బోనీ కపూర్ రీమేక్ స్ట్రాటజీ అమలు చేస్తున్నాడు. అంతేకాదు… అటు నుంచీ ఇటు, ఇటు నుంచీ అటు కథల్ని ఇంపోర్ట్, ఎక్స్ పోర్ట్ చేస్తూ ఉత్తర, దక్షిణ భారతదేశాల్లో హల్ చల్ చేసేస్తున్నాడు. మొదట ‘పింక్’ సినిమాని తమిళంలో అజిత్ తో రీమేక్ చేశాడు. అదే తీసుకొచ్చి తెలుగులో ‘వకీల్ సాబ్’గా మళ్లీ నిర్మించాడు. ప్రస్తుతం ఆయన అజిత్ తో మరోసారి సినిమా చేస్తున్నాడు. అదే ‘వలిమై’. ఇక నెక్ట్స్ మరో సినిమా కూడా లైన్లో పెట్టాడు కోలీవుడ్ లో. బోనీ కపూర్, ఉదయ్ నిధి స్టాలిన్ కాంబినేషన్ లో ‘ఆర్టికల్ 15’ సినిమా రీమేక్ అవ్వబోతోంది.
Read Also: చదువుకి గుడ్ బై చెప్పి… బాలీవుడ్ బరిలో దిగుతోన్న మరో వారసుడు!
బోనీ కపూర్ ‘పింక్, ఆర్టికల్ 15’ లాంటి హిందీ చిత్రాల్ని దక్షిణాది ప్రేక్షకుల ముందుకి తేవటమే కాదు… సౌత్ స్టోరీస్ ని నార్త్ లోనూ రీమేక్ చేసి హిట్స్ కొట్టే ఆలోచనలో ఉన్నాడు! మలయాళ చిత్రం ‘హెలెన్’ రీమేక్ హక్కులు ఇప్పటికే బోనీ వద్ద ఉన్నాయి. త్వరలోనే జాన్వీ కపూర్ టైటిల్ లో రోల్ లో ఆ సినిమా బాలీవుడ్ రీమేక్ పట్టాలు ఎక్కనుంది. అలాగే, బోనీ తనయుడు అర్జున్ కపూర్ కూడా సౌత్ రీమేక్ లో నటించబోతున్నాడు. తమిళ చిత్రం ‘కోమలి’ హక్కులు స్వంతం చేసుకున్న స్టార్ ప్రొడ్యూసర్ వారసుడితో తెరకెక్కించనున్నాడు.
మలయాళ చిత్రం ‘హెలెన్’, తమిళ చిత్రం ‘కోమలి’ ఇంకా సెట్స్ మీదకి వెళ్లక ముందే బోనీ మరో సౌత్ మూవీపై ఖర్చీఫ్ వేశాడని సమాచారం! మల్లూవుడ్ తో సూపర్ హిట్ గా నిలిచిన ‘వన్’ సినిమా బాలీవుడ్ లో బోనీనే రీమేక్ చేయబోతున్నాడు. మమ్మూట్టి సీఎంగా నటించిన పొలిటికల్ డ్రామా కేరళ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. అయితే, బోనీ తన బాలీవుడ్ ‘వన్’ రీమేక్ లో హీరోగా ఎవర్ని క్యాస్ట్ చేస్తాడని ముంబైలో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఎవరో ఒక స్టార్ ఇమేజ్ ఉన్న సీనియర్ హీరోనే నటిస్తాడని అంటున్నారు. చూడాలి మరి, రీమేక్స్ ఫార్ములా అమలు చేస్తోన్న సీనియర్ కపూర్ ఎవర్ని ఎంచుకుంటాడో? కూతురు, కొడుకుతో ఎలాగూ రీమేక్స్ చేస్తున్నాడు కాబట్టి.. తమ్ముడు అనీల్ కపూర్ ని ‘వన్’ రీమేక్ లో పొలిటీషన్ గా తెర మీదకు తెస్తాడేమో!