉన్నంతలో బాగా చేశారు..
సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు కూడా వారి పాత్రకు న్యాయం చేశారు.. జగపతి బాబును సరిగా వాడుకోలేదు. సునీల్ ఒక్క సన్నివేశానికి పరిమితం అయ్యారు. వెన్నెల కిశోర్ టైమింగ్ కొన్ని సన్నివేశాల్లో నవ్విస్తుంది. బాబ్జిగా అజయ్ కనిపించేది రెండు మూడు సీన్లు అయినప్పటికీ… కడుపుబ్బా నవ్విస్తారు.. త్రివిక్రమ్ మార్క్ ను చూపించారు.. పబ్లిక్ ఇప్పటివరకు పాజిటివ్ టాక్ ఇస్తున్నారు.. ఇక మహేష్ సినిమా సూపర్ హిట్ అని హంగామా మొదలెట్టేశారు.. ఇక కలెక్షన్స్ ఏ మాత్రం వసూల్ చేశారో తెలియాల్సి ఉంది.. ఇకపోతే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను భారీ ధరకు నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుందని తెలుస్తుంది.. మరి ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో తెలియాల్సి ఉంది.. మొత్తానికి మరో హిట్ సినిమాను మహేష్ తన ఖాతాలో వేసుకున్నాడని తెలుస్తుంది..